`పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న ఉత్తరాది విద్యా సంస్థలు!
`తెలంగాణ విద్యా సంస్థలను కాబలిస్తున్న ఉత్తరాది సంస్థలు!
`హంగు అర్బాటలతో ఏర్పాటు చేస్తున్నారు.
`తెలంగాణ విద్యను కమ్మేస్తున్నారు.
`తెలంగాణ విద్యా సంస్థలకు సమాధి కడుతున్నారు.
`లక్షలకు లక్షల ఫిజులు వసూలు చేస్తున్నారు.
`చిత్ర, విచిత్రమైన పేర్లు పెడుతున్నారు.
`ఆకర్షనీయమైన పేర్లతో ఆకట్టు కుంటున్నారు.
`తెలంగాణ విద్యా వంతులు స్కూల్ పెట్టుకోవాలన్నా సవాలక్ష ప్రశ్నలు!
`గతంలో తెలంగాణ కు చెందిన విద్యా సంస్థలకు తోకలు తగిలించొద్దన్నారు.
`స్కూల్ అని మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
`స్కూల్స్ పేరులో టెక్నో లాంటి పేర్లపై అభ్యంతరం తెలిపారు.
`ఇప్పుడు ఉత్తరాదికి చెందిన విద్యా సంస్థలు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు.
`పైగా టీచర్లు గా ఉత్తరాది వాళ్లనే తీసుకుంటున్నారు.
`తెలంగాణ వాళ్లకు అవకాశం కల్పించడం లేదు.
`చదివేది తెలంగాణ విద్యార్థులు.. చదువు చెప్పేది ఉత్తరాది వాళ్ళు!
`మాతృ బాషను లేకుండా చేసే కుట్రలో ఇది కూడా ఒక భాగమే!
`ఒకప్పుడు విద్యా వ్యవస్థలో సౌత్ ఇండియా నెంబర్ వన్.
`ఇప్పటికి ఉత్తరాదిలో నిరక్ష రాస్యత ఎక్కువ.
`అలాంటి రాష్ట్రాల నుంచి వచ్చి స్కూల్స్ పెడుతున్నారు!
`ఇప్పటికే అన్ని వ్యాపారాలలో దూరిపోయారు.
`తెలంగాణ వ్యాపారులను బికారీలను చేస్తున్నారు.
`ఇప్పుడు తెలంగాణ విద్యా సంస్థల మీద పడ్డారు.
`తెలంగాణ ను సర్వ నాశనం చేసే దాకా వదిలిపెట్టేలా లేరు
హైదరాబాద్, నేటిధాత్రి:
చిన్నప్ప్పుడు పుస్తకాలలో ఆర్యుల దండయాత్ర అనే పాఠాలు అందరూ చదువుకున్నారు. ఇప్ప్పుడు అదే ఉత్తర భారతం నుంచి వ్యాపారం ముసుగులో అనేక మంది వస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యాలు విస్తరిస్తున్నారు. అన్ని రకాల వ్యాపారాలలో స్దానిక వ్యాపారాలకు స్దానం లేకుండా చేస్తున్నారు. మన రాజ్యాంగం కల్పించిన హక్కుల పరంగా ఎవరు ఎక్కడైనా నివాసం వుండొచ్చు. ఎక్కడైనా వ్యాపారం చేసుకునే స్వేచ్చ వుంది. కాని వ్యాపారం ముసుగులో స్దానిక ప్రజలకు ఉపాది లేకండా చేయడాన్ని రాజ్యాంగం కూడా స్వాగతించదు. ఇది ఇప్ప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద గుదిబండలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని రకాల వ్యాపారాలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేరారు. ఎవరి ఉపాది వారిదే అన్న ధోరణి అందరూ కనబర్చారు. కాని కొన్ని మౌలికమైన రంగాలు ప్రత్యేంగా వుంటాయి. అందులో విద్య అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ముందు టీ స్టాల్స్‌తో మొదలైన ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కార్పోరేట్ వ్యాపారాలను శాసించే స్దాయికి ఎదిగారు. అలా చిన్నగా బట్టల దుకాణాలు మొదలు పెట్టిన వారు ఇప్ప్పుడు తెలంగాణలో వ్యాపారాలను తెలంగాణ వారికి అందకుండా కబలించేశారు. ఆ వ్యాపారాలలో తెలంగాణకు చెందిన వ్యక్తులకు కనీస ఉపాది కూడా అందకుండా చేస్తున్నారు. వారి మనుషులనే తెచ్చుకుంటున్నారు.న వారి ప్రాంతాల ప్రజలకు ఉపాది కల్పిస్తున్నారు. తెలంగాణ యువత వలసలు పోయే పరిసి ్దతి తీసుకొస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వచ్చి చేరి కొన్ని లక్షల కిరాణ దుకాణాలు పెట్టేశారు. నగరంలో ఏ వీదిలో చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. వారి సిండికెట్ వ్యాపారంలో నాసి రకం సరుకులు ప్రజలకు అంటగడుతున్నారు. అవి కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇక సెల్ ఫోన్ల దుకాణాలకు లెక్కే లేదు. ప్రతి చిన్న చిన్న పట్టణంలోనూ సెల్‌ఫోన్ దుకాణాలు పదులు, వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యక్తులకు ఉపాది లేకుండా చేశారు. చిన్న ీVAటళ్ల నుంచి మొదలు పెద్ద పెద్ద ీVAటళ్లు ఏర్పాటు చేసుకున్నారు. గహ నిర్మాణంలో రంగంలో దూరిపోయారు. ఇంటికి అవసరమైన అన్ని రకాల వస్తువుల సరఫరాకు చెందిన షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. ఇక బంగారం దుకాణాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఎక్కడ చూసినా బంగారం షాపులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులవే వున్నాయి. వైద్య సేవల ముసుగులో ఇప్పటికే అనేక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. కంటి ఆపరేషన్లకు చెందిన కొన్ని ఆసుపత్రులు తెలంగాణలోని ప్రతి చిన్న పట్టణంలోనూ ఏర్పాటు చేశారు. ఇలా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా ఆక్రమించారు. కాకపోతే ఒక్క విద్యారంగంలోకి వాళ్లు ప్రవేశించడం లేదన్న ధైర్యం వుండేది. కాని ఇప్ప్పుడు ఆ రంగంలోనూ ప్రవేశించారు. అతి తక్కువ సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాలలోతోపాటు, హైదరబాద్‌లో అనేక స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా వెలుస్తూనే వున్నాయి. పుట్టగొడుగుల్లా విద్యా సంస్ధలను ఏర్పాటు చేస్తున్నారు. పైగా అందులో ఉపాద్యాయలను, ఇతర సిబ్బందిని కూడా పూర్తిగా ఉత్తరాదికి చెందిన వాళ్లేనే నియమించుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో విద్యా వ్యవస్ధ ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో బిహార్ రాష్ట్రం అక్షరాస్యతలో,పేదరికంలో అట్టడుగు స్దాయిలో వుంది. అలాగే ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, నుంచి మహారాష్ట్ర , ఒరిస్సా, అస్సాం,చత్తీస్ఘడ్ ఇలా చెప్ప్పుకుంటూ అన్ని రాష్ట్రాలలోనూ సరైన విద్యా వ్యవస్ధ లేదు. కాని ఆది నుంచి దక్షిణాదిన బలమైన విద్యా వ్యవస్ధలు వున్నాయి. అక్షరాస్యతలో మూడు, నాలుగు దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత గ్రామాలు తెలంగాణలో అనేకం వున్నాయి. కేరళ రాష్ట్రం కొన్ని దశాబ్ధాల క్రితమే మొత్తం రాష్ట్రమే సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. అలాంటి దక్షిణాది రాష్ట్రాýలో ఉత్తరాది వాళ్లు విద్యా సంస్ధలు ఏర్పాటు చేయడం అంటే పరిస్దితి ఏలా వుందోఅర్దం చేసుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాల లాగానే విద్యను కూడా పూర్తిగా వ్యాపారంగా మార్చడంలో భాగంగానే ఇలా ఉత్తరాదికి చెందిన వాళ్లు వచ్చి స్కూళ్లు పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వదిలేస్తే ప్రాదమిక, మాధ్యమిక విద్యలతోపాటు, పూర్తిగా ఉన్నత విద్యలలోనూ ఉత్తరాది సంస్దలు పుట్టగొడుగుల్లా వస్తాయి. తెలంగాణకు చెందిన చిన్న, చితకా స్కూళ్లు, కాలేజీలే కాదు, పెద్ద పెద్ద కార్పోరేట్ విద్యా సంస్దలు కూడా భవిష్యత్తులో మనుగడ లేకుండా పోతాయి. తెలంగాణలో ఇప్పటికే కొన్ని కార్పోరేట్ కాలేజీల మూలంగా అనేక చిన్న చితకా లోకల్ కాలేజీలు మూతపడ్డాయి. అందులో పనిచేసే అద్యాపకులు జీవితాలు వీధినపడ్డాయి. కాలేజీలు ఏర్పాటు చేసిన యాజమన్యానాలు అప్ప్పుల పాలయ్యాయి. వాళ్లు కూడా ఉపాది లేకుండా పోయారు. తెలంగాణలో అనేక స్దానిక స్కూళ్లు కూడా కొన్ని వేలల్లో కార్పోరేట్ స్కూళ్ల పుణ్యమా అని మూతపడ్డాయి. ఇప్ప్పుడు తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్‌కు చెందిన కార్పోరేట్ విద్యా సంస్ధలు కూడా ఉత్తరాధి వాల్లకు చెందిన విద్యా సంస్ధల మూలంగా కనుమరుగయ్యే కాలం తరుముకొస్తోంది. ఒకప్ప్పుడు తెలంగాణలో స్కూళ్లపేర్లకు ముందు వెనుకు ఏవైనా తోకలు తగిలిస్తే ప్రభుత్వాలు కొరడా ఝులిపించాయి. కేవలం ప్రైవేటు స్కూల్ అని మాత్రమే పేరుండాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆ సమయంలో కొన్ని స్కూళ్లకు టెక్నో స్కూల్స్ అంటూ కొన్ని రకాల పేర్లను జత చేసేవారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్పోరేట్ స్కూళ్లు కూడా ఆ పేర్లను తొలగించాయి. కాని ఇప్ప్పుడు ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్లు పెడుతున్న పేర్లు ఎవరికీ అర్ధమయ్యేలా లేవు. అసలు వాటి అర్ధమేమిటో కూడా తెలియకుండా వుంటున్నాయి. ఆ పేర్లు ఏ రాష్ట్రానికిచెందిన అర్ధాలతో ముడి పడి వున్నాయో కూడా తెలియకుండా వుంటున్నాయి. కాకపోతే ఆకర్షణీయంగా వుండేలా పేర్లు పెడుతున్నారు. పెద్ద పెద్ద అప్పార్టుమెంట్లలో ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ అంటే ఎలా వుండాలో అనేదానికి కొన్ని ప్రత్యేకమైన నిబందనలున్నాయి. స్కూల్ నిర్మాణం ఖచ్చితంగా అర్ద చంద్రాకారాంలో మాత్రమే నిర్మాణమై వుండాలి. క్రమేనా అప్పార్టుమెంటు కల్చర్ రావడంతో అలా నిర్మాణాలకు తావు లేకుండా పోయింది. తరగతి గదులకు వెలుతురు, గాలి సమద్దిగా రావాలి. ప్రతి స్కూల్‌కు ఆట స్ధలం వుండాలి. ఇలా కొన్ని ఖచ్చితమైన నిబందనలున్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణం ఇప్పటికీ అలాగే జరుగుతంది. కొత్తగా ఉత్తరాదికి చెందిన విద్యా సంస్దలు అద్దాల మేడల్లా ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. చిత్ర విచిత్రాల పేర్లు పెడుతున్నారు. అయినా తెలంగాణ విద్యాశాఖ కండ్లు మూసుకుంటోంది. అసలు అలాంటి పేర్లను ఎలా విద్యాశాఖ ఎలా అనుమతినిస్తుందనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్ది సంఘాలు కూడ దానిపై దష్టిపెట్టడం లేదు. తెలంగాణ విద్యావంతులు కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. తెలంగాణకు చెందిన వ్యక్తులు స్కూల్, కాలేజీ ఏర్పాటు చేసుకోవాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. అనుమతుల్లో అనేక తికమకలు పెడుతుంటారు. కాని ఉత్తరాదికి చెందిన వారికి ఎలా అనుమతులు ఇస్తున్నారు? పైగా తెలంగాణలో ఉత్తరాది వాళ్లు ఏర్పాటు చేస్తున్న స్కూళ్లలో, కాలేజీల్లో స్దానికులకు అవకాశాలు కల్పించడం లేదు. ప్యూన్ నుంచి ప్రిన్సిపల్ దాకా అందరూ ఉత్తరాదికి చెందిన వాల్లే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి విద్యా సంస్ధలు విస్తరిస్తే తెలంగాణలో స్దానికుల స్కూళ్లు, కాలేజీలే కాదు, ఇప్ప్పుడు గుత్తాధిపత్యం వహిస్తున్న కార్పోరేట్ కాలేజీలు కూడా బిచాణ ఎత్తేయడం ఖాయమే అవుతుంది. ఇక చిన్నా చితక కాలేజీలు, స్కూళ్లు పూర్తిగా మాయమైపోతాయి. విద్యా సంస్ధల ముసుగులోస్ధానిక బాషలను బొంద పెట్టే కుట్రలో కూడా ఇవి భాగమైపోయే ప్రమాదముంది. ఇప్పటికే తెలంగాణ రాజదాని హైదరాబాద్‌లో తెలుగు రాసే వాళ్లు కరువౌతున్నారు. తెలుగు మాట్లాడడమే నామూషీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కొనసాగితే కొంత కాలం పోతే తెలంగాణలో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం లేకేపోలేదు. తెలంగాణ విద్యాసంస్దలకు మరణ శాసనం కాక తప్పదు.
