గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా గంగారం మండలంలో పలుగ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ మాట్లాడుతున్న , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు,అన్నారు,క్వింటా వడ్లకు 500 బోన్స్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు, పెన్షన్లు 4వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడంలేదని అన్నారు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు,కావున ఇప్పుడు, మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తానని అంటున్నాడు. కావున ప్రజల గమనించాలని అన్నారు ఇప్పుడు జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత కార్ గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించరు వారి వెంట కొత్తగూడెం గంగారం ఎన్నికల ఇంచార్జ్ ఈసం సమ్మయ్య జిల్లా నాయకులు సువర్ణపాక జగ్గారావు ఇస్లావత్ బాలకృష్ణ దుర్గం కృష్ణ మాదారపు సతీష్ జనగాం వెంకన్న సోషల్ మీడియా ఇంచార్జి జనగాం రవి తదితరులు పాలుగోన్నారు