అన్‌స్టాపబుల్ 3లో చిరు, కేటీఆర్.. విజయదశమికి రచ్చ రచ్చే..

నందమూరి బాలయ్య ఫ్యాన్స్ చొంకాలు చింపుకునే న్యూస్. కేవలం నందమూరి ఫ్యాన్స్ యే కాదు.. చిరంజీవి, కేటీఆర్ లాంటి వారి ఫ్యాన్స్ కు కూడా పండగలాంటి వార్తే ఇది. ఏంటి అంటారా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదికపై అదరహో అనిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో… సీజన్ 1, సీజన్ 2 సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య సీజన్ 3కి రెడీ అవుతున్నారట. తొలి రెండు సీజన్స్ ని మించేలా గ్రాండ్ గా అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్లాన్ చేశారట.

అయితే అన్ స్టాపబుల్ 3లో పాల్గొనబోయే గెస్ట్ ల గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొనబోతున్నట్లు టాక్. ఇదే నిజమైతే ఈ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పడం లో ఎలాంటి డౌట్ లేదు. ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ కి వచ్చే కిక్కే వేరు. అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్, మంత్రి కేటీఆర్ లాంటి ప్రముఖులు కూడా ఈ షోకి అతిథులుగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఎలా ఉండబోతుందో. ఎవరు రాబోతున్నారో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *