భాజపా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం.
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తున్నది భాజపా నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండి వైఖరి,అసమర్థ పాలనతో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి,భాజపా నాయకులు బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చెయ్యగా అందుకు నిరసనగా పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం దగ్గర భాజపా నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేడ్కర్ ల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఆ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.సందీప్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు 66 అబద్ధాల హామీలతో గద్దెనెక్కి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడున్నదని ఆరోపించారు.ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ కృషి చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నారని తెలియచేశారు. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఓటు వేయని వ్యక్తి అలాగే ప్రజాస్వామ్యంతో నడిచే దేశంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని నమ్మని వ్యక్తి గద్దర్ కు పద్మశ్రీ ఇవ్వబోమని తెలియజేసిన బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ (చిన్న),నియోజకవర్గం యువ మోర్చా నాయకులు జూలూరి మనీష్ గౌడ్,నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్,దుగ్గొండి మండల అధ్యక్షులు నేదుర రాజేందర్ ఖానాపూర్ మండల అధ్యక్షులు రాధారపు అశోక్, నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అశోక్,జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్, దుంక దువ్వ రంజిత్, బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు సూత్రపు సరిత, జిల్లా యువ మోర్చా నాయకులు, నర్సంపేట నియోజకవర్గ బిజెపి నాయకులు, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.