డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుగురికి జైలు శిక్ష
ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించిన న్యాయస్థానం
మద్యంతాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు:నర్సంపేట సీఐ శ్రీనివాస్
నర్సంపేట, నేటిధాత్రి:
మద్యం తాగి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఆరుగురికి నర్సంపేట కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆరుగురు పట్టుబడ్డారు. వీరిని బుధవారం ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.డి. యూసుఫ్ ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన పోతరాజు వెంకటయ్య, కమ్మపల్లికి చెందిన తప్పట్ల రాజు అలియాస్ రమేష్,నర్సంపేట పట్టణానికి చెందిన వేముల సురేష్,గోక శ్రీనివాస్, ద్వారకాపేటకు చెందిన నల్ల రజనీకాంత్,సర్వపూర్‌కు చెందిన అంజనపెల్లి వీరస్వామిలకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1వెయ్యి జరిమానా విధించారు. శిక్ష పడిన ఆరుగురిని మహబూబాబాద్ జైలుకు తరలించినట్లు నర్సంపేట టౌన్ సీఐ ఎం. శ్రీనివాస్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
