‘‘ఈ’’ ఇద్దరు గులాబీకి చీడనే! పార్టీకి పీడనే!

ఇద్దరు ఐరన్‌ లెగ్గులే?

`ఆ రెండు జిల్లాల ఓటమి వాళ్ల వల్లనే!!

`రెండు జిల్లాల్లో తుడిచిపెట్టుకు పోవడానికి కారణం వాళ్లే?

`ఖమ్మం ఖాళీ కావడానికి పువ్వాడే!

`వరంగల్‌ ఓటమికి కారణం రాకేషే!

`పొంగులేటిని పట్టించుకోక చెడగొట్డింది పువ్వాడ.

`తమ్మలను పక్కనపెట్టి మొదటికే మోసం తెచ్చింది అజయే.

`వరంగల్‌ ఓటమి మొత్తం రాకేష్‌ వల్లనే!

`బీఆర్‌ఎస్‌ నేతలను తిట్టి పార్టీని పలున చేసింది రాకేషే!

`ఆ ఇద్దరి వల్ల కారుకు వచ్చిన పీడనే!

`ఆ ఇద్దరు చెదపట్టినట్లే పార్టీని చెరిపేశారు.

`ఖమ్మంలో కారు తలెత్తుకోకుండా పువ్వాడ చేశాడు.

`రాకేష్‌ నమ్మితే వరంగల్‌ కు ఓటమిని తెచ్చిపెట్టాడు.

`ఈ ఇద్దరు పార్టీని భ్రష్టు పట్టించారు.

`ఖమ్మం కారులో పువ్వాడ చెరి ఖాళీ చేశాడు.

-మంత్రి పదవిలో వుండి అందర్నీ పార్టీకి దూరం చేశాడు.

-ప్రత్యక్ష,పరోక్షంగా ఈ ఇద్దరు పార్టీని కోలుకోకుండా చేశారు.

-వరంగల్‌ లో తలెత్తుకోకుండా రాకేష్‌ చేశాడు.

-బీజేపీలో వుండి రాకేష్‌ బిఆర్‌ఎస్‌ మీద దుమ్మెత్తిపోశాడు.

-కారులో చేరి పొగబెట్టాడు.

-ఎన్నికల ముందు చేరి, చిల్లం చిల్లం చేశాడు.

-బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఈ ఇద్దరినే నమ్మారు.

-నమ్మిన వాళ్లను ఈ ఇద్దరు నట్టెట ముంచారు.

-ఇప్పటికీ ఆ ఇద్దరికే అగ్రనేతలు ప్రాధాన్యతనిస్తున్నారు.

-ఆ ఇద్దరు వున్నంత కాలం పార్టీ కష్ట కాలం తప్పదు.

-రాకేష్‌ ఒంటెద్దు పోకడలు..పువ్వాడ పనికి రాని లెక్కలు.

-తలకిందులైన కారు అంచనాలు.

-ఇప్పటికీ మించిపోయింది లేదు.

-ఈ ఇద్దరినీ పక్కన పెడితే చాలు.

-కారు జోరందుకోవడానికి పెద్ద సమయం పట్టదు.

-ఈ ఇద్దరి వల్లనే బిఆర్‌ఎస్‌ కు ఉద్యమ కారులు దూరమౌతున్నారు.

-మాజీ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయాల్లో కొంత మందిని గోల్డెన్‌ హాండ్స్‌అంటారు. కొంత మందిని ఐరన్‌ లెగ్స్‌ అంటారు. గోల్డెన్‌ హాండ్స్‌ వల్ల పార్టీకి ఎంతో మేలు జరిగిందని చెప్పుకునే అవకాశముంటుంది. ఐరన్‌ లెగ్గుల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్ప జరిగే మేలు ఏమీ వుండదు. ఐరన్‌ లెగ్గులుగా ముద్ర పడిన నాయకుల్లో చాలా వరకు వాళ్లు గెలిచినా, పార్టీ గెలవదు. వాళ్లతోపాటు పార్టీని నిండా ముంచేస్తారు. అలాంటి వారిని రాజకీయ పార్టీలే ఐరన్‌ లెగ్‌లంటూ ప్రచారం సాగిస్తుంటాయి. అలా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీలో ఇద్దరి పేర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు ఐరన్‌ లెగ్‌లే కాదు, ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమికి ప్రత్యక్ష, ప్రరోక్ష కారణాలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లను బిఆర్‌ఎస్‌ నమ్మడమే పాపమైపోయిందని అంటున్నారు. వాళ్ల వల్ల పార్టీకి అణాపైస లాభం జరక్కపోగా, పెద్ద నష్టం మిగిల్చారన్న చర్చ సర్వత్రా జరగుతోంది. పార్టీలో ఆ ఇద్దరి మూలంగా జరిగిన నష్టం భర్తీ కావడానికి కూడా సమయం పట్టేలా వుందంటున్నారు. వారు పార్టీలో వుంటే నాయకులంతా ఒక్కతాటి మీద వుండలేకపోతున్నారు. వారి పెత్తనం సాగుతుంటే పార్టీల నాయకులు సహించలేకపోతున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా విషయాన్ని చెప్పుకుంటే పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. పువ్వాడ నాగేశ్వరరావు మీద వున్న అభిమానంతో ఆయనను గెలిపించారు. ముందుగా పువ్వాడ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి గెలిచారు. తర్వాత 2014ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెవడంతో బిఆర్‌ఎస్‌లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌కు సన్నిహితుడయ్యారు. కేటిఆర్‌ వల్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతూ వచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచి, మంత్రి అయ్యారు. 2014నుంచి ఉనికి కోసం తపత్రయ పడ్డ అజయ్‌కుమార్‌ 2018 తర్వాత పెత్తనం చేయడం మొదలు పెట్టారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత సీనియర్‌ నాయకులను పార్టీకి దూరం చేసే ఎత్తుగడలు చేస్తూ వచ్చారు. ఒంటెద్దు పోకడలతో ఇతర నాయకులను పట్టించుకోవడం మానేశారు. ఇతర నాయకుల నాయకత్వాలు ప్రశ్నార్ధకం చేశారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన్ని బలహీన పర్చుతూ వచ్చారు. ఆయనకు ప్రాదాన్యత లేకుండా చేయాలనుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనను దూరం చేస్తూ వచ్చారు. నిజానికి తుమ్మల నాగేశ్వరావు ఒకప్పుడు కేసిఆర్‌కు మంచి మిత్రుడు. ఆ సాన్నిహిత్యంతోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనను కేసిఆర్‌ పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్దిలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని చూశారు. ఎందుకంటే ముందు నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిని నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నంత కాలం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మం జిల్లా అభివృద్దికి బాటలు వేశారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ మంత్రి అయిన నుంచి పక్కన పెట్టడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పాలేరు ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన తుమ్మల తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తుమ్మల ఓటమికి కారణం పువ్వాడ అన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. ఎందుకంటే తుమ్మల 2018 ఎన్నికల్లో గెలిస్తే తనకు ప్రాదాన్యత లభించదని పువ్వాడ ఎత్తులువేసినట్లు చెప్పుకుంటారు. ఇక మరో నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన 2014 వరకు తెలంగాణ రాజకీయాలకు పరిచయం లేని నాయకుడు. కానీ ఉప్పొంగిన తరంగంలా తెలంగాణ వచ్చినతర్వాత కూడా ఆయన తెలంగాణలో వైసిపి తరుపున పోటీచేసి గెలిచారు. ఖమ్మం ఎంపిగా ఆయన గెలవడమే కాదు, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించి, తెలంగాణ రాజకీయాలను తన వైపు తిప్పుకున్నారు. అందరూ ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. ఖమ్మం జిల్లాను శాసించే కొత్త నాయకుడు వచ్చాడని అందరూ అప్పుడే అనుకున్నారు. అలాంటి సమయంలోనే కేసిఆర్‌ ఖమ్మం ఎంపిగా వున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సేవలు వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు అవకాశమివ్వకపోయినా పార్టీ కోసం పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్‌ పార్టీకి దూరం చేస్తూ వచ్చారు. పొంగులేటికి ప్రాదాన్యతనివ్వకుండా చూసుకున్నారు. కేసిఆర్‌ అప్పాయింటు మెంటు కూడా మంత్రి పొంగులేటికి అందకుండా చేశారు. జిల్లారాజకీయాల నుంచి పొంగులేటిని తరిమేయాలని పువ్వాడ చూశారు. కాని ఏమైంది. పువ్వాడ ఓడిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ మీద సవాలు చేశారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకుండా చేస్తానన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్‌ను గెలిపించారు. ఖమ్మంలో క్లీన్‌ స్వీప్‌ చేసి చూపించారు. తన రాజకీయ శక్తి ఎంత గొప్పదో రుచి చూపించారు. తను కూడా గెలవలేని పువ్వాడను నమ్ముకొని, ఆయన మాటలు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్‌ను దూరం చేసుకొని పార్టీ ఓటమి పాలైంది. అదే శ్రీనివాస్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత వుంటే బిఆర్‌ఎస్‌ రాజకీయం మరో విధంగా వుండేది. పువ్వాడ తన స్వార్ధ రాజకీయం కోసం పార్టీని నట్టెట ముంచేశారు. ఇప్పుడు కూడా ఆయన వ్యవహారం మారలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదనే వ్యాఖ్యలే స్వర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదు. ముందు పడతున్నదేమీ లేదు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభకు ఇతర నాయకులు తరలించినంత మందిని కూడా పువ్వాడ తలరించలేదని అంటున్నారు. అందువల్ల ఖమ్మం కారు రాజకీయాల నుంచి పువ్వాడను పక్కకు తప్పిస్తే తప్ప ఖమ్మంలో మళ్లీ గులాబీ వికసించదంటున్నారు. బిఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం రాదంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా అంటేనే బిఆర్‌ఎస్‌కు కంచుకోట. ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ నాయకులున్నంత బలంగా ఏ పార్టీ లేదు. ఏ పార్టీకి అంత బలవంతమైన నాయకులు లేరు. కాని ఒక్క నాయకుడు మూలంగా వరంగల్‌ బిఆర్‌ఎస్‌ రాజకీయాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న మాటలు పార్టీ పెద్దల దాకా చేరడం లేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నాయకులు, ఉద్యమ కారులు ఎక్కువ మంది బిఆర్‌ఎస్‌లోనే వున్నారు. ఉద్యమ కాలం నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకోసం పనిచేస్తూనే వున్నారు. పార్టీకి కంచుకోటలు కట్టిన నాయకులున్నారు. అలాంటి పార్టీని చిన్నా భిన్నం చేసిన నాయకుడు రాకేశ్‌రెడ్డిని బిఆర్‌ఎస్‌లోకి తీసుకోవడమే పెద్ద పొరపాటు అంటున్నారు. ఇది బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ తీసుకున్న సరైన నిర్ణయం కాదంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, బిఆర్‌ఎస్‌కు తీరని అన్యాయంచేసిన రాకేష్‌రెడ్డికి ప్రాదాన్యత కల్పించడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే బిజేపిలో టికెట్‌ దక్కే అవకాశం లేదని నిర్ధారణ జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. అంతకు ముందు మూడేళ్ల కాలం పాటు రాకేష్‌రెడ్డి తన సోషల్‌ మీడియా, బిజేపిని అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద తీవ్ర విమర్శలు చేసేవారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి అండదండలతో బిఆర్‌ఎస్‌ మీద లేని పోని అబద్దాలు సృష్టించి ప్రచారం చేసేవారు. ఏకంగా పోలీసు శాఖను కూడా పదే పదే అవమానించే రీతిలో మీడియా సమావేశాలు ఏర్పాటుచేస్తుండేవారు. ఇక ఉమ్మడి వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఎంతో నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు వున్నారు. అలాంటి మాజీ ఎమ్మెల్యేల మీద కూడా లేనిపోనివి ప్రచారం చేసి, ప్రజల దృష్టిని మరల్చాడు. అంతిమంతా అది కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా చేశారు. తీరా ఎన్నికల ముందు రాకేష్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వల్ల ఆయన మరింత నష్టమే జరిగింది తప్ప, మేలు జరగలేదు. వ్యక్తిగతంగా ఆయన కొంత మంది ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. తాను బిజేపిలో వున్నప్పుడు చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పలేకపోయారు. వరంగల్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గెలుపుకోసం పెద్దగా కష్టపడిరది లేదు. కాని ఆయనను తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక వచ్చింది.. ఆ టికెట్‌ ఉద్యమ కారులకు ఇస్తారని అనుకున్నారు. కాని రాకేష్‌రెడ్డికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆఖరు నిమిషంలో ఆయన పేరు ఖరారు చేయడంతో అందరూ అవాక్కయ్యారు. పైగా రాకేష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ఖర్చు కూడా మొత్తం బిఆర్‌ఎస్‌ పార్టీయే భరించింది. అదే టికెట్‌, ఖర్చు ఇతర ఉద్యమ నాయకులకు ఎవరికి ఇచ్చినా బిఆర్‌ఎస్‌ గెలిచేది. రాకేశ్‌రెడ్డి బిజేపిలో వున్నంత కాలం బిఆర్‌ఎస్‌కు మద్దతుగా వున్న పత్రికలపై కూడా నిత్యం విషం కక్కుతూ వుండేవారు. నమస్తే తెలంగాణ వంటి పత్రికను కూడా తర్పూర పడుతుండేవారు. ఇప్పుడు అలాంటి రాకేష్‌రెడ్డికి ఆ పత్రికలోనే అధిక ప్రాదాన్యతన్విడంపై బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అసహనం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సభ ఏర్పాటు, నిర్వహణ, బాధ్యతలు రాకేష్‌రెడ్డి తీసుకోలేదు. దాని పర్యవేక్షణ సైతం కనీసం చేయలేదు. రజతోత్సవసభ వేదిక మీద నిర్వాహకుల కన్నా, ఎక్కువ హల్‌చల్‌చేశారు. ఇది నిజమైన ఉద్యమకారులకు ఎంతో ఇబ్బందికరంగా కనిపించింది. ఎందుకంటే రాకేష్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. కనీసం ఆది నుంచి బిఆర్‌ఎస్‌ నాయకడు కాదు. మద్దతు దారుడు అసలే కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసిఆర్‌ను గుర్తించిన వ్యక్తి కాదు. కేసిఆర్‌ త్యాగాన్ని ఏనాడు కొనియాడిన నాయకుడు కాదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే కళ్లు చూసిన నాయకుడు కాదు. కాని తెలంగాణను కేసిఆర్‌ ఆగం చేస్తున్నాడని విమర్శించిన నాయకుడు రాకేష్‌రెడ్డి. తెలంగాణను కేసిఆర్‌ అప్పుల పాలు చేస్తున్నాడన్నారు. కాలేశ్వరం విషయంలో రాకేష్‌రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరంగల్‌ జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులపై రాకేష్‌రెడ్డి అబద్దాలు చెప్పి, చెప్పి వారి ఓటమికి కారణకుడయ్యారు. అలాంటి రాకేష్‌రెడ్డిని తెచ్చి ఆ నాయకుల నెత్తి మీద పెట్టేంత పనిచేయడం సరైంది కాదంటున్నారు. రాకేష్‌ పార్టీలో వున్నా, లాభం లేదని అంటున్నారు. అలాంటి నాయకుడు వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్నారు

కాల్పుల విరమణపై డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌

కాల్పుల విరమణపై డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌

ఇప్పటికే పాక్‌ను అథ్ణపాతాళానికి తొక్కేసిన ఇండియా

గతకాలం నాటి భారత్‌ కాదు

కర్ర పట్టుకో, శాంతంగా మాట్లాడు అన్నదే మన విధానం

బలం లేనివాడు శాంతివచనాలు పలికితే ఎవరూ లెక్కచేయరు

సత్తా వున్నవాడు చెప్పే ప్రతిమాట శాసనమే

శాసించే స్థాయికి చేరిన భారత్‌

భారత దౌత్య నిపుణత, సైనిక సామర్థ్యానికి గుర్తింపు

చైనా, పాక్‌లకు తమ స్థాయి ఏంటో తెలియజెప్పిన భారత్‌

భారత్‌ాపాకిస్తాన్‌లు కాల్పుల విరమణ పాటించడానికి అంగీకరించాయని శనివారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌ చేయడం సంచలనం సృష్టించింది. అయితే వీసా, సింధూ నదీ జలాలపై భారత్‌ వైఖరి కొనసాగుతుందనేది ఈ పోస్ట్‌ సారాంశం. పహల్గాం సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరపడం, తర్వాత పాకిస్తాన్‌ మనదేశంపై యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులకు మనదేశం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అని పేరు పెడితే పాకిస్తాన్‌ మనదేశంపై జరి పే దాడులకు ‘‘‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ అని పేరుపెట్టింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ మనకు ఎంతమాత్రం సరిసాటి కాదన్న సంగతి ప్రపంచానికి స్పష్టమైంది. అంతేకాదు, మన సాయుధ సంపత్తి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లను, క్షిపణులను, విమానాలను నిలువరించే పటిష్ట రక్షణ వ్యవస్థ, నిర్వహించిన ప్రతి దాడిలో నూటికి నూరుపాళ్లు కచ్చితత్వాన్ని సాధించడం, మరోవైపు పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేవిధంగా మనం అనుసరించిన దౌత్యనీతి ప్రపంచ దేశాలను నోరెళ్లబెట్టేలా చేసింది. ఒక చెడు మరో మంచికి దారితీస్తుందనేది ఒక సామెత. పాక్‌ చేసిన దుశ్చర్య ఇప్పుడు దానికి తన స్థానమేంటో చక్కగా తెలిసొచ్చింది. రెండోది భారత్‌ పదేళ్ల క్రితం కంటే అన్నిరంగాల్లో సాధించిన ప్రగతి, సామర్థ్యాలను ప్రపంచం అబ్బురంతో చూస్తోంది. ఇప్పటి కే ప్రపంచ యవనికపై దౌత్యపరంగా ఒక విలక్షణ శైలిని అనుసరిస్తూ, అవసర సమయంలో అగ్రరాజ్యాలతో సహా అన్ని దేశాలు తనవైపే చూసే స్థాయికి భారత్‌ చేరింది.
ఈ యుద్ధం చైనాకు కూడా పెద్ద గుణపాఠం నేర్పుతుందనుకోవాలి. ప్రపంచంలోనే తమవి అ త్యాధునిక రక్షణ వ్యవస్థలుగా చైనా విపరీత ప్రచారం చేసుకుంది. ఎఫ్‌`16 విమానాలకు దీటు గా వుంటాయంటూ జెఎఫ్‌`17 విమానాల గురించి ఎంతో గొప్పలు చెప్పుకోవడమే కాదు, తన ఐరన్‌ బ్రదర్‌ పాకిస్తాన్‌కు అందజేసింది. చైనా రక్షణ వ్యవస్థలు, జెఎఫ్‌`17 యుద్ధ విమానాలు ఏవీ మన ధాటికి తట్టుకోలేక ధ్వంసమైపోయాయి. అంతెందుకు, ఎఫ్‌`16 యుద్ధ విమానాలను కూడా మన సైన్యం కూల్చివేసింది. ప్రపంచ మార్కెట్‌లో ఎఫ్‌`16 విమానాలను అమ్ముకోవడానికి అమెరికాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిరది. అమెరికా పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఆవిషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఆ దేశాన్ని ఇరుకున పడేసింది. కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలన్న నిబంధనను ఉల్లం ఘించినందుకు ఇప్పుడు పాకిస్తాన్‌కు, అమెరికా చీవాట్లు పెట్టే పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు చైనా రక్షణరంగ ఉత్పత్తుల్లోని డొల్లతనాన్ని భారత్‌ ప్రపంచానికి వెల్లడిరచినట్లయింది. కేవలం కొద్ది సమయంలోనే పాకిస్తాన్‌లోని చైనా తయారీ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాదు, జెఎఫ్‌`17 యుద్ధ విమానాలను సునాయాసంగా కూల్చివేయడంతో భారత్‌ సత్తా ఏంటో చైనాకు తెలిసొచ్చింది. అంతేకాదు తైవాన్‌ ఆక్రమణకు చైనా చేస్తున్న యత్నాలను చూసి మరే దేశమూ ఇప్పుడు భయపడక పోవచ్చు. ముఖ్యంగా ఆ దేశానికి తన చుట్టూ 14 చిన్న దేశాలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో చైనా ఉత్పత్తుల డొల్లతనం అర్థమైన ఈ దేశాలేవీ ఇక చైనాను లెక్కచేయకపోవచ్చు. అమెరికా కూడా చైనా సాయుధ సంపత్తిపై ఒక అంచనాకు వచ్చి వుండాలి. ఇదే సమయంలో ఎఫ్‌`16 యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్‌ సామర్థ్యం కూడా అమెరికాకు తెలిసొచ్చింటుంది.
2013ా14 నుంచి 2024ా25 వరకు పరిశీలిస్తే భారత్‌ ఎంతటి సామర్థ్యాన్ని సంతరించుకున్నదీ ఈ యుద్ధం స్పష్టం చేసింది. టర్కీ వేల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్‌కు ఇచ్చినప్పటికీ, భారత్‌ వాటిని సమర్థవంతంగా కూల్చివేయడంతో డ్రోన్ల తయారీలో తానే రారాజునని భావిస్తున్న టర్కీకి శృంగభంగమైంది. భారత్‌ శక్తి ఎంటో బాగా తెలిసొచ్చింది. ఇప్పుడు ఏజియన్‌ సముద్రంలోని ద్వీపాల విషయంలో గ్రీస్‌తో టర్కీకి గొడవులున్నాయి. అదేవిధంగా సైప్రస్‌ విషయంలో కూడా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం వుంది. కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ నిలవడంతో మనదేశానికి తీవ్ర ఆగ్రహం కలిగింది. పలితంగా ఇప్పుడు మనం గ్రీస్‌కు మద్దతుగా నిలుస్తున్నాం. అదేవిధంగా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన మరోదేశం అజర్‌బైజాన్‌. ఇప్పుడు ఆ దేశానికి కూడా భారత్‌ శక్తి ఏంటో తెలిసొచ్చింది. దానికి అర్మీనియాకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! అజర్‌బైజాన్‌ కూడా కశ్మీర్‌ విషయంలో పాక్‌ పక్షమే వహిస్తోంది. ఇప్పుడు మనదేశం అర్మీనియాకు ఆయుధ సంపత్తిని సమకూరుస్తూ, అజర్‌బైజాన్‌కు చెక్‌పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నాం. ఇదిలావుండగా అజర్‌బైజాన్‌ాఅర్మీనియా యుద్ధం డ్రోన్ల వాడకం ప్రాధాన్యత ను ప్రపంచానికి తెలియజెప్పగా, భారత్‌ాపాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ‘కౌంటర్‌ డ్రోన్‌’ టెక్నాలజీ అవసరాన్ని ప్రపంచానికి వెల్లడిరచింది.
ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ మొత్తం 26 ప్రదేశాలనుంచి ముఖ్యంగా మనదేశ పశ్చిమ ప్రాంతంపై డ్రోన్లు, సుదూర ప్రాంతాలపై దాడులకు ఉపయోగించే క్షిపణుల సహాయంతో దాడులకు యత్నించగా మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాదు, త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాయి. మన నేవీ కరాచీ పోర్టులో సృష్టించిన విధ్వంసానికిఅది ఇప్పట్లో మామూలు స్థితికి రాదనేది సుస్పష్టం. లాహోర్‌, రావల్పిండి తదితర ప్రాంతాలపై మనదేశం చేసిన దాడులు, పాకిస్తాన్‌కు భవిష్యత్తులో మరచిపోలేని గుర్తులుగా మిగిలిపోతాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
నిజం చెప్పాలంటే పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న పాక్‌ ఉగ్రవాదుల కు వ్యతిరేకంగా భారత్‌ తన చర్యను ప్రారంభించింది. వీరిమూలాలను ధ్వంసం చేయాలన్న నిర్ణయానికి వచ్చి అటువంటి పాక్‌లోని 42 ఉగ్రస్థావరాలను గుర్తించింది. వీటిల్లో మొదటిదశలో 9స్థావరాలపై జరిపిన దాడుల కలిగిన విధ్వంసం పాక్‌ కలలో కూడా ఊహించి వుండదు. అంతే కాదు యూద`అమెరికన్‌ జాతీయుడైన జర్నలిస్ట్‌ డేనియన్‌ పెరెల్‌ హత్యలో పరోక్ష పాత్ర పోషించిన ఇస్లామిక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో హతమయ్యాడు. ఇతగాడిని అప్పగించాలన్ని ఎప్పటినుంచో అమెరికా కోరుతున్నా పాకిస్తాన్‌ ఆపనిచేయడంలేదు. ఇతడి మరణం విషయం భారత్‌ ప్రకటించిన తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేయడం గమనార్హం. ఇదిలావుండగా ఉగ్ర స్థావరాలపై దాడిని తనపై చేసిందిగా పరిగణించి మనదేశంపై ప్రతిచర్యకు దిగిన పాకిస్తాన్‌కు అడుగడుగునా శృంగభంగమే మిగిలింది. తమదేశంలో అంతర్గత కల్లోలాలను తట్టుకోవడానికి భారత్‌పై యుద్ధం చేయకతప్పదని భావించిన పాక్‌ మనదేశం పై కాలు దువ్వింది. చివరకు భంగపడి ఏదోవిధంగా ఈ యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా కా ళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. బహుశా తెరవెనుక దౌత్యం నేపథ్యం కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేయడానికి దారితీసుండవచ్చు.
ఒకవేళ ఇదే నిజమై కాల్పుల విరమణ పాటిస్తే మొత్తం గుర్తించిన 42 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయాలన్న భారత్‌ లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది. ఈ యుద్ధం ద్వారా పీఓజేకేను స్వాధీనం చేసుకునే సువర్ణావకాశం కూడా చేజారిపోతుంది. ఇక బెలూచ్‌ వీరులు ఇప్పటికే 80శాతం బెలూచ్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వాతంత్య్రం ప్రకటించుకునే అవకాశం కూడా దెబ్బతింటుంది. వాస్తవానికి బెలూచ్‌ వీరులకు అమెరికా పరోక్ష మద్దతుందన్న నిర్ధారణ కాని వార్తలు వచ్చాయి కూడా! లక్ష్యం సాధించకుండా వెనుదిరగని నరేంద్ర మోదీ ట్రంప్‌ ట్వీట్‌పై ఏవిధంగా స్పందిస్తా రో చూడాలి. గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా మనదేశం అన్ని సానుకూలతలున్నా, పాకిస్తాన్‌ను క్షమించే రీతిలోనే వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందా? అనేది ప్రశ్న.
మరో అంశమేంటంటే, ఉగ్రవాదులపైనే దాడులు జరపాలి, యుద్ధం అనవసరం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారంటూ మనదేశంలోనే కొందరు వ్యాఖ్యానించే ప్రబుద్ధులున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడినుంచి ప్రారంభమైంది? పహల్గాం దాడినుంచి! ఇక్కడ చనిపోయింది అమాయకు లైన సాధారణ పర్యాటకులు! దీనికి ప్రతీకారంగా భారత్‌ మొదలు పెట్టింది కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులతోనే! మనదేశం చేసిన దాడుల లక్ష్యం సాధారణ పౌరులు లేదా పాక్‌ సైనిక స్థావరాలు కానేకాదు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి మూలాలపై దాడు లు జరిపింది. మరి యుద్ధం మొదలుపెట్టిందెవరు? పాకిస్తాన్‌! మరి మన కుహనా మేధావులకు కంటి ఎదురుగ్గా కనిపిస్తున్న ఈ సత్యం అర్థం కావడంలేదంటే ఆ విచక్షణను వారికే ఒదిలే యాలి. ఒక రకంగా చెప్పాలంటే మనదేశాన్ని కొన్ని రకలు ‘ఇజాలు’ క్యాన్సర్‌లా పట్టిపీడిస్తున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరుకున్నాయంటే ‘ఛాందస స్థాయికి’ చేరుకున్నాయి. అందువల్లనే వీటిని ‘సూ డో లిబరలిజం’ లేదా ‘లిబరల్‌ ఫండమెంటలిజం’ అనడం సబబుగా వుంటుందేమో! భారత్‌`పాక్‌ మధ్య సంఘర్షణను రెండు కులీన వర్గాలకు చెందిన ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధంగా వర్ణించే వారు, పదగుంభనం బాగున్నా, అర్థం తేలిపోతున్నది. తప్పు చేసినవాడిని శిక్షించాల్సిందే! అది ప్రకృతి ధర్మం! చిన్న పిల్లవాడు అమాయకుడు కదాని నిప్పులో వేలు పెడితే కాలకుండా వుండదు! ప్రతి తప్పుడు పనికి కాలం విధించే శిక్ష కఠినంగానే వుంటుంది! సమాజంలో ధనికులు, పేదలు, ఉపాధి లేనివారు, అనాధలు…ఈవిధంగా అన్ని రకాల మనుషులు వుంటారు. వీరి అభ్యున్నతికి ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వీటిని సమూలంగా తొలగించడం సాధ్యంకాదు. అట్లాగని వీరిని ఉపేక్షించనూ కూడదు. ప్రతి సంఘటనకు ‘వీరిని’ ముందుకు తీసుకొచ్చి పదగుంభనంతో మాట్లాడటం ‘డొల్ల మేధావితనం’ తప్ప ‘ఉపయుక్త మేధస్సు’ కాదు!

యు.పి. రాజకీయాలపై కులగణన ప్రభావం

కోల్పోయిన ఓబీసీల్లో పట్టుకు బీజేపీ వ్యూహం

‘హిందూత్వ’ నుంచి ‘కుల రాజకీయాల’వైపు మారక తప్పని పరిస్థితి

దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీలకే అనుకూలమయ్యే అవకాశం

కులరహిత సమాజం లక్ష్యం నెరవేరదు

కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది

దేశంలో 50వేల కులాల్లో కేటగిరీలుగా విభజన ఎలా సాధ్యం?

బీజేపీకి అచ్చొచ్చిన ‘కలిసుంటే లాభం’ నినాదం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కులగణన చేపట్టిన ఘనత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి కల్పించింది కూడా తామేనని కాంగ్రెస్‌ చెప్పుకోవడం సహజమే. దీన్ని బీజేపీ కొట్టిపారేస్తున్న సంగతి వేరేవిషయం. ఈ కులగణన ద్వారా రాజకీయంగా లబ్దిపొందాలని రెండు కూటములు యత్నిస్తున్నాయనేది నిష్టుర సత్యం. ఇదిలావుండగా ఇప్పటి వరకు కులాలపేరుతో హిందూ సమాజాన్ని విడదీయవద్దంటూ ‘హిందూత్వ’ రాజకీయాలకు పరి మితమైన బీజేపీ కులగణన చేపట్టాలని నిర్ణయించడానికి కొన్ని బలమైన కారణాలే వున్నాయను కోవాలి. త్వరలో బిహార్‌లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకత్వంలో విపక్షాలు ఈ కులగణను ఒక ప్రధాన అస్త్రంగా మలచుకోవడం ఒక కారణం కాగా, రెండోది గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 33 సీట్లకే పరిమితం కావడం మరో కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తం 80 స్థానాలు కలిగిన యు.పి.లో 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 62 స్థానాల్లో గెలుపు సాధించగా గత ఎన్నికల్లో దాదాపు సగం సీట్లు కోల్పోవడం పార్టీ నాయకత్వా న్ని పునరాలోచనలో పడేసింది. ముఖ్యంగా 400 సీట్లు లక్ష్యంతో ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ యూపీలో ఘోరంగా దెబ్బతినడానికి కారణం ఇక్కడి కుల రాజకీయాలు, రిజర్వేషన్లను రద్దుచే స్తారని విపక్షాలు ప్రతికూల ప్రచారం చేయడం, పార్టీ టిక్కెట్ల జారీలో లోటుపాట్లుగా పార్టీ గుర్తిం చి ఆ దిశగా దిద్దుబాటు చర్యలకు దిగింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది యు.పి. లో గెలుచుకున్న స్థానాలే నిర్ణయిస్తాయన్నది తెలిసిన విషయమే. ఇవే ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకొని బీజేపీని వెనక్కి నెట్టేసింది. ఇక కాం గ్రెస్‌ ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ మార్పుకు కారణమేంటన్న ప్రశ్నకు, గత దశాబ్దకా లంగా బీజేపీకి వెన్నుదనున్నగా వున్న ఓబీసీ మరియు దళిత ఓటర్లు దూరం కావడమన్నది నిపుణులు చెబుతున్న సమాధానం. 

కులగణనవైపు బీజేపీ మొగ్గు

సమాజ్‌వాదీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు ముస్లింలు, యాదవులు కాగా దీన్ని మరింత విస్తరిం చేందుకు అఖిలేష్‌ యాదవ్‌ వెనుకబడిన, ఆదివాసి, దళిత, అల్పసంఖ్యాక (పీడీఏ) వర్గాల ఓట్లకోసం అనుసరించిన వ్యూహం ఫలించడం కూడా బీజేపీ సీట్లు కోల్పోవడానికి ఒక కారణం. ఈ నేపథ్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. రంగంలోకి దిగి బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషించడం మొదలుపెట్టింది. ఇందుకోసం వివిధ సమావేశాలు నిర్వహించి, ‘తాము కులగణనకు వ్యతిరేకం కాదని, కాకపోతే ఇది రాజకీయ ప్రేరేపితం కారాదు’ అని గత ఏడాది సెప్టెంబర్‌లో తన అభిప్రాయం వ్య క్తం చేసింది. సెప్టెంబర్‌ 2న పాలక్కాడ్‌ (కేరళ)లో జరిగిన మూడురోజుల సదస్సులో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పబ్లిసిటీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ అంబేద్కర్‌ సంస్థ అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. అదేనెల సె ప్టెంబర్‌ 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన జరిపే అంశాన్ని కొట్టిపారేయలేదు. దీనికి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తానని ఆయన చెప్పారు. కులగణనపై బీజేపీ వైఖరిలో వస్తున్న మార్పును గుర్తించిన అఖిలేష్‌ యాదవ్‌ అప్పటివరకు యు.పి. ప్రభుత్వాన్ని ‘ఠాకూర్‌ అనుకూలం’ అంటూ చేస్తున్న విమర్శలవాడిని తగ్గించారు. 2024 నంబర్‌ నెలలో యుపీపీఎస్‌సి ఛైర్మన్‌ సంజయ్‌ శ్రీనెట్‌కు వ్యతిరేకం గా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గన్న అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏకంగా ‘‘ఠాకూర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’’ అంటూ ఆరోపించారు. 2025లో ఆయన రాజ్‌పుత్‌ల వివిధ ప్రభుత్వ సంస్థల్లో రాజపుత్‌ల ఆధిపత్యంపై దాడులను మరింత తీవ్రం చేశారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌, ఆగ్రా, మెయిన్‌పురి, చిత్రకూట్‌, మహోబాల్లో నియమించిన పోలీసు అధికార్లలో అధిక సంఖ్యాకులు రాజ్‌పుత్‌ వర్గంవారేనంటూ ఆయన చేసిన ఆరోపణలను పోలీసువర్గాలు ఖండిరచడం తర్వాతి పరిణామం.

 మోహన్‌ భాగవత్‌ నరేంద్రమోదీ సమావేశం

జనగనణతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఏప్రిల్‌ 30న తీసుకున్న నిర్ణయాన్ని యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతించారు. ఈ మంత్రివర్గ నిర్ణయానికి ముందు ప్రధాని నరేంద్రమోదీని మొట్టమొదటిసారి ఆర్‌.ఎస్‌.ఎస్‌. చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సమావేశమవడం కీలక పరిణామం. 7`లోక్‌ కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసం లో వీరిద్దరూ దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన కీలక అంశాల్లో కులగణన కూడా వుండవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈ సామాజిక`ఆర్థిక సర్వేను, సంపద పంపిణీ వంటి కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ‘అర్బన్‌నక్సల్స్‌’ ఆలోచనా సరళిగా ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు కులగణన ద్వారా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను కోల్పోయిన పీడీఏ మరియు ఓబీసీ ఓట్లను తిరిగి తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా కులగణన తర్వాత కుల జనాభాను బట్టి సం క్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఆయా వర్గాల ఓట్లను పొందవచ్చనేది ఏ రాజకీయ పార్టీ అయినా అనుసరించే వ్యూహం. ఇందుకు బీజేపీ అతీతం కాదు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో 24 నెలల సమయం వున్న నేపథ్యంలో, కోల్పోయిన వర్గాల ఓట్లను తిరిగిపొందడానికి కులగణన వ్యూహాన్ని బీజేపీ ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువ. అదీకాకుండా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్‌ ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోదీ వి శ్వసించినంతగా మరే ఇతర నాయకుడు విశ్వసించడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇదిలావుండగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని యూపీలోని చాలామంది బీజేపీ కీలక నేతలు సమర్థిస్తున్నారు. ముఖ్యంగా 2024లో కోల్పోయిన ఓట్లను తిరిగి పొందడానికి ఇది ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడుతున్నారు. 

కులాల ఆధారంగా పార్టీలు

నిజం చెప్పాలంటే యు.పి.లోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు కులాలపై ఆధారపడి ఏర్పడిన వే కావడం విశేషం. ఉదాహరణకు సమాజ్‌వాదీ పార్టీ యాదవులకు, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ జాతవ్‌లకు, సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ రాజ్‌భార్లకు, నిషాద్‌ పార్టీ నిషాదులకు, రాష్ట్రీయ లోక్‌దళ్‌ జాట్‌లకు, అప్నాదళ్‌ కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ ‘హిందూత్వ’ అనే సిద్ధాంతానికి తప్ప ఏ ఒక్క కులానికి మద్దతివ్వదు. కానీ కులగణన నేప థ్యంలో జనాభా ఆధారంగా కులాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడటం ఖాయం. కులగణన వల్ల కలిగే మరో పరిణామమేంటంటే, ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న తక్కువ జనాభా కలిగిన కులాలకు ప్రాతినిధ్యం తగ్గి, ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యత లేని అధిక జనాభా కలిగిన కులాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే యాదవులు, రాజ్‌పుత్‌వర్గాల ప్రాధాన్యం తగ్గే అవకా శాలే ఎక్కువ. మరోవిషయమేంటంటే అట్టడుగున వున్న వెనుకబడిన వర్గాలు, జాతవ్‌ యేతర ఎస్సీ వర్గాల ఓట్లు తమ ఖాతాలో పడతాయని బీజేపీ అంచనా. ఇదే సమయంలో 2024లో స మాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసిన కుర్మీల రాజకీయ ప్రాబల్యం కూడా తగ్గే అవకాశముంది. ఇది బీజేపీకి లాభదాయకమవుతుందని స్థానిక బీజేపీ నేతల అంచనా.

వ్యూహం మార్చిన అఖిలేష్‌ యాదవ్‌

2024లో అఖిలేష్‌ యాదవ్‌ పీడీఏను ప్రధాన అజెండాగా తీసుకొని ఎన్నికల ప్రచారం కొనసా గించారు. కులగణన నేపథ్యంలో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఈ వ్యూహం పనిచేయదు. దీన్ని గుర్తించిన అఖిలేష్‌ యాదవ్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాత, అప్పటివరకు అనుసరిస్తున్న ‘ఠాకూర్‌’లను వ్యతిరేకిస్తూ అనుసరించిన వ్యూహాన్ని మార్చి ఇప్పుడు రాజ్‌పుత్‌లపై దృష్టిపెట్టారు. ఎస్‌.పి. ఎం.పి. రాంజీలాల్‌ సుమన్‌ రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మేవార్‌ (రాజస్థాన్‌) రాజ్‌పుట్‌ రాజు రాణా సంగాను ‘‘ద్రోహి’’గా వర్ణించడం ఇందులో భాగమే అనుకోవాలి. దీన్ని ఎస్సీలు, రాజ్‌పుత్‌లకు మధ్య ఉన్న సయోధ్యను చెడగొట్టడానికి చేసే కుట్రగా రాజ్‌పుత్‌ నాయకు లు పరిగణిస్తున్నారు. నిజం చెప్పాలంటే యు.పి.లో ఠాకూర్‌ (రాజ్‌పుత్‌ల్లో ఒక వర్గం)లంటే తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. దీన్ని అనుకూలంగా మలచుకోవడానికే అఖిలేష్‌ యాదవ్‌ ప్ర యత్నిస్తున్నారనుకోవాలి. ఇంతగా ఠాకూర్‌లపై విమర్శలు గుప్పిస్తున్న అఖిలేష్‌ యాదవ్‌, ఆయనతండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ల హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పోస్టుల్లో యాదవ్‌లతో నింపేశారన్న ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి ‘యాదవ్‌ రాజ్‌’ ప్రధాన కారణమన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇదిలావుండగా కులగణన కారణంగా రాష్ట్రంలోని అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు) వారు తమ హక్కులను కోల్పోయామన్నభావనకు లోనుకాకుండా బీజేపీ జాగ్రత్తపడాల్సి వుంటుంది. పార్టీకి ఈ వర్గాల్లో గట్టి పట్టుంది. 

కులగణన వల్ల బీజేపీ తాను సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న ‘హిందుత్వ’ సిద్ధాంతానికి దూరం కావలసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేసే నాయకులు లేకపోలేదు. ఇది శాశ్వతంగాపార్టీని కుల రాజకీయ ఊబిలోకి నెట్టేస్తుందన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణగా వి.పి.సింగ్‌ అమలుచేసిన మండల్‌ కమిషన్‌ నివేదిక ఉదంతాన్ని వివరిస్తున్నారు. ఈ కమిషన్‌ నివేదిక ప్రకారం ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ను వి.పి.సింగ్‌ ప్రభుత్వం అమలుచేసింది. కానీ తర్వాతికాలంలో దీనివల్ల బాగా లాభపడిరది ప్రాంతీయ పార్టీలు మాత్రమే! ఈ నేపథ్యంలో కులగణన వల్ల రాబోయేకాలంలో బీజేపీకి నష్టం కలుగుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది. 

ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన నష్టం నేపథ్యంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హిందూత్వపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ‘విడిపోతే నష్టపోతాం’ అన్న నినాదం హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా పనిచేసి, బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. కుల రాజకీయం అనేది ‘సైద్ధాంతిక పోరాటం లేకుండానే ఓటమి పాలవడం తప్ప మరోటికాదు’ అ న్నది బీజేపీలోని కొందరు నాయకుల అభిప్రాయం. కాంగ్రెస్‌ అనుసరించే కుల రాజకీయాలు బీజేపీకి సరిపోవన్నది వారి దృఢవిశ్వాసం. అసలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం ఎంతవరకుసాధ్యముతుందనేది మరి కొందరు సంధిస్తున్న ప్రశ్న. దేశవ్యాప్తంగా 50వేల కులాలున్నప్పుడు ఎన్ని కేటగిరీలుగా విడగొడతారు? అదీకాకుండా ఒక వ్యక్తి తాను ఫలానా కులానికి చెందినవాడినని చెప్పినప్పుడు ఏవిధంగా దాన్ని నిర్ధారిస్తారు? ఒకవేళ కులగణన సమాచారం ప్రకారం రిజర్వేషన్‌ కోటాను 50శాతం కంటే పెంచుతారా? అనేది మరో ప్రశ్న. ఎస్సీ/ఎస్టీల్లో ఉపకుల వర్గీ కరణ చేయవచ్చని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అయితే ఈవిధమైన వర్గీకరణ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకమని బీజేపీ వాదిస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే కులగణన వల్ల కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. కులరహిత వ్యవస్థకోసం కృషిచేయాలన్న మన నాయకుల ఆశయాలకు ఇది గండికొట్టే అవకాశాలే ఎక్కువ!

చైనా వ్యూహాత్మక చట్రంలో పాకిస్తాన్‌

ప్రతివ్యూహంతో చైనాకు చెక్‌ పెడుతున్న భారత్‌
ఫలితం భారత్‌ నిర్దేశిందిగానే వుంటుంది

ప్రపంచ దేశాలకు భారత్‌ అత్యంత అవసరం

భారత్‌ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు


తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌పై చైనా అక్కసు

యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్‌

భారత్‌ వ్యూహంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి

చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి

చివరకు భారత్‌కు అనుకూలంగానే రానున్న ఫలితం

పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా ఒక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల కొన్ని అ నుబంధ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. పహల్గామ్‌ సంఘటన నేపథ్యంలో భారత్‌ చేపట్టిన ఉగ్రవాదుల ‘ఉత్పత్తి’ కేంద్రాలపై జరిపిన దాడులు విజయవంతం కావడమే కాదు, ప్రపంచానికి భారత్‌ను ఒక కొత్తకోణంలో చూపాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా, పెట్టుబడులకు అనుకూల దేశంగా తనను తాను నిరూపించుకున్న భారత్‌ ఇప్పుడు సీమాంతర ఉ గ్రవాదం పీచమణచడంలో మరే ఇతర దేశం అనుసరించని రీతిలో వ్యవహరించి పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి తన సత్తాలోని ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి చూపింది. ఒక లక్ష్య సాధనలో వ్యవస్థల సమన్వయం ఎంత పకడ్బందీగా వుండాలనేది చెప్పడంలో ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా వ్యవహరించింది. ఆధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధనీతిలో తనకు తిరుగులేదని రుజువుచేసింది. ఇక అసలు విషయానికి వస్తే, కుంచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అప్రతిహతంగా ప్రపంచ మార్కెట్లను శాసించిన చైనా, తనను సవాలు చేసే రీతిలో భారత్‌ ఎదగడం ఎంతమాత్రం తట్టుకోలేక పోతున్నది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధం, యూరప్‌ సహా ఇతర దేశాల మార్కెట్లలో ప్రవేశం క్రమంగా కుం చించుకు పోతున్న తరుణంలో, తన మార్కెట్‌ను క్రమంగా ఆక్రమిస్తున్న భారత్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా విచిత్ర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కోపంతో మనపై దాడి చేయలేదు, అట్లాగని అక్కున చేర్చుకోలేదు, ఇదే సమయంలో విస్మరించనూ లేదు. విరోధాభాసలాంటి ఈ పరిస్థితిని అధిగమించి భారత్‌పై కక్ష తీర్చుకోవాలంటే దానికి వున్న మార్గం పాకిస్తాన్‌! తాను ఏది చేయాలనుకున్నా పాక్‌ ద్వారానే సాధించడానికి ప్రయత్నిస్తుంది. ‘డ్రాగన్‌’ ఈ జిత్తులమారితనానికి ‘ఏనుగు’ (భారత్‌) రెచ్చిపోవడంలేదు. ఆగ్రహంతో ఊగిపోవడంలేదు కూడా. కానీ ఒక పద్ధతి ప్రకారం తనదైన వ్యవహారశైలితో నిశ్శబ్దంగా పనిచేసుకొని పోతూ, క్రమంగా ఎక్కడికక్కడ ‘నట్లు’ బిగించుకుంటూ వూపిరి ఆడకుండా చేస్తున్నది. దీన్ని ‘డ్రాగన్‌’, ‘ఏనుగు’ అనే దిగ్గజ ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న ‘ప్రచ్ఛన్న’ పోరాటం అనుకోవచ్చు.
పాక్‌ దుస్సాహసం వెనుక ‘అండ’
పహల్గాం సంఘటన వెనుక పాకిస్తాన్‌ హస్తమున్నదనేది తిరుగులేని సత్యం. అమాయకులైన ప ర్యాటకులను దారుణంగా చంపేయడం ద్వారా భారత ప్రభుత్వాన్ని, ప్రజలను రెచ్చగొట్టాలన్నది దాని ఉద్దేశం. అయితే ఇక్కడ పాక్‌ ఆశించిన స్థాయిలో ఉగ్రవాదులు వ్యవహరించలేకపోయారు. మరి పాకిస్తాన్‌ ఇటువంటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టిందనేది సహజంగా ఉదయించే ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గతంలో చేపట్టిన ఉగ్రవాద చర్యలకు ప్రతిక్రియ ఏవిధంగా ఉన్నదీ పాకిస్తాన్‌కు అనుభవైకమే. మళ్లీ ఇటువంటి దుస్సాహసానికి పాల్పడితే పరిస్థితి దారుణంగా వుంటుందనేది కూడా పాక్‌కు తెలియంది కాదు. దేశంలో అల్లకల్లోలం చెలరేగుతున్నప్పుడు నియంతలు, సైనిక పాలకులు సాధారణంగా బాహ్య శత్రువును చూపి దేశాన్ని ఐక్యంగా వుంచ డానికి యత్నిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ కూడా అదే చేసి ప్రజల దృష్టిని మరల్చాలనుకున్న వ్యూ హం బూమరాంగ్‌ అయింది. మోదీ ప్రభుత్వం ఇంతటి తీవ్రస్థాయిలో స్పందిస్తుందని బహుశా ఊహించి వుండకపోవచ్చు. ఈ ప్రతిక్రియను తట్టుకునే ఆర్థిక సామర్థ్యం పాక్‌కు లేదు. సైనిక సామర్థ్యం అంతకంటే లేవు. అయినప్పటికీ కొరివితో తలగోక్కోవడానికి సిద్ధపడిరదంటే దానికి ఏదో ఒకరకమైన మద్దతు కచ్చితంగా వున్నట్టే! అదే చైనా!
చైనాభారత్‌ సంబంధాల్లో సందిగ్ధత
2020లో గల్వాన్‌ సంఘటన తర్వాత భారత్‌ాచైనాల మధ్య దారుణంగా దెబ్బతిన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడిప్పుడే గాట్లో పడుతున్నాయి. అమెరికాతో వాణిజ్య వైరం కూడా చైనాను దిగొచ్చే లా చేసింది. మానససరోవర యాత్ర తిరిగి ప్రారంభం, దౌత్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. పైకి సజావుగా, అంతా ప్రశాంతంగా సాగిపోతున్నట్టు కనిపిస్తున్నా, చైనా హృదయాంతరాళాల్లో ఎక్కడో వ్యక్తం చేయలేని భయంతో కూడిన ఆందోళన! వేగంగా ఎదుగుతున్న భారత్‌ ముందు ఇక ఎంతోకాలం తన ఆధిపత్యం నిలవదన్న సత్యం దాని మెదడును తొలిచేస్తోంది. మరోవైపు భారత్‌ను నిరోధించలేదు అట్లాగని విస్మరించనూ లేదు. ఇదొక విచిత్ర సందిగ్ధ పరిస్థితి! నిజం చెప్పాలంటే 21వ శతాబ్దంలో భారత్‌ాచైనాల మధ్య ఎంతమాత్రం పొంతన లేని దశ కొనసాగింది. చైనా ఒక స్థాయికి చేరుకోగా, భారత్‌ ఇంకా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తూనే వుంది. 2010 తర్వాత మౌలికసదుపాయాలు, సాంకేతికరంగం మరియు వాణిజ్య రంగాల్లో భారత్‌ను పూర్తిగా వెనక్కు నెట్టేసింది. ఇక భారత్‌ను ప ట్టించుకోవాల్సిన అవసరం లేదనకుంటున్న తరుణంలో 2017లో డోక్లాం సంఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. భారత సైన్యం ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిలబడేసరికి, చైనా వెనక్కు త గ్గాల్సి వచ్చింది. 2020లో జరిగిన గల్వాన్‌ సంఘనలో భారత్‌ తన కార్యశీలతను రాజకీయ దృఢత్వాన్ని విస్పష్టంగా ప్రదర్శించడం చైనాను కలవర పరచింది. ఆ తర్వాత కోవిడ్‌ మహమ్మారి ఒక్కసారి విజృంభించడంతో చైనాతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలి పోయా యి. ఈ అఘాతం నుంచి భారత్‌ చాలా వేగంగా బయటపడగా, చైనా తన చురుకుదనాన్ని కో ల్పోయి వెనుకబడిరది. ముఖ్యంగా ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోగా, ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనం చేసింది. మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవడం, రుణ సంక్షోభం చైనాను అతలాకుతలం చేశాయి. అప్పటివరకు భారత్‌ను తనతో సరిసమాన దేశంగా చైనా ఎప్పుడూ పరిగణించలేదు. కేవలం ప్రాంతీయ శక్తి స్థాయికే పరిమితం చేసి తాను గ్లోబల్‌ స్థాయికి ఎదగడానికి అమెరికాతో పోటీపడటం మొదలుపెట్టింది. కానీ అమెరికాతో పోటీపడాలన్న ఆకాంక్ష మాట అట్లా వుంచి, భారత్‌ వేగంగా పుంజుకొనడంతో, ప్రపంచ యవనికపై భారత్‌ాచైనాలను సరిసమానంగా చూడటం మొదలైంది. 2025లో ట్రంప్‌ హయాం వచ్చిన త ర్వాత వాణిజ్య యుద్ధం మొదలుకావడంతో చైనా పరిస్థితి మరింత తల్లక్రిందులైంది. ఈ వాణిజ్య యుద్ధంలో రెండుదేశాలు నష్టపోయినప్పటికీ, దెబ్బ అధికంగా తగిలింది చైనాకే! మొత్తం వాణిజ్య సరఫరా శృంఖలాలు దెబ్బతినడం, దేశంలో ఉత్పత్తుల నిల్వలు అమాంతం పెరిగిపోవడం,మార్కెట్ల కొరతతో చైనా ఆర్థికంగా అతలాకుతలమైంది.
ప్రత్యామ్నాయంగా భారత్‌
ప్రతి లావాదేవీలో తనకు లాభం లేకుండా అడుగు ముందుకేయని అమెరికా, ఈ వాణిజ్యయు ద్ధంలో ముందుకే వెళ్లడానికి ప్రధాన కారణం భారత్‌ ప్రత్యామ్నాయంగా కనబడటం! అమెరికా వ్యూహాత్మక అవసరాలు తీర్చే స్థితిలో భారత్‌ వుండటంతో, చైనాపై ఒత్తిడి పెరిగింది. భారత్‌కు వాణిజ్యపరంగా విస్తృతమవుతున్న సరఫరా శృంఖల వ్యవస్థ, భౌగోళిక సమతుల్యతను సాధించ డం వంటి అంశాలను చైనా మీడియా సంస్థలు క్రమంగా గుర్తించడం మొదలైంది. కేవలం భారత్‌ వుండటం వల్లనే అమెరికా తనను ఒక చట్రంలో బిగించగలుగుతోందన్న సత్యం కూడా చైనాకు అర్థమవసాగింది. ఈ నేపథ్యంలో తనకు పొరుగునే వుంటూ, తన ఆధిపత్యాన్ని సవాలు చే స్తూ, గ్లోబల్‌ పవర్‌గా ఎదుగుతున్న భారత్‌ ఒక పెద్ద సవాలుగా మారింది. దీన్ని ఏదోవిధంగా కట్టడి చేయకపోతే నిండా మునగడం ఖాయమన్నది కూడా అవగతమైంది.
1980 దశకంలో చైనా ఎదుగుదలకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్యదేశాలు ఎంతగానో స హకరించాయి. కానీ భారత్‌ పరిస్థితి అదికాదు. తాను పశ్చిమదేశాల ప్రభావానికి లోనుకాకుండాస్వతంత్రంగా, తన సొంత పంథాలో ముందుకెళుతూ ఎదుగుతోంది. స్వతంత్రంగా ఎదుగుతున్నభారత్‌ను కట్టడిచేయడం చైనాకు సాధ్యంకాని పని! ఒకవేళ అట్లా చేయాలనుకుంటే భారత్‌`యుఎస్‌లు మరింత సన్నిహతమవుతాయి. సైనికంగా బెదిరిద్దామను కుంటే, డోక్లామ్‌, గల్వాన్‌ సం ఘటనలు చైనాకు తన పరిమితేంటో స్పష్టం చేశాయి. మరో సంఘర్షనకు దిగడమంటే ఆత్మహ త్యా సదృశమేనన్న సంగతి చైనాకు బాగా తెలుసు.
భారత్‌ సహకారం తప్పనిసరి
ఈ నేపథ్యంలో అమెరికాను పక్కనబెట్టే విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను నిర్మిస్తే ప్రస్తుత దుస్థితినుంచి బయటపడవచ్చు. అందుకు బ్రిక్స్‌ వంటి వేదికలు అవసరం. ఈ వేదికను ఉపయోగించుకొని బ్రిక్స్‌కు ప్రత్యేక కరెన్సీ రూపకల్పన, డాలర్‌కు ప్రత్యామ్నాయ చెల్లింపుల వి ధానాన్ని అమల్లోకి తేవడం వంటి ప్రక్రియలు చేపట్టాలి. ఇందుకు మళ్లీ భారత్‌ సహకారం తప్పనిసరి. ఇండియా ముందుకు రాకపోతే చైనా వ్యూహాలు చెత్తబుట్టలోకి వెళ్లిపోతాయి. ఎందుకంటే వాణిజ్యపరంగా భారత్‌ లేకుండా, యు.ఎస్‌.కు ప్రత్యామ్నాయంగా అనుసరించే మార్గాలను ప్రపంచం విశ్వసించదు. రష్యాకు ఇది బాగా అర్థమైంది. చైనాకు తెలిసొచ్చింది. అయినప్పటికీ చై నాలోని అహంకారం భారత్‌ ఎదుగుదలను అడ్డుకోవాలనే కోరుతుంది. ఇందుకోసం కొంత రిస్క్‌ను భరించడానికి కూడా సిద్ధమే! వేగంగా ఎదుగుతున్న భారత్‌ తనకు పెను సవాలుగా మారక తప్పదు. అట్లాగని పశ్చిమదేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని నిరోధించాలంటే భారత్‌ సహాయం తప్పదు! అందువల్లనే మనదేశంపై దాడిచేయలేదు, అట్లాగని కౌగిలించుకోనూ లేదు, ఇదేసమయంలో విస్మరించడం అసలు సాధ్యమూ కాదు. ఈ విచిత్రపరిస్థితి నేపథ్యంలోనే తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన పాకిస్తాన్‌ను పావుగా ఉపయోగించుకొని భారత్‌ను దెబ్బకొట్టే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
పహల్గాం సంఘటనలో పాక్‌కు మద్దతు
వ్యూహాత్మకంగా ఇటువంటి జటిల పరిస్థితిలో, పాకిస్తాన్‌ను ఒక ఉపకరణంగా వాడుకునే సాను కూలత చైనాకు లభించింది. పహల్గాం సంఘటనలో పాకిస్తాన్‌కు కేవలం మద్దతివ్వడమే కాదు, మనదేశంలోకి పాక్‌ చొరబాట్లకు గట్టి మద్దతునిస్తోంది. పహల్గామ్‌ దాడిలో ఉగ్రవాదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు తేలింది. ముఖ్యంగా హువావే ఉపగ్రహ ఫోన్లు, చైనాకు చెందిన అత్యాధునిక ‘ఆల్ట్రాసెట్‌ ఎన్‌క్రిప్షన్‌ టెక్నాలజీ’ ఈ ఉగ్రవాదులకు అందు బాటులోకి రావడం గమనార్హం. ఈ సాంకేతిక పరిజ్ఞానం తమను గుర్తించకుండా సహాయపడు తుంది. ఈ ప్రత్యేక ఉపకరణాలను చైనా కంపెనీలు తయారుచేశాయి. వీటిని పాక్‌ సైన్యం ఉపయోగిస్తుంటుంది. ఇవి సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ స్టేషన్‌ల ఫ్రీక్వెన్సీకి అను సంధానమై పనిచేస్తుంటాయి. వీటి సహాయంతో కుదించిన సమాచారాన్ని చైనా ఉపగ్రహాల ద్వారా పాకిస్తాన్‌కు అందజేస్తుంటారు. కేవలం సైన్యానికి పరిమితమయ్యే ఈ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానం, కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే మిలిటెంట్ల చేతికి రావడం చైనా అధికార్లకు తెలియదంటే అంతకంటే అమాయకత్వం మరోటుండదు. దౌత్యపరంగా పాకిస్తాన్‌కు పూర్తిస్థాయి మద్దతునిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాక్‌ మిలిటెంట్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించనీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. అంతేకాదు పహల్గాం సంఘటనకు పాక్‌ మిలిటరీకి సంబంధమున్నదన్న సంగతి స్పష్టమైనా, పాకిస్తాన్‌ చెబుతున్న ‘నిష్పాక్షిక విచారణ’కు మద్దతివ్వడం గమనార్హం. అంతకంటే మరో ముఖ్య విషయమేంటంటే, పాకిస్తాన్‌ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే తాము అండగా నిలుస్తామని చైనా వ్యూహకర్త విక్టర్‌ గావో పేర్కొనడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
యుద్ధం కోరుకుంటున్న దేశాలు
నిజం చెప్పాలంటే ప్రంపంచంలోని ప్రతి బలీయమైన దేశం పైకి ఎన్ని మాటలు చెప్పినా అంతర్గతంగా భారత్‌`పాక్‌ల మధ్య యుద్ధం రావాలనే కోరుకుంటున్నాయి. ఈయుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయి, ప్రపంచంలో భారత్‌`పాకిస్తాన్‌ అనే స్థాయికి దిగజారాలన్నది చైనా కోరిక! ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌ను తనతో సమానంగా పరిగణించడం చైనాకు ఎంతమాత్రం ఇష్టంలేదు. పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే, భారత్‌ తనతో బేరసారాలాడే బలీయతను కోల్పోయి, కాళ్లబేరానికి వస్తుందన్నది అమెరికా అంచనా. ఇక రష్యా విషయానికి వస్తే ఇప్పటికే యుక్రెయిన్‌ యుద్ధంలో ఏకాకిగా మారిన తాను, ప్రస్తుతం భారత్‌కు నమ్మకమైన మిత్రుడుగా కొనసాగుతు న్నప్పటికీ మరో భౌగోళిక రాజకీయ సంక్షోభంలోకి తలదూర్చి మరింత ఒంటరి కావడానికి ఇష్ట పడటం లేదు. ఇక పాకిస్తాన్‌కు ఇప్పుడు యుద్ధం అత్యవసరం. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రిగ్గర్‌ను నొక్కేసింది. పదేపదే భారత్‌ను రెచ్చగొడుతోంది. యుద్ధం వస్తేనే తనకు మద్దతిస్తామ న్న దేశాలనుంచి ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతుంది. కానీ ఎక్కడెక్కడో ఉన్న సైన్యాన్ని సరి హద్దులకు తరలించడం దానికి తలకు మించిన భారంగా మారింది. భారత్‌ ఆలస్యం చేసినకొద్దీ,తరలించిన సైన్యం యుద్ధసన్నద్ధత నిర్వహణకు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్‌ మరింత దిగజారే పరిస్థితి ఏర్పడక మానదు. ఆవిధంగా ఒక్క బుల్లెట్‌ కూడా పేల్చకుండా పాక్‌ ‘రక్తమోడక’ తప్పదు. భారత్‌ను ‘వెయ్యి గాయాలతో రక్త మోడిస్తాం’ అని ప్రతిజ్ఞ చేసిన పాక్‌ ఇప్పుడు తాను అదే దుస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకనే పాకిస్తాన్‌ ప్రతి చిన్న విషయానికి భారత్‌ సహనాన్ని పరీక్షించే రీతిలో రెచ్చగొడుతోంది.
భారత్‌ను తక్కువగా అంచనా వేస్తున్న ప్రపంచం
నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలు భారత్‌ అనుసరించే భౌగోళిక రాజకీయాన్ని చాలా తక్కువగాఅంచనా వేస్తున్నాయి. రష్యా`చైనా ఒకవైపు, పశ్చిమ దేశాలను మరోవైపు ఏ కారణం లేకుండా నే మనదేశం అయోమయంలో వుంచుతుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. బ్రిక్స్‌ నుంచి క్వాడ్‌ వరకు భారత్‌ సభ్యురాలే అన్న విషయం మరచిపోకూడదు. అన్ని భౌగోళిక రాజకీయ కూటముల్లో భారత్‌ భాగస్వామి. అందువల్ల ఏ దేశమూ భారత్‌ లేకుండా ముందడుగు వేయడంసాధ్యంకాదు. అట్లాగని ఏకాకినీ చేయలేవు. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌ రెండంచుల కత్తిపై చిన్న గాయం కాకుండా నడిచే రీతిలో దౌత్యాన్ని కొనసాగిస్తోంది. భారత్‌ వేసే ప్రతి అడుగులో భావావేశం వుండదు, కేవలం ఒక పద్ధతిప్రకారం, వ్యూహాత్మకత మాత్రమే వుంటుంది. పాకిస్తాన్‌పై నీటి ఒత్తిడిని క్రమంగా పెంచుతూ వచ్చింది. 2016 నుంచి సింధూనది ఉపనదులపై భారత్‌ డ్యామ్‌లు నిర్మిస్తూ వస్తున్న సంగతి కొందరికే తెలుసు. ఇప్పుడు ఈ నీటిపై ఆధిపత్యం సాధించడం ద్వారా, పాక్‌లో వ్యవసాయాన్ని, విద్యుత్‌ను, ఆహార భద్రతను నియంత్రించవచ్చు. ఇదే సమయంలో భారత సైన్యం ఫార్వర్డ్‌ పోస్టుల్లో కొనసాగుతాయి. దీని వల్ల పాక్‌ సైన్యం అనుక్షణం అప్రమత్తంగా వుండాలి. ఇది దానికి ఆర్థిక భారం! ఇదేసమయంలో భారత దౌత్యప్రతినిధులు తమపని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ దేశాల ఒత్తిడి కేవలం పాకిస్తాన్‌పై మాత్రమే కాదు దాని మద్దతుదార్లపై కూడా బాగా పెరిగిపోయింది. ఇక చైనా విషయానికి వస్తే, ఇప్పటికే పన్నుల యుద్ధంలో కుదైలైన ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో, ఈ పాకిస్తాన్‌ ‘వ్యూహాత్మక భారాన్ని’ మోసే పరిస్థితిలో లేదు. ఇది మరింతకాలం కొనసాగితే చైనా పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇప్పటికే యూరప్‌, అమెరికా, రష్యాల్లో జాతీయవాద భావాలు పెరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సరిహద్దుల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యవస్థపై కూడా భారత్‌ తన ముట్టడిని కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌పై సైనిక చర్య వుండవచ్చు. ఎన్నో భారమైన నిద్రలేని రాత్రులు గడిచిన తర్వాత, నీ రు`ఆహారం కొరత ఏర్పడినప్పుడు, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న తర్వాత, నిరంతరం సైనికుల తరలింపు వల్ల సైన్యం బలహీనమైనప్పుడు దాని నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడుభారత్‌ చేసే దాడి తీవ్రతను అంచనా వేయడానికుండదు. పాకిస్తాన్‌ను ఒక పేపర్‌ మాదిరిగా మడత పెట్టేస్తుంది. అప్పుడు ప్రపంచానికి తామకు కావలసింది లభిస్తుంది. కానీ అది భారత్‌ నిర్దే శించిన పరిధిలో మాత్రమే వుంటుంది!

నలిగిపోతున్నారు..నానా కష్టాలు పడుతున్నారు!

నలిగిపోతున్నారు..నానా కష్టాలు పడుతున్నారు!

`మధ్య తరగతి జనం కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు

`కడుపారా ఏడ్వలేరు..పది మంది ముందు పలుచన కాలేదు

`కడుపు కాలుతున్న, కడుపు నిండా తిన్నామని చెప్పుకుంటారు

`పస్తులున్నా ఆకలి కేకలు వేయలేరు

`బతకలేక చితికిపోతున్నారు

`బతికిండగానే నరకం చూస్తున్నారు

`కిరాయికి వుండలేరు…సొంతిళ్లు కట్టుకోలేరు

`పల్లెల్లో పని లేదు, పట్నంలో కూలి సరిపోదు

`వచ్చిన ఆదాయం ఏ మూలకు సరిపోదు

`ఎంత ఖర్చు చేసినా కాళ్లు వారసాపుకునేంత ఇల్లు దొరకదు

`బతకలేం బాబోయ్‌ అంటున్న మధ్యతరగతి

`అటు ధరలు, ఇటు పన్నలు

`సంపాదన మూరెడు..ఖర్చు బారెడు

`నెలనెల అప్పులు…నెలాఖరున పస్తులు

`బైటకు చెప్పుకోలేక మధ్య తరగతి అవస్థలు

`పరువు కోసం పాకులాట…బతుదెరువు చాలక యాతన

`సంపాదన నెలల మధ్యలోనే హరతి కర్పూరం

`ఎంత పొదుపు చేద్దామనుకున్నా చాలీచాలని వేతనం.

`పని చేస్తేగాని పూట గడవదు

`ఈ రోజు సంపాదనలో రూపాయి రేపటికి మిగలదు

`మధ్య తరగతి సమస్యలు పార్టీలకు పట్టవు

`పాలకులకు అసలే పట్టవు. పేదల బతుకులు మారవు

`పెరుగుతున్న ధరలు…నెలాఖరున అప్పులు

`సగటు వ్యక్తి వీపు మీద మోయలేని భారాలు

 పేదోడి బతుకులు పెరగవు. పెద్దోడి బతుకులు తరగవు. మధ్య నలిగిపోయేది మధ్య తరగతి వాడే..కష్టాలు, నష్టాలు మోసేది ఆ మిడిల్‌ క్లాస్‌ వాడే అని పెద్దలన్నారు. అందుకే మధ్య తరగతి ప్రజలు ఎప్పుడూ నానా కష్టాలు పడుతూనే వుంటారు. కష్టాలన్నీ ఎదుర్కొంటూనే వుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా పేదోడు దేవుడి మీద భారం అనుకుంటాడు. పెద్దోడు నాకేం తక్కువ. అని ఎదుర్కొంటాడు. కాని మధ్య తరగతి వాడే దేవుడి మీద భారం వేయలేదు. ఎదుర్కొనేందుకు ధైర్యం చేయడు. ఎవరికీ చెప్పుకోలేక సతమతమౌతుంటాడు. కష్టాలు తీరే రోజులు రాకపోతాయా? అని ఎదురుచూస్తుంటాడు. ఆశాజీవిగా బతుకుతుంటాడు. కాని ఎదుగుదల లేకపోగా, కుంచించుకుపోయే జీవితాలను చూసుకుంటూ కుమిలిపోతుంటాడు. తన జీవితాన్ని తానే ప్రశ్నించుకోలేడు. తనను తాను సముదాయించుకోలేడు. ఎందుకొచ్చిన కష్టం రా అని కలత చెందుతూనే వుంటాడు. ఉన్నదాంట్లోనైనా సంతృప్తి పడదామనుకుంటే తరిగిపోతున్న వయసు, చాలీ చాలని సంపాదనతో మరింత వేధనకు గురౌతుంటాడు. అదీ మధ్య తరగతి బతుకు. అయితే గతంలో మధ్య తరగతి వాడిని చీకు చింతలేని బతుకులు అనుకునేవారు. ఉన్నదానితో సంతృప్తిపడుతూ జీవించే వేతన, జీవులు కష్ట జీవులు అని అనుకునేవారు. ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా ఎప్పుడూ ఒకేలా వుండే జీవితాలు అని సమాజం కూడా మధ్య తరగతి ప్రశంసిస్తూ వుండేది. చీకు చింత లేని జీవులుగా మాట్లాడుకునేవారు. అటు సంపాదన చాలడం లేదనో, ఇటు పొదుపుతో రూపాయి చేతిలో వుందన్న ఆనందం మధ్య తరగతి ప్రజలకు వుండేది. కాని ఇప్పుడు ఆ కాలం పోయింది. మధ్య తరగతి వాడు చితికిపోవడమే కాదు, ఉతికి ఆరేబడుతున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుంటూ బతుకుతున్నాడు. అవి కూడా పక్కవాడికి కనిపించకుండా చూసుకుంటున్నాడు. పైకి గంభీరంగా బతుకుతున్నా, లోలోన కుతకులలాడుకుంటూ బతుకుతున్నాడు. ఒక రకంగా నిత్యం ఆలోచనలతో, వేదించే సమస్యలతో రోగాల పుట్ట కూడా అవుతున్నాడు. అన్ని రకాలుగా దేశాన్ని సాదుతున్నాడు. తాను ఆవిరైపోతున్నాడు. ఆకలి ఎంత దహిసున్నా కడుపులో తల పెట్టుకోలేదు. లోపలిబాధలు పైకి కనిపించుకోనివ్వడు. పది మందిలో వున్నా సంతోషంగా వుండలేదు. ఒంటరిగా వుండి నిలబడలేదు. ఏ రకంగా చూసినా మధ్య తరగతి వాడు నేను ఒక మనిషినే అన్న విషయాన్ని రోజు రోజుకూ మర్చిపోతున్నాడు. తన బాధలను చూసి కడుపార ఏడ్వలేడు. పది మంది ముందు పలుచన కాలేదు. కడుపు చింపుకుంటే తన కాళ్ల మీదే పడుతుందని తెలిసిన ఆకలి మేదావి మధ్య తరగతి వాడు. తానే కాదు, తన కుటుంబ సభ్యుల కష్టాలన్నీ ఒక్కడే మోసే వాడు. ఎంతటి విపత్కరమైన పరిసి ్దతులైనా సరే తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా కడుపులో దాచుకుంటాడు. ఏ ప్రశ్నకు సమాదానం చెప్పలేని వాడు. ఎవరినీ నిందించలేని వాడు. కడుపు కాలుతున్నా ఏడుపును ఆపుకుంటూ, ఆనందాన్ని నటించగల గొప్ప ఆశాజీవి మధ్య తరతగి వాడు. రోజుల తరబడి ఆకలి కేకలు కడుపులో వినిపిస్తున్నా, సముదాయించుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బతకలేకి చితికిపోతున్నాడు. బతికుండగానే చితికిపోయే పరిస్దితుల్లో మగ్గిపోతున్నాడు. బతికుండగానే నిత్య నరకం చూస్తున్నాడు. ఎందుకు పుట్టించావు దేవుడా అని ఏడుస్తాడే గాని, దేవుడిని కూడా నిందించలేడు. పాపఖర్మల ఫలితమేమే అనుకుంటూ బతుకులీడుస్తుంటాడు. కాలం పరుగెత్తున్నంత వేగంగా పరుగెత్తలేక, అలసిపోతున్నాడు. ఆగమౌతున్నాడు. సమాజాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోతున్నాడు. పల్లెల్లో బతకలేడు. అక్కడ గుంట జాగ వున్నా చూసుకొని మురిసిపోయేవాడు. కాని పల్లె లో కూడా గూడు లేక విలవిలలాడుతున్నాడు. పల్లె పొమ్మంటే పట్నం చేరి నానా కష్టాలు పడుతున్నాడు. గతంలో పల్లెల్లో కూడా మధ్యతరగతి వాడు ఎంతో హుందాగా బతికేవాడు. వృత్తిపనులు చేసుకుంటూ కాలం గడుపుకునేవాడు. కాని ఇప్పుడు రైతుకు తప్ప పల్లెలో వృత్తిదారులకు భూములులేవు. కనీసం నిలువ నీడ లేదు. దాంతో ఎటు పోతున్నామో తెలియని అమోయమంలో పడి బతుకులీడుస్తున్నాడు. చాలీ చాలని జీతాలు. వచ్చే ఆ సంపాదనలో అన్నీ సర్ధుకోవాలి. ఆకలి పస్తులను బందువులను చేసుకోవాలి. కిరాయికి వుండలేదు. అది హైదరాబాద్‌ లాంటి నగరమే కాదు, జిల్లా కేంద్రాలైనా, చిన్న చిన్న పట్టణాలైనా సరే ఆకాశాన్నంటున్న కిరాయిలే సగం సంపాదనను ఊడ్చుకుపోతున్నాయి. మధ్య తరగతి వాడికి గతంలో పల్లెల్లో వున్న పని ఇప్పుడు లేదు. కమ్మరి చేసే కుండలు ఎవరూ కొనడంలేదు. చాకలి చేత ఇస్త్రీలు చేయించుకోవడం లేదు. పద్మశాలీల మగ్గం పని చేయడం లేదు. మేర వారి మిషన్‌ తిరగడం లేదు. కమ్మరి కొలిమి ఎప్పుడో పాడుపడి పోయింది. వడ్రంగి పనులు చేసుకునేవారు లేరు. ఏ వృత్తి బతికిలేదు. అక్కడక్కడ వున్నా బతకు సాగడం లేదు. దాంతో పట్నం చేరి గొడ్డు చాకిరి చేసినా సంపాదన అంతంత మాత్రమే అవుతోంది. నగరాల్లో ఖర్చు సంపాదనను వెక్కిరిస్తోంది. ఎందుకంటే మధ్యతరగతి వాడు కూలీ చేయలేదు. పార పట్టలేడు. బస్తాలు మోయలేదు. అంతో ఇంతో చదువున్న చదువుతో జీతం తక్కువైనా పరపతి తగ్గొద్దనుకుంటాడు. అదే మధ్య తరగతికి ఉరిని మిగిల్చుతోంది. దాంతో వచ్చిన ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు. సగం ఇంటి బాడుగ మింగేస్తోంది. మిగతా సగం పిల్లల చదువుకు ఊడ్చుకుపోతోంది. మిగిలిని ఆ కాస్త నెలంతా సరిపోక ఆకలి తిష్టవేసి వేపుకుతింటోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో మధ్యతరగతి వాడి జీతం మొత్తం చెల్లించినా, కాళ్లువారసాపుకునేంత ఇల్లు దొరకదు. పెద్దింట్లో కిరాయికి వుండలేడు. దాంతో బతకలేంబాబోయ్‌ అంటూ రోదిస్తున్నాడు. చాలీచాలని జీతాలతో పెరుగుతున్న ధరలను తట్టుకోలేడు. కారం మెతుకులు తినలేడు. ఉన్నదానిలో సంతృప్తిగా తినకుండా వుండలేదు. తనను తాను పోషించుకోలేకోయినా, సంపాదనంతా ఖర్చు చేస్తూ దేశాన్ని సాదుతున్నాడు. దేశానికి పన్నుల మీద పన్నులు కడుతున్నాడు. తన నడుములు విరగ్గొట్టుకుంటున్నాడు. వీపు మీద పన్నులు విమానం మోత మోగిస్తున్నా భరిస్తున్నాడు. ఎందుకంటే మధ్య తరగతి వాడి సంపాద ఎటు కొలిచినా మూరడే వుంటుంది. జీతం వచ్చాక నోట్లను ఎన్ని సార్లు లెక్కించినా ఒక్కరూపాయి పెరగదు. రూపాjైునా పేరుగదా? అని పలు సార్లు లెక్కించుకునే మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ వున్నారు. ఆ ఆశతో బతుకుతున్నారు. పరువు తప్ప దేనిని లెక్కచేయడు. పరువు కోసం పాకులాడుతుంటాడు. ఐన వారు ఎవరొచ్చినా కష్టపడుతున్నానని చెప్పుకోడు. కష్టం గురించి పది మందితో పంచుకోడు. అంతెందుకు తను పడే వేధన , యాతన ఇంట్లో వారికి కూడా చెప్పుకోడు. కుటుంబ సభ్యులు ఏ కోరిక కోరినా చూద్దాం అంటారే గాని, లేదని ఎప్పుడూ చెప్పడు. అదీ మధ్య తరగతి మనస్తత్వం. తన నెల సంపాదన నెల మధ్యలోనే హరతి కర్పూరమౌతున్నా బతుకుపై భరోసాతో సాగుతుంటాడు. వచ్చే నెల బాగుంటుందేమో అని ఆశపడుతూ బతుకుతుంటాడు. చాలీ చాలని వేతనమైనా సరే..ఎలా వున్నారంటే అంతా బాగున్నామనే చెబుతుంటాడు. నిత్యం పని చేస్తేగాని పూట గడవదు. రోజు సంపాదనలో ఇంటికి చేరే సరికి రూపాయి మిగలదు. తెల్లారి జేబు చూసుకుంటే చిల్లి గవ్వ కనిపించదు. మధ్య తరగతి ప్రజల సమస్యలు పాలకులకు పట్టవు. రాజకీయ పార్టీలకు అర్దంకావు. పెరుగుతున్న ధరలు, నెలాఖరున అప్పులు మధ్య తరగతికి అవే ఆస్ధులు. చెప్పుకునేందుకు గొప్పలు. నవ్వుతూ బతకాలిరా..తమ్ముడూ అని పాట పాడుకుంటూ సాగలేదు. పేద వాడి పాట వింటూ నిలబడలేదు. పెద్ద వాడు కారులో పోతూ వింటున్న పాట పూర్తిగా వినిపించక పరుగెత్తైనా వినాలననుకుంటాడు. శక్తి చాలదని ఉసూరు మంటాడు. నిత్యం సమస్యల మంటల్లో మాడి మసైపోతున్నా, మళ్లీ తెల్లవారి ఫెయిర్‌ అండ్‌ లౌలీ పెట్టుకొని అద్దంలో ముఖం చూసుకొని సంబరపడతాడు. అదీ మధ్యతరగతి వాడు..ఆశల తోరణానికి వారసుడు. ఎండిపోయిన మామిడాలు వచ్చే పండుగ దాకా తీసేయ, మళ్లీ పండగెప్పుడు వస్తుందా? అని ఎదరుచూస్తుంటాడు…ఆ ఒక్క రోజైనా పండుగ చేసుకుంటున్నానని సంబరపడిపోతుంటాడు.

‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

 

-ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌!

-ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌!

-పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం.

-భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం.
-దేశమంతా మన సైనికులకు సలామ్‌.

 

-జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది.

-పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం.

-మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి.

-100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.

-26 ఉగ్రస్థావరాలు గుర్తింపు.

-పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది.

-ఇప్పుడే మొదలైంది…ఇక పాకిస్తాన్‌కు మూడిరది.

-ఉగ్రవాద స్థావరాలపై అర్థరాత్రి మొదలైన భారత్‌ దాడులు.

-25 నిమిషాలలో ఆపరేషన్‌ పూర్తయ్యింది.

-9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

-అంతర్జాతీయంగా పాక్‌ ఇప్పుడు ఏకాకి!

-పాక్‌కు మిగిలేది ఇక భవిష్యత్తు కాళరాత్రి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇండియా అంటేనే శాంతి సందేశం. శాంతికి నిలయం. పరహితం. పరోపకారం. ప్రపంచశాంతిని కోరుకునే దేశం. అలాంటి మన దేశం మీద ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతకడమే పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. దేశం విడిపోయిన నాటి నుంచి ఏదో ఒక రకంగా గిచ్చి కయ్యం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నది. ఇప్పటికి నాలుగు సార్లు జరిగిన యుద్దంలో ఓడిపోయినా ఆ పాకిస్తాన్‌కు బుద్ది రావడం లేదు. 1972లో ఏకంగా 90 వేల మంది పాకిస్తాన్‌ సైనికులు లొంగిపోయి, యుద్దంలో ఓడిపోయారు. అయినా ఆ దేశానికి సోయి రావడం లేదు. ఎన్ని సార్లు ఆ దేశం పీచమణిచినా మారడం లేదు. తినడానికి తిండికి దిక్కులేకపోయినా సరే, మనతో యుద్ధం కోరుకుంటూ పతనం అంచుల్లో వున్నా దాని బుద్ది మారడం లేదు. మన దేశంలో ఎన్ని కవ్వింపులు చేసినా క్షమిస్తూ పోతూనే వున్నాం. పైగా ఆ దేశంలో విపత్కర పరిస్ధితులు ఎదురైన ప్రతిసారి సాయం చేస్తూ ఆదుకుంటూనే వున్నాం. అయినా ఆ దేశానికి కృతజ్ఞతలేదు. ఎన్నొసార్లు భూకంపాలు వచ్చిన పాకిస్తాన్‌ అతలా కుతలమైపోయిన సందర్భాలలో ఆదుకుంటూ వచ్చాం. ఇప్పటికీ నిత్యం గోదుమ పిండి పంపకపోతే , తిండికి దిక్కులేకపోయినా, మన తిండి తింటూ మన దేశంపైనే ప్రతికారం కోరుకుంటుంది. అలాంటి దేశానికి ఇక బుద్ది చెప్పే తరుణం ఆసన్నమైంది. ఇక పాకిస్తాన్‌ను కోలుకోకుండా, తేరుకోకుండా చేస్తే తప్ప పాకిస్తాన్‌ దారికి వచ్చే పరిస్ధితి లేదు. దాయాది దేశమని సాయం చేసినా, ఎన్ని పాలు పోసినా పాము విషమే కక్కుతుందన్నట్లు తన పాపపు బుద్దిని పాకిస్తాన్‌ ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే ఇక ఆట మొదలైంది. ఉగ్రవాదులు వేట మొదలైంది. తనకు దిక్కులేకపోయినా, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, మన దేశంలో అశాంతిని రేపుతామని చూస్తున్న పాకిస్తాన్‌ను ఇక వదిలిపెట్టకూడదన్న గట్టి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆరేళ్ల క్రితం మన సైనికులు 60 మందిని పొట్టన పెట్టుకున్నా, సర్జికల్‌ స్ట్రైక్‌తో ఆపేశాం. కాని ఆసారి పెహల్గావ్‌లో ముష్కరులు హిందువులను టార్గెట్‌ చేసి చంపడం అన్నది ప్రపంచంలో ఏ దేశం సహించలేదు. మన 140 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోయింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్‌ ప్రేజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే, ముష్కర స్ధావరాలను కూకటి వేళ్లతో పెలికించి, ప్రపంచం ముందు మరోసారి భారత్‌ గొప్పదనాన్ని చాటుకున్నది. కాకపోతే పాకిస్తాన్‌ పాపాలకు ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పడాలి. పాకిస్తాన్‌ ఇక భారత్‌ వైపు కన్నెత్తి చూడాలంటే కలలో కూడా అక్కడి పాలకులు ఉలిక్కి పడాలి. పాకిస్ధాన్‌కు మన దేశపు దెబ్బ అంత గట్టిగా పడాలనే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు ప్రపంచంలో అభివృద్దిలో పోటీ పడాలని మనం ఆలోచిస్తుతంటే, ప్రతిసారి పాకిస్తాన్‌ కవ్వింపుల కోసం ఇక ఆలోచించే రోజు వుండకూడదు. అంటే పాకిస్తాన్‌ వరల్డ్‌ మ్యాప్‌లో లేకుంటా చేస్తేనే దారి వస్తుంది. పాక్‌ ఆక్రమించుకున్న పిఓకే స్వాధీనంతోపాటు, పాక్‌ను అష్ట దిగ్భందనం చేస్తే తప్ప దానికి ఊరిరి ఆడదు. మన కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్‌ కూసాలు కదిలిపోయేలా చేస్తోంది. భవిష్యత్తులో యుద్దం అన్న ఆలోచన వస్తేనే పాకిస్తాన్‌ గుండెలు అదిరిపోవాలి. అంతే కాదు మీరు తప్ప మాకు దిక్కులేదని కాళ్లబేరానికి రావాల్సిన అవసరం వుంది. అంత దూరం తీసుకుపోతే తప్ప పాకిస్తాన్‌ మాట వినదు. ఇప్పుడున్న పరిసి ్దతుల్లో పాకిస్తాన్‌పై కనికరం అన్నది చూపకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. హిందూస్తాన్‌ వైపు తొంగి చూసినా తునాతునకలైపోతామన్న భయం పాకిస్తాన్‌కు రుచి చూపించాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా జార విడువాలనుకోవడం లేదు. పాకిస్తాన్‌తో ఈ తలనొప్పి ఇక వుండదకూడదనే నిర్ణయానికి వచ్చింది. సరిహద్దును చూస్తే పాకిస్తాన్‌ ఇక జడుసుకోవాలి. ముష్కరులకు తావివ్వాలంటేనే పాకిస్తాన్‌కు తడిసిపోవాలి. అందుకే ఇక అసలు ఆట మొదలైంది. అంతం కాదిది..ఆరంభం. ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌. 9 ఉగ్రవాద స్ధావరాలు మాటాష్‌. పలహాల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత్‌ తీర్చుకున్న ప్రతికారం. భారతీయుల్లో ఆనందం వెల్లిరిస్తోంది. ఇలాంటి మాట కోసం అమాయకులైన 25మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నాటి నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రతీకారంతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ప్రతికారం తీర్చుకోకుంగా జాప్యం చేస్తుందని మధనపడినవ వారు కూడా వున్నారు. మన దేశ ప్రభుత్వ ఆలోచన, యుద్ద వ్యూహాలు అర్ధం చేసుకోలేక, బావోద్వేగాలతో ఎదురుచూసిన ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భమిది. దేశమంతా ఒక రకంగాచెప్పాలంటే పులకించిపోతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మన సైనికులను కీర్తిస్తోంది. దేశమంతా జేజేలు పలుకుతోంది. ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరుపెట్టి మరీ ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేయడాన్ని దేశమంతా ఉద్వేగంతో సంబరాలు చేసుకుంటోంది. భారత్‌ మాతాకీ జై అని జై కొడుతోంది. జై హింద్‌ అంటూ దేశమంతా నినదిస్తోంది. దేశమంతా మన సైనికులు సలాం చేస్తోంది. జై హింద్‌ ట్విట్లతో దేశమంతా మారు మ్రోగిపోతోంది. పాకిస్ధాన్‌ ఆక్రమించుకున్న పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనే కాదు, ఏకంగా పాకిస్తాన్‌ గడ్డ మీదకు వెళ్లి మరీ ఉగ్ర స్ధావరాలను మన వైమానిక దళం ద్వంసం చేసింది. పాకిస్తాన్‌ కేంద్రంగా వున్న 26 ఉగ్ర స్ధావరాలను గుర్తించినట్లు సమాచారం. అందులో కీలకమైన 9 స్దావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. పిఓకెలో వున్న 5 ఉగ్రవాద స్ధావరాలు, పాకిస్తాన్‌ గడ్డ మీద వున్న 4 స్ధావరాలను నామరూపాలు లేకుండా చేశారు. పాకిస్తాన్‌ గడ్డ మీద మన సైనికులు త్రివర్ణ పతాకం ఎగరవేడం గొప్ప శుభ పరిణామం. మన దేశమంతా సగర్వంగా సైనికులకు సలాం చేసింది. తీవ్ర వాద నాయకుడైన మసూద్‌ కుటుంబం మొత్తం చనిపోయింది. వారితోపాటు బంధువులు, ఇతర ఉగ్ర వాదులు మొత్తం 100 మందికిపైగా భారత్‌ జరిపిన వైమానికదాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక మన కంటిలో నలుసులా, చెప్పులో రాయిలా తయారైన పాకిస్తాన్‌ కూడా మాయమయ్యే సమయం ఆసన్నమైంది. అయితే మన దేశం అనుసరిస్తున్న యుద్ద వ్యూహాలు అర్దం కాక ఇప్పటికే పాకిస్తాన్‌ తలలు పట్టుకుంటోంది. పాకిస్తాన్‌ విషయంలో ప్రపంచమంతా ఒకవైపు, పాకిస్తాన్‌ ఒక వైపు అనేలా యుద్ద తంత్రాన్ని నెరిపిన ఘనత మన ప్రదాని నరేంద్ర మోడీకే దక్కింది. గతంలో పాకిస్తాన్‌కాలు దువ్విన ప్రతి సందర్భంలోనూ ఏదోఒక దేశం మద్దతు ప్రకటిస్తూ వచ్చేవి. కాని ఈసారి 80 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్‌కు అగ్రరాజ్యాలేవీ పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. ఒక రకంగాచెప్పాలంటే పాకిస్తాన్‌ ఏకాకి అయ్యింది. మన ప్రధాని నరేంద్ర మోడీ యుద్ద తంత్రాన్ని ఇప్పుడే మొదలు పెట్టారు. అయితే నిజానికి పహల్గావ్‌ దాడి మరుసటి రోజు నుంచే మన దేశం యుద్దతంత్రాన్ని మొదలు పెట్టింది. ముందు పాకిస్తాన్‌ను ఆర్ధికంగా కుదేలు చేసింది. ఆ దేశానికి ఎగుమతులు అన్నీ రద్దు చేసింది. తర్వాత వైమానిక దారులు మూసేసింది. పాకిస్తాన్‌కు సిందు నది నీళ్లను ఆపేసింది. దాంతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పటికే మూలిగే నక్కలాంటి పాకిస్తాన్‌ మీద మన ప్రభుత్వం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్‌ గిలగిలాడుతోంది. నిజానికి పాకిస్తాన్‌ ప్రజలు కూడా మన దేశంతో యుద్దం వద్దని ఆ దేశ సైనికులు కూడా పాకిస్తాన్‌ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. యుద్దం చేయడానికి ఇష్టపడక ఎంతో మంది పాకిస్తాన్‌ సైనికులు కూడా తమ ఉద్యోగాలు రాజీనామా చేశారన్న వార్తలు కూడా విన్నాం. అయినా పాకిస్తాన్‌కు బుద్ది రాలేదు. ఆ దేశ రాజకీయ నాయకులకు సోయి రావడం లేదు. ఇండియా మీద గెవడం అన్నది పాకిస్తాన్‌కు కలలో కూడా జరగనిది. యుద్దమంటే క్రికెట్‌ లాంటి ఆటలో గెలవడం కాదు. అయినా ఆటలో కూడా ఎప్పుడూ పాకిస్తాన్‌ పెద్దగా గెలిచింది లేదు. అలాంటిది యుద్దంలో పాకిస్తాన్‌ కనీసం చెప్పుకునే రణ తంత్రం లేదు. సైనిక సంపత్తి చాలదు. మన దేశ ప్రజలంతా ఒక్క సారి జై హింద్‌ అంటే ఆ సౌండ్‌కే పాకిస్తాన్‌ సగం గుండె ఆగిపోతుంది. అలాంటి పాకిస్తాన్‌ కొన్ని అగ్ర రాజ్యాల అండ చూసుకొని ఎగురుతూ వుండేది. కాని ఇప్పుడు ఏ దేశం పాకిస్తాన్‌కు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అంతే కాదు అఫ్గనిస్తాన్‌ తాలిబన్లు కూడా పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. అయినా పాకిస్తాన్‌కు సిగ్గు రావడం లేదు. మన దేశ నుంచి విడిపోయిన ముక్కకే అంత వుంటే, ఆ ప్రాంతాన్ని దానం చేసిన మనకు ఎంత వుండాలి? మన సైనిక శక్తి కింద వారి సంఖ్య ఎంత? గతంలో ఊ అంటే అణ్వాయుదాలున్నాయంటూ పదే పదే పాకిస్తాన్‌ బెదిరిస్తూ వచ్చేది. అయినా మన దేశం ఎంతో సంయమనంతో వుండేది. మన మంచితనం పాకిస్తాన్‌కు చేతగాని తనంగా కనిపిస్తోంది. ఈసారి అసలు పాకిస్తాన్‌ అనేదే లేకుండా చేస్తే తప్ప దారికి రాదు. 1972 తర్వాత మళ్లీ మనదేశంలో సైనిక మాక్‌ డ్రిల్‌ జరిగిందంటే మన ప్రభుత్వం ఎంత స్ధిర నిర్ణయంతో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంతతను దెబ్బతీసేలా పక్కలో బల్లెంలా నిత్యం కొర్రీలు పెడుతుంటే ఇంకా చూసుకుంటూ ఊరుకునే పరిస్దితి లేదని మన ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. ఓ వైపు పాక్‌ మన దేశ భూగాగాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డగా చేసి పెట్టి మారణ హోమం సృష్టించాలని ఇప్పటి వరకు పాకిస్తాన్‌ చూసింది చాలు. ఇకపై మన దేశం ఉపేక్షించే పరిస్దితి లేదని ప్రదాని మోడీ తేల్చి చెప్పేశారు. ఆఖరుగా ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్‌ ఈ విషయాన్ని లెవనెత్తి పై చేయి సాధించాలిన చూసింది. మన దేశం చెప్పిన సమాధానం విని పాకిస్తాన్‌ బిత్తర పోయింది. ప్రపంచ దేశాలతోపాటు, ఐక్య రాజ్య సమితికూడా మన దేశానికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌ చేత కూడ ఉగ్ర వాదులను తుదముట్టించేందుకు సహకరిస్తామని చెపాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితిలో తమ దేశంపై భారత్‌ దాడిచేయాలని చూస్తోందని చెప్పి సానుభూతి పొందాలని చూసింది. కాని మన ప్రభుత్వం మాత్రం మేం ఉగ్రవాదుల ఏరి వేత మాత్రమే చేస్తున్నామని చెప్పడంతో ఐక్యరాజ్య సమితిలో పాక్‌ పరువు పోయింది. లేనిపోనివి చెప్పి సానుభూతి పొందాలనుకున్నా చెల్లలేదు. అదే రోజు అర్ధరాత్రి అంటే 7తేదీన ఆలస్యం చేయకుండా 9 ఉగ్ర వాద స్ధావరాలను ధ్వసం చేసింది. పాకిస్తాన్‌లాగా దొంగ దెబ్బ మనం తీయలేదు. ప్రపంచానికి చెప్పి మరీ మన ప్రభుత్వం ఉగ్ర స్ధావరాలను టార్గెట్‌ చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో 25 నిమిషాలలో పని పూర్తి చేసింది. అయితే ఇక్కడితో ఆగిపోయేది కాదు. మనదేశం ఆగేది కాదు. అందుకే హోం మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2 వుంటుందని ప్రకటించారు. అంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇ ంకా వుందని అమిత్‌షా సంకేతాలిచ్చినట్లైంది. ఏ రకంగా చూసినా అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఏకాకి. ఇక ప్రతి రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రే..! జై భారత్‌. జై హింద్‌!!

సమన్వయ సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిరచిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’

రుజువైన భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యం

పాక్‌లోని లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం బహిర్గతం

తాత్కాలిక లక్ష్యాలు సాధించినా, దెబ్బతినని ఉగ్రవాదుల మూలాలు

పాక్‌ ప్రకటనతో యుద్ధంగా మారే ప్రమాదం

 

పాకిస్తాన్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే

అడుక్కు తింటున్నా అహంకారం తక్కువేం లేదు

అంతర్జాతీయంగా ఏకాకి అయినా బుద్ధి మారని పాక్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అత్యాధునిక యుద్ధకళలో మనదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. గతంలో బాలాకోట్‌, యురి దాడులు నిర్వహించినా, ఆ రెండుసార్లు మన దళాలు పీఓకేలోకి ప్రవేశించి ఆయా ఆపరేషన్లను దిగ్విజయంగా నిర్వహించాయి. అయితే ఈసారి సరిహద్దు దాటకుండానే కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రమే కాదు, పాక్‌ భూభాగంపై కూడా నిర్దిష్టమైన రీతిలో దాడిచేయగలమని ఆ దేశానికి తెలియజెప్పింది. ముఖ్యంగా ఈ దాడిలో త్రివిధ సైనిక దళాలు, రాజకీయ నాయకత్వం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఎంతో సమన్వయంతో పనిచేసి అనుకున్నది సాధించాయి. మనదేశంలోని అన్ని వ్యవస్థల సమన్వయ సామర్థ్యంకూడా ప్రపంచానికి మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా ఈదాడుల్లో ఉపయోగించింది రఫేల్‌ యుద్ధ విమానాలు. వీటిల్లో అత్యాధుóనిక ఆయుధాలను అమ ర్చి సరిహద్దును దాటకుండానే, ఏవిధమైన నష్టం లేకుండా నిర్దిష్ట లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహించడం ఇక్కడ గుర్తించాల్సిన కీలకాంశం. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో మనదేశానికి చెందిన 25 మంది, నేపాల్‌కు చెందిన మరొక పర్యాటకుడిని అమానుషంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనకు ప్రతీకారంగా జరిపిన ఈ దాడుల్లో 90వరకు మిలిటెంట్లు మరణించి నట్టు తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ప్రపంచానికి పదేపదే స్పష్టం చేస్తున్న మనదేశం, ఈ దాడులను కేవలం లష్కరే తొయ్యబా (లెట్‌), జైషే మహమ్మద్‌ (జెమ్‌) స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే నిర్వహించింది. చాలా జా గ్రత్తగా రచించిన ప్రణాళిక ప్రకారం పాక్‌ సైనిక స్థావరాలను ముట్టుకోలేదు.

స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులు

ఈ దాడులకు ఉపయోగించిన రఫేల్‌ జెట్‌ విమానాల్లో స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులు, హామర్‌ ప్రిసిషన్‌ గైడెడ్‌ బాంబులను భారతీయ వాయుసేన అమర్చింది. వీటిల్లో స్కాల్ప్‌ క్షిపణులు లోపలి ప్రాంతాలపై కచ్చితమైన దాడులకు ఉపయోగపడగా, హామర్‌ బాంబులతో గాల్లోనుంచి భూత లం మీది లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేశాయి. పూర్తిగా భారత భూభాగంనుంచి ని ర్వహించిన ఈ ఆపరేషన్‌కు, నేవీ చక్కటి సమన్వయ సహకారాలు అందించింది. భారత ప్రజలుగాఢనిద్రలో వున్న సమయంలో, పాక్‌ సైన్యం ఏమరుపాటుగా వున్న తరుణాన్ని ఎంచుకొని సరి గ్గా 6వ తేదీ అర్థరాత్రి దాటి, 7వ తేదీ 1.44 గంటలకు మన సైన్యం ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో భారత్‌ వైపు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్తాన్‌ గగనతలంలోకి ప్రవేశించి నిర్దిష్ట ఉగ్ర లక్ష్యాలపై దాడులు జరపడంలో భారత్‌ తనవద్ద ఉన్న ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని విస్పష్టంగా ప్రదర్శించింది. ముఖ్యంగా పాకిస్తాన్‌ సైన్యంతో అనవసర యుద్ధం రాకుండా, కేవలం ఉగ్రవాద కేంద్రాలపైనే దృష్టి కేంద్రీకరించడమనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అనుకున్న విధంగా పూర్తిచేయడం అంత సులభం కాదు. దీన్ని మనదేశం సాధించి చూపింది. 

రఫేల్‌ కీలకపాత్ర

రఫేల్‌ యుద్ధవిమానాల్లో అమర్చిన స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులకు 300 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యముంది. ఫలితంగా ఈ యుద్ధ విమానం సురక్షితమైన దూరంలో వుంటూనే తన దాడిని కొనసాగించడానికి వీలైంది. అదీకాకుండా ఈ క్షిపణీ వ్యవస్థ శత్రు రక్షణ వ్యవస్థల ను ఏమార్చి ముందుకు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించగలదు. హామర్‌ (హైలీ అగైల్‌ మాడ్యులార్‌ మ్యునిషన్‌ ఎక్స్‌టెండెండ్‌ రేంజ్‌) బాంబులు వ్యూహాత్మకంగా, ఉగ్రవాద స్థావరాల్లోని నిర్దిష్ట చిన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడ్డాయి. ఈ మొత్తం ఆపరేషన్‌, ప్రణాళికా రచనలో మన సైన్యం అనుసరించిన ఆధునిక పోకడ ప్రపంచానికి వెల్లడైంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకుండానే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఆపరేషన్‌ సింధూర్‌ విశిష్టత. గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే, మనవైపు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, ఉగ్రవాద స్థావ రాలకు అనుకున్న రీతిలో తీవ్ర నష్టం కలిగించడం. అంతేకాదు, ఈ ఆపరేషన్‌ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాల ధ్వంసంపై మాత్రమే కాదు, ఆయా సంస్థల ముఖ్యనేతలను హతమార్చ డంపై కూడా దృష్టి కేంద్రీకరించింది. ఈ ఉగ్రవాద స్థావరాలను గుర్తించడానికి, పహల్గామ్‌ దా డులు జరిగినప్పటినుంచి మన రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ (రా) సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆవిధంగా సేకరించిన కచ్చితమైన సమాచారం ఆధారంగా, లష్కరే తొయ్యబా, జెయిషే మహమ్మద్‌ సంస్థల కమాండ్‌ మరియు కంట్రోల్‌ విభాగాలను పూర్తిగా ధ్వంసం చేయాలన్న లక్ష్యాన్ని మన సైన్యం నిర్దేశించుకుంది. 

ముర్దిక్‌లోని లెట్‌ స్థావరంపై తీవ్రస్తాయి దాడులు

ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా ముర్ధిక్‌లోని లెట్‌ స్థావరంపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు కేంద్ర స్థానం. అదేవిధంగా బహవాల్పూర్‌లోని జై షే మహమ్మద్‌ ఉగ్ర సంస్థపై కూడా దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ఈ రెండు సంస్థల్లోనూ భారత్‌ను లక్ష్యం చేసుకొని ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ప్రదేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. ఈవిధంగా ఈ సంస్థలకున్న ఉగ్రవాదులను తయారుచేసే సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, భవిష్యత్తులో అటువంటి ప్రణాళికలు రూపొందించకుండా వుండే స్థాయిలో ఈ దాడులు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఈ ఆప ంషన్‌ మొత్తాన్ని పర్యవేక్షించడాన్ని పరిశీలిస్తే, మనదేశ అత్యున్నత నాయకత్వం దీనికి ఎంతటి ప్రాధాన్యత నిచ్చిందీ అర్థమవుతుంది. ఇక మన రియల్‌ జేమ్స్‌బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఎప్పటికప్పుడు ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌దే కీలక పాత్ర. ఇదే సమయంలో మన ‘రా’ సంస్థ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన నిక్కచ్చి సమాచారాన్ని అంద జేయడం మరో గొప్ప విషయం. 

భారత్‌ నిగ్రహం

ఈమొత్తం ఆపరేషన్‌ను ఉగ్రవాద వ్యతిరేక చర్యగానే భారత్‌ పరిగణించి ఎంతో నిగ్రహంతో వ్య వహరించడం వల్లనే పరిస్థితి యుద్ధానికి దారితీయలేదు. ఈ వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయంవంతం కావడానికి మించి మరో ప్రయోజనం కూడా ఒనగూడిరది. చాలా తక్కువ నష్టంతో పాకిస్తాన్‌లోని సుదూర ప్రాంతాల్లోని నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయగలమన్న స్పష్టమైన సందేశాన్ని పాక్‌ ఉగ్రవాదులకు, వారి మద్దతుదార్లకు మనదేశం ఇచ్చినట్లయింది. ఇదే సమయంలోఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేసామని, ఆవిధంగా ‘ఉగ్రవాదంపై పోరు ’కే కట్టుబడి వున్నామన్న సందేశాన్ని ప్రపంచానికి మనదేశం ఇచ్చింది. అయితే ఆపరేషన్‌ సిం ధూర్‌ ద్వారా మనదేశం తక్షణ లక్ష్యాలను సాధించినప్పటికీ దీర్ఘకాలంలో దీని పర్యవసానాలు ఎట్లా వుంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మౌలిక వసతుల ధ్వంసం, ఉగ్ర సంస్థల నాయకులను హతమార్చడం తాత్కాలికంగా ఆయా సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసినప్పటికీ, కొంత విరామం తర్వాత అవి మళ్లీ యథాస్థితికి చేరుకుంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యం. కాకపోతే పాకిస్తా న్‌ లోని సుదూర ప్రాంతాలపై కూడా అత్యంత కచ్చితత్వంతో దాడిచేసే సామర్థ్యం భారత్‌కు ఉ న్నదన్న సత్యం పాకిస్తాన్‌కు తెలిసొచ్చిన మాట వాస్తవం. అంతేకాదు ఈ ఆపరేషన్‌ దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ సరిహద్దు అంశాలపై తన ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఈ దాడులను ‘యుద్ధ చర్య’గా పాకిస్తాన్‌ ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ! అయితే ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడులు జరపడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సన్నిహిత దేశాలకు తెలియపరుస్తూ రావడంవల్ల, యుద్ధం స్థాయికి పరిస్థితులు దారితీయకపోవచ్చు కూడా!

మరో మైలురాయి

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈ ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరులో మనదే శం మరో మైలురాయిని దాటిందనే చెప్పాలి. తన ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే, వ్యూహాత్మక సంయమనం పాటించడం ఒక్క భారత్‌కు మాత్రమే సాధ్యమైంది. వీటి వినియోగం ద్వారా రెండుదేశాల మధ్య సంఘర్షణ జరగకుండా జాగ్రత్తపడిరది. అంతేకాదు మనదేశం అనుసరిస్తున్న ‘త్రివిధ దళాల ఉమ్మడి చర్య సిద్ధాంతం’ ఇస్తున్న చక్కటి ఫలితాలు ప్రపంచానికి తెలిసొచ్చాయి. మొత్తంమీద చెప్పాలంటే, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్‌ నిబద్ధత ప్రపంచానికి మరోసారి వెల్లడైంది.

పంజాబ్‌ , హర్యానాల మధ్య నీటి రగడ

ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాల్లో నీటి జగడం సమంజసం కాదు

సింధూనది జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో మళ్లీ రగిలిన నీటివివాదం

ఆప్‌ ప్రభుత్వం వైఖరితో కేంద్రానికి ఇరకాటం

దేశ సమస్యను పట్టించుకోని పంజాబ్‌

పాక్‌కు ప్రయోజనం కలిగించే రీతిలో పంజాబ్‌ వైఖరి

ఆప్‌ ప్రభుత్వానికే కాంగ్రెస్‌ మద్దతు

ఎవరి కారణాలు వారికున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వివాదం నిర్హేతుకం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

హర్యానాకు 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని భాక్రా బీయాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ (బీబీఎంబీ)ని శుక్రవారం ఆదేశించింది. మే 3వ తేదీనుంచి ఎనిమిది రోజుల వరకు ఈ నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది. శుక్రవారం పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థా న్‌ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానంతరం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మో హన్‌ ఈమేరకు ఆదేశించారు. ఈ నాలుగు రాష్ట్రాలు బీబీఎంబీలో సభ్యులుగా వున్నాయి. 

బీబీఎంబీ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియంత్రణలో వుంది. బీబీఎంబీకి చెందిన కమిటీలో హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, చండీగఢ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు సభ్యులుగా వుంటారు. కేంద్రం ఆదేశాల మేరకు నీటివిడుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వీరు సిద్ధం చేసి అమలు చేస్తారు. 

సమస్య ప్రారంభం

తమరాష్ట్రానికి అదనపు జలాలు విడుదల చేయాలని ఏప్రిల్‌ 28న హర్యానా ముఖ్యమంత్రి నా యబ్‌ సింగ్‌ సైనీ కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టునుంచి హర్యానా 4వేల క్యూసెక్కుల నీటిని పొందుతోంది. కాగా ఆయన డిమాండ్‌ మేరకు రాష్ట్రానికి భాక్రా డ్యాం నుంచి 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. పంజాబ్‌లో అధికారంలో వున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు, మే 1వ తేదీన భాక్రాకు దిగువన 13 కి లోమీటర్ల దూరంలో వున్న నంగల్‌ డ్యామ్‌ వద్దకు డీఐజీ స్థాయి పోలీసు అధికార్లను పంపి అక్కడినుంచి నీటి విడుదలను అడ్డుకుంది. విచిత్రమేమంటే బీబీఎంబీ బోర్డులో సభ్యురాలిగా వున్న రాజస్తాన్‌ నిపుణులు హర్యానాకు 8500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసేందుకు మద్దతు పలు కగా, హిమాచల్‌ ప్రదేశ్‌ నిపుణులు మాత్రం మౌనంగా వుండిపోయారు. ఒక్క పంజాబ్‌ ప్రతిధు లు మాత్రమే నీటి విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హర్యానాకు అదనపు జలాల కేటాయింపును అడ్డుకొని తీరతామని పంజాబ్‌కు చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టం చేయడం గ మనార్హం. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో ఏడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చండీగఢ్‌లో మే 1న సమావేశమై, హార్యానాకు చుక్క అదనపు నీటిని తరలించినా అడ్డుకొని తీరతామని శపథం చేయడంతో సమస్య జఠిలమైంది. ఇది కేవలం తమ నీటిని దోపిడీ చేయడమేనని పంజాబ్‌ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, హర్యానా ముఖ్యమం త్రి నాయబ్‌ సింగ్‌ సైనీ ఈ విషయంలో సంయమనం పాటించాలంటూ హితవు పలికారు.

బీబీఎంబీ నిర్వహణ

భాక్రా మరియు పొంగ్‌ డ్యామ్‌ల నుంచి నీటి నిర్వహణ బాధ్యతను భాక్రా బీయాస్‌ మేనేజ్‌మెంట్‌బోర్డ్‌ (బీబీఎంబీ) చూస్తుంటుంది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లు ఈ రెండు డ్యామ్‌లనుంచి ఏటా తమ నీటి అవసరాలను తీర్చుకుంటుంటాయి. బీబీఎంబీ ఈ రాష్ట్రాలకు మే 21 నుంచి మరసటి ఏడాది మే 20 వరకు ఏ రాష్ట్రానికి ఎంత వాటా నీటిని కేటాయించాలో నిర్ణయించి ఆమేరకు అమలు చేస్తుంటుంది. కాగా హర్యానా ముఖ్యమంత్రి కోర్కె మేరకు 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని బీబీఎంబీ నిర్ణయించడంతో వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని కమిటీ లోని పంజాబ్‌ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే హర్యానా తనకు రావలసిన నీటిని వాడుకుందని, అటువంటప్పుడు అదనపు నీటిని కేటాయించడం అన్యాయమని వారు వా దించారు. ఈ నేపథ్యంలోనే పంచాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ‘కేంద్రం, హర్యానా ప్రభు త్వాలు కుమ్మక్కయ్యాయని, బీజేపీ ఎన్నడూ పంజాబీలది కాదు’ అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం, హర్యానా ముఖ్యమంత్రి సైనీ, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లు కుట్రపూరితంగా ఈవిధంగా చేస్తున్నారంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆరోపించారు. ఇప్పటికే తనకు కేటాయించిన దాంట్లో హర్యానా 103శాతం నీటిని, రాజస్థాన్‌ 110% నీటిని వాడుకున్నాయి. అదే పంజాబ్‌ ఇప్పటివరకు కేవలం తన వాటా నీటిలో 89% నీటిని మాత్రమే వాడుకుందని పంజాబ్‌ ఆర్థిక శాఖ మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ ఛీమా పేర్కొన్నారు. 

ఆయన అందించిన వివరాల ప్రకారం పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు వరుసగా 5.512 మిలియన్‌ యాకర్‌ ఫీట్‌ (ఎంఏఎఫ్‌), 2.987 ఎంఏఎఫ్‌, 3.398 ఎంఏఎఫ్‌ నీటిని కేటా యించగా, ఇప్పటివరకు హర్యానా 3.091 ఎంఏఎఫ్‌, రాజస్థాన్‌ 3.738 ఎంఏఎఫ్‌ మరియు పంజాబ్‌ 4.925 ఎంఏఎఫ్‌ నీటిని వాడుకున్నాయి. ప్రస్తుతం భాక్రా డ్యామ్‌లో 1557.10 అడుగులు (పూర్తి సామర్థ్యం 1680 అడుగులు), పోంగ్‌ డ్యామ్‌లో 1293.73 అడుగులు (పూర్తి సామర్థ్యం 1390 అడుగులు), రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌లో 1642 అడుగులు (పూర్తి సామర్థ్యం 1732 అడుగులు) నీటి నిల్వ వుంది. అంటే ఇప్పటికే ఈ డ్యామ్‌ల్లో నీటినిల్వ తక్కువగా వున్న నేప థ్యంలో హర్యానాకు అదనపు నీరు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సైనీ ప్రశ్నిస్తున్నారు. హర్యానా తనకు కేటాయించిన నీటిని మే 21 వరకు ఉపయోగించుకోవచ్చు. గడువు తేదీకి చాలా కాలం ముందుగానే తన వాటా నీటిని పూర్తిగా వాడుకున్నదంటే, ఆ రాష్ట్రం నీటిని దుబారా చేసేస్థాయి ఏవిధంగా వున్నదో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తాగుకు కేటాయించిన నీటిని వ్యవసాయానికి, పరిశ్రమలకు సరఫరా చేయడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. 

దీనిపై హర్యానా ముఖ్యమంత్రి సైనీ తీవ్రంగా స్పదించారు. ‘పంజాబ్‌ అంటే గురువుల ప్రదేశం. మేం గురువులనుంచి ఎంతో నేర్చుకున్నాం. పంజాబ్‌ అంటే మా సోదర రాష్ట్రం, అక్కడి ప్రజలు నీటికి కటకటపడుతుంటే మా వాటా నీటిని అందిస్తాం. అదీ మా సంస్కృతి. అంతేకాని నీటి పే రుతో తుచ్ఛ రాజకీయాలు చేయడం సమంజసం కాదు’ అంటూ పంజాబ్‌ రాజకీయ నేతలపై విరుచుకుపడ్డారు. అంతేకాదు తమకు తాగునీరు సరఫరా చేయాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆయనకోరారు. ఆవిధంగా చేయకపోతే అదనపు నీరు వృధాగా పాకిస్తాన్‌లోకి పోతుందని గుర్తుచేశారు.పహల్గామ్‌ దాడులకు నిరసనగా పాకిస్తాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో సైనీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. జూన్‌ నెలాఖరు లోగా భక్రా డ్యాంను ఖాళీ చేస్తే, రుతుపవన వర్షాలతో మళ్లీ డ్యాం నిండుతుంది. లేదంటే అదనపు నీరు హరి కా పట్టణ్‌ ద్వారా పాకిస్తాన్‌లోకి వెళుతుందన్నారు. ఇది పంజాబ్‌కు లేదా మనదేశానికి ఎంతమాత్రం ప్ర యోజనకరం కాదని గుర్తుచేశారు.

ఇదిలావుండగా హర్యానాకు అదనపు నీటిని ఇవ్వొద్దన్న పంజాబ్‌ ప్రభుత్వ డిమాండ్‌ను కాంగ్రెస్‌ సమర్థించడమే కాదు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి తన మద్దతు తెలిపింది. ఇదిలావుండగా రెండు రాష్ట్రాలమధ్య సట్లెజ్‌`యమున లింక్‌ కాల్వ సమస్య కూడా రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పుడు హర్యానాకు అదనపు నీటి వివాదంతో ఇదికూడా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సట్లెజాయమున లింక్‌ కెనాల్‌ (ఎస్‌వైఎల్‌) వివాదం

నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు 1960లో భారత్‌`పాకిస్తాన్‌ల మధ్య సింధూనదీ జలాల ఒప్పందం కుదిరినప్పుడు, రావీ, బీయాస్‌, సట్లెజ నదుల నీటిని స్వేచ్ఛగా మనదేశం వినియోగించుకునేందుకు వీలైంది. ఒకరకంగా చెప్పాలంటే కర్ణాటక`తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ వివాదం లాంటిదే ఇది కూడా. 1966లో పంజాబ్‌ నుంచి హర్యానా విడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నదులనుంచి హర్యానాకు కూడా న్యాయబద్ధంగా నీటి వాటాను కేటాయించాల్సి వచ్చింది. ఇందులో భాగంగా రూపొందించిందే సట్లెజ్‌`యమున లింక్‌ కెనాల్‌ (ఎస్‌వైఎల్‌) పథ కం. అయితే విభజన చట్టాల ప్రకారం తమ రాష్ట్రంలోని నీటిని పంపిణీ చేయాల్సిన అవసరంలేదంటూ పంజాబ్‌ ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది. తర్వాతికాలంలో సామరస్య వాతావరణం నెలకొన్ని నేపథ్యంలతో1981లో రెండు రాష్ట్రాలు ఎస్‌వైఎల్‌జలాలను పంచుకోవాలని ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో పంజాబ్‌లోని కాపూరీ గ్రామంలో ఈ కాల్వ తవ్వకాన్ని ప్రారంభించారు.ఈ కాల్వ మొత్తం పొడవు 214 కి లోమీటర్లు. ఇందులో 122 కిలోమీటర్లు పంజాబ్‌లో, 92 కిలోమీటర్లు హర్యానాలో కాల్వ కొనసాగుతుంది. అ యితే హర్యానా తనకు కేటాయించిన ప్రాజె క్టు పనులను పూర్తిచేయగా, పంజాబ్‌ మాత్రం 1982 నుంచి ఇప్పటివరకు దీన్ని పూర్తిచేయలేదు. కాగా ఈ కాల్వ విషయంలో పంజాబ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకొని చివరకు దేశ భద్రతకు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో1985 లో అప్పటి ప్రధానిరాజీవ్‌గాంధీ, అకాళీదళ్‌ అధినేత సంత్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీని నిర్ణయించేందుకు ఒక కొత్త ట్రై బ్యునల్‌ ఏర్పాటుకుఈ ఒప్పందం వీలు కల్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బాలకృష్ణ ఎరాడీ నేతృత్వం లో ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. 1987లో ఈ ట్రైబ్యునల్‌ తన నివేదికను సమర్పించింది. ఈ నదీ జలాల్లో పంజాబ్‌కు 5ఎంఏఎఫ్‌, హర్యానాకు 3.83 ఎంఏఎఫ్‌నీటిని పంపిణీ చేయాలని ట్రైబ్యునల్‌ సిఫారసు చేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఎంతకూ ముందుకు పోకపోవడంతో హర్యానా 1996లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కాల్వ పనులను పూర్తిచేయాలని 2002లో సుప్రీంకోర్టు పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించగా, 2004లో ఈ ఒప్పందాన్నే రద్దు చేస్తూ పంజాబ్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీని చట్టబద్ధతపై విచారించిన సుప్రీంకోర్టు, పంజాబ్‌ ప్రభుత్వం ముందుగా తాను అంగీకరించిన ఒప్పందం నుంచి పంజాబ్‌ పక్కకు తప్పు కోవడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. అంతేకాదు కేంద్రం మధ్యవర్తిత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి ఎస్‌వైఎల్‌పై ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్దేశించింది. అయితే పంజాబ్‌ మాత్రం తమ నదీజలాలను పంచుకోవడానికి ఇష్టపడటంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో భూగర్భ జలాలను విపరీ తంగా వినియోగిస్తున్న నేపథ్యంలో 2029 తర్వాత క్షామ పరిస్థితులు నెలకొంటాయని పంజాబ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా గతంలో మాదిరి కాకుండా తగ్గిపోతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోం ది. ఇప్పటికే రాష్ట్రంలోని 79శాతం భూభాగంలోని నీటిని విపరీతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకునే అవకాశం లేదని పంజాబ్‌ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. అయితే హర్యానా మా త్రం తమకు రావలసిన న్యాయమైన వాటా నీటిని కూడా పంజాబ్‌ విని యోగిస్తున్నదని ఆరోపిస్తోంది. తమ రాష్ట్రంలో భూగర్భ జలాలు 1700 అడుగుల కిందికి పడిపోయిన నేపథ్యంలో, దక్షిణ ప్రాంతంలో తాగునీటికే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హర్యానా పేర్కొంటున్నది. ఈ నేప థ్యంలో ట్రైబ్యునల్‌ తమ వాటాగా పేర్కొన్న నీటిని అందించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈవి ధంగా రెండు రాష్ట్రాల మధ్య ఎస్‌వైఎల్‌ ఒక రావణకాష్టంగా మారింది.

కోర్టు ఆదేశంతో రగడ మొదలు

అసలు పంజాబ్‌లో ఎస్‌వైఎల్‌కు సంబంధించి భూసేకరణ, సర్వే ఎంతవవరకు వచ్చాయో తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గత అక్టోబర్‌ 4న అదేశించింది. కోర్టు ఆదేశించిన మరునాడే, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఒక ప్రకటన చేస్తూ ‘హర్యానాతో నీటి పంపకం ఒప్పందం తమకు లేనందువల్ల ఈ కాల్వ నిర్మాణం చేపట్టే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. అప్పటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు సమస్యపై ఆయనకు అవగాహన లేదంటూ దెప్పి పొడిచా రు. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వున్నదన్నారు. అయితే పంజాబ్‌లోని పార్టీల వైఖరి మాత్రం కాల్వ నిర్మాణానికి వ్యతిరేకంగానే వుంది. కాల్వ నిర్మాణం ద్వారా హర్యానాతో నీటిని పంచుకోవడమంటే పంజాబ్‌ రైతులను ఆత్మహత్యలకు పురికొల్పడమేనని కాంగ్రెస్‌, శిరోమణి అకాళీదళ్‌ వంటి విపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. ఏతావాతా చెప్పాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఈవిధంగా నీటి జగడాలు కొనసాగడం వర్తమాన ఉద్రిక్త పరిస్థితుల్లో ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సింధూ జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో ఈ నదీ జలాలకు చెందిన చుక్క నీరు కూడా పాకిస్తాన్‌లోకి వెళ్లకూడదనేది కేంద్రం ఉద్దేశం కాగా, పట్టువిడుపులు ప్రదర్శించకుండా పంజాబ్‌లోని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే హర్యానాకు నదీ జలాల విడుదలకు కేంద్రం ఆదే శించాల్సి వచ్చిందనుకోవచ్చు.

‘‘భూమి పుత్రుడి’’ పట్టుదల ‘‘భూ భారతి’’!..రైతుల కలలు నిజం చేసిన ‘‘పొంగులేటి’’.

`ధరణి దారిద్య్రం పారదోలారు.

`భూ భారతి ఒక నూతన విప్లవం.

`రైతుల కళ్లలో నిండుతున్న సంతోషం.

`రైతులకు భోరోసా నింపుతున్న గొప్ప నూతన ఆవిష్కారం.

`ఆరేళ్ల రైతు గోసకు చరమగీతం.

`భూ భారతి తెచ్చి రైతులకు సంజీవని చేశారు.

`ధరణిలో ఎదురైన 15 సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపారు.

`ఆరేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలగిస్తున్నారు.

`ఆన్‌ లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.

`ప్రతి తహసీల్దారు కార్యాలయంలో నలుగురు ప్రత్యేక సిబ్బందితో జాప్యం లేకుండా చూస్తున్నారు.

`కాలయాపన లేని శీఘ్రతర పరిష్కారం కనుగొన్నారు.

`వేలాది మంది రైతుల సమస్యలు తీర్చుతున్నారు.

`పచ్చని పల్లెలో పెట్టిన ధరణి చిచ్చును ఆర్పుతున్నారు.

`రైతుల మధ్య ధరణి పెంచిన వైషమ్యాలను చెక్‌ పెడుతున్నారు.

`భూ భారతి తెచ్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు.

`మళ్ళీ పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు.

`రైతుల మధ్య వైషమ్యాలు లేకుండా ఆగోగ్యకరమైన సుహృద్భావం ఏర్పరుస్తున్నారు.

`పరిష్కారం కావని తెల్లబోయిన రైతుల సమస్యలు చిటికెలో నెరవేర్చుతున్నారు.

`పైలెట్‌ ప్రాజెక్టులోనే అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు.

`రాష్ట్ర వ్యాప్త అమలుతో రైతులు వేడుకలు చేసుకోనున్నారు.

`ధరణి దుర్మార్గం నుంచి బైడపడి ఊపిరిపీల్చుకుంటున్నారు.

`జీవితకాలం శిక్షలా మారిన ధరణి దరిద్రం పోయినందుకు సంబరపడుతున్నారు.

`దటీజ్‌ ‘‘పొంగులేటి’’ అని రైతులు కొనియాడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 పట్టుదలకు మారు పేరు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అది రాజకీయంగానైనా, పాలనా పరంగానైనా తన చిత్త శుద్ది ఎంత గొప్పదో అనేక సార్లు నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా కష్టపడుతున్నమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఒకటే సమాధానం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన వున్నంత ఆక్టివ్‌గా మరే మంత్రి కూడా లేరన్న వార్తలున్నాయి. రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఎంత ఆక్టివ్‌గా వుంటారో..మంత్రిగా పాలనా పరంగా కూడా అంతకు మించి దూకుడుగా వుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వం తన పని తీరును ప్రజలు హర్షించేలా చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెస్తున్నారు. ముఖ్యంగా ధరణి విషయంలో ఆయన చూపిన శ్రద్ద అంతా ఇంతా కాదు. అంతే కాదు ఇంత తొందరగా భూభారతి అమలులోకి వచ్చిందటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపిన చొరవ హర్షనీయమనే చెప్పాలి. అటు అధికారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, భూభారతి డెవలప్‌ మెంటుపై చర్చలు పెట్టారు. సమీక్షలు చేపట్టారు. దానిపై విసృతమైన చర్చ జరిగేలా చూశారు. అందరి సూచనలు, సలహాలు తీసుకున్నారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేయించారు. అందిరకీ ఆమోదయోగ్యమైన కార్యక్రమంగా భూ భారతి రూపు దిద్దేలా చేశారు. భూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా కూడా అంతే ..ఆయన తలపెట్టిన ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంకోసం పని చేసే విధానం అందిరకీ నచ్చేలా వుంటుంది. తన ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి తన దారిలో అడ్డంకులు ఎదుర్కొన్నారు. తన దారికి అడ్డు పడిన పుల్లలను పూచిక పుల్లలుగా తొక్కుకుంటూ పైకొచ్చారు. నాయకుడికి ధైర్యం కూడా ఎంతో ముఖ్యమనేది శ్రీనివాస్‌రెడ్డి నిరూపించారు. తొలుత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదురులేని నాయకుడిగా వచ్చారు. కాని కొందరి మాటలు నమ్మి తన అడుగులకు ఆయన ముందర కాళ్లకు బంధం వేసుకున్నారు. అది తొందరగానే గ్రహించారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. వ్యక్తిగత ప్రతిష్టతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవలో ఎవరూ చేయలేనంత సేవ చేసి ప్రజల మన్నననలు పొందారు. నాయకుడికన్నా, ముందుకు ప్రజా సేవకుడిగా ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనను రాజకీయంగా ఆదరించారు. రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే ఆయనతోపాటు ఎంతో మందిని నాయకులను చేశారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ జీవితం ఇచ్చారు. తనతో పాటు సమానమైన హోదా కల్గిన ప్రజా ప్రతినిధులుగా తయారు చేశారు. అలాంటి నాయకుడికి కూడా అడ్డంకులు ఏర్పరిచారు. నమ్మిన వాళ్లే ఆయనను వెన్ను పోటు పొడిచారు. అయినా ఆయన కుంగిపోలేదు. లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ప్రజా సేవలో ఆయన మడమ తిప్పలేదు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన వెనుదిగిరి చూడలేదు. అందుకే ఆయన రాజకీయాలను శాసించే స్ధాయికి ఎదిగారు. తన సొంత జిల్లాలో రాజకీయాలను తన కనుసైగలతో శాసించే స్ధాయికి ఎదిగారు. అదీ ఒక నిబద్దత వున్న నాయకుడి అంకితభావం అని నిరూపించారు. ఖమ్మం అంటే పొంగులేటి అంటే ఖమ్మం అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు పెద్దదిక్కుగా మారారు. ఉమ్మడి ఖమ్మం ప్రజలకు పెద్దన్నగా సేవలు చేస్తున్నారు. అందుకే ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు ఏది చెబితే అది, ఎంతచెబితే అంత అన్నట్లు రాజకీయాలను శాసించగలుగుతున్నారు. గతంలో ఎంత పెద్ద నాయకుడు కూడా చేయలేని సాహసాలు చేశారు. రాజకీయంగా సవాళ్లు విసిరారు. ఎదరులేదనుకున్న బిఆర్‌ఎస్‌ను మట్టికరిపించారు. తాను చేసిన శపధాన్ని నిలబెట్టుకున్నారు. అలా శపథం చేసి నిలబెట్టుకున్న నాయకులు చరిత్రలో ఒక్క పొంగులేటి తప్ప మరే నాయకుడు లేదు. విజయం సాధించిన నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డికి తప్ప మరెవరికీ సాధ్యం కాలేదు. అలాంటి నాయకుడు పాలనలో భాగస్వామి అయితే ఎలా వుంటుందో కూడా చూపిస్తున్నారు. తన శాఖకు వన్నె తెస్తున్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తేవడం వల్ల కొన్ని లక్షల మంది రైతులు ఆగమయ్యారు. తాతల తరాల నుంచి లేని ఇబ్బందులు గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల నెత్తిన పిడుగులు వేశారు. నిజాం కాలం తర్వాత అత్యుత్తమైన భూ విధానం తీసుకొస్తామని చెప్పి, చిల్లం చిల్లంచేశారు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో లేని పోని సమస్య సృష్టించారు. ఎవరి భూములు ఎటు వెళ్లాయో తెలియకుండాపోయాయి. రైతుల మధ్య కలతలు చెలరేగాయి. భూ వివాదాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఎంతో మంది అన్నదమ్ముల మధ్య కొట్లాటలు తెచ్చాయి. కుటుంబాలలో పగలు రగించాయి. అయినా అంతా బాగుందంటూ గత ప్రభుత్వ మసి బూసి మారేడు కాయ చేయడానికే ప్రయత్నం చేసింది. దాంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. రైతులు తమ భూములను తామవే అని చెప్పుకోవడానికి కూడా ఆరేళ్లపాటు నరకం చూశారు. లక్షలు ఖర్చు చేసుకున్నారు. అప్పుల పాలై ఆగమాయ్యారు. తమ భూములు తమకు కాకుండా చేసిన గత ప్రభుత్వాన్ని దింపేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హమీ ఇచ్చినట్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ సమయంలోనే భూ భారతిని తెచ్చింది. భూ భారతి కోసం మంత్రి పొంగులేటి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ప్రజలకు వీలైనంత తొందరగా మేలైన పనులు చేయాలని, వారికి ఊరట కల్గించాలని, భరోసా కల్పించాలని మంత్రి పొంగులేటి దగ్గరుండి భూ భారతి రూపకల్పన చేయించారు. రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఆరేళ్లపాటు పడరాని పాట్లు పడిన రైతులు ఇప్పుడు భూ భారతి వల్ల ఎంతో మేలు పొందుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా చిటికెలో పరిష్కారమయ్యేలా పోర్టర్‌ రూపొందించారు. రైతులకు కొత్త లోకాన్ని ఆవిష్కరించారు. తమ భూములపై రైతులకు కొండంత ధైర్యం భూ భారతితో నింపారు. అందుకు ప్రజలు కూడా మంత్రి పొంగులేటి కృషిని ప్రశంసిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలలో ప్రముఖంగా ఆన్‌లైన్‌ పట్టాలున్నా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. దాంతో ఎంతో మంది రైతుల పాసు పుస్తకాల కోసం నిత్యం తహసిల్ధార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇక భూదాన్‌, వక్ఫ్‌, దేవాదాయ భూములంటూ పట్టా లాండ్స్‌ను కూడా పివోబిలో నమోదు చేయడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ధరణిలో రైతుల పేరిట వుండాల్సిన భూముల కంటే తక్కువ విస్తీర్ణం చూపించిన సందర్బాలు అనేకం వున్నాయి. వీటిపై ఎన్ని పిర్యాధులు వచ్చినా అప్పటి పాలకులు స్పందించలేదు. సర్వేనెంబర్లు మిస్‌ చేశారు. సాదాబైనామాలు కూడా రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేశారు. ఆ భూములకు కూడా లేని పోని సమస్యలు సృష్టించారు. ఇలా ధరణిపోర్టలో 15 రకాల సమస్యలు సృష్టించినట్లు గుర్తించారు. ఇక రైతులు అందరూ ఆన్‌లైన్‌లో ధరకాస్తు చేసుకోవాలనడం సాద్యం కాని పని. రైతులు ఎలాంటి కాగితం మీద పిర్యాదు ఇచ్చినా తీసుకునేలా భూ భారతికి వెసులుబాటు కల్పించారు. ప్రతి తహసిల్ధార్‌ కార్యాలయంలో కనీసం నలుగురు సపోర్టింగ్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. వాటి నుంచి సత్వర విముక్తి కావాలని ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తోంది. అంతే కాకుండా భూ భారతిలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనే సదస్సులు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పిర్యాధులు స్వీకరించాలి. అప్పుడు పొరపాట్లు జరగడానికి ఒక్క శాతం కూడా ఆస్కారం వుండదు. ప్రజలందరి ముందు రైతులు తప్పుడు పిర్యాధులు చేసుకునేందుకు కూడా వీలుండదు. ఎందుకంటే గ్రామాలల్లో ఏ రైతు భూమి ఏమిటన్నది దాదాపు అందరికీ అవగాహన వుంటుంది. ఒక వేళ ఎవరైనా తప్పుడు పిర్యాదులు చేయాలని చూసినా వెంటనే తెలిసిపోతుంది. పైగా రైతులకు సులభమైన రీతిలో అర్ధమయ్యేలా ఫార్మేట్‌ రూపొందించారు. ఇలా రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించేలా చట్టం రూపకల్పన జరిగింది. రైతులకు ఎంతో మేలు చేసేలా రూపకల్పన జరిగింది. లేని పోని గొప్పలకు పోయి, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగా ఎంతో మందిరైతులు మానసిక వేధనకు గురయ్యారు. తట్టుకోలేని ఎంతోమంది చనిపోయారు. ఎన్నో రైతు కుటుంబాలు సమస్యలు ఎదుర్కొన్నాయి. వాటన్నింటికీ ఒక్కటే పరిష్కారం భూ భారతి. రైతుల కలలు నెరవేరుస్తోంది. అది శ్రీనివాస్‌ రెడ్డి నిబద్దతను నిరూపిస్తోంది.

నీతిలేని పవన్‌!? మాటలకు తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక

`పవన్‌ పూటకో వేషం తెలంగాణలో చెల్లదు!?

`పవన్‌ను వెనుకేసుకొచ్చే వారి ఆటలు కూడా సాగవు

`తెలంగాణ అంటే నవ్వులాట రాజకీయాలు కాదు

`ఉద్వేగరితమైన తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తేమంటే చూస్తూ ఊరుకోం

`ఇసంత రమ్మంటే ఇళ్లంత నాదే అనే రకం!

`జనసేన పుట్టింది తెలంగాణలో అంటే తరిమి, తరిమి కొడతాం!

`నీ ఊసరవెళ్లి రాజకీయాలు సాగవు!

`ఉద్యమ కారుల ప్రాణాలు త్యాగం చేసిన నేల

`కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై గద్దలు వాలితే ఈకలు పీకేస్తాం

`కన్నెత్తి చూస్తే గుడ్లతో గోలీలాడతాం

`ఉద్యమ కారుల తనువులు చాలిస్తుంటే రెచ్చ గొట్టిన చరిత్ర పవన్‌ది

`తెలంగాణ విడిపోతే 11 రోజులు అన్నం తినలేదని చెప్పి ఏపిలో ఓట్లు అడుక్కున్నావ్‌

`తెలంగాణ వ్యతిరేకులకు చోటు లేదు

`అవకాశవాది పవన్‌కు అసలే వుండదు

`తెలంగాణ అంటే ఆత్మ గౌరవం

`పూటకో మాట మాట్లాడే పవన్‌ అవకాశ రాజకీయం

`పుట్టిన గడ్డ ఏపికి ముందు సేవ చెయ్యి!

`నమ్మి గెలిపించినందుకు అభివృద్ధి చేయి

`తెలంగాణ జోలికొస్తే తరిమి కొడతాం

`ప్రాంతేతరుడి పొలిమేర వరకు తరమాలని చెప్పిన కాలోజీ వారసులం

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

అయ్యోనివా..నువ్వు అవ్వోనివా..తెలంగాణకు నువ్వు పాలోడివా అన్న పాట ఇంకా తెలంగాణ జనం మర్చిపోలేదు. ఉద్యమ పురిటి వాసనలు తెలంగాణలో పోలేదు. తెలంగాణ అంటేనే ఉద్యమ రూపం. కలిసి సాగుదామంటే తెలంగాణలో వున్నంత సఖ్యత ఎక్కడా వుండుదు. కాని ఎప్పుడైతే పెత్తనం ఆలోచనలు ఏపి నాయకులు ఎవరు చేసినా తెలంగాణ సమాజం చీరి చింతకు కడుతుంది. అరవై ఏళ్లపాటు నిరంతరం పోరాటం చేసి, వేలాది మంది అమరులైన త్యాగం మళ్లీ ఏపి నాయకులు ఇక్కడ రాజకీయం చేయడానికా? తెలంగాణను మళ్లీ ఆగం చేయడానికా? నరనరాల్లో మనుషులే కాదు, జీవ జాతులన్నీ, చెట్టు చేమ, పుట్టా, ఆకు, అలము కూడా తెలంగాణ ఉద్యమ దీరత్వాన్ని నింపుకొని వున్నవే. వాటిని కదిలించే ప్రయత్న ఎవరు చేసినా పసిగడుతుంటాయి. పొలిమేర ఆవలకు తరిమేస్తుంటాయి.అందుకే కాలోజీ అన్నట్లు ప్రాంతేతరుడు తెలంగాణలో వేలు పెడితే ప్రాంతం పొలిమేర వరకు తరిమేయమన్నారు. అదే తెలంగాణ సమాజం ఆచరిస్తోంది. తెలంగాణ సాదించి అదే చేస్తోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ వుంటే, తెలంగాణమీద కుట్రలు చేసి, మళ్లీ మర్రి చూడకుండా ఏపికి వెళ్లిన చంద్రబాబును చూసి పవన్‌ కల్యాణ్‌ నేర్చుకోవాలి. జనసేన తెలంగాణలో పుట్టిందని చెబితే తెలంగాణ పార్టీ అయిపోదు. మది నిండా విషపు ఆలోచనలు నింపుకునే ఏపి నాయకులను తెలంగాణ సమాజం ఇక వెయ్యేళ్లయినా క్షమించదు. ఇలాగే చిరంజీవి మెగాస్టార్‌ అని లేని కిరీటాన్ని పెట్టుకొని , ఎన్టీఆర్‌ గెలిచారు. నేను గెలవనా? అనుకొని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రజారాజ్యం పెట్టుకున్నాడు. ఏమైంది? ఎన్టీఆర్‌కు, చిరంజీవికి నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని విసిరి అవతల పడేశారు. తెలంగాణ ప్రకటనకు ముందు సామాజిక తెలంగాణ అని ప్రజలను నమ్మించి మోసం చేయాలని చిరంజీవి చూశారు. అసలు సామాజిక తెలంగాణ అంటే అర్దమేమిటంటే నీళ్లు నమిలాడు. తెలంగాణ ప్రకటన రాగానే జై సమైక్యాంద్ర అన్నాడు. అలాంటి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఏపి నాయకుడే అవుతాడు తప్ప, తెలంగాణ నాయకుడు ఎప్పుడూ కాదు. ఎందుకంటే వారి మనసు వేరు, నిజం వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపి ప్రజలే పవన్‌ను నమ్మలేదు. ఒక్క సీటు కూడా గెలిపించలేదు. పవర్‌ స్టార్‌ అని తనకు తానే గొప్పలు చెప్పుకొని, లేని స్టార్‌ డ్రమ్‌ను చూపించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేసినా ఏపి జనం నమ్మలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు ఇవ్వలేదు. దాంతో అసలైన పవన్‌ బైటకు వచ్చాడు. అబద్దాలు చెప్పితే తప్ప గెలవలేనని నిర్ణయం తీసుకున్నాడు. చెప్పిన మాటే చెప్పి, చెప్పి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాడినే అంటూ మాట్లాడి అమాయకులైన ప్రజలను నమ్మించాడు. అయితే ఒంటరిపోరుతో గెలవలేదు. కూటమి జట్టుకట్టి 20 సీట్లు గెలిచారు. అలాంటి పవన్‌ జనసేన పుట్టింది తెలంగాణలో అంటూ పల్లవి పాడితే తెలంగాణ జనం నమ్మరు. ఆదరించరు. తెలంగాణకు పవన్‌ కూడా ఒక శత్రువే. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజుల పాటు ఉప వాసం వున్నానని, అన్నం తినాలనిపించలేదని అన్నాడు. ఇంట్లోనుంచి బైటకు రావాలంటే కూడా మనసొప్పలేదన్నాడు. తెలంగాణపై అంతటి విషం పెంచుకున్న పవన్‌ తెలంగాణలో వేలు పెట్టాలని చూసినా ప్రజలు సహించరు. 

ఆ మధ్య షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టింది. నాలుగు రోజులు హడావుడి చేసింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక మాట సూటిగా చెప్పారు. ఏపికి చెందిన వారికి తెలంగాణలో రాజకీయం ఏమిటి? కొట్లాడి సాదించుకున్న తెలంగాణలో మీ ఉనికికి చోటెక్కడిది. రాజకీయం కోసం తెలంగాణలో ప్రగతి, అభివృద్ది విషయంలో మాట్లాడుకోవడానికైనా, పొట్లాడుకోవడానికైనా మేం చాలా మందిమి వున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఏపి నాయకులు వేలు పెడితే సహించమని స్పష్టం చేసిన సందర్భం వుంది. పిపిసి. అధ్యక్షుడుగా వున్నప్పుడే రేవంత్‌రెడ్డి షర్మిల విషయంలో అలాంటి అలా స్పందించిన రేవంత్‌ రెడ్డి, ఏ ఇతర ఏపి నాయకులు పెత్తనానికి వచ్చిన సహించరు. అలాగే తెలంగాణ మేధావి వర్గం కూడా వారిని ఆహ్వనించదు. ఒకవేళ బిజేపి తన ఉనికికోసం, సీట్ల సాధన కోసం, అధికారం కోసం జనసేనతో కలిసి వచ్చినా దీర్ఘ కాలంలో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందే తప్ప మేలు జరగదు. తెచ్చుకున్న తెలంగాణకు బిజేపి ద్రోహం చేసినట్లే అవుతుంది. 

ఆంధ్రా పార్టీలు, నాయకులు ఎప్పుడూ తెలంగాణ బాగు కోరుకోరు. తెలంగాణ బాగు పడాలని కోరుకోరు. ఏపి ప్రజలకన్నా,తెలంగాణ ప్రజలు సంతోషంగా వుండాలని ఎప్పుడూ కోరుకోరు. అదే నిజమైతే అరవై ఏళ్లపాటు తెలంగాణను గోస పెట్టకపోయేవారు. తెలంగాణ నాయకులను పాలనలో సమ ప్రాదాన్యం కల్పించేవారు. కేవలం సీట్లు ఎక్కువున్నాయన్న మందబలంతో ఆనాటి నుంచి తెలంగాణ వచ్చేదాక అన్యాయమే చేశారు. తప్ప ఏనాడు రాజకీయంగా తెలంగాణను ఎదగనీయలేదు. ఆర్ధిక పరిపుష్టి కల్గించలేదు. తెలంగాణ రైతును ఆదుకోలేదు. తెలంగాణను ఏ రంగంలో ఎదగనీయలేదు. అన్ని రంగాలను ఆగం చేశారు. తెలంగాణను ఆగం చేశారు. అందుకే 1969 ఉద్యమం వచ్చింది. వందలాది మందిని కాల్చి చంపారు. తెలంగాణ ఉద్యమాన్ని కర్కషంగా అణిచివేశారు. తెలంగాణ నాయకులు చేతనే తెలంగాణ కంట్లో పొడిపించారు. అవకాశవాద నాయకులను అడ్డం పెట్టుకొని ఆధిప్యతం చెలాయించారు. తర్వాత కూడా ఆరని మంటలా తెలంగాణ ఉద్యమం సాగుతూనే వచ్చింది. 2000 సంవత్సరం నుంచి మళ్లీ కేసిఆర్‌ రూపంలో ఉద్యమం మొదలైంది. ఉప్పెనలా మారింది. తెలంగాణ వచ్చింది. ఉద్యమ కాలంలో అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం చేశారు. అణిచివేశారు. కేసులు పెట్టారు. ఉద్యమకారులను జైలు పాలు చేశారు. తెలంగాణ యువకులు ఆత్మాహుతి చేసుకుంటున్నా కనికరించలేదు. ఎందుకంటే ఒక ప్రాంతం మీద పెత్తనం అంటే నాయక వర్గాలకు తరతరాల ఆదాయమే కాదు, పదవీ వ్యామోహం కూడా దాగి వుంటుంది. ఒక ప్రాంత నాయకులు మరో ప్రాంత నాయకులను బానిసలుగా చేసుకొని రాజకీయం చేయడం అహాంకారానికి నిదర్శనం. అది తట్టుకోలేని తెలంగాణ సమాజం 2000 తర్వాత మరింత ఎదురుతిరిగింది. తెలంగాణ సాధించుకున్నది. దాంతో ఆంధ్రా నాయకులకు కంటి మీద కనుకులేదు. హైదరాబాద్‌ను వదిలివెళ్లాలంటే మనసొప్పడంలేదు. నిజానికి ఏపి నాయకులకు ఆ ప్రాంతం మీద మమకారం లేదు. కాని పెత్తనం కావాలి. పదవులు కావాలి. అందుకే ఇప్పటికీ ఏపికి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నాలుగు రోజులు ఏపిలోవుంటారు. మిగతా మూడు రోజులు తెలంగాణలో వుంటారు. ఆస్ధులన్నీ ఇక్కడుంటాయి. పెత్తనం అంతా అక్కడ చేస్తారు. ఈ తిరుడుగు కన్నా, మళ్లీ తెలంగాణను వశం చేసుకోవాలన్న కుట్రను తెలంగాణ వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలు పెట్టారు. ఇక మేక వన్నె పులి లాగా తెలంగాణలో వుంటే తెలంగాణ ప్రజలను, ఏపిలో వుంటే ఏపి ప్రజలను నమ్మించేలా సినిమా డైలాగులు చెప్పి ఏపి డిప్యూటీసిఎం. పవన్‌ నమ్మిస్తూనే వున్నారు. ఒంటరి రాజకీయం కలిసి రావడం లేదని తెలుసుకొని , కూటమి జట్టు కట్టి, బిజేపిని ఒప్పించి, తెలుగుదేశంతో జతకట్టి ఎన్నికలకు వెళ్లారు. ఇచ్చిన సీట్లు తీసుకున్నాడు. బిజేపి తెలుగుదేశం పుణ్యమా? అని గెలిచాడు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో కూడా రాజకీయం చేయాలన్న ఆసక్తిని పవన్‌ పెంచుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపికి చెందిన ఏ నాయకుడు జై తెలంగాణ అనడు. అంటే ప్రత్యేక భావన ఉట్టిపడుతుంది. ఆ మాట అనాలంటే ధైర్యం కావాలి. అది నిజాయితీ వున్న నాయకులే అనగలరు. కాకపోతే మోసం చేయాలనుకునే వారు కూడా అనగలరు. అదే దారిలో నడిచే పవన్‌ ఇంత వరకు జై తెలంగాణ అనేలేదు. కాని తెలంగాణలో రాజకీయం చేయాలని కలలు కంటున్నారు.

Fine rice is boon for poor people

 

· Govt. Support will be continued to millers

· Civil Supplies Commissioner Devendrasingh Chauhan gave interview to ‘Neti Dhathri’ Editor Katta Raghavendra Rao 

· Fine rice distribution caused people to feel happy

· ‘Fine rice’ distribution is a revolutionary decision

· People are appreciating the State Government in this regard.

· ‘It is fortunate for me to launch this programme during my tenure’.

· ‘This remains a challenge in discharging my duties’.

· ‘We have proved that distribution of fine rice is possible.

· This remains an example for the sincerity of the Government

· Millers have key role in distribution of fine rice

· All types of required assistance extended to millers

· Any miller can approach me to explain their problems

· Fine rice distribution is depends on the strength of millers system

· ‘ISO’ also issued certificate for distribution of fine rice 

· ‘Five Star’ rating remains an example for the success of fine rice distribution

· People are now feeling happy

· Representatives from other states inquiring about this fine rice distribution

· Jharkhand minister and officials came here to know about his fine rice distribution

· We explained them with power point presentation

· Representatives from five states already came here and observed at field level

· They took some advises regarding the distribution method of this fine rice.

· Four decades back then Govt. Implemented one kg rice for Rs.2/-

· Now present Govt. Successfully implementing this free rice distribution.

· Telangana remains No.1 in food security.

 

Katta Raghavendra Rao: ‘Namaste Sir’

Devendra Sing Chowhan: ‘Namaste’

Katta: ‘How are you sir?’

Chowhan: ‘Fine…what about you?’

Katta: “Happy sir…there is wide spread positive talk on fine rice. How is the impact of this fine rice distribution among the people?

Chowhan: Really speaking this is an excellent feeling. Providing sufficient food to poor people is really a best scheme. No other scheme can be compared with this scheme. This is mainly meant to fulfill the daily needs of the people. Especially the schemes related to food, shelter, cloth remains in the hearts of people forever. Such governments those implementing these schemes will always receive the support of the people. Providing daily essentials to people is not new. In previous so many governments implemented them. But distribution of fine rice to poor is totally different when compare with them because it provides food security for the needy people. Rs.2/- per kg rice scheme had been implemented since 1985, which provided food security to people. This scheme implemented just four decades back. In those days I think fine rice cost around Rs.4/- per kg. After some time some other governments felt it is not possible to distribute rice at a cost of Rs.2/- per kg and raise the cost to Rs.5/-. After NTR government, during the tenure of Kotla Vijayabhaskar Reddy as Chief Minister, rice distributed to poor with a cost of Rs.1.90 per kg. Later Chandrababu Naidu government increased the rate. After winning the 2004 elections, Dr. YS Rajasekhar Reddy implemented Rs.2/- per Kg. Rice scheme. Then the market price of rice was around Rs.10/- per kg. Later Kirankumar Reddy reduced the cost further to Rs.1/- per kg. Since then, rice distribution has been continuing with affordable prices to poor. When compare to previous schemes, the present distribution of fine rice is unique one and revolutionary in nature. At present fine rice market price is around Rs.50/- per kg. In this situation free distribution of fine rice is really an appreciable one. In previous when ‘doddu biyyam’ distributed, people used to sell out it in the market and continue to purchase fine rice. News regarding this situation published in news papers also. Now distribution of fine rice caused some burden free on poor people. Now it is very happy to see that entire society transformed to the level of consuming the fine rice. Especially the poor people are very happy towards the government for providing them fine rice. They are also happy to consume such fine rice. In previous, these poor people used to sell out their ‘doddu biyyam’ in the market and used to purchase fine rice paying higher prices. Now that situation has been changed. There is no difference in between poor, middle class and upper class. All people have been consuming fine rice equally.

‘Katta’: How you are feeling on receiving ‘ISO’ certificate?

‘Chowhan: ‘I can’t explain this happiness in words. While issuing the certificate they identified the fact about quality rice being distributed to poor. This rice contains more nutrients than the fine rice that available in the market. That means Government not only concentrating on food security but also on health security. This is the main reason name and fame received for ‘fine rice’ scheme implementing in Telangana. In this back ground ISO certificate issued to Civil Supplies department. Now people are happily consuming the fine rice. I wish them all to lead happy and healthy life.

Katta: What is the impact of this scheme in other states?

Chowhan: The implementation of fine rice scheme created repercussions in other states. Now there is growing demand for fine rice distribution in other states. Government representatives from other states are telephoning to give some time to know about this scheme. Jharkhand minister along with government officials came here and observed how this scheme has been implemented. They felt astonished on successful implementation of this scheme. We have explained them with power point presentation on how the scheme being implemented in Telangana. After knowing about this, they returned to their state with fixed mind to implement this scheme. Really speaking this scheme is the brain child of Chief Minister Revanth Reddy. Minister Uttamkumar Reddy also has been working hard for proper implementation of this scheme. As head of implementing authority I feel very happy for the success of this scheme. 

Katta: Rice millers have key role in implementation of this scheme. But it is said that they are also facing some problems.

Chowhan: Yes Rice millers play key role in implementing this scheme. On this occasion I express my congratulations to them.

Katta: It is said that millers wants to meet you to detail their problems.

Chowhan: They are always welcome to meet me. They can tell me the problems being faced. I am available for every miller and they can meet me any time to get proper solutions for the problems being faced. There is no discrimination between small and big miller. Even if you know about any problem they faced, can bring it to my notice. I will immediately attend and resolve the issue being faced. I am ready to give appointment to any miller who wants to meet me. Millers have key role in making success this fine rice scheme in the state. There is no question of negligence. Any miller in single or in group will get immediate appointment with me. I am always being available for them.

Katta Raghavendra Rao: Thank you sir. Let us meet once again.

Chowhan: Thanks…always welcome.

కూకీ మిలిటెంట్లతో మణిపూర్‌లో అశాంతి

సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మిలిటెంట్లు

వీరు మనదేశ పౌరులు కాదు

మయన్మార్‌ నుంచి వచ్చి కూకీ ప్రజలపై ఆధిపత్యం

మత్తుమందుల అక్రమరవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు వీరి నిత్యకృత్యం

మైతేయీల మతసంప్రదాయాలను అడ్డుకుంటున్న కూకీలు

సుప్రీంకోర్టు జడ్జినే బార్‌ అసోసియేషన్‌లోకి అనుమతించని వైనం

మణిపూర్‌లో శాంతి ఎండమావేనా?
హైదరాబాద్‌,నేటిధాత్రి:
మణిపూర్‌లో మైతేయి, కూకీల మధ్య హింసాకాండ జరిగి మే 3తో సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఇంపాల్‌, చురాచంద్‌పూర్‌, కంగ్‌పోక్పీ జిల్లా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల చేశారు. ఈ సందర్భంగా మైతేయి వర్గానికి చెందిన సామాజిక సంస్థ ‘కోఆర్డినేటింగ్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇన్‌టిగ్రిటీ’ మే 3న ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అన్ని పనులు మానుకొని మరీ ఈ సదస్సుకు రావాలని పిలుపునివ్వడంతో, ఎక్కడ ఏవిధమైన అల్లర్లు జరగకుండా పోలీసులు డేగ కళ్లతో నిఘాను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో కూకీ మెజా రిటీ ప్రాంతాల్లో కూకీ విద్యార్థి సంఘం ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ జోమీ స్టూడెంట్స్‌’ బంద్‌కు పిలుపుని చ్చింది. అంతేకాదు చురాచంద్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ‘ఇండీజినియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం’ ఏ ర్పాటుచేసిన ఈవెంట్‌లో పాల్గనాలని ఈ విద్యార్థిసంఘం కూకీలకు పిలుపునిచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన హింసాకాండకు నిరసనగా ప్రజలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని కూడా ఈ సంఘం కోరింది. మే 2023 నుంచి ఇంపాల్‌ లోయ వాసులైన మైతేయీలు, చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నివసించే కూకీ`జో గ్రూపుల మధ్య జరిగిన హింసాకాండలో 240 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేలకు పైగా గాయపడ్డారు. మరో 60వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడం ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ గత ఫిబ్రవరి 9న రాజీనామా చేయడంతో, కేంద్రం అదేనెల 13వ తేదీనుంచి మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన విధించింది. ఇటీవల మైతేయీ, కూకీ తెగలకు చెందిన పౌరహక్కుల సంఘాల నాయకులు మరియు నా గా, మైతేయీ, కూకీ తెగలకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య చర్చలకు ప్రోత్సహించి నా పలితం లేదు.
క్యాన్సర్‌లా పరిణమించిన కూకీ మిలిటెన్సీ
సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (ఎస్‌ఓఓ) కింద కూకీ మిలిటెంట్‌ గ్రూపుల కార్యకలాపాలు ఇప్పుడు మణిపూర్‌ను క్యాన్సర్‌ రోగంలాగా పీడిస్తున్నాయి. నిజానికి ఈ ఒప్పందం కూకీ, మైతేయీ తెగల మధ్య శాంతి స్థాపనకోసం ఉద్దేశించింది. అయితే ఈ ఒప్పందాన్ని అడ్డంపెట్టుకొని, కూకీ మిలి టెంట్లు, కూకీ ప్రజల గ్రామాల్లో తిష్టవేసి, ప్రభుత్వ అధికార వ్యవస్థను ఎంతమాత్రం లెక్కచేయ కుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి ఈ కూకీ మిలిటెంట్లు భారతీయులు కా దు. మయన్మార్‌నుంచి సరిహద్దులు దాటి మనదేశంలో ప్రవేశించి కూకీ తెగల ప్రజలు నివసిం చే పర్యత ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారని చెప్పాలి. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ ప్రాంతాల్లో నివసించే కూకీ తెగల ప్రజలతో కూడిన ‘కూకీలాండ్‌’ ఏర్పాటు వీరి ప్రధానడిమాండ్‌. నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఓ ఒప్పందాన్ని ఖాతరు చేయడంలేదు. బలవంతపు వసూళ్లు, ఆయుధాల అక్రమరవాణా, వేధింపులకు పాల్పడటం వీరికి నిత్యకృత్యమైంది. ఒకవిధం గా చెప్పాలంటే 2023 మే నెలలో రెండు తెగల మధ్య హింస ప్రజ్వరిల్లడానికి ముందే వీరు ఇటువంటి కార్యకలాపాలు యదేచ్ఛగా నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి కూడా వీరిని ప్రోత్సహించినట్లవుతోంది. ఒక్కోసారి వీరు పాల్పడుతున్న స్థానిక నేరాలు, దేశ భద్రతకు ముప్పుగా మారుతుండటం వర్తమాన చరిత్ర.
మిలిటెంట్ల కాల్పులతోనే హింస ప్రారంభం
2023 మే నెలలో ప్రజ్వరిల్లిన హింస నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఎస్‌ ఒప్పందాన్ని ఉల్లం ఘించి, మైతేయీ గ్రామాలపై కాల్పులు జరపడంతో ప్రారంభమైంది. అప్పుడు మైతేయీ ప్రజ లు తమకు అందుబాటులో ఉన్న సంప్రదాయ తుపాకులతో ఎదురుదాడులకు దిగడంతో హింస తీవ్రరూపం దాల్చింది. తర్వాత గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయుధాలను అప్పగించాలని కో రడంతో, మైతేయీ ప్రజలు తమవద్ద వున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. కానీ కు కీ తెగలవారు కొద్ది మంది మాత్రమే ఆయుధాలు అప్పగించడంతో ఇప్పటికీ వారివద్ద అధునాత న అయుధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రామరక్షక దళాలుగా వున్న కూకీల చేతిలో ఇటువంటి ఆయుధాలున్నాయని మైతేయీలు ఆరోపిస్తున్నారు.
ఉన్నతస్థాయివారికీ ఇబ్బందులు
ఇక్కడ కొనసాగుతున్న అరాచక పరిస్థితి ఉన్నతస్థాయికి చెందిన వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నది. ఉదాహరణకు ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.కోటేశ్వర్‌ (ఈయన మైతేయీ తెగకు చెందినవారు)ను చురాచంద్‌పూర్‌ స్థానిక బార్‌ అసోసియేషన్‌లోకి ప్రవేశిం చకుండా అడ్డుకున్నారు. నిజానికి ఈ సంఘటన స్థానిక లీగల్‌ మరియు పౌర హక్కుల సంఘాలను నిర్ఘాంతపోయేలా చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తిని కేవలం మైతేయీ తెగకు చెందిన వాడన్న కారణంగా ఈవిధంగా అనుమతించకపోవడానికి మించిన అ రాచకం మరేదైనా వుంటుందా? ఇది మిలిటెంట్లు చేసిన పనికాదు. చట్టం, రాజ్యాంగం బాగా తెలిసిన వారు పాల్పడిన చర్య.
మైతేయీలపై ఆంక్షలు
ఇదిలావుండగా మైతేయీ తెగల ప్రజలు ఏటా ఏప్రిల్‌ నెలలో ‘తాంగ్‌జిల్‌ పర్వతం’పైకి తీర్థయా త్రకు వెళ్లి అక్కడ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని తరాలుగా ఈ ఆచారాన్ని మైతేయీలు పాటిస్తున్నారు. అయితే కూకీ`జో తెగకు చెందిన ఆరు సంస్థలు ఈ యాత్ర జరుపకూడదని మైతేయీలకు హెచ్చరికలు జారీచేశాయి. ఇది మైతేయీ తెగ ప్రజల సాంస్కృతిక హక్కుపై నేరుగా జరిపిన దాడి! రాజ్యసభ ఎం.పి. తితులార్‌ కింగ్‌ సనజౌబా లీషిం బా తీవ్రంగా ఖండిరచారు. పౌరహక్కుల సంఘాలు కూడా కూకీ తెగల వ్యవహారశైలిని తీవ్రంగానిరసించాయి. కూకీాజో తెగకుచెందిన థాన్‌లాన్‌ వింగ్‌జాజిన్‌ వాల్టే హింస ప్రారంభమైన తొలినాళ్లలో తీవ్రంగా గాయపడ్డారు. కోలుకున్న తర్వాత ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రెండు తెగల మధ్య శాంతి సుస్థిరతలు నెలకొనాల్సిన అవసరం వున్నదని చెప్పడంతో శాంతిపై ఆశలు చిగు రిరించాయి. కొద్దిరోజుల తర్వాత విచిత్రంగా ఆయన మాటమార్చి ‘ప్రత్యేక పాలన’ మాత్రమే మణి పూర్‌లో శాంతికి దోహదం చేస్తుందని మరో వీడియో విడుదల చేయడంతో కూకీ మిలిటెంట్లు ఆయనచేత అలా బలవంతంగా చెప్పించారన్న సంగతి స్పష్టమైంది. కూకీ తెగలో ఉదారవాదుల ను మిలిటెంట్లు తమ నియంత్రణలో వుంచుకుంటున్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ.ఏప్రిల్‌ 21న కాంగ్‌పోక్పీ జిల్లా ఎస్‌.పి. ఆఫీస్‌ నుంచి ఒక ప్రకటన వెలువడిరది. కె.పొన్‌లెన్‌ గ్రామంలో, కాంగ్‌చుప్‌ ఏరియా ప్రొటెక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (కేఏపీడీసీ) ఏప్రిల్‌ 30న ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ స్థానిక సివిల్‌ పోలీసులు, మణిపూర్‌ రైఫిల్స్‌ (ఎంఆర్‌), ఇండియా రిజర్వ్‌ బెటాలియన్లను ఆదేశిస్తూ జారీచేసిన ప్రకటన ఇది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూకీ ఇన్పీ తెగవారు.
రాష్ట్రపతి పాలనతో పరిస్థితి అదుపు
గత ఫిబ్రవరిలో రాష్ట్రపతిపాలన విధించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పువచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్దేశాలున్నప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటికే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. తెగలమధ్య అనుమానాలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర సంస్థలు మౌనాన్ని పాటించడం కూడా ప్రజల్లో ఒకరమైన అస్పష్టత కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే మణిపూర్‌ తన ‘ఉనికి’ కోసం పోరాడుతోంది. ముఖ్యంగా కూకీ మిలిటెంట్ల కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల అక్రమర వాణా, తత్సంబంధిత హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వీరి ప్రభావం పౌరసమాజం, రాజకీయాలు, శాంతిభద్రతలు, సాం స్కృతిక సంస్థల పై తీవ్రంగా వుంటోంది. తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం తాత్సారం చేసే కొద్దీ, ఈ కూకీ మిలిటెంట్లు మరింత బలపడతారు. మతసహనం పాటింపులో పక్షపాత వైఖరి అనుసరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇది ప్రజాస్వామ్య సమర్థకుల్లో విశ్వాసాన్ని దె బ్బతీస్తుంది. వాస్తవానికి మైతీయీలు, కూకీలు పరస్పరం శాంతినే కోరుకుంటున్నారు. కానీ సమస్యల్లా మిలిటెంట్లతోనే! ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతిపాలన పరిపాలనా పరంగా ఒక సానుకూల దశగా వుండాలి. ముఖ్యంగా శాంతి సుస్థిరతలు నెలకొల్పేదిగా, తెగల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దోహదపడేదిగా వుండాలి. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడే ముష్క రులను నియంత్రించాలి. తద్వారా కొత్త ప్రభుత్వం సక్రమంగా పాలన కొనసాగించే వాతావరణాన్ని కల్పించగలగాలి. ఇది d సాధించేవరకు, మణిపూర్‌ను ‘చట్టం’ పాలిస్తుందా లేక తుపాకుల ఆధిపత్యం కొనసాగుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోక తప్పదు!

ఉద్రిక్తతల నడుమ కోలుకుంటున్న కాశ్మీరం

ఆర్థికంగా దెబ్బకొట్టిన ఒకే ఒక సంఘటన

మూకుమ్మడిగా బుకింగ్‌లు రద్దుచేసుకున్న పర్యాటకులు

రద్దు చేసుకున్నవారిలో ముంబై, పూణె, బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ పర్యాటకులు

స్థానికుల్లో ఉగ్రవాదులపట్ల ఆగ్రహావేశాలు

జీవనోపాధిని దెబ్బకొట్టారన్న బాధ

ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న పర్యాటకులు

పరిస్థితి చక్కబడితే మళ్లీ పర్యాటకుల సందడి 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26మంది అమాయక పర్యాటకును ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్న సంఘటన జరిగి పదిరోజులు కావస్తోంది. ఇప్పటికీ పహల్గామ్‌ ప్రాంతం ఈ షాక్‌నుంచి తేరుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే పర్యాటకులు వస్తుండటంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పదిరోజులవరకు పోటెత్తిన పర్యాటకులతో కళకళలాడిన పహల్గామ్‌ ప్రాంతం ఉగ్రసంఘటనతో ఒక్కసారిగా వెలవెలపోయింది. అప్పటివరకు పర్యాటకుల వల్ల వస్తున్న ఆదాయంతో ఎంతో సంతోషంగా వున్న స్థానికుల్లో జీవనాధారం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. శీతాకాలం వారికి ఎటువంటి ఆదాయం వుండదు. ఈ ఎండాకాలంలోనే సంపాదించుకునే ఆదాయమే కశ్మీరీలకు ఏడాది పొడవునా కడుపునా జీవనం గడవడానికి ఆధారం. అటువంటిది ఒక్కసారిగాఆదాయం కోల్పోవడంతో వారిలో తీవ్రమైన నిరాశ ఆవహించిందన్న మాట వాస్తవం. ఎందుకంటే కశ్మీర్‌ సందర్శించే ఒక పర్యాటకుడు రోజుకు సగటున రూ.10వేలు ఖర్చు చేస్తాడు. పర్యాట కుల సంఖ్యను బట్టి ఈ ఆదాయాన్ని లెక్కిస్తే, ఈ రంగం ఎంత చక్కటి జీవనోపాధిని కలిగిస్తున్నదీ అర్థమవుతుంది. ఎంతోకష్టపడి నిర్మించుకున్న ఆకాశహార్మ్యాన్ని ఒక్క అగ్గిపుల్లతో భస్మీపటలం చేయొచ్చు. ప్రస్తుతం పహల్గామ్‌ సంఘటన ద్వారా ఉగ్రవాదులు చేసిన పని ఇదే. పర్యాటక ‘హార్మ్యాన్ని’ కుప్పకూల్చడానికి యత్నించారు.

పర్యాటకానికి తాత్కాలిక బ్రేక్‌

 1988ా89 ప్రాంతంనుంచి అశాంతి, హింసాకాండ మధ్య నలిగిపోయిన కాశ్మీరంలో, 370 అధికరణం రద్దు తర్వాత ప్రగతి ఉషోదయ కాంతులు ప్రారంభమయ్యాయి. మాల్స్‌, సినిమా ధియేటర్లు తెరుచుకున్నాయి, హోటళ్లు, రిసార్టులు పర్యాటకులతో కళకళలాడాయి. స్థానిక కశ్మీరీలు తమ జీవనోపాధికి సంపాదించుకునే అవకాశాలు మళ్లీ మామూలు స్థితికి చేరుకోవడంతో వారి లో సుఖ సంతోషాలు మళ్లీ ప్రారంభయ్యాయి. గత ఆరేళ్లుగా ఎటువంటి ఉగ్రసంఘటన లేకపోవడంతో కశ్మీర్‌ వేగంగా మామూలు స్థితికి చేరుకుంది. సరిగ్గా ఇదేసమయంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో ఇన్నేళ్లుగా క్రమంగా నెలకొంటూ వచ్చిన మామూలు స్థితికి బ్రేక్‌ పడిరది. ఒక్కసారిగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తమ జీవితాలు మళ్లీ కొడిగట్టిపోతాయన్న భయం స్థానికుల్లో వ్యక్తమైంది. నిర్మానుష్యంగా వున్న ఈ ప్రాంతం మాదిరిగానే, కళతప్పిన కళ్లతో మళ్లీ స్థానికుల్లో దీనావస్థ మొదలైంది. జీవనోపాధి కోల్పోయిన స్థానికుల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ సంఘటన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కట్టిపడేస్తున్న కశ్మీర్‌

కానీ భూతల స్వర్గమైన కశ్మీర్‌ పర్యాటకులను తన అందచందాలతో కట్టిపడేస్తూ పదేపదే వచ్చేలాఆహ్వానిస్తూనే వుంటుంది. ఇప్పుడు సరిగ్గా జరుగుతున్నదిదే. ఉగ్ర సంఘటన తర్వాత నిస్తేజంగా మిగిలిన పహల్గామ్‌ ప్రాంతంలో మళ్లీ పర్యాటకుల రాక మొదలైంది. నిజానికి ఉగ్రసంఘటన జరిగిన పహల్గామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని బైసరాన్‌ పర్వతాగ్రంపై వున్న పచ్చిక మైదానాల ప్రదేశాన్ని ‘స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని పేర్కొంటారు. ప్రభుత్వం కూడా భద్రతా కార ణాల రీత్యా మొత్తం 87 పర్యాటక ప్రదేశాల్లో 48 వరకు ప్రభుత్వం మూసివేసింది. దూష్‌పత్రి, కోకెరాంగ్‌, దుక్సుమ్‌, సింథన్‌ టాప్‌, అచ్ఛాబల్‌, బంగస్‌ వ్యాలీ, మార్గాన్‌ టాప్‌, తోసా మైదాన్‌ వంటి పర్యాటక ప్రదేశాలు మూసివేసిన వాటిల్లో వున్నాయి.బుద్గాం లోని దూధ్‌పత్రి, అనంతనాగ్‌లోని వెరినాగ్‌ వంటి సుందర ప్రదేశాల్లోకి కూడా ప్రస్తుతం పర్యాటకులను అనుమతించరు. వీటి మూసివేతను అధికారికంగా ప్రకటించకపోయినా, వీటి ఎంట్రీ ప్రదేశాలు తాళాలు వేసి వుంటున్నాయి. గుల్‌మార్గ్‌, సోన్‌మార్గ్‌, మొఘల్‌ గార్డెన్స్‌, దాల్‌ లేక్‌ వంటి ప్రముఖ పర్యాటక ప్రాం తాలు ఇంకా తెరిచే వున్నాయని చెబుతున్నప్పటికీ మొఘల్‌ గార్డెన్స్‌లోకి ప్రవేశించే గేట్లు తెరుచుకోవడంలేదు.

ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు…

పాక్‌ ప్రేరిత ఉగ్రవాదంతో సతమతమైన ఈ ప్రాంతం, తిరిగి ఇప్పటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టిందనేది నిజం. గత ఏడాది కశ్మీర్‌ను సందర్శించిన వారి సంఖ్య 20మిలియన్లను దాటడం, ఇక్కడ పర్యాటకం ఏ స్థాయిలో ఊపందుకున్నదీ వెల్లడిస్తున్నది. అయితే ఉగ్రసంఘటనతర్వాత పూణె, ముంబయి, బెంగళూరు మరియు పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారనేది టూర్‌ ఆపరేటర్లు చెబుతున్న మాట. 80 నుంచి 90శాతం బుకింగ్స్‌ రద్దయ్యాయని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే అడ్వాన్స్‌ మొత్తాలను చెల్లించిన పర్యాటకులు మాత్రం తమ పర్యాటక ప్రణాళికను యధాతథంగా కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా ఈ సంఘటన నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెన ప్రారంభం మరింత ఆలస్యం కాక తప్పదు. ఈ ప్రాంతంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టు బడులపై కూడా ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే వున్న వ్యాపారాలు బిక్కుబిక్కు మంటూ కొనసాగించక తప్పని పరిస్థితి! ఇదిలావుండగా జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఏప్రిల్‌ 28న అసెంబ్లీలో చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ, మరణించిన 26మంది పేర్లు చదివి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిని క్షమించమని అడగడానికి కూడా మాటలు రావడంలేదన్నారు. 

ఒక్క దాడితో మొత్తం తల్లక్రిందులు

నిజానికి 2025లో కశ్మీర్‌ జీఎస్‌డీపీ 7.06%గా వుండగలదని అంచనా. ఇది దేశ జీడీపీ కంటే ఎక్కువ! 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర సమ్మిళిత వార్షిక ప్రగతి (సీఏజీఆర్‌) 4.89%గా న మోదైంది. ఫలితంగా 2025 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,703గా న మోదైంది. ఉగ్ర సంఘటనలు కూడా 2018లో 223 జరగ్గా 2023నాటికి 46కు పడిపోయాయి. సోపోర్‌ మండి వార్షిక టర్నోవర్‌ 2024లో రూ.7వేల కోట్లకు చేరుకుంది. కుప్వారా, బండిపుర, బారాముల్లా, బుద్గాం ప్రాంతాల ప్రజల జీవనోపాధిని ఈ మండి సుస్థిరం చేసింది. అదేవిధం గా 2020లో 34 లక్షలమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తే, 2024 నాటికి వీరి సంఖ్య 2.36కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ నాలుగేళ్ల కాలంలో పర్యాటకుల సంఖ్య ఇంత విపరీతంగా పెరగడం రాష్ట్ర ఆర్థిక పుష్టికి దోహదం చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యాటక రంగంపై ఆధారపడి 1500 హౌజ్‌ బోట్లు, మూడువేలకు పైగా హోటల్‌ రూమ్‌లు, టాక్సీ ఆపరేటర్లు, టూర్‌ గైడ్‌లు, చేనేత వస్తువుల అమ్మకందార్లు, చిన్న గుర్రాలు (పోనీ)ల నిర్వాహకులు ఆధారపడి బతుకు తున్నారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ ప్రకటన, తర్వాత నాలుగు రోజులకు జరిగిన ఉగ్రదాడి ఈ మొత్తం కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవనోపాధులను అంధకారంలోకి నెట్టేసిందన డం అతిశయోక్తి కాదు. 

