పాఠశాల పునః ప్రారంభానికి నాలుగు గదులు సిద్ధం చేయాలి…

పాఠశాల పునః ప్రారంభానికి నాలుగు గదులు సిద్ధం చేయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ఎం, సత్యనారాయణ

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం కేసముద్రం మండలంలోని అర్పనపల్లి గ్రామంలో నిర్మాణం జరుగుతున్న నూతన పాఠశాల భవనాన్ని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సత్యనారాయణ మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల జూన్12 రోజున పాఠశాల పునఃప్రారంభం అవుతున్నందున, విద్యార్థుల కోసం నాలుగు తరగతి గదులను సిద్ధం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version