బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి జిఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. సోమవారం కేటీకే ఓసి 3 అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో రెండోరోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు.
ఈ దీక్షలను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాథరాజు సతీష్, నూకల చంద్రమౌళి, సుధాకర్ రెడ్డి లు కార్మికులకు దండలు వేస్తూ ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల కు కొమ్ము కాస్తూ 60 సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడం జరుగుతుందని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుండి శ్రావణపల్లి బ్లాక్ ను కూడా వేలం వేయడానికి ప్రభుత్వం పూనుకున్నదని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి టెండర్లను హైదరాబాదులోనే వేలం పాట వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ సింగరేణి సంస్థకే కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మధుగాని విజేందర్, బ్రాంచ్ నాయకులు ఫిట్ సెక్రెటరీ ఎల్ శంకర్, ఓసి త్రీ ఫిట్ సెక్రటరీ ఎస్ కృష్ణారెడ్డి, పి మహేందర్ రావు సుంకరి శీను నరేష్ ఈ పి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *