నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
కమలాపూర్ మండలం లోని ఉప్పల్ గ్రామములో నూతనంగా నిర్మిస్తున్న బీరన్న ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాయినేని తిరుపతి రావు రూ.3,50,000/- ల విరాళం ప్రకటించారు.గ్రామానికి చెందిన కురుమ సంఘం పెద్దల అభ్యర్థన మేరకు విరాళం ప్రకటించిన తిరుపతి రావు ను వారితో పాటు గ్రామస్థులు అభినందించారు.గ్రాములో ఎవ్వరికీ ఎలాంటి ఆపద కలిగిన ముందుండే తిరుపతి రావు వివిధ కుల సంఘాలకు,ఆలయాల నిర్మాణాలకు కూడా హితోధికంగా ఆర్థికంగా విరాళాలు అందిస్తూ దాతృత్వం లో తనకు మరెవరూ సాటి రారని మరో సారి నిరూపించుకున్నారు అని కురుమ సంఘం పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమములో గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్ రావు,రాకం మొండయ్య,కోనుపుల రామచందర్,ఎర్రబెల్లి శ్రీధర్ రావు,మొందెద్దుల రాజమౌళి,బండారి ఐల కొమురయ్య,వీరబోయిన రవి,ముష్కే శ్రీను,బండారి మొగిలి,పూర్ణచందర్,బండ సదయ్య తదితరులు పాల్గొన్నారు.