అస్త్రం, శస్త్రం ‘‘హరీషే’’!

`’’సిద్దిపేట’’ కు అన్నీ ‘‘హరీషే’’!

`సిద్దిపేట కల లో కూడా కలవరించేది ‘‘హరీష్‌’’నే!

`సిద్దిపేటను కళ్లలో పెట్టుకొని కాపాడుతున్నది ‘‘హరీషే’’!

`చెట్టు, చేమ, చెరువు, పొలం ఏదైనా సరే చెప్పే పేరు ‘‘హరీషే’’?

`చెట్టు పేరు చెప్పుకొని ఇంకెవరు వచ్చినా వట్టిదే!

`’’హరీష్‌’’ సేవను చెరిపేసే గీతలు పుట్టలేవులే?

`’’బీఆర్‌ఎస్‌’’ బ్యాక్‌ బోన్‌ ‘‘హరీష్‌’’!

`గులాబీని కాపాడే కొమ్మ ‘‘హరీష్‌’’.

`గులాబీ జెండా ఎగురవేసిన తొలి నేత ‘‘కేసీఆర్‌’’.

`తెలంగాణను గులాబీ వనంగా మార్చిన మలినేత ‘‘హరీష్‌’’.

`తెలంగాణ బ్రాండ్‌ ‘‘హరీష్‌’’.

`సకలజన హిత ‘‘హరీష్‌!లి

`పద్నాలుగేళ్ల పోరాటంలో అలుపెరగని కార్యకర్త ‘‘హరీష్‌’’.

`పార్టీయే ప్రాణమైన నేత ‘‘హరీష్‌’’!

`’’కేసీఆర్‌’’ తెలంగాణ తొలి అడుగుకు ఊత కర్ర ‘‘హరీష్‌’’.

`పార్టీకి తొలి సైనికుడు ‘‘హరీష్‌’’.

`సిద్దిపేట ‘‘హరీష్‌’’ కంచుకోట.ప్రజాభిమానంతో నిండిన కలబోత.

`’’కేసీఆర్‌’’ కలల రూపమైన సిద్దిపేటను పదిలంగా కాపాడుతున్న నేత ‘‘హరీష్‌’’.

`పార్టీకి నీళ్లు పోసి పెంచిన ‘‘హరీష్‌’’.

`పార్టీ కొమ్మలు నరికే పనిలో ‘‘కవిత’’.

`’’హరీష్‌’’ పార్టీకి మూల స్తంభం దాన్ని కూలిస్తే కూలిపోయేది ‘‘కేసీఆర్‌’’ ప్రపంచం.

`ఈ మాత్రం అవగాహన ‘‘కవిత’’కు లేకపోవడం విడ్డూరం.

`పదిలంగా ‘‘కేసిఆర్‌’’ కీర్తిని అజరామరం చేస్తున్నది ‘‘హరీష్‌’’.

`’’హరీష్‌’’ ను బూచిగా చూపి

‘‘కేసిఆర్‌’’ను నిందల పాలు చేస్తున్న ‘‘కవిత’’.

`కూర్చున్న కొమ్మను నరుక్కున్న ‘‘కవిత’’.

`’’బీఆర్‌ఎస్‌’’ పార్టీకి వారసురాలు కాలేదు.

`’’కేసీఆర్‌’’ తర్వాత స్థానం ‘‘కవిత’’కెప్పుడూ దక్కదు.??

`’’కేసీఆర్‌’’ తర్వాత ‘‘కేటిఆర్‌’’ ఆపై ‘‘హిమాన్షు’’??!

`’’హరీష్‌ రావు’’కు ఎలాంటి ఆశలు లేవు.

`ప్రజా సేవ తప్ప ‘‘హరీష్‌’’ కు మరో ధ్యాస లేదు.

`అందరినీ గెలిపించేది ‘‘హరీషే’’.

`పార్టీకి వెన్నెముకగా నిలబడేది ‘‘హరీషే’’.

`’’హరీష్‌’’ తోడుగా ‘‘కేటిఆర్‌’’ కదలితే ప్రభంజనమే!.

`అధికారంలోకి తెచ్చేది ‘‘హరీష్‌, కేటీఆర్‌’’ ద్వయమే.

`‘‘కవిత’’ రాజకీయం త్రిశంకు స్వర్గమే!.

`’’కవిత’’ కలలు ఊహల పల్లకే!.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కలలు తీరేవి కాదు. ఆశలు నెరవేరేవి కాదు. పగటి కలలెప్పుడూ నిజం కావు. ఒక్కసారి చింతమడకు వచ్చి జన్మభూమి, ఖర్మ భూమి అని డైలాగ్‌లు చెబితే జనం నమ్మేది లేదు. కేసిఆర్‌ కూతురుగా ఊరు అక్కున చేర్చుకుంటుందేమో కాని, నాయకురాలిగా ఆ ఊరు కూడా అంగీకరించదు. సిద్దిపేటలో హరీష్‌రావును రాజకీయంగా ఎదుర్కోవాలంటే అంత సులువైన పని కాదు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఛాలెంజ్‌గా నిలబడి గెలవాలి. గెలిచే స్ధానం ఎన్నుకొని గెలవాలని కోరుకోవడం నాయకుల లక్షణం కాదు. అందులోనూ సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసిఆర్‌. ఇప్పుడు హరీష్‌రావు. ముందు ముందు కూడా హరీష్‌రావు మాత్రమే..అంతే కాని ఇంకెవరూ సిద్దిపేటను ఆక్రమించుకునే అవకాశం లేదు. అంతగా ప్రజలకు చేరువైన నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటను హరీష్‌రావు అధికారంలో వున్న పదేళ్లలో అభివృద్ది చేసిన నాయకుడు కాదు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే సిద్దిపేటను సిరుల పేట చేశాడు. తెలంగాణ ఉద్యమ గడ్డకు ఊరిపిలూదాడు. ఆనాటి నుంచి నేటి దాకా తనకు ఎదురులేని, తిరుగులేని రాజకీయాన్ని రాసుకున్నాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు కావడం నాయకులందరికీ సాద్యం కాదు. అది ఒక్క హరీష్‌రావుకు మాత్రమే సాధ్యమైంది. సిద్దిపేట నియోజకవర్గంలో అందిరకీ బందువు హరీష్‌రావు. అలా గుర్తింపును, ప్రతి ఇంటిలో స్ధానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. బిఆర్‌ఎస్‌ పార్టీకి అస్త్రశస్త్రాలంటేనే హరీష్‌రావు. అలాంటిది సిద్దిపేటకు అన్నీ ఆయనే. కారు పార్టీకి ఇందనమే హరీష్‌రావు. కేసిఆర్‌ అమ్ముల పొదిలే అస్త్రమే హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావు మీద కవిత ఎన్ని కుట్రలు చేయాలని ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే. తన గౌరవాన్ని తాను కోల్పోవడమే. చుట్టపు చూపుగా వచ్చిన వారికి ఒక్క రోజే మర్యాద. పదే పదే బంధువులు వస్తే ఎవరూ స్వాగతించరు. పదే పదే సిద్దిపేటకు వస్తానంటే కవిత పరిస్దితి కూడా అంతే..నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే వెతుక్కోవాలి. అదీ అసలైన నాయకుల ధైర్యం. అంతే కాని పారిపోయి, పది దిక్కులు చూస్తామంటే ప్రజలు స్వాగతించారు. బిఆర్‌ఎస్‌ గాలి రాష్ట్రమంతా వీస్తున్న సమయంలోనే కవిత ఓడిపోయారు? తాను ఎందుకు ఓడిపోయాను? ఏ వర్గాలకు దూరమయ్యాను? ప్రజలు ఎందుకు తనను దూరం పెట్టారు? అనేది ఆలోచించుకొని, పునరాలోచన చేసుకొని, చేసిన తప్పులను సరిద్దుకొని ముందుకు వెళ్లాలి. కాని తనను ఓడిరచి ప్రజలు తప్పు చేశారనే భావన కవితలో వుండడం ప్రజాస్వామ్యంలో పనికి రాదు. 2014 ఎన్నికల్లో కవితను చూసి నిజామాబాద్‌ ప్రజలు గెలిపించలేదు. కేవలం కేసిఆర్‌ కూతురుగా మాత్రమే గెలిపించారు. ఆ విషయం ఆమె అర్దం చేసుకోలేదు. అందుకే ఓడిపోయారు. రాజకీయాల్లో వారసత్వం ఎప్పటికీ పని చేయదు. ప్రతిసారి గెలిపించేందుకు అసలే ఉయయోగపడదు. ఇరవై ఏళ్లుగా సిద్దిపేట ప్రజలు హరీష్‌రావు వెనుక నిలబతుతున్నారంటే అది ఆయన వ్యక్తిత్వం. ఆయన సేవా గుణం. అందించిన సంక్షేమం. కష్టకాలంలో నాయకుడిగా ఆదుకున్న దాతృత్వం. ఒక నాయకుడు అప్రతిహాతంగా విజయాలు సాదిస్తున్నాడంటే ఒకే కారణం వుండదు. వారిలో వుండే నైతిక రాజకీయాలతోపాటు, ప్రజలపట్ల ఆ నాయకుడికి వుండే అంకిత భావం కూడ పనిచేస్తుంది. సిద్దిపేటలో మొదటిసారి హరీష్‌రావు గెలిచినప్పుడు కేసిఆర్‌ వల్లనే గెలిచారు. కాని తర్వాత కాలం నుంచి హరీష్‌రావు కూడా కేసిఆర్‌ లాగానే ప్రజలను కళ్లలో పెట్టుకొని చూసుకుంటాడన్న నమ్మకాన్ని పెంచుకున్నాడు. సిద్దిపేటలో కేసిఆర్‌ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే అందుకు కారణం కూడా హరీష్‌రావే. కేసిఆర్‌ ఆనవాలును మరింత పునరుద్దరిస్తూ హరీష్‌ రావు ముందుకు సాగుతున్నారు. ప్రతిసారి కేసిఆర్‌ పేరును హరీష్‌రావు నిలబెడుతూ వస్తున్నాడు. తాను పోటీ చేసిన ప్రతిసారి తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. హరీష్‌రావు ఎన్నికల్లో సృష్టించిన చరిత్రను భవిష్యత్తులో ఎవరూ సృష్టించలేరు. ఆయన రికార్డును ఎవరూ అధిగమించలేరు. ప్రజల్లో నాయకుడి మీద ఎంత ప్రేమ వుంటే గాని, అంత మెజార్టీ సొంతం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజీనామా చేసిన ప్రతిసారి ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ విజయాలు సాదించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటను బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేసిన నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటలో ప్రతి కుటుంబం కలలో కూడా కలవరించేది హరీష్‌రావునే. కష్టం వచ్చినా హరీష్‌రావు వద్దకు పరుగెత్తుకుంటూ వస్తారు. సంతోషమైనా సరే హరీష్‌రావుతో పంచుకునేందుకు వస్తారు. ఆయన కార్యాలయం నిత్యాన్నదాన సత్రం. పని మీద వచ్చినా, హరీష్‌రావును చూడడానికి వచ్చినా, సరే ఆకలి తీర్చి పంపే నాయకుడు హరీష్‌రావు. అలాంటి నాయకుడిని సిద్దిపేటకు దూరం చేయడం ఎవరి తరం కాదు. కవిత చెట్టు పేరు చెప్పుకొని వచ్చినా సరే ఆమె రాజకీయం చేసినా సిద్దిపేటలో ఒట్టిదే అవుతుంది. కోరికోరి రాజకీయ కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. హరీష్‌రావు తన నియోజకవర్గంలో ప్రచారం చేయకున్నా గెలుస్తాడు. ప్రజలే మీరు శ్రమ పడి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని హరీష్‌రావుకే చెబుతారు. బిఆర్‌ఎస్‌ను ఇతర నియోజకవర్గాలలో గెలిపించేందుకు వెళ్లండి అని ప్రజలే సూచిస్తుంటారు. అంతగా ప్రజలకు చేరువైన హరీష్‌ను మీద పోటీ చేయడమంటేనే ఎవరైనా ఓటమిని ముందే మూట గట్టుకోవడం అవుతుంది. ఇరవై ఏళ్లులో ఎంతో మందికి అనుభవం ఎదురైంది. సిద్దిపేటలో హరీష్‌రావు సేవను చెరిపేసే గీతలు పట్టువు. ఎందుకంటే చెట్టు, చేమ, పుట్ట, పొలం,చెరువు ఏదైనా సరే హరీష్‌రావు కోసమే ఎదురుచూస్తాయి. హరీష్‌రావునే కలవరిస్తాయి. ఉద్యమ కాలంలోనే హరీష్‌రావు చేసిన సేవ అంతా ఇంతా కాదు. తాను అధికారంలో లేకపోయినా, ఉద్యమ సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవను ప్రజలే గుర్తు చేస్తారు. ఎండాకాలం వస్తే ఎడారిగా మారే సిద్దిపేట రైతులకు ఆంద్రానుంచి గడ్డి కొనుక్కొచ్చి ఉచితంగా అనేక సంవత్సరాలు అందించిన ఏకైక నాయకుడు హరీష్‌రావు. ప్రతి ఊరిలో పశువులకు మంచినీటి కోసం తొట్లు కట్టించారు. నియోకవర్గంలోని ప్రతి ఊరికి సమీపంలో రోడ్డుకు ఇరవైపులా కూడా అలాంటి తొట్లు కట్టించారు. అలా పశువులకు ఆహారమే కాదు, నీటి కొరత లేకుండా చేసిన రైతు ప్రేమికుడు హరీష్‌రావు. తన నియోకవర్గంలో శ్రమదానంతో చెరువులను బాగు చేసి, తెలంగాణ రాకముందే చెరువుల్లో పూడికలు తీసిన నాయకుడు హరీష్‌రావు. అలా ప్రతి ఊరుకు చెరువును
ఉమ్మడి రాష్ట్రంలోనే కల్పతరువును చేసిన నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేటకు నాయకుడిగా, పాలకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఎంత వెన్నుదన్నుగా నిలిచారో..అలాగే గులాబీ పార్టీ పరిరక్షకుడిగా హరీష్‌రావు పోషించిన పాత్ర మరెవరూ పోషించలేరు. అయినా ఆది నుంచి కవితకు బిఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఆది నుంచి బిఆర్‌ఎస్‌లో సభ్యత్వమున్న నాయకురాలు కాదు. కనీసం కార్యకర్త కూడా కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే ఆమె బిఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. నిజామాబాద్‌ టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో పోటీచేశారు. పార్టీ నాది అని ఆమె చెప్పుకున్నా అధినేత కేసిఆర్‌కే నచ్చలేదు. ఎందుకంటే ఆమె పార్టీ సభ్యురాలు మొదటి నుంచి కాదు. ఉద్యమ సమయంలో పార్టీలో లేదు. ఉద్యమ సమయంలో ఆమె తన దుకాణం ఆమె నడుపుకున్నారు. జాగృతి పేరుతో ఉద్యమ రాజకీయం చేశారు. తర్వాత ఆమె బిఆర్‌ఎస్‌లో చేరారు. కాని హరీష్‌రావు బిఆర్‌ఎస్‌ పరుడు పోసుకున్నప్పటి నుంచి వున్నారు. తొలిసారి జెండా ఎగుర వేతలో కేసిఆర్‌కుతోడుగా వున్నారు. గులాబీ జెండా ఎగురవేసిన తొలినాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ జెండా ఊరూర ఎగుర వేసుకుంటూ తెలంగాణను గులాబీ వనం చేసిన నాయకుడు హరీష్‌రావు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ బ్రాండ్‌ హరీష్‌రావు. సకల జన హితుడు హరీష్‌రావు. బిఆర్‌ఎస్‌పార్టీకి తొలి సైనికుడు హరీష్‌రావు. సైన్యాధ్యక్షుడిగా పార్టీని ప్రతిసారి గెలిపిస్తూ వస్తున్న నాయకుడు హరీష్‌రావు. కేసిఆర్‌ ప్రపంచాన్ని కాపాడుతూ, ఆయన సామ్రాజ్యాన్ని నిలబెతున్న నాయకుడు హరీష్‌రావు. అయినా నేను సామాన్య కార్యకర్తనే అని చెప్పుకునే గొప్ప గుణమున్న, మనసున్న నాయకుడు హరీష్‌రావు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version