Indiramma House Inaugurated
ఇందిరమ్మ ఇల్లును గృహప్రవేశం చేసిన మార్కెట్ చైర్మన్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం కల్వల గ్రామంలో గుండెబోయిన ఎల్లమ్మ అనే మహిళకు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని ఇంటి నిర్మాణం పనులు పూర్తి అయినందున లబ్ధిదారులు సోమవారం మంచి ముహూర్తం ఉండడంతో ముఖ్యఅతిథిగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డిని ఆహ్వానించడం జరిగింది. చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయటం జరిగింది, చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలు వారు పార్టీలకు అతీతంగా భేద భావం లేకుండా ఇల్లు లేదని గుర్తించిన వారికి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని ఇంకా రెండో విడుద ఇందిరమ్మ ఇండ్లు రావడం జరుగుతుందని అన్ని పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇవ్వటం జరిగిందని ఇకముందు కూడా ఇలాగే ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల సుజాత రామచంద్ర పార్టీ అధ్యక్షులు గండి శ్రీనివాస్ ఉపసర్పంచి పెద్దగాని రవి వార్డ్ మెంబర్స్ ఘంట రామ్మోహన్ రెడ్డి ఘంటా బాలకృష్ణ రెడ్డి కొమ్మల జయేందర్ రెడ్డి జల్లె లచ్చయ్య బొడ్డు బిక్షం దయాలే యాకన్న సెక్రటరీ సాయి తేజ పాల్గొన్నారు.
