kavitha new party
`ఈనెల 25 న కవిత పార్టీ ప్రకటన.
`సామాజిక రాజకీయ వేదిక కవిత.
`బడుగుల చైతన్య గీతిక కవిత.

`పోరాటాల అపర కాళిక తెలంగాణా కవిత.
`కదిలింది కవిత.. జాగృతి రాజకీయ వేట!
`ఆట మొదలు పెట్టనునున్న కవిత.
`సంప్రదాయాలకు భిన్నంగా కొత్త చూడబోయే కొత్త బాట.
`ఉద్యమ కారులకు బాసటగా.

`యువతరానికి కు భరోసా..
`సరి కొత్త రాజకీయాలతో తెగింపు తోట.
`రేపటి రాజకీయాలకు కొత్త తరం కోట
`బలహీన వర్గాలను బలమైన వేదికలుగా మార్చుట.
`సామజిక రాజకీయ చైతన్యమే లక్ష్యంగా జాగృతి సరికొత్త బాట.
`రేపటి తరం ఆకాంక్షల త్యాగాల వెన్నెల కవిత.
`మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో సమరశంఖం పూరించనున్న కవిత.
`తెలంగాణ కు అన్యాయం చేసిన పార్టీలను తెగనరికే ఖడ్గమే కవిత.
`డాడీ, మోడీ ఎవరైనా సరే డీకొంటానంటున్న కవిత.
`మొక్కుబడి రాజకీయాల మీద యుద్దానికి దూసుకొస్తున్న అంకుశం కవిత.
`హామీల పేరుతో గద్దెనెక్కి మోసం చేసే పార్టీల గుండెలు చిల్చే బాణం కవిత.
`తరతరాల రాజకీయ మోసాలకు చరమ గీతం కవిత.
`తెలంగాణ నవ శాకానికి నాంది కవిత.
`ప్రజా తెలంగాణ ఆవిష్కారమే లక్ష్యంగా కదిలే రధచక్రమే కవిత.
`మహిళా లోకపు మణి దీపిక కవిత.
-మహిళా చైతన్య రాజకీయ కిరణం కవిత.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదు కాబోతోంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకునే సమయం ఆసన్నమైంది. ఇంకా కొన్ని గంటలే మిగిలి వుంది. మాజీ ఎంపి. మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే సమయం దగ్గరకొచ్చింది. తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలు, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25 తేదీ కోసం కవిత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆమె అభిమానులు, ఆత్మీయులు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు, యువత ఎదురుచూస్తున్నారు. రాజకీయ కదనరంగంలోకి కవిత పార్టీపరంగా దూకబోతోంది. కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ ఎలా వుంటుంది? ఏఏ అంశాలు ఆమె పార్టీ సిద్దాంతాలలో వుంటాయన్న విషయాన్ని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. సామాజిక తెలంగాణ నిర్మాణమే కాదు, సర్వోదయ తెలంగాణ కల సాకారం చేసే దిశగా పార్టీ నిర్మాణం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు బడుగులకు అండగా, బడుగు వర్గాల రాజకీయ వేదిక అనేది లేదు. వున్నా అవి ముందుకు సాగలేక ఆగిపోయినవి కొన్ని వున్నాయి. ఉనికి కోసం ఆరాటపడుతున్నవి కొన్ని వున్నాయి. అయినా బడుగుల పక్షాన బలమైన గొంతు వినిపించడంలో అవి విఫలమౌతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సామాజిక తెలంగాణ పేరుతో పార్టీలు పురుడు పోసుకున్నాయి. కాని వాటిని జనం కూడా ఆదరించలేదు. ఉద్యమ కారులే వాటికి జై కొట్టలేదు. దాంతో ఆ సమయంలో అనేక పార్టీలు కనుమరుగయ్యాయి. ఉద్యమ కారులు మాత్రమే మిగిలిపోయారు. అయితే అలాంటి వారికి అండగా, వారి చైతన్యానికి వేదికగా, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా కవిత ఇప్ప్పుడు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ కొంత సామాజిక న్యాయం చేసిన పార్టీగా పేరు పొందింది. కాని తర్వాత ఆ పార్టీ కూడా ఒక కులానికి బలీమైన శక్తిగా మారిపోయింది. ఇప్ప్పుడు దేశంలోనే కాదు, తెలంగాణలో బలమైన సామాజిక వేదిక లేదు. అందుకు కవిత తీసుకొచ్చే పార్టీ ఖచ్చితంగా బలహీన వర్గాలకు తోడుగా, బడుగుల నాయకత్వాలను తయారు చేయడానికి ఎంతో దోహదపడుతుందన్న నమ్మకం చాలా మందిలో కనిపిస్తోంది. అందుకు కవిత ఏర్పాటు చేయబోయే పార్టీపై అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె పార్టీ పేరు ఏమిటి? సిద్దాంతాలు ఏమిటి? పార్టీ లక్ష్యాలు ఏమిటన్న వాటిపై కూడా ఆసక్తి నెలకొన్నది. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమ శక్తిగా కవిత వున్న పేరు ఎవరూ కాదనలేనది. తెలంగాణ బతుకమ్మగా ఇప్పటికే జనం నుంచి ఆమెకు ఎంతో ఆదరణ వుంది. తెలంగాణ బతుకమ్మను సాంస్కతిక వేదిక చేసి, తెలంగాణ ఉద్యమానికి ఆమె అండగా నిలిచిన తీరు అందరికీ తెలిసిందే. ప్రపచంలో ఎక్కడా అలాంటి సాంస్కతిక విప్లవం కూడా లేదు. రాలేదు. కాని తెలంగాణలో బతుకమ్మతో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపును తెచ్చి, ఊపిరిపోసిన నాయకురాలు కవిత. అందుకే ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆమెను బతుకమ్మ అంటూ సంబోదిస్తుంటారు. ఆ గౌరవం ఆమెకు ఇస్తుంటారు. తెలంగాణ బతుకమ్మను దేశ విదేశాల్లో తెలంగాణ ప్రజలకు ఆరాధ్యం చేసిన ఘనత కూడా కవితకే దక్కుతుంది. అలాంటి కవిత కొత్తపార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్దితులు అందరికీ తెలిసిందే. ఒక రకంగా ఆమె పార్టీ ఏర్పాటు అనేది అటు రాజకీయం అంశాలు, ఇటు కుటుంబ పరమైన విషయాలు మిలితమై వున్నాయి. అందులో ఎవరికి తప్ప్పు, ఎవరికి ఒప్ప్పు అనేది ప్రజలకు అవసరం లేని ముచ్చట. కాని ప్రజలకు సేవ చేసే పార్టీ మాత్రం కావాలి. అది కవిత రూపంలో వుస్తుందంటే జనం కూడా ఎదురుచూస్తున్నారు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పోరాటాల అపర కాళిక కవిత అని చెప్పకతప్పదు. ఆమె చేసిన పోరాటం ఆనాడైనా, ఇప్ప్పుడైనా సరే తెగించి జనం కోసం ముందుకు నడవడమే ఆమెకు తెలుసు. ఉద్యమ కాలంలో ఆమె చేసిన పోరాటాలు ఇప్పటికీ స్పూర్తిదాయకమైనవే. వంటా వార్పు అనే కార్యక్రమాన్ని తీసుకొని, ఉద్యమ కారుల ఆకలి తీర్చిన నాయకురాలు కవిత. ఎక్కడ ఉద్యమ కార్యాచరణ వున్నా అక్కడ ఆమె చేపట్టిన వంటా వార్పు అనేది తెలంగాణ మొత్తం వ్యాపించింది. Å£డుపు మాడ్చుకొని ఎండలో, వానలో, చలిలో రోజంతా దీక్షలు, ఉద్యమాలు, పోరాటాలు చేసే ఉద్యమ కారుల ఆకలి తీర్చిడం కోసం కవిత చేసిన ప్రయత్నం చాలా గొప్పది. అటు బతుకమ్మ ఉత్సవాలు, ఇటు దీక్షలు, పోరాటాలు చేసి, తనకంటూ రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. రైల్ రోకోలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎంతో ధైర్యంకావాలి. రైల్వేశాఖకు చెందిన కేసులు ఎంత తీవ్రంగా వుంటాయో తెలియంది కాదు. అయినా ఆమె ఎక్కడా వెరవలేదు. తెలంగాణ కోసం ఆమె అనేక సార్లు రైల్ రోకో కార్యక్రమాలను విజయవంతం చేసిన వారిలో ఒకరుగావున్నారు. అటు ఉద్యమ నాయకురాలుగా, ప్రజా ప్రతినిధిగా ఆమె చేసిన సేవలు తెలంగాణ గుండెల్లో పదితరాల పాటు పదిలంగా వుంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఇంత వరకు చూసిన కవిత వేరు. ఇప్ప్పుడు తెలంగాణ చూడబోయే కవిత వేరు అని అంటున్నారు. ఎందుకంటే కవిత మొండితనం తెలుసు. కవిత తెగువ ఎలాంటిదో తెలుసు. తెగింపు అందరం చూసిందే. మోడీ అయినా, డాడీ అయినా రాజకీయంగా డీకొట్టాలనుకున్నప్ప్పుడు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం ఆమె దైర్యసాహసాలకు నిదర్శనం. కేంద్రంలో బిజేపిని చూసి దేశంలోని అన్ని పార్టీల నాయకులు కూడా గజగజలాడుతున్న తరుణంలో కవిత సవాలు చేయడం అంటేనే సామాన్యమైన విషయం కాదు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయడానికి సిద్దమైందంటేనే ఆమె తెగువ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆమె సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా రానున్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ అస్ధిత్వ ఆత్మగౌరవంగా, ఉద్యమ కారులకు బాసటగా, యువతరానికి భరోసాగా, సామాజిక తెలంగాన నిర్మాణ దిశగా, బడుగుల రాజకీయ వేదికగా కవిత కదలి వస్తోంది. రాజకీయ విశ్వరూపం చూపించనున్నది. రేపటి తరానికి కొత్త రాజకీయ కోటను కవిత నిర్మించనున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో సరికొత్త రాజకీయ, సామాజిక బాటను ఏర్పాటు చేయనున్నది. రేపటి తరాల ఆక్షాంక్షలకు ప్రతిరూపంగా తన పార్టీ వుంటుందని కవిత ఇప్పటికే ప్రకటన చేసింది. తెలంగాణకు అన్యాయం చేసే పార్టీలను తెగనరికే ఖడ్గమే కవిత కొత్త రాజకీయ పార్టీఅని ఆమె అభిమానులు అంటున్నారు. మొక్కుబడి రాజకీయాలను చూసి, అలసిపోయి, విసిగిపోయి వున్న తెలంగాణ ప్రజల చేతుల్లో గాండీవంలా కవిత దూసుకురానున్నారు. ప్రజలకు రాజకీయ హమీల పేరుతో మోసం చేసే పార్టీకు గుణపాఠం చెప్పడానికి కవిత వస్తున్నారు. తరతరాల రాజకీయ చరిత్ర కాదు, ఈ తరం ఆశయాలు, ఆలోచనలు, ఆచరణలకు అనుగుణమైన పార్టీగా కవిత పార్టీ రానున్నది. తెలంగాణ నవ శకానికి నాంది పలికేలా కవిత పార్టీ వుండబోతోంది. అంతేకాకుండా మహిళాలోకపు మణిదీపికగా, తెలంగాణలో మహిళా రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు రాబోతున్నారు. నేటి ధాత్రి దిన పత్రిక తరుపున ఆమెకు శుభాకాంక్షలు. ప్రజల విసత ఆదరణలో సర్వోదయ, సామాజిక, మహిళా రాజకీయ వేధికగా విజయాలను అందుకోవాలని నేటిధాత్రి కోరుకుంటోంది. అభినందనలు అందిస్తోంది.
