Lokesh Meets Kandukuri Naresh on TDP Strengthening
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన కందుకూరి నరేష్
పరకాల,నేటిధాత్రి
పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్,ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించారు.కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తల సేవలను మంత్రి ప్రశంసించారు.పరకాల ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.రాబోయే అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీకి సిద్ధమవుతోందని,గ్రామస్థాయి నుండి కమిటీల పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.పరకాలలో టిడిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నరేష్ తెలిపారు.
