ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నేటి ధాత్రి కథలాపూర్
ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా కథలాపూర్ మండలకేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా మండల రజక అధ్యక్షుడు చిలుముల మహేష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ వీర నారి అని తొలి తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధురాలని ఆమె తెగువ ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆ రోజుల్లోనే ఒక మహిళ అయి ఉండి ఎందరో పెత్తందారులతో దొరలతో రజాకాలతో పోరాడి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు మహేష్ మరియు కోశాధికారి చెన్నవేని జలంధర్ కథలాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగరాజం గంగాధర్ శేఖర్ రాజేశం మరియు కథలాపూర్ గ్రామ శాఖ రజక సంఘం సభ్యులు, యువకులు, కథలాపూర్ తాజా మాజీ నాయకులు నాగేశ్వరరావు, కల్లాడ శంకర్ , వేణు తదితర నాయకులు పాల్గొన్నారు.