లేజర్ కాస్మోటిక్స్ ఉచిత వైద్య శిబిరం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లేజర్ కాస్మోటిక్స్ ఉచిత వైద్యశిబిరాన్ని శుక్రవారం నర్సంపేట పట్టణంలోని భరత్ డెంటల్, లేజర్ ఆసుపత్రిలో నిర్వహించారు. నర్సంపేట కెఎస్ఆర్ మహిళా కళాశాలకు చెందిన ఇరవైమంది విద్యార్థినులకు పులిపిర్లు, నల్లమచ్చలపై లేజర్ చికిత్సను ఉచితంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ డాక్టర్ భరత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో చర్మ వైద్యులు డాక్టర్ విజయ్ మాట్లాడుతూ అత్యాధునిక లేజర్ వైద్య విధానాల వల్ల మనం కోరుకున్న ఫలితాలు వస్తాయన్నారు పులిపిరులు, నల్లమచ్చల కోసం పసర వైద్యం కీడు చేస్తుందని అన్నారు. మహిళలు చర్మ సౌందర్యం కోసం లేజర్ స్పెషలిస్టులను సంప్రదించి ఆత్మవిశ్వాసం పొంది విజయం సాధించాలన్నారు. ఎండ తాకిడి నుండి చర్మ రక్షణకు సన్క్రీమ్ లోషన్ వాడాలన్నారు. యూవీ కిరణాల ప్రభావంతో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కోశాధికారి రవీందర్ ప్రముఖ వైద్యులు రాజేశ్వర్‌రావు ఎస్సార్ పారా మెడికల్, కెఎస్ఆర్ విద్యార్థినులు పాల్గొన్నారు.