దూల్మిట్ట.. నేటిధాత్రి….
దూల్మిట్ట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గద్దల మహేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి, మరియు చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడీ జీవన్ రెడ్డి కి, ఈ ఎన్నికకు సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల సాయిలు కి, మరియు పార్టీ మిత్రులు ప్రజలకు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నిక సందర్భంగా ప్రజలకు పార్టీకి అనుసంధానంగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పార్టీ ఎదుగుదలకు నిరంతరం శ్రమిస్తూ, ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తానని, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.