చల్లా వంశీచంద్ రెడ్డి కి ఘనస్వాగతం పలికిన నవాబ్ పేట్ మండల ప్రజలు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
పాలమూరు న్యాయ యాత్ర 12వ రోజులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్, జడ్చర్ల నియోజకవర్గం, నవాబ్ పేట్ మండలంలోని చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు న్యాయ యాత్ర చేరుకున్నారు.
జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి సహకారంతో నేడు జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలంలోని కాకర్లపాడ్,రుద్రారం, నవాబ్ పేట్ గ్రామాలలో సి. డబ్ల్యూ. సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి , మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి, పాలమూరు న్యాయయాత్ర నిర్వహించారు.
సందర్భంగా వంశీ చంద్ రెడ్డి ఆయా గ్రామాలలోని దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు యంగ్ డైనమిక్ లీడర్స్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.