Illegal Mining Continues in Kandawada
కందవాడలో ఆగని అక్రమ మైనింగ్
* కందవాడ అసైన్డ్ భూముల్లో ఆగని అక్రమ మైనింగ్
* కోట్లల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి
* అర్ధరాత్రి జేసీబీలతో తవ్వి టిప్పర్లతో తరలింపు
* మైనింగ్ చెరలో కందవాడ ప్రభుత్వ అసైన్డ్ భూములు
* మైనింగ్ శాఖ ఉందా లేదన్న అనుమానం
* గతంలో ఎమ్మార్వో, టిప్పర్ల సీజ్, అయిన ఆగని మైనింగ్
* సుమారు పాతిక ఎకరాలు తవ్వేషారు
* అధికారుల హెచ్చరికలను లెక్కచేయని మట్టి మాఫియా
* అసైన్డ్ పట్టాదారులకు తెలియకుండా మట్టి తవ్వకాలు
* కావలి రాజుపై పిడియాక్ట్ కేసు నమోదు హెయ్యాలని రైతుల డిమాండ్
నేటిధాత్రి. రంగారెడ్డి :
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కందవాడ సర్వే నంబర్ 269/1 లో రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకాలకు పాలపడుతున్న కందవాడ వాసి కావలి రాజు అలియాస్ పొట్టిరాజు కందవాడలోని ప్రభుత్వ భూములలో సుమారు 25 ఎకరాలలో కొన్ని నెలలుగా అడ్డగోలుగా మైనింగ్ జేసిబిలతో తవ్వి టిప్పర్లతో చేవెళ్ల,చుట్టూ గ్రామాలకు వెంచర్లకు, నూతన బిల్డింగ్ నిర్మాణాలకు తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు, చుట్టూ పొలాల రైతులు, కందవాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ అసైన్ భూములో మైనింగ్ కు పాల్పడుతున్న రాజు పై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అసైన్డ్ పట్టాదారులు డిమాండ్ చేస్తున్నారు. కందవాడ గ్రామానికి చెందిన అసైన్ పట్టాదారు షేక్ రైమాబికి సర్వేనెంబర్ 269/1లో ప్రభుత్వం రెండెకరాల అసైన్డ్ పట్ట భూమి ఇచ్చింది. మైనింగ్ చేస్తున్న భూమికి షేక్ రైమాబి భూమిలో నుంచి 40 ఫీట్ల దారి ఏర్పాటు చేసుకుని టిప్పర్లతో దంద కొనసాగిస్తున్నాడని వారు ఆరోపించారు. కందవాడ గ్రామానికి చెందిన కావాలి రాజుపై ఇడియట్ కేసులు నమోదు చేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పై ప్రశ్నించిన రైతులను బెదిరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి .
* అసైన్డ్ రైతులకు నయాన భయానా ఇచ్చి…మైనింగ్

కందవాడ గ్రామానికి చెందిన కొంతమంది అ సైడ్ దార్లకు
నయానా భయానా ఇచ్చి కోట్ల రూపాయల మైనింగ్ చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. రాజు చేస్తున్న మైనింగ్ కు అసైన్ భూములు దారులుగా మారుతున్నాయి.అంతేకాకుండా కందవాడ సర్వేనెంబర్ 249, 250 ప్రభుత్వ అసైన్డ్ భూమిలో 5ఎకరాలలో భారీగా 20 మీటర్ల లోతు
భారీగా మైనింగ్ పాల్పడుతున్నారు.
* అధికారుల హెచ్చరికలను లెక్కచేయని మైనింగ్ మాఫియా

అధికారులు కేసులు నమోదు చేసినప్పటికీ మట్టి మైనింగ్ మాఫియా లెక్కచేయడం లేదు.చేవెళ్ళ రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త దాడులలో అధికారులు కొద్దిరోజుల క్రితం చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందవాడ సర్వేనెంబర్ 249,250 లో అర్ధరాత్రి ఎక్కడో మైనింగ్ చేస్తున్న సమయంలో టిప్పర్ల సీజ్ చేసి చేవెళ్లకు పక్క మండలం నుండి సైతం తీసుకొచ్చి భారీగా మట్టి తవులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు బలగంగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలు లేక ఇలా మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ,మైనింగ్ శాఖలు చొరవ తీసుకుని వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అతనిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేసి, ప్రభుత్వ భూములను కాపాడాలని కందవాడ రైతులు ప్రజలు కోరుతున్నారు.
