భద్రాచలం నేటిదాత్రి
1980 నుంచి సాగు చేసుకుంటున్నాం చర్ల మండలం కలివేరు గ్రామ ప్రజల పోడు భూముల ఆక్రమణలు ఫారెస్ట్ వారు ఆపాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బృందం ఐటిడిఏ పిఓ ను కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మాట్లాడుతూ కలివేరు గ్రామ ప్రజలు 1980 నుంచి భూమి సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు ఈ సంవత్సరం ఫారెస్ట్ అధికారులు వచ్చి అట్టి భూములను ఆక్రమించుకొని మొక్కలు పెడదామని బెదిరిస్తూన్నారు. సంవత్సరం కూడా ఆ గ్రామస్తులు గింజలు వేసుకున్నారు.ఇప్పుడు ఫారెస్ట్ వారు వచ్చి ఈనెల పదో తారీకు వరకు ఈ భూమి మాకు అప్పజెప్పాలని దాంట్లో ప్రభుత్వం మొక్కలేస్తుందని పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురు చేస్తున్నారు.ఇది ఏం పద్ధతి అని అడిగిన నాయకత్వంపై మండల కార్యదర్శి ముసలి సతీష్ పై అక్రమ కేసులు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కలివేరు ప్రజలకి గ్రామ సభలో చేసుకున్న దరఖాస్తులు చేసుకున్నవి అధికారాన్ని కలిసి అనేక పత్రాలు ఉన్నాయి కావున అట్టి భూమి పై కలివేరు ప్రజలకే హక్కులు ఉన్నాయని తెలియజేస్తూ ఐటీడీఏ పీవో కి వివరించి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. పి వో వెంటనే డి ఎఫ్ ఓ తోటి మాట్లాడి ఈ సమస్యను తొందరలో పరిష్కరించేటట్టు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఏఐకేఎంఎస్ జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు ఇరప సమ్మక్క ఆదిలక్ష్మి రాజలక్ష్మి మంగక్క తదితరులు పాల్గొన్నారు