బాధితులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట కేంద్రానికి చెందిన తాళ్లపల్లి అనురాధ రామకృష్ణ గౌడ్ లాకు రూపాయలు 54 వేల చెక్కును జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షుడు నజీర్, ఎం ఎస్ ఎస్ ఓ అధ్యక్షుడు వెంకట్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు 


మండల పరిధిలోని నందగోకుల గ్రామానికి చెందిన కొమ్మిడి సుశీల బాపిరెడ్డి కి 45 వేల రూపాయల చెక్కు కన్నాపురం దేవరాజ్ తండ్రి సిద్ధరామ గౌడ్ కి 20 వేల రూపాయల చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు అందే స్వామి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు చేతులమీదుగా చెక్కులను అందజేయడం జరిగింది. బాధితులు మాట్లాడుతూ మాకు చెక్కులు వచ్చే విధంగా కృషిచేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులలో శాస్త్ర చికిత్సలు చేయించుకున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఉపశమనం కలుగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరంలా మారాయి అన్నారు. నందగోకుల్ గ్రామానికి చెక్కులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రోహిత్ రావుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మిడి భూపతి రెడ్డి ,మేదరి కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *