అయ్య బాబోయ్ “హై రేజ” బిల్డింగులు!

రోగాల కొంపలు… ఊపిరాడని పిట్టల గూళ్లు!!

ఆకాశంలో విశాలం కాదు…గుడిసెల్లో వున్న ఆరోగ్యం కూడా వుండదు.

`భూ మీద కొనుక్కునే నరకానికి నకళ్ళు!

`కోట్లు పెట్టి కొనుక్కునే అనారోగ్య కేంద్రాలు.

`దుర్వాసన దూపాలు.. కంపుకు నిలయాలు.

`సౌకర్యాలు చచ్చు బండలు… ఉక్కపోతకు ఆవిరి బండ్లు.

`కొలిమి మంటకు స్వయంగా బంధువులు.

`చలి కాలం కూడా హాయి లేని నిద్రలేమి రాత్రులు!

`చూడడానికే ఆకాశ హ్రమ్యాలు..సమస్యల తోరణాలు.

`ఆరోగ్యంగా ఉన్నవారు పిలిచి రోగాలు కొని తెచ్చుకుంటారు.

`పేరుకే సకల సౌకర్యాలు… ఎంత సంపద వున్నా సుఖం లేని బతుకులు.

`గాలి కాలుష్యం, నీటి కాలుష్యం జీవితమంతా కంపుతో సహవాసం.

`బిల్డింగ్ మాత్రమే అందం.. లోపలికి అడుగు పెడితే అంతా వికారం.

`అలవాటు పడితే తప్ప ఆ జీవితం అగమ్య గోచరం.

`ఎంత ఎత్తులో వున్నా దోమలు, ఈగలకు ద్వారాలు తెరిచే స్వాగతం.

`అద్దాల మేడల్లో వున్నా ఆగమే వారి జీవితం.

`కొనుక్కున్న వారు పడుతున్న కష్టం పగవాడికి కూడా వద్దనేంత వేదాంతం.

`బతికుండగానే ఇదేం బతుకురా అని నేర్పించే అద్వైతం.

హైదరాబాద్, నేటిధాత్రి:

హైదరాబాద్ అంటే ఆ మాత్రం వుంటుంది. ఎటు చూసినా ఆకాశాన్ని తాకేంతటి పెద్ద పెద్ద అప్పార్టుమెంట్లు కనిపిస్తుంటాయి. కాని వాటిని అప్పార్టుమెంట్లు అనడం లేదు. అందంగా హైరేజ్ బిల్డింగులు అంటున్నారు. రోడ్డు పక్కనే ఆకాశాన్ని తాకుతున్నాయా? అని అనిపించేంత అందంగా వుంటాయి. నిజంగానే ఆ హైరేజ్ బిల్డింగ్‌లలో జీవితాలు అందంగా వుంటాయా? ఆహ్లాదంగా వుంటాయా? ఆరోగ్యంగా వుంటాయా? అంటే జీవితంలో కొన్ని చూడడానికి మాత్రమే పనికి వస్తాయి? అందంగా కనిపించే హైరేజ్ బిల్డింగుల జీవితాలు కూడా అంతే అని చెప్పకతప్పదు. పైకి కనిపించేంత అందమైన బతుకులు వారిలో వుంటాయని ఊహించుకోకండి. ఊహలకందని జీవితాలు అనుభవించాలనే రాసి వుంటేనే అందులో బతుకుతారని కూడా అనుకోకండి. ఎందుకంటే కోట్లు పెట్టి కొనుక్కునే రోగాల కుంపట్లు ఆ హైరేజ్ బిల్డింగులు. ఆశలకు పోయి కొనుక్కునే నరక కూపాలు. కాలం విదించే శిక్షలకు కార్ఖానానలు. అవును. అందులో జీవిస్తున్న వారు ఏడ్వలేక చెబుతున్న మాటలు. పైగా పక్కపక్కనే కొన్ని వుండే ఆ హైరేజ్ బిల్డింగుల వల్ల ఎదురయ్యే సమస్యలు రాస్తే రామాయణం పెద్దదౌతుంది. వింటే భారతం కనిపిస్తుంది. అందులోనే అన్నీ వికారాలు వుంటాయి. ఆకాశంలో విహరిస్తున్నట్లు జీవితాలు వుంటాయని కోట్లు పెట్టి కొనుక్కుంటారు. కాని ఊపిరాడని జీవితాలను కొని తెచ్చుకుంటారు. పొల్యూషన్ ఫ్రీ అని చేసే ప్రచారం నమ్ముతుంటారు. నిజమైన భరించలేని కాలుష్యం ఎదుర్కొంటారు. భూమి మీద నుంచి వెళ్లే కాలుష్యమంతా ఆ హైరేజ్ బిల్డింగుల పై నుంచి వెళ్లలేక అందులో దూరిపోతుంది. వారి బతుకులు నకరం చేస్తుంది. అది దుమ్మైనా, దూళి అయినా, ఆఖరుకు విషవాయులైనా సరే వారు పీల్చుకోవాల్సిందే. నరకం అనుభవించాల్సిందే. అంత ఘోరంగా హైరేజ్ బిల్డింగుల జీవితాలుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఊపిరి కూడా ఆడనటువంటి పిట్ట గూళ్లు నయమని కొనుక్కొని అనుభవిస్తే గాని అర్ధం కాదు. పైకి ఎంతో అందంగా విశాలంగానే కనిపిస్తుంటాయి. ఎందుకంటే కోట్లు పెట్టి కొన్న తర్వాత అదో అందమైన ప్రపంచం మాత్రమే అనుకోవాలి. అందవిహీనమైన జీవితాలను బహుమతిగా పొందాలి. హైరేజ్ బిల్డింగులు రోగాల కూపాలు అనే సంగతి కొన్న తర్వాత గాని తెలియదు. నిర్మాణం చేసేవారు చెప్పరు. ప్రచారంలో ఎక్కడా ఆ మాట చెప్పరు. ఉన్నతమైన జీవితాలకు నిలయాలుగా మాత్రమే ఊదరగొడతారు. వాటిని నమ్మి కొనుగోలు చేసుకొని నరకాలు అనుభవిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి అందుతుందని కలలుకంటారు. కాని కాలుష్యం పీల్చుకోవాల్సి వుస్తుందని ఊహించరు. నిర్మాణ దారుల చెప్పరు. వందలకోట్లు పెట్టి నిర్మాణం చేస్తున్నామని మాత్రమే చెబుతారు. అది నమ్మి కోట్లు పెట్టి కొనుక్కుంటారు. సకల సౌకర్యాలు వుంటాయి. వాటితోపాటు సమస్యలు కూడా వుంటాయి. అందులోనే అన్నీ వుంటాయంటారు. అందుకే ఆసుపత్రులు కూడా వుంటాయి. ఆర్యోగ్యంగా వుండాల్సిన ప్రాంతాలలో ఆసుపత్రులు వెలుస్తున్నాయి అంటేనే ఎక్కడో తేడా జరుగుతుందన్న సత్యాన్ని మాత్రం గ్రహించరు. ఒకప్ప్పుడు హైదరాబాద్‌లో వుండే ఆసుపత్రులు ఎన్ని? ఇప్ప్పుడు వున్న ఆసుపత్రులు ఎన్ని? నగరం పెరుగుతున్న కొద్దీ ఆసుపత్రులు కూడా పెరుగుతూ వచ్చాయి. అంటే ఆరోగ్యం జనం దగ్గరకు వస్తున్నట్లు లెక్క కాదు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అర్దం. అలాగే హైరేజ్ బిల్డింగుల్లోనూ ఆసుపత్రులు వుండాల్సి వస్తుందంటే అన్ని సౌకర్యాలు అతి దగ్గర వున్నట్లు కాదు. అనారోగ్యాలను దరి చేసుకుంటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు. ప్రతి హైరేజ్ బిల్డింగ్‌లో కొన్ని వేల మంది నివాసాలు వుంటున్నారు. అంటే కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వుండే గ్రామ జనాభా కొన్ని వందల గజాల్లో నివాసముంటున్నారు. ఒకరి నెత్తి మీద మరోకరు అన్నట్లు ఆవాసాలు కొనుక్కుంటున్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే గాలి, నీరు, మురుగునీరు వానసలు ప్రతి బిల్డింగును పలకరిస్తూ పోతుంటాయి. ఆ వాసన వదిలిపెడుతూ వెళ్తుంటాయి. నీళ్లయితే నేరుగా కిందికి వెళ్తుంటాయోమో గాని వాసన మాత్రం అందిరికి వదులుతూ, పంచుతూ వెళ్తుంది. ఆ దుర్వాసనలను ప్రతి క్షణం పీల్చుకుంటూ బతుకుతుంటారు. దుర్వాసనతోనే దూపాలు వేసుకున్నట్లు పీల్చికుంటారు. ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. అది పైకి కనిపించని అనార్యోన్ని ముందు పరిచయం చేసుకుంటూ వుంటారు. అంతకు ముందు లేని అనారోగ్య సమస్యలు మెల్లిగా ఒంటికి చేరుతుంటాయి. అదంతా హైరేజ్ బిల్డింగ్‌లో బతుకుతున్నందన వస్తుందన్న ఆలోచన చేయరు. వయసు పెరుతుందన్న ఆలోచనతో నిజాన్ని తెలుసుకోరు. ఒక్క పూట ఆ కాంపౌండ్‌లో పనిచేసే కార్మికులు పనికి విరామం ఇస్తే ఇక అంతే గతి. అందుకే ఆసుపత్రుల్లో ఎప్ప్పుడూ కార్మికులు ఫినాయిల్‌తో క్లీన్ చేస్తుండడం చూస్తుంటాం. సరిగ్గా హైరేజ్ బిల్డింగుల్లోనూ కార్మికులు ప్రతి క్షణం పని చేస్తూనే వుంటారు. పైన పటారం లోన లొటారం క్లీనింగ్‌తో వచ్చే లాభం ఏమీ వుండదు. ఐదంతుస్తుల ఆసుపత్రుల్లోనే రోజంతా క్లీన్ చేసినప్ప్పుడు, హైరేజ్ బిల్డింగుల్లో ఎంత క్లీన్ చేసినా కంపు పోతుందా? దుర్వాసనలు ఆగుతాయి? మనుషుల ఉచ్వాస, నిశ్వాస నుంచి మొదలు, అంతా కాలుష్యమే. అంతంటా కంపు ప్రాంతమే? అన్ని రకాల సౌకర్యాలు వుంటాయని మురిసిపోయినంత కాలం కూడా అందులో చేరిన వారు ఆరోగ్యంగా వుండరు. ఆ వాతావరణంలోకి చేరుకున్నకొద్ది రోజులకే వారి ఒంటిలోమార్పులు చూస్తారు. రకరకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎదురుకావడం గమనిస్తారు. ఓవైపు ఉక్కపోతలు, మరో వైపు దుర్వాసనలు చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎండా కాలం వచ్చిందంటే చాలు కొలిమి మంటలను చూస్తారు. ఎల్లప్ప్పుడూ ఏసిలు లేకుండా బతకలేదు. హైరేజ్ బిల్డింగుల్లో చేరక ముందు స్వచ్చమైన గాలిని పీల్చుకుంటామని అనుకుంటారు. కాని అసలు స్వచ్ఛత అంటే మర్చిపోయి బతుకుంతుంటారు. ఎప్ప్పుడూ ఇంట్లోనుంచి బైటకు వెళ్లిపోదామా? అని జనం చూస్తుంటారు. కొనుక్కున్న ఖర్మానికి బకలాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కోట్లు పెట్టి కొనుక్కున్న హైరేజ్ బిల్డింగులు అమ్మకోలేరు. అవి వదిలేసి వెళ్లిపోలేరు. అంతలా నరకం చూస్తారు. చలి కాలం కూడా హాయిగా నిద్రపోని రాత్రులు చూస్తారు. ఆరోగ్యంగా వున్న వారు కోట్లు ఖర్చు చేసి, పిలిచి పిలిచి రోగాలను తెచ్చుకుంటారు. ఆరోగ్యమే మహాబాగ్యమని చదువుకున్న వాళ్లు కూడా కోట్లు పోసి అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. హాయిగా అందమైన ఊహా లోకలంలాగా జీవితం గడపాలని కలలు కని, ఆరోగ్యాలు పాడై, అయితే ఆసుత్రుల్లో లేకుంటే మురికి కూపంలో బతకాల్సి వస్తుందన్న సత్యాన్ని గ్రహిస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే వచ్చే లాభమేమీ వుండదు. ఎంత సంపద వున్నా సుఖం లేని జీవితాలు కోరి కోరి తెచ్చుకోవడం అంటే హైరేజ్ బిల్డింగులు కొనుక్కోవడమే అంటున్నారు. పైకి ఎంతో అంతంగా కనిపించినా, లోపల వారి జీవితాలు ఎంతో వికామైపోతున్నాయి. అవి కొనుక్కున్న వారు పడుతున్న కష్టం పగవాడికి కూడా వద్దనేంత వేదాంతం ప్రతి ఒక్కరిలోనూ అబ్బుతుంది. బతికుండగానే ఇదేం బతుకురా? అని అనిపించేంత అద్వైతం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇంత చెప్పినా హైరేజ్ బిల్డింగ్ స్టేటస్ సింబల్ అనుకుంటే మీ ఖర్మ???

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version