మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగుర్ల వెంకటేశ్వర్లు
పరకాల,నేటిధాత్రి
పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దెల బాబు(రాజయ్య)ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎరుకొండ రమాదేవి శ్రీనివాస్,పరకాల మండల పీఏసీఎస్ చైర్మన్ నాగయ్య యాదవ్,వార్డు సభ్యులు పసుల కావ్య మధుకర్,జాలిగపు సంకీర్తన రాజు,మాజీ ఉపసర్పంచ్ పసుల సంపత్,నాయకులు కంచ సమ్మయ్య,రవీందర్ రెడ్డి,కృష్ణారెడ్డి,యూత్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డి, పోతరాజు మనోజ్,వేల్పుల భద్రయ్య,బండారి చంద్రమొగిలి,మేకల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
