ఎన్ ఎస్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం..

ఎన్ ఎస్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

మల్లంపల్లి, నేటిధాత్రి:

శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారు నిర్వహించిన ఉచిత కంటి శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినందుకు ట్రస్ట్ అధ్యక్షులు మహేష్ నాయక్ పత్తిపల్లి గారు వారిని అభినందించారు
20-5-2025 బుధవారం రోజున ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో ఎన్ ఎస్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అందులో 56 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో 26 మందికి ఆపరేషన్ అవసరం అని నిర్ధారించి వారిని ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బస్సులో హైదరాబాదు శంకర ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి మరియు అద్దాలు సమకూర్చి మరియు ఉండడానికి వసతి భోజనం అన్నియు సమస్త వారు సమకూర్చుతారు మరియు ఆపరేషన్ అయిపోయిన తరువాత ప్రత్యేకమైన బస్సులో తిరుగు ప్రయాణం కూడా కల్పిస్తున్నాము ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ మరియు ఇంత మంచి సిబిరాన్ని అందించిన శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ యాజమాన్యానికి ట్రస్ట్ చైర్మన్ మహేష్ నాయక్ పత్తిపల్లి గారు ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version