కాలిపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించినఎమ్మెల్యే.

కాలిపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించినఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంకటరావుపల్లి చల్లగరిగే చిట్యాల రామచంద్రాపురం గ్రామాలలో గురువారం రాత్రి వివిధ కారణముల వలన జరిగిన అగ్ని ప్రమాదాలలో కాలిపోయిన పంటలను అధికారులతో పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులను ఓదార్చి ధైర్యం నింపారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల క్షేమం కొరే ప్రభుత్వమని ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది, షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన రైతుల వివరాలు కైలాపూర్ గ్రామ శివారు సిరిపురం కుమారస్వామి తండ్రి కొమరయ్య అరటి పంట దాదాపు నాలుగు ఎకరాల 20 గుంటలు మరియు చల్లగరిగే గ్రామంలో పామాయిల్ తోట పాటు డ్రిప్పు పైపులు చాడ సమ్మిరెడ్డి రెండు ఎకరాలు మరియు వెంకట్రావుపల్లికి చెందిన బాలవీని వేణు 1.20 గుంటలు చిట్యాల గ్రామ శివారులో తాను కౌలుకు తీసుకున్న మిర్చి పంట మరియు డిప్ పైపులు అగ్ని ప్రమాదానికి కాలిపోయాయని తెలిసింది అట్టిది విచారణ జరిపి అధికారులకు నివేదిక పంపడం జరిగింది, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వసంతరావు ఎంపీడీవో జైయ శ్రీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, మండల అధికారులు రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version