మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గణపురం మండల మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ
అకాల వర్షాలతో, జిల్లాలోని అన్ని మండలాల్లో వరి పంట గాలికి పూర్తిగా నెలకోరిగి, దెబ్బ తిన్న వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే పార్టీలో చేరికలపై ఉన్న శ్రద్ధ రైతులపై కొంచెం రైతులపై పెట్టి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నష్టపరిహారం వచ్చేలా సహకరించాలని, లేని పక్షంలో రైతులను సంఘటితం చేసి జిల్లాలో నష్టపరిహారం కోసం పోరాటం చేస్తామని అన్నారు
ఇప్పటికే రైతుబంధు, రుణమాఫీ లేక రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో రైతుల పై గాలి వర్షం పిడుగుపడినట్లు అయిందని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు