వయోవృద్ధుల కోసం మెగా హెల్త్ క్యాంప్

*వయోవృద్ధుల డేకేర్ సెంటర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్*

*పరకాల,నేటిధాత్రి*

 

పరకాల వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.హైదరాబాద్‌కు చెందిన శంకర కంటి ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలతో పాటు బీపీ,షుగర్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పరకాల ఆర్డీఓనారాయణ,హనుమకొండ జిల్లా డీఎంహెచ్‌వో అప్పయ్య,డీడబ్ల్యూఓ విశ్వజా,అనురాగ హెల్పింగ్ అండ్ సొసైటీ నిర్వాహకురాలు అనితారెడ్డి,సీడీపీఓ స్వాతి, ఏసీడీపీఓసింధూరాణి,జూనియర్ అసిస్టెంట్ రేవంత్,ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ,డీహెచ్‌ఈ కోఆర్డినేటర్ కళ్యాణి,జీఎస్ మానస,స్వర్ణలత,9వ వార్డు కౌన్సిలర్ దశరథం,కాలేశ్వరం మహాదేవపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుంటూజు వెంకన్న,ప్రగతి సేవాసమితి కార్యదర్శి గదల జాన్,సూపరింటెండెంట్ రాజ్‌కుమార్,సిబ్బంది శివ,పరకాల వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు ఆర్.నరసింహులు,డాక్టర్ జైపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరకాలలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.క్యాంపులో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 70 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.వారికి హైదరాబాద్‌లోని శంకర కంటి ఆస్పత్రికి ఉచిత బస్సు సౌకర్యంతో తరలించి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని వెల్లడించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రగతి సేవా సంస్థకు,శంకర కంటి ఆస్పత్రి వైద్య బృందానికి గ్రామీణ ప్రాంత ప్రజలు,వయోవృద్ధులు మరియు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version