· నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ
· అబ్జెక్టివ్ పద్ధతినుంచి, సమగ్ర అభ్యసనం దిశగా మార్పు
· కోచింగ్ సెంటర్లకు కష్టాలు తప్పవు
· ప్రైవేటు స్కూళ్ల విచ్చలవిడి ఫీజులపై నియంత్రణ
· కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
· ఈఏపీసీఈటీ ప్రవేశపరీక్ష రద్దు
· 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల ఆధారంగా సీట్లు
· టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లకు స్వస్తి
· పనితీరు ఆధారంగా ప్రమోషన్లు
· ప్రాథమిక స్థాయి నుంచే కత్రిమమేధకు ప్రాధాన్యం
· నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం
· 1వ క్లాస్ నుంచి త్రిభాషా సూత్రం అమలు
హైదరాబాద్, నేటిధాత్రి:
కొత్త విద్యావిధానంపై అధ్యయనం చేసేందుకు నియమించిన ఏకసభ్య కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించడం తాజా పరిణామం. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఈ కమిటీకి నేతత్వం వహించారు. “ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ`2026: విజన్ ఫర్ ఇన్‌క్లూజివ్ ఎక్స్లెన్స” పేరుతో ఈ నివేదికను తయారుచేసారు. ప్రస్తుతంఅమల్లో వున్న విద్యావిధానంలో సమూల మార్పులను కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యంగా వి ద్యార్థి కేంద్రంగా ఈ విద్యావిధానం వుండటం కీలకం.
ఈ కమిటీ చేసిన సిఫారసులు ఈవిధంగా వున్నాయి.
· ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఈఏపీసీఈటీ)ని రద్దు చేయాలి. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలి.
· నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. ఇదే సమయంలో 1వ తరగతినుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి.
· ఇప్పటివరకు అమల్లో వున్న ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానానికి స్వస్తి పలకాలి. టీచర్ పనితీరు ప్రమాణంగా మాత్రమే ఇక ముందు ప్రమోషన్లు కల్పించాలి.
· ప్రస్తుతం రాష్ట్రంలోని రెండువేల పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా మార్చాలి. అంతేకాదు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించాలి.
· ఎస్.ఎస్.సి.(10వ తరగతి), ఇంటర్మీడియట్ (12వ తరగతి) బోర్డులను విలీనం చేసి, బోర్డు పరీక్షలను కేవలం 12వ తరగతి స్టాండర్డ్‌లోనే నిర్వహించాలి.
· 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు (విజయ డైరీ) త ప్పనిసరిగా ఇవ్వాలి.
· ప్రాథమిక విద్య స్థాయినుంచే కత్రిమమేధ (ఏఐ) పాఠ్య ప్రణాళికలో చేర్చాలి.
· ఈ ఏఐ పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా టీచర్లు, అధ్యాపకులకు స్వల్పకాలిక ఏఐ ట్రైనింగ్‌ను నిర్వహించాలి. అంటే ఇప్పటికి కాలం చెల్లిన టెక్నికల్ ప్రోగ్రామ్‌ల స్థానంలో ఏఐ ఆధారిత కోర్సులకు ఈ ట్రైనింగ్ల్లో ప్రాధాన్యతనివ్వాలి.
· ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో, మిగిలిన 100 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను పైలెట్ ప్రాతిపదికన ప్రారంభించాలని కమిటీ సిఫా రసు చేసింది.
· ప్రతి స్కూల్‌ను 4-5 ఎకరాý విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క తరగతి గదిని 30 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించాలి.
· తరగతి గదులు డిజిటల్ అభ్యసనానికి అనువుగా ఇం{రాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ లు), డ్యూయల్ డెస్క్‌లు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.
· పూర్తి స్థాయి పరికరాలతో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఆధునిక ఫర్నీచర్‌తో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి.
· విద్యార్థులకు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా స్కూల్ బస్సు సదుపా యం కల్పించాలి.
· అగ్రశ్రేణి కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరిగానే క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి.
· సోలార్ ప్యానళ్లు, ఎలఈడీ లైటింగ్, ప్రకతి వ్యవసాయం కోసం న్యూట్రిషన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి.
· పాలిటెక్నిక్ కళాశాలలు, అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లలో కూడా ఏఐ విద్యను తక్షణం ప్రవేశపెట్టాలి.
· యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్‌ను రద్దు చేసి, ఆయా కోర్సును రెగ్యులర్ చే యాలి.
· యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ను పునర్వ్యవస్థీకరించి, వైస్`ఛాన్స్లర్ నియామకా ల్లో పారదర్శకంగా పనిచేసే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలి.
· ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ, ఫీజు నిర్మాణ ప్రక్రియ ఏవిధంగా వుండాలనేది నిర్ణయించేందుకు రిటైర్డ్ జడ్జి లేదా ప్రధాన కార్యదర్శి నేత త్వంలో ఒక రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలి.
కమిటీ నివేదికలో పేర్కొన్న సిఫారసుల ప్రకారం తొలిదశ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక దన్నుతో పాటు కొత్త సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను (టీపీఎస్) 2026`27 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌కు ఆవల ప్రతి నియోజకవర్గంలో ఒక టీపీఎస్ స్కూల్‌ను ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే క్యూర్ (కాంప్రహెన్సివ్ అర్బన్ రీవైటలైజేషన్Ê ఎడ్యుకేషన్) కింద ప్రణాళికలు తయారుచేసిన 12 సమీకత పాఠశాలల్లో, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏడాదిలోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పాఠశాలల నిర్మాణం ప్రస్తుతం కొండర్గ్, ఆరుట్ల, కల్వకుర్తి, u£ట్టుగూడ, మిర్యాలగూడల్లో కొనసాగుతోంది.
తెలంగాణ బడ్జెట్ 2026-27లో విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నారు. మొత్తం బడ్జెట్ రూ.3.2 నుంచి 3.25లక్షలకోట్లుగా వుండే అవకాశముంది. ఇందులో విద్యకు అగ్రతాంబూలం ఇ వ్వడానికే ప్రభుత్వం కతనిశ్చయంతోవుంది. 2025‘26 బడ్జెట్లో ప్రభుత్వం విద్యకు రూ.23,108కోట్లు కేటాయించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 13.5% ఎక్కువ. టీపీఎస్‌ల కోసం ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టక తప్పదు. గతంలో రాష్ట్రంలోని 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ప్రభుత్వం రూ.11,600కోట్లు కేటాయించింది. ఈ మొత్తంతో వీటిల్లో టీపీఎస్‌లకు నిర్దేశించిన మౌలిక స దుపాయాలే కల్పిస్తారు. ఇక రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లుగా అభివద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2324.2 కోట్లు కాగా టాటా టెక్నాలజీస్‌తో పాటు ఇందులో ప్రభుత్వం, రూ.308కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్ లో విజయపాలు ఇవ్వాలని నిర్ణయించడం వల్ల, డైట్ చార్జ్‌లకు 40% వరకు ప్రభుత్వం పెంచ నుంది.
ఈఏపీసెట్‌ను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను విపరీత మానసిక ఒత్తిడినుంచి విముక్తి చేయనున్నది. ముఖ్యంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, కోచింగ్ ఈపీసెట్ పెరుతో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్యార్థులపై ఆర్థిక భారం విపరీతంగా పడుతోంది. క మిటీ సిఫారసు మేరకు 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగడంవల్ల వి ద్యార్థులకు మానసిక ఒత్తిడినుంచి, వారి తల్లిదండ్రులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలుగ నుంది. ప్రస్తుతం ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విద్యావిధానం ద్వారా, విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లో సమగ్ర పాఠ్యాంశాల అభ్యసన ప్రక్రియకు మళ్లుతారు. అంటే ఇప్పుడు కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నల ఆధారిత పరీక్షా విధానం ఆధారంగా జరిగే అభ్యసకు స్వస్తి పలుÅ£నున్నారు. ఇక నర్సరీ నుంచి పీజీ వరకు ఇంగ్లీషు మాధ్యమంలో చదవడం వల్ల గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలవారు ఆంగ్లభాష రాకపోవడమన్న ఇబ్బందినుంచి బయటపడతారు. ఫలితంగా ఉ ద్యోగాల్లో గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను తేలిగ్గా నేర్చుకోగ లుగుతారు. ఇక ప్రాథమిక స్థాయినుంచే ఏఐ పాఠ్యప్రణాళికను అమలుచేయడంవల్ల, గ్లోబల్ డిజిటల్ ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ సాధనకు అనువైన నైపుణ్యాలను విద్యార్థులు అలవరచుకోగలుగుతారు. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ (టీఈఎసఏ), ప్రైవే టు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తుంది. ముఖ్యంగా విద్య వాణిజ్యీకరణను నిరోధించడమే కాకుండా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సమాన విద్యాప్రమాణాలు కొ నసాగేలా చూస్తుంది.
అయితే ఈ కొత్త విద్యావిధానంపై విమర్శలు కూడా లేకపోలేదు. మరింత సమర్థవంతమైన టీచర్ ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీషు మీడియం విద్య ఎంతవరకు విజయవంతమవుతుందనేది కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానం. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేయాలనుకుంటున్న పోషకాహార పథకాల అమలుకు 2031 నాటికి రూ.31600 కోట్లు అవసరం. నిజం చెప్పాలంటే విద్యావిధా నంలో ప్రస్తుతం తీసుకువస్తున్న మార్పుల వల్ల “కోచింగ్ కల్చర”నుంచి విద్యార్థులకు విముక్తి కలుగుతుంది. ఇదే సమయంలో టీచర్లు, అధ్యాపకుýను జవాబుదారులుగా చేయడంవల్ల ఇప్పటి మాదిరి ఉద్యోగ భద్రత వుండకపోవచ్చు.
ఈఏపీసెట్ రద్దువల్ల ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు కష్టాలు మొదలవుతాయి. ఇప్పటివరకు కార్పొ రేట్ కళాశాలలు, ఈ కోచింగ్‌ల పేరుతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాయి. కోచింగ్‌ల్లో కూడా రకరకాలు ప్రవేశపెట్టి మరీ విద్యార్థుల తల్లిదండ్రులనుంచి ముక్కుపిండి చేసే వసూలు ప్రక్రియ లకు ఇక ఫుల్స్టాప్ పడుతుంది. అదీకాకుండా ప్రైవేటు విద్యాసంస్థలు బోధనలో ఆబ్జక్టివ్ మెథడ్, షార్ట్క్ మెథడ్లను అనుసరించే విధానానికి అడ్డుకట్ట పడుతుంది. అవి కూడా తప్పనిసరిగా సమగ్ర పాఠ్యప్రణాలికను అనుసరించే విధంగా పద్ధతులు మార్చుకోక తప్పదు. ఇప్పటివరకు ఈఏపీసెట్ కోచింగ్‌పై ఆధారపడి కొనసాగుతున్న చిన్నపాటి కోచింగ్ సెంటర్లు మూతపడటమో లేక ఏఐ లేదా జాతీయ స్థాయి జీఈఈ/నీట్ పరీక్షల కోచింగ్‌కు మరలక తప్పదు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి సదుపాయాల కల్పన వల్ల, ప్రస్తుతం డిజిటల్ సౌకర్యాలు లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలనుంచి, మధ్యతరగతి విద్యార్థులు పెద్దఎత్తున టీపీఎస్‌లకు మారే అవకాశాలు పుష్కలం! ఈ కమిషన్ పనితీరు ఆధారిత మూల్యాంకనానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, ఒక టీచర్ బోధించే విద్యార్థుల సగటు గ్రేడు వద్ధిని బట్టి, మెరుగుదల అంచనాలు వేస్తారు. ప్రభుత్వం నియమించిన కె.కేశవరావు కమిటీ ఈ మూల్యాంకనాలకు పాటించాల్సిన నిబంధనల పై అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా ఇవి రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, నిస్సాక్షి కంగా వుండే విధంగా చూస్తున్నారు.
ఇక టీచర్లకు తమ పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు లభించనున్నాయి. ఐదేళ్ల కాలంలో విద్యార్థి అభ్యసన ఫలితాల (ఎసఎలఓ) లక్ష్యాలను అధిగమించిన టీచర్లు మాత్రమే “స్పెషల్ మెరిట్ ఇం క్రిమెంట్స”కు అర్హులవుతారు. ఇక హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ 70శాతం వారి పనితీరు, 30% వారి సీనియారటీలపై ఆధారపడనున్నది. మారుమూల ప్రాంతాల్లోని టీపీఎస్ ల్లో పనిచేసే టీచర్లకు 10% “హార్డ్‌షిప్ అలవెన్స”ను ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటు పాఠశాల లు డొనేషన్ల పేరుతో వసూళ్లను ప్రభుత్వం రద్దుచేయనుంది. ఇక వన్‌టైమ్ అడ్మిషన్ ఫీజుపై కూడా పరిమితి విధించనుంది. ప్రైవేటు స్కూళ్లు కూడా తమ ఫీజు వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో వుంచాలి. ఫీజు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలకు వాటి స్థాయిని బట్టి రూ.1లక్ష నుంచి రూ.10లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు. అధిక ఫీజులు వసూలు చేసిన సంస్థలు, 30 రోజుల్లోగా వడ్డీతో సహా అదనపు మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లించాల్సి వుంటుంది. ప్రతి జిల్లా కేంద్రంలో డీఈఓ నేతత్వంలో “గ్రీవెన్స్ సెల్స్‌ను” ఏర్పాటు చేస్తారు. ఇందులో తలిదండ్రుల అసోసియేషన్ కు చెందిన ఒకరు సభ్యులుగా వుంటారు. ఇందులో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుకు సదరు స్కూల్ వారం రోజుల్లోగా తప్పనిసరిగా స్పందించాలి. దీనికి సంబంధించిన విధివిధానాలకు కె.కేశవ రావు కమిటీ తుదిరూపం ఇస్తోంది. ఒకవేళ డీఈఓ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే, ఆటో మేటిక్‌గా ఈ ఫిర్యాదు రాష్ట్రస్థాయికి వెళ్లే విధంగా నిబంధనలు రూపొందిచనున్నారు.
