ప్రతి గ్రామంలో సీసీ కెమె రాలను ఏర్పాటుచేసుకో వాలి
నేరాల నియంత్రణలో ప్రజ లు భాగస్వాములు కావా లి
సీఐ సుధాకర్ రెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిఐ సుధాకర్ రెడ్డి ప్రజలను కోరా రు. బుధవారం మండలం లోని ప్రగతి సింగారం గ్రామం లో బోనపల్లి రఘుపతి రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూపాయలు 25 వేల విలువైన నాలుగు సోలార్ సిసి కెమెరాలు కోసం విరా ళాలు అందజేశారు. అదేవి ధంగా రాజుపల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మణరావు ఉప సర్పంచ్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు మరియు గ్రామ సభ్యుల సహకారంతో రూ.25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల కోసం సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేష్ సమక్షంలో సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్ నిర్వహిం చారు. సిఐ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగ స్వాములు కావాలని అన్నా రు ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేష్, గ్రామ పెద్దలు, ప్రజ లు, పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.
