“డి.ఆర” వై… దుర్మార్గులకు దగ్గరుండి సేవ చేస్తావా?
`చిట్ కంపెనీల మూలంగా ఎవ్వరూ నష్టపోవద్దని సిఎం. రేవంత్ రెడ్డి చెప్పారు.

`మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
`అందుకు అనుగుణంగా జీవో తెచ్చారు
`అయినా భయం లేకుండా బాధితులకు అన్యాయం చేస్తావా?
`కమిషన్ కోట్లు వస్తున్నాయని కక్కుర్తి పడతావా?
`ప్రజల జీవితాలను ఆగం చేస్తావా?
`ప్రజల సొమ్ముకు కాపలా దారువా లేక, దొంగలకు సద్ది కడతావా?
`కమిషన్లకు ఆశపడి కంత్రి గాళ్ళతో చేతులు కలుపుతావా?
`కనక దుర్గ చిట్ ఫండ్ కంపెనీకే కొమ్ము కాస్తావా?
ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడతావా? ప్రభుత్వనికి చెడ్డపేరు తెస్తావా?
`ప్రభుత్వం తెచ్చిన “జీవో” కు విరుద్దంగా వ్యవహారం నడుపుతావా?
`ప్రజల సొమ్మును కమిషన్లకు ఆశపడతావా?
`బాధితుల సొమ్ము మింగాలని చూస్తావా?
`ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి చిట్ కంపెనీకి ఊడిగం చేస్తావా?
`చిన్నగా పేపర్ యాడ్ ఇచ్చి చేతులు దులుపుకుంటావా?
`సమ్మక్క జాతర సమయం చూసి యాడ్ జారీ చేస్తావా?
`బాధితులు చూడకుండా చేసి మోసం చేస్తావా?
`కనీసం మూడు, నాలుగు పేపర్లలో ఇవ్వాల్సిన యాడ్ ఒక్క పత్రికకు పరిమితం చేస్తావా?
నెల రోజుల క్రితం “డిఐజీ” ఆదేశాలిస్తే కాలయాపన చేస్తావా?
`సరిగ్గా జాతర సమయం చూసి వారం రోజులు గడువిస్తావా?
`మీడియాకు కనీసం ప్రెస్ నోట్ ఇచ్చినా అందరికీ తెలిసేది కదా?
`జనం సొమ్ము అంటే అంత అలుసై పోయిందా?
`పేదలను మోసం చేస్తే అడిగే దిక్కుండదని అనుకుంటున్నావా?
అడుగడుగునా “నేటిధాత్రి” నిఘా నేత్రం గమనిస్తూనే వుంటుంది?
`బాధితులకు సొమ్ము న్యాయంగా అందేవరకు అక్షర పోరాటం చేస్తూనే వుంటుంది?
`డిపాజిట్ సోమ్మంతా కంపని మింగేందుకు సహకరిస్తావా?
`ప్రజలకు మొండి చేయి ఇచ్చేందుకు సాయపడతావా?
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రజల సొమ్మంటే ఎంత అలుసైపోయింది. దాచుకోండి..దోచుకుంటామన్నంత సులువైపోయింది. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కొన్ని చిట్ ఫండ్ కంపనీలు చేస్తున్న అరాచకాలకు, కొంత మంది రిజిస్ట్రార్లు తోడు కావడంతో జనం సొమ్ముకు భద్రత లేకుండాపోతోంది. దాచుకున్న సొమ్ము తిరిగి చేతికొస్తుందన్న నమ్మకం లేకుండాపోతోంది. వరంగల్ లో అదే జరిగింది. ప్రజల సొమ్మును కాపాడాల్సిన కుర్చీలో కూర్చున్న ఓ రిజిస్ట్రార్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఓసారి నేటిధాత్రి దినపత్రిక కనకదుర్గ చిట్ ఫండ్ కంపనీ బాదితులను ఎలా మోసం చేస్తోందనే దానిపై అనేక వార్తలు రాసింది. అందుకు రిజిస్ట్రార్లు ఎలా సహకరిస్తున్నారు. కమీషన్లు ఎలా తీసుకుంటున్నారన్న దానిని వెలుగులోకి తెచ్చింది. దాంతో కొంత కాలం చేయాల్సిన మోసాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్ప్పుడు మళ్లీ బాదితులను మోసం చేసేందుకు కొంత సమయం తర్వాత రెడీ అయ్యారు. జనం సొమ్ము కోట్లాది రూపాయలతో ఉడాయించాలని కనకదుర్గ చిట్‌పండ్ కంపనీ పక్కగా ప్లాన్ వేసింది. దివాళా తీసినట్లు నాటకమాడింది. బోర్డు తిప్పేసింది. కాని జరిగింది వేరు. కంపనీ చెప్పింది వేరు. జనం సొమ్మును అప్పనంగా మింగాలని చూసింది. కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టాలని చూసింది. అందుకు వక్రబుద్ది కలిగిన కక్కుర్తి రిజిస్ట్రార్లు సహరిస్తున్నారు. దాంతో యదేచ్చగా చిట్ ఫండ్ కంపనీలు ప్రజలకు శఠగోపం పెడుతున్నారు. ఇలా చిట్ కంపనీల మూలంగా ప్రజలు ఎంతో మంది నష్టపోతున్నారు. దాచుకున్న సొమ్ము చేతికి రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వారిని మోసం చేసేందుకు కంపనీలు పుట్టగొడుల్లా వెలుస్తున్నాయి. వాటి ఆగడాలను నిలువరించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. బాధితుల సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు దీనిపై దష్టిసారించారు. ఏ చిట్ కంపనీ అయినా ప్రజలను మోసం చేస్తే, ఆ కంపనీలకు చెందిన ఆస్తులు, ఆ కంపనీకి చెందిన వ్యక్తుల ఆస్దులు జప్తు చేసైనా సరే బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం జీవో కూడా జారీ చేసింది. చిట్ కంపనీలలో చిట్ వేసిన ఏ ఒక్కరూ మోసపోవద్దు. అన్యాయానికి గురి కావొద్దు. అదీ ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దాంతో కనకదుర్గ చిట్ కంపనీ తప్పని పరిస్తితుల్లో బకాయీ దారులకు సొమ్ము చెల్లించాల్సి వచ్చింది. సుమారు 43 కోట్ల రూపాయల వరకు కంపనీ ప్రజలకు బాకీ పడింది. ఆ సొమ్మును చిట్ కట్టిన వారికి చెల్లించడం ఆ కంపనీలకు సుతారం ఇష్టం లేదు. అదేదో తమ సొమ్ము ప్రజలకు ఇస్తున్నట్లు తెగ బాధపడిపోతున్నారు. కంపనీకి సహాకారమందించేందుకు జిల్లా రిజిస్ట్రార్ రంగంలోకి దిగారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ కనకదుర్గకు సాయం అందించేందుకు అంగీకరించారు. దాంతో కంపనీ లేని ఖాతాదారులను కొంత మందిని సష్టించేందుకు కపట నాటకమాడుతోంది. కంపనీకి చెందిన కొంత మంది వ్యక్తులు చిట్ ీVAల్డర్లుగా తయారు చేస్తున్నారు. అసలైన బాధితులకు అన్యాయం చేయడానికి సిద్దపడ్డారు. ఈ విషయాన్ని నేటిధాత్రి పసిగట్టింది. మళ్లీ అన్యాయం జరిగేలా వుందని రంగంలోకి దిగింది. జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై ఆరా తీసింది. దాంతో కొంత కాలం చెక్‌ల పంపణీ ఆగిపోయింది. అందులోనూ కొంత మోసం చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. బాధితులకు అన్యాయం జరుగుతున్న విషయం రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాదికారులు స్పందించారు. మళ్లీ ఒకసారి దినపత్రికల్లో ప్రకటన జారీ చేసి అప్ప్పుడు బాదితులకు సొమ్ము చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేసికూడా నెల రోజులకు పైనే అవుతుంది. కాని ఇన్‌చార్జీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కావాలనే కాలయాపన చేశారు. సరిగ్గా సమ్మక్క సారక్క జాతర సమయంలో అదును చూసి ఓ దిన పత్రికలో చిన్నగా ప్రకటన జారీ చేశారు. ఇది రూల్స్‌కు విరుద్దం. ప్రజలు ఎక్కువగా తిలకించే, చదివే ఓ మూడు నాలుగు పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలి. కాని డిఆర్ మాత్రం ఒక్క పత్రికలో ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అదే పత్రిక అందరూ చదవాలని లేదు. పైగా ఆ ప్రకటన కనిపించేంత పెద్దదిగా ఇవ్వలేదు. ప్రకటన ఇచ్చామా? అంటే ఇచ్చాం..మమ అని పించేలా ఇచ్చారు. నిజానికి ఆ ప్రకటన అసలైన బాధితులకు పూర్తి స్ధాయిలో చేరలేదు. సరిగ్గా సమ్మక్క జాతర సమయంలో ఇవ్వడంతో ఇలాంటి ప్రకటన ఒకటి వచ్చిందన్న సంగతి కూడా తెలియకుండాపోయింది. పైగా ఆ ప్రకటన జారీ అయిన వారం రోజుల్లో బాదితులు తమ వద్ద వున్న ఆధారాలు సమర్పించాలని అన్నారు. ఆ ప్రకటన జారీ చేసి అప్ప్పుడే ఆరు రోజులౌతోంది. కాని అసలైన బాదితులకు సమాచారమే చేరలేదు. కొంత మందికి బాదితులకు ఈ విషయం చేరడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకున్నారు. అక్కడ కార్యాలయ సిబ్బంది, డిఆర్ చెప్పిన మాటలు విని విస్తుపోయారు. చిట్ కంపనీకి చెందిన వ్యక్తికి ఆదారాలు సమర్పించాలని డిఆర్ బాదితులకు సూచించారు. దొంగ చేతికి తాళాలు ఇమ్మన్నట్లుగా ఆదారాలన్నా చిట్ కంపనీ వ్యక్తికి అందజేస్తే ఆదారాలు మాయమైపోవా? మోసం మళ్లీ మొదటికి రాదా? బాదితుల వద్ద ఆధారాలు లేకుండా చేయాలని డిఆర్ , కంపనీ ప్రతినిధులతో కలిసి కుట్ర చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఆ ఆధారాలను ఒక ప్రభుత్వ అధికారిగా డిఆర్ తీసుకోవాలి. వాటిని పరిశీలించి చెక్కులు జారీ చేయాలి. కాని డిఆర్ కార్యాలయంలో కంపనీ ప్రతినిధిని కూర్చోబెట్టి బాధితుల వద్ద వున్న ఆదారాలు సమర్పించాలన్నప్ప్పుడే అసలు గుట్టు బైటపడింది. ఇలా ఒకరిద్దరు కంపనీ ప్రతినిధి వద్దకు వెళ్తే వారికి రావాల్సిన సొమ్ముకన్నా అధికంగా రుసుము రాసి చెక్కు అందజేస్తాం? అదనంగా చెక్కుపై రాసిన సొమ్ముకు బాదితులు ఒక చెక్ ఇస్తే రుసుము చెల్లిస్తామని చెప్పడం జరుగుతోంది. అంటే చిట్ కంపనీ డిపాజిట్‌కు చెందిన సొమ్ముంతా ఒక్కసారిగా ఖాళీ చేసి, కంపనీ చేతులెత్తేసేందుకు డిఆర్ పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నట్లు అర్దమౌతోంది. అటు కంపనీలో చిట్ వేయని అనుయాయుల చేత సంతకాలు చేయించి, దొంగ డాక్యుమెంట్లు సష్టిస్తున్నారు? వాటికి తోడు బాధితులకు కట్టిన సొమ్ముకు అదనంగా కొన్ని రెట్ల సొమ్మును చెక్ మీద రాసి, ముందే వారి నుంచి చెక్కులు తీసుకుంటున్నారు. ఇలా రెండు రకాలుగా బాదితులను వించిస్తున్నారు. డిపాజిట్ సొమ్మంతా మింగేయాలని చేస్తున్నారు? ఇలా డిఆర్ చెక్కులు జారీ చేయడానికి పెద్దఎత్తున ముడుపులు తీసుకునేలా ఒప్పందం జరిగినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. కో{్ల రూపాయలు చేతులు మారేలా, డిఆర్ జేబులు నిండేలా చూసుకుంటూ, కంపనీకి మేలు చేసే కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు వ్యూహం పన్నారు. నలుగురు బాదితులకు బకాయిలు చెల్లించిన చేతులు దులుపుకొని, కంపనీ డిపాజిట్ సొమ్మంతా తినేందుకు పథకం వేశారు. ఇది ఒక్క కనకదుర్గ చిట్ కంపనీ వ్యవహరమే కాదు. తెలంగాణలో వున్న దాదాపు అన్ని చిట్ కంపనీలు సాగిస్తున్న వ్యవహారమే. తెలంగాణలో సుమారు 12వందల కోట్ల రూపాయలను ఇలా ఎగవేసేందుకు కంపనీలు కుట్రలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక్క కనకదుర్గ చిట్ కంపనీ ఏకంగా 43 కోట్లు బాధితులకు కుచ్చు టోపి పెడుతోంది. అయితే ఇది ఒక్క వరంగల్ బ్రాంచ్ మాత్రమే. తెలంగాణలో కనకదుర్గ కంపనీకి అనేక బ్రాంచ్‌లున్నాయి. వాటిపై కూడా అదికారులు దష్టిపెడితే అసలు బాగోతం అంతా బైటపడుతుంది. బాదితులకు కొంతైనా న్యాయం జరుగుతుంది!