ఆత్మవిశ్వాసంతో పర్యాటకులు

వాస్తవానికి 1989 నుంచి పతాకస్థాయికి చేరిన ఉగ్రవాదం నేపథ్యంలో భద్రతా దళాలపైనే, ముష్కరులు దాడులు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి సాధారణ పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో, సర్వేసర్వత్రా వారిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పహల్గామ్‌ వంటి ప్రాంతాలు రాష్ట్రానికి పర్యాటకపరంగా అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తాయి. సంఘటన తర్వాత ప ర్యాటకుల సంఖ్య పడిపోతే, స్థానికుల జీవనోపాధి మాత్రమే కాదు, రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పడిపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. శాల్వలు అమ్ముకునేవారు, డ్రైవర్లు, రి సార్టుల్లో పనిచేసే వర్కర్లు మొదలైనవారిలో ప్రస్తుతం అయోమయం నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న యాత్రికులతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దాడి తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అతుల్‌ కులకర్ణి వున్నారు. వియత్నాం కు చెందిన పర్యాటకులు కూడా పహల్గామ్‌లో సందడి చేశారు. తాము తొలిసారి కశ్మీర్‌ను సందర్శిస్తున్నామని, ఇక్కడి అందాలు తమను మంత్రముగ్ధులను చేస్తున్నాయని, తాము ఇక్కడి సౌం దర్యాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పడం విశేషం. భదేర్వాప్‌ా ప్రాంతాన్ని నేపాలీ సందర్శకుడు సందడి చేశాడు. ఇక్కడి పచ్చికమైదానంలో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. అంతేకా దు ఇక్కడికి వస్తున్న పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటించాలన్న తమ నిర్ణయంలో ఎటువంటి మా ర్పు లేదని దృఢ నిశ్చయంతో చెబుతుండటం విశేషం. ఏదో ఒక్క సంఘటన జరిగిందని పర్యాటకులు తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకో వద్దని, కశ్మీర్‌ ఎల్లప్పుడూ తన స్వచ్ఛమైన సౌందర్యంతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతూనే వుంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్న మాట!

సన్న బియ్యం.. పేదలకు వరం.మిల్లర్లకు ఎప్పుడూ వుంటుంది సహకారం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం సరఫరా, మిల్లర్ల సమస్యలపై ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ ‘‘దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌’’ ఇచ్చిన సమాధానాలు…
`సన్న బియ్యం సరఫరా తెలంగాణ ప్రజల కళ్లలో నిండిన ఆనందం.

`సన్న బియ్యం అందించడం విప్లవాత్మక నిర్ణయం.

`రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రశంసలు.

`నేను కమీషనర్‌గా వున్న సమయంలో ప్రారంభం గొప్ప అనుభూతి.

`నా ఉద్యోగ నిర్వహణలో ఇదొక ఛాలెంజ్‌.

`సన్న బియ్యం సరఫరా సాధ్యమే అని నిరూపించాం.

`పాలకుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

`సన్న బియ్యం సరఫరాలో మిల్లర్ల పాత్ర కీలకం.

`మిల్లర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు వుంటాయి.

`ఏ మిల్లరైనా సరే నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చు.

`మిల్లర్ల వ్యవస్థ ఎంత బాగుంటే సన్న బియ్యం సరఫరా అంత బాగుంటుంది.

`సన్న బియ్యం సరఫరాపై ‘‘ఐఎస్‌ఓ’’ సర్టిఫికేట్‌ కూడా అందించింది.

`‘‘ఫైవ్‌ స్టార్‌’’ రేటింగ్‌తో సన్న బియ్యం సరఫరా సక్సెస్‌ అయ్యింది.

`ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు.

`ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి సన్న బియ్యం సరఫరా మీద వివరాలు తెలుసుకుంటున్నారు.

`తాజాగా జార్ఖండ్‌ నుంచి మంత్రితో పాటు, అధికారులు వచ్చారు.

`వారికి పరవ్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడం జరిగింది.

`ఇప్పటికే ఐదు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

`వారి రాష్ట్రాలలో అమలు కోసం అవసరమైన సలహాలు తీసుకున్నారు.

`‘‘నలభై ఏళ్ల’’ క్రితం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.

`ఇప్పుడు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడమంటే గొప్ప కార్యక్రమం.

`ఆహార భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి

కట్టా రాఘవేంద్రరావు: సార్‌..నమస్తే..

దేవేంద్రసింగ్‌ చౌహాన్‌: నమేస్తే…

కట్టా: ఎలా వున్నారు?

చౌహాన్‌: బాగున్నాను..మీరు.

కట్టా: హపీ సార్‌…సన్నబియ్యం ఒక సంచలనం అంటున్నారు. ప్రజల్లో ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది?

చౌహాన్‌: నిజం చెప్పాలంటే ఇది ఒక అర్భుతమైన ఫీలింగ్‌ అని చెప్పాలి. పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్ప పథకం ఏముంటుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల లక్ష్యం. అందులోనూ కూడు, గూడు, గుడ్డ కూడా సమకూర్చే పథకాల అమలు చేసిన ప్రభుత్వాలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి. నిజానికి ప్రజలను ఆకలి బాధలు పడకుండా ప్రభుత్వాలు చూడడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాకపోకపోయినా, సన్న బియ్యం పధకం కొత్తగా వుంది. ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చడంమొదలు పెట్టి కొన్ని దశాబ్దాలౌతోంది. కాని ఇంత విసృత స్ధాయిలో ప్రజలకు ఆహారభద్రత కల్పించడం అన్నది కొంత కాలం నుంచి మాత్రమే వస్తోంది. ముఖ్యంగా 1985 నుంచి ఈ పధకం గొప్పగా అమలు జరుగుతోంది. అప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అన్నది ఇప్పటికీ అమలు జరుగుతుండడం మంచి పరిణామం. అయితే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అమలు మొదలై ఇప్పటికీ 40 సంవత్సరాలు గుడుస్తోంది. అప్పుడు మార్కెట్‌లో బియ్యం రేటు కూడా నాకు తెలిసి రూ.4 వరకు వుండొచ్చు. అప్పట్లో సన్న బియ్యం కూడా అదే ధరలో వుండొచ్చు. తర్వాత ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం సాద్యం కావడంలేదని కిలో బియ్యం రూ.5కు పెంచిన ప్రభుత్వంకూడా వుంది. కాని 1985లో ఎన్టీఆర్‌ సమయంలో రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు జరిగిన తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1.90పైసలకు కిలో బియ్యం అందించింది. తర్వాత చంద్రబాబు నాయకుడు ప్రభుత్వం దాని ధర పెంచింది. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కిలో రెండు రూపాయలకు మళ్లీ ఆ పదకం అమలు చేశారు. అయితే అప్పటికి మార్కెట్‌లో బియ్యం పది రూపాయలకు పైనే వుంది. తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి దానిని రూపాయికి చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం సరఫరాచేస్తున్నప్పటికీ సన్నబియ్యం సరఫరా అన్నది ఒక విప్లవాత్మకమైనది. గతంలో ప్రభుత్వాలు హమీలు ఇచ్చాయి. కాని అమలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం దరలు రూ.50 వరకు పలుకుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎవరైనా ప్రశంసించాల్సిందే. అంతే కాకుండా అది నేను కమీషనర్‌గా వున్న సమయంలో అమలు కావడం కూడా నా అదృష్టం. మొన్నటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం విషయంలో అనేక రకాల వార్తలు వుండేవి. ఆ బియ్యం ప్రజలు అమ్ముకొని, సన్న బియ్యం కొనుగోలు చేసుకునేవారు అనే వార్తలున్నాయి. కాని ఇప్పుడు ఆ బియ్యం స్ధానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల, పేద ప్రజలపై కొంత భారం తగ్గింది. అందరూ సన్న బియ్యం తినే సమాజ నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు. సామాన్యులకు సన్న బియ్యం తినాలన్న ఆశ తీర్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. బియ్యం తీసుకెళ్లిన వారు ఎంతో సంతోషంగా తింటున్నారు. గతంలో బియ్యం అమ్ముకొని మరిన్ని రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొంత మంది తెచ్చుకునేవారు. కాని ఇప్పుడే పేద, మద్య తరగతి, ఉన్నత వర్గం అన్న తేడా లేదు. తెలంగాణలో అందరూ సన్న బియ్యం తింటున్నారంటే గొప్ప విషయం.

కట్టా: సన్న బియ్యం పధకం అమలుపై ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చింది? ఎలా ఫీల్‌ అవుతున్నారు?

చౌహాన్‌: ఇక ఆ సందర్భం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నదే కాదు ఎంత క్యాలిటీ బియ్యం ఇస్తున్నామన్నది కూడా గుర్తించారు. మార్కెట్‌లో లభించే బియ్యం కన్నా, అదనంగా పోషకాలు వుండే బియ్యం కూడా కలిపి, ప్రజలకు ఆహార భద్రతే కాదు, ఆరోగ్య భద్రత కూడా చేకూర్చేలా బియ్యం సరఫరా జరుగుతోంది. అందుకే అంతర్జాతీయ స్దాయిలో తెలంగాణలో సన్న బియ్యం పధకం పేరుగాంచింది. ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పౌరసరసరఫరాల శాఖకు అందించింది. అది ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రజలు ఎంతో సంబురంగా సన్న బియ్యం తింటున్నారు. వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను.

కట్టా: ఈ పథకం అమలుపై ఇతర రాష్ట్రాలలో ఏదైనా ప్రభావం వుందా?

చౌహాన్‌: తెలంగాణలో సన్న బియ్యం పధకం అమలు అన్నది ఒక సంచనలంగా మారింది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్‌ ఊపందుకున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుంచి వారి ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. సమయం కావాలని కోరుతున్నారు. తాజాగా రaార్ఖండ్‌ రాష్ట్ర మంత్రితోపాటు, ప్రతినిధి బృందం రావడం జరిగింది. ఎలా సాద్యమౌతుందన్న దానిపై వారికి పూర్తి వివరాలు అందించడం కూడా జరిగింది. అందుకు అవసరమైన డెమోతోపాటు, పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్లంతా ఆశ్యర్యపోయారు. తప్పకుండా తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం అమలు చేయడం అన్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అందుకు ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది, అంకితభావం వుంటే తప్ప జరగదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మానస పుత్రికగా సన్న బియ్యం పధకం అందరూ చెప్పుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నబియ్యం పదకం అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆ బాద్యతలు నిర్వర్తిన్న నాకు కూడా ఎంతో సంతోషంగా వుంది.

కట్టా: మీకు మరో ప్రశ్న. సన్న బియ్యం పదకం అమలులో కీలకమైన రైస్‌ మిల్లర్లు వారి సమస్యలున్నాయంటున్నారు?

చౌహాన్‌: నిజమే… సన్నబియ్యం పదకం అమలులో కీలకమైన పాత్ర పోషిస్తున్నది రైస్‌మిల్లర్లే. వారు బాగుంటేనే ఈ పదకం అమలు ఇంకా గొప్పగా సాగుతుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.

కట్టా: మిల్లర్లు మీ దగ్గరకు రాలేకపోతున్నారట? వారి సమస్యలు చెప్పుకుంటారట?

చౌహన్‌: తప్పకుండా…రాష్ట్రంలోని ఏ మిల్లరైనా సరే నా వద్దకు రావొచ్చు. వారి సమస్యలు చెప్పుకోవచ్చు. అందుకు నేను ఎప్పుడూ సిద్దంగా వుంటాను. ఎలాంటి అపోహలు వద్దు. ఇంత పెద్ద సన్నబియ్యం కార్యక్రమం విజయవంతంగా అమలు జరగాలంటే ప్రతి మిల్లర్‌ కూడా ఎంతో ముఖ్యమే. అందులో చిన్నా పెద్దా అనే తేడాలేదు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు కూడా మాకు చెప్పొచ్చు. మీ వద్దకు వచ్చి, సమస్యలు చెప్పిన మిల్లర్‌ను నా వద్దకు పంపించండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పాయింట్‌ మెంటు ఇస్తాను. వారి సమయం కేటాయించడంలో ఎలాంటి జాప్యం వుండదు. తెలంగాణ ఆహార భద్రతలో నెంబర్‌ వన్‌గా వుందంటే అందులో మిల్లర్ల పాత్ర కూడా వుంది. అలాంటి మిల్లర్లను నిర్లక్ష్యం చేయడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. మిల్లర్లు ఒక్కరొస్తారా? లేక కొంతమంది కలిసి వస్తారా? అన్నది వారి ఇష్టం. నేను ఎప్పుడైనా వారికి అందుబాటులో వుంటాను.

కట్టా రాఘవేంద్రరావు: ధన్యవాదాలు సార్‌. మళ్లీ కలుద్దాం.

దేవేంద్ర సింగ్‌ చౌహన్‌: ధాంక్స్‌..ఆల్వేస్‌ వెల్‌కం.

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా?

`సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా?

`రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు?

`వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?

`‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు?

`వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా?

`హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా?

`‘‘రోహిణి’’ ఆసుపత్రికి అనుకూలంగా ‘‘కోర్టు ఆర్డర్‌’’ కాపీ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు?

`ప్రభుత్వం జారీ చేసిన ‘‘జీవో’’, జాబితా మీడియాలో ప్రచురితం కోసమే విడుదల చేశారు.

`మీడియా తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది.

`మీడియాకు గడువు ఇచ్చే హక్కు ‘‘రోహిణి’’కి లేదు.

`ప్రభుత్వ ‘‘జీవో’’ ఆధారంగానే మీడియా వార్తలు రాసింది.

`‘‘రోహిణి’’ ఆసుపత్రి తప్పు చేయకపోయినా ‘‘సిఐడి’’ విచారణ తప్పని యాజమాన్యం చెబుతోంది!

`‘‘సిఐడి’’ వ్యవస్థనే ‘‘రోహిణి’’ యాజమాన్యం శంకిస్తోంది!

`తప్పు ‘‘సిఐడి’’ మీద నెట్టేసి ‘‘రోహిణి’’ తప్పించుకోవాలనుకుంటోంది!

`ఒక రకంగా ప్రభుత్వాన్నే లిరోహిణి’’ యాజమాన్యంసవాలు చేసినట్లైంది!

`మీడియా మీద తోసేస్తే సరిపోతుందా?

`మీడియా కోరుకునేది కూడా అదే నిజమేమిటో నిగ్గు తేలాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
‘‘రోహిణి ఆసుపత్రి’’ యాజమాన్యం నుంచి ప్రజలకు, పత్రికా విలేకరులకు స్పష్టీకరణ పేరుతో ఒక నోట్‌ విడుదల చేశారు.అందులో ఇటీవల కొన్ని డిజిటల్‌ పత్రికలు, యూట్యూబ్‌ ఛానల్స్‌ రోహిణి ఆసుపత్రి యాజమాన్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.ఇదే మాట మీద ఆసుపత్రి యాజమాన్యం నిలబడుతుందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.మీడియాలో వచ్చినవి అబద్దాలు, ఆరోపణలు, వాస్తవ విరుద్దాలని రోహిణి ఆసుపత్రి చెబుతోంది. ఇక్కడ యాజమాన్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలు కాదు. ఆరోపణలు అసలే కాదు. వాస్తవ విరుద్దమైనవి అని దులిపేసుకుంటే సరిపోదు.’’సిఐడి’’ ద్వారా చేసిన విచారణ తర్వాత రూపొందించిన జాబితాలో ఆసుపత్రి పేరు అనుమానాస్పదంగా వుందని నింద ప్రభుత్వం మీద వేస్తున్నారా? లేక ‘‘సిఐడి’’ విచారణ లోప భూయిష్టంగా వుందని యాజమాన్యం భావిస్తుందా? అదే నిజమైతే యాజమాన్యం ప్రభుత్వం మీద కూడా దావా వేయవచ్చు. ‘‘సిఐడి’’కి కూడా నోటీసులు పంపవచ్చు. యాజమాన్యం ఆ దిశగా ముందుకు సాగుతుందా? స్పష్టం చేయాలి. ఎందుకంటే యాజమాన్యం నేరుగా ‘‘ప్రభుత్వాన్నే స్పష్టంగా దోషి’’ అంటోంది. అనుమానాస్పదంగా జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుందని చెప్పడం ‘‘రోహిణి’’ ఆసుపత్రి చేస్తున్న మరో నేరం. ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధుల అక్రమాల నేపథ్యంలో ‘‘రోహిణి’’ ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు, లేదా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడమంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా నిధులు విడుదల చేశారని సూటిగా ఆరోపణలు చేసినట్లు భావించాల్సి వుంటుంది. ప్రభుత్వం ‘‘సీఐడి’’ విచారణకు ఆదేశించినది నిజమే. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్‌ను అధికారికంగా విడుదల చేయలేదు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి వర్గాలు నిర్థారణకు వచ్చిందా? ఏ అధికారిక సమాచారం మేరకు ఈ విషయం స్పష్టం చేస్తున్నారో చెప్పాలి. ఇక ‘‘సిఐడి’’ నివేదిక అనేది పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేది కాదు.రహస్య విచారణలకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయదు.ఈ విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విడ్డూరం.’’సిఐడి’’ నేరుగా తన నివేదికను బహిరంగ పర్చదు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా జివో విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జివో కాపీలోనే ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును చేర్చడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుంది. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును అనుమానాస్పదంగా ‘‘సిఐడి’’ చేర్చిందనడం కూడా నేరంగా పరిగణిస్తారు. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరుతో ఎవరో నకిలీ స్టాంపులు, బిల్లులు తయారు చేసినట్లు చెప్పి యాజమాన్యం తప్పించుకోవాలని చూసినా చెల్లదు. మరింత కఠినమైన శిక్ష బాధ్యులౌతారు. అంతేకాకుండా ‘‘సిఐడి’’ బోగస్‌ విచారణ చేపట్టిందని, ‘‘సిఐడి’’ విచారణ సరైన పద్ధతిలో జరగలేదని యాజమాన్యం సూటిగా ఆరోపణలు చేసినట్లౌతుంది. ఎవరు నకిలీ, ఏది నకిలి అని తేల్చలేనంత అసమర్థంగా ‘‘సిఐడి’’ విచారణ చేసిందని యాజమాన్యం ప్రతికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీనిని ‘‘సిఐడి’’ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి ఏకంగా ‘‘సిఐడి’’ వ్యవస్థనే శంకిస్తోంది. అంటే నేరుగా ప్రభుత్వానికే సవాలు విసిరింది. ‘‘సిఐడి’’ చేసిన విచారణ తప్పు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి అంటోంది.’’సిఐడి’’ వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. లేకుంటే ‘‘సిఐడి’’ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ‘‘సిఐడి’’ నివేదికే బైటకు రాలేదంటున్న ‘‘రోహిణి’’ యాజమాన్యం నివేదికలో ‘‘సిఐడి’’ పొందుపర్చిన పేర్లు ఎలా తెలిసింది? ఆ పేషెంట్లు మా ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేదని ఎలా చెబుతున్నారు? మీడియా వద్ద ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ వుందా? అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘జివో’’ కూడా ‘‘బోగస్‌’’ అని యాజమాన్యం నిర్థారించినట్లేనా? ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ లో వున్న పేర్లు యాజమాన్యానికి ఎలా తెలిశాయి. ‘‘సిఐడి’’ రోహిణి ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారణకు పిలువలేదా?ఆసుపత్రికి వచ్చి విచారణ చేయలేదా? మా ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించకుండానే ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ తయారు చేసిందని ‘‘రోహిణి’’ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా? ‘‘సిఐడి’’ రాలేదని నిర్థారిస్తున్నారా? అందుకు ఐదు రోజుల గడువు సిఐడికి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నారా? ఎందుకంటే మీడియాకు గడువు విధించే అధికారం రోహిణి యాజమాన్యానికి లేదు. ప్రభుత్వమే మీడియాకు ‘‘జీవో’’ తో పాటు జాబితాను ప్రచురణ కోసమే విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసిన జాబితాను అనుసరించే మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. యాజమాన్యానికి నిజంగా ధైర్యం వుంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితా తప్పు అని ప్రకటన చేయాలి. మీడియా మీద తోసేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఇక ‘‘సీఎంఆర్‌ఎఫ్‌’’ నిధులు రోగుల ఖాతాలకు నేరుగా వెళ్లేలా వ్యవస్థ ఉంది. నిజమే…మరి ఈ ఆసుపత్రి పేరుతో నిధులు విడుదల జరుగుతుంటే ఇంత కాలం యాజమాన్యం ఏం చేసినట్లు? ‘‘సిఐడి’’ విచారణకు వచ్చినప్పుడు ఆ బిల్లులు మా ఆసుపత్రికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? చెబితే ‘‘సిఐడి’’ విచారణ ఆ దిశగానే జరిగేది. తెలంగాణలో ఇన్ని ఆసుపత్రులు వుండగా 28 ఆసుపత్రులు తప్పులు చేసినట్లు తేలింది? ఇక మీడియాను సవాలు చేసిన యాజమాన్యం కోర్టు ఉత్తర్వులు ఎందుకు పొందుపర్చలేదు? రోహిణి యాజమాన్యం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి.

జనగణనతో పాటు కులగణన

కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం

`విపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

`కులగణనపై విపక్ష దాడులకు చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం

`ఈ నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మరింత మెరుగు

`బిహార్‌, కర్ణాటక, తెలంగాణల్లో కులగణన నిర్వహించిన ప్రభుత్వాలు

`రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం కులగణనపై వుండే అవకాశం

`జనాభాలెక్కలతో పాటే నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రాగలవు

`కులవ్యవస్థ మరింత బలపడే అవకాశం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) బుధవా రం సమావేశమై కులగణన విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు గట్టి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ కులగణన అంశాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏన్డీఏ కూటమికినేతృత్వం వహిస్తున్న జేడీయూ, గతంలో మహాఘట్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కులగణన చేసింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో 75శాతం వెనుకబడిన వర్గాలున్నట్టు తేలింది. అయితే కులగణను బీజేపీ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. కులాలుగా, వర్గాలుగా హిందువులను ముక్కలుగా చీల్చే ప్రక్రియగా దీన్ని పేర్కొంటూ వచ్చింది. బిహార్‌లో కులగణను ప్రధాన అస్త్రంగాచేసుకొని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు ప్రచారం కొనసాగించడం భాజపాకు మింగుడు పడటం లేదు. ఎన్నికల వాతావరణం తమకే సానుకూలంగా వున్నాయన్న సంకేతాలు స్పష్టంగా వెలువడు తున్నప్పటికీ, తమకు ప్రతికూలంగా మారే ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో, కులగణనపై తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ద్వారా, విపక్షాలకు ముందరికాళ్లకు బంధం వేసేవిధంగా, జనాభాలెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టడానికి నిర్ణయించింది. సీసీపీఏ తీసుకున్న నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ సహా విపక్షాల దాడిని ఎదుర్కోవడంలో డిఫెన్స్‌లో పడిపోయిన ఈ పార్టీలు ఇప్పుడు, విపక్షాలపై తమ ప్రతిదాడులను మరింత తీవ్రం చేసేందుకు ముందడుగులు వేస్తున్నాయి.

వాయిదా పడుతున్న జనగణన

నిజానికి జనగణన 2020లో చేపట్టాల్సివుంది. కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదాపడిరది. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ప్రతి పదేళ్లకోమారు జనగణన చేపట్టాలి. దీని ప్రకారం 2021 నాటికి జనాభా లెక్కల వివరాలు ప్రచురితం కావాల్సి వుంది. కానీ అది ఇప్పటివరకు వాయి దా పడుతూ వచ్చింది. ఇదిలావుండగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక న్యా యం జరగాలంటే కులగణన తప్పనిసరని గతంలో గట్టిగా వాదిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడినవర్గాల వారు విద్యవిషయంలో ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. అన్నివర్గాల ప్రజలకు వనరులను సమాన ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువరావాలంటే కులగణన తప్పదని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. 1927, మార్చి 20న డాక్టర్‌ బాబాసాహెబ్‌అంబేద్కర్‌ కులవివక్షను తీవ్రంగా విమర్శించారు. ఆరోజున నీటికోసం జరిపిన మహద్‌ సత్యాగ్ర హం సందర్భంగా మాట్లాడుతూ, ‘నీటికోసం మాత్రమేకాదు, గౌరవం, సమానత్వం కోసం జరిపేపోరాటం ఇది’ అంటూ పేర్కొన్న అంశం ప్రస్తావనార్హం. ఇదిలావుండగా భాజపా రాహుల్‌పై ఎ దురుదాడి చేస్తూ కుటుంబ పాలనలో కాంగ్రెస్‌ తమపార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల ను ఎంతగా అవమానించిందో తెలుసుకోవాలని కోరింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను పైకి ఎదగనీయకుండా తొక్కేసిన చరిత్ర కాంగ్రెస్‌దంటూ భాజపా ఆరోపిస్తూ వచ్చింది. అయితే కుల గణన ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయని రాహుల్‌ గాంధీ కూడా ఎదురుదాడి చేయడం వర్తమాన రాజకీయ పరిణామం. 

కులగణన రాజకీయం

రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను విలేకర్లకు వివరిస్తూ కేంద్ర రైల్వేశాఖ మం త్రి అశ్విన్‌ వైష్ణవ్‌, కేవలం తమ రాజకీయ లబ్దికోసమే కులగణను ఇండీ కూటమి పార్టీలు లేవ నెత్తుతున్నాయని విమర్శించారు. కాగా రాజ్యాంగంలోని 246వ అధికరణలోని 69వ నిబంధన జనగణనను కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా స్పష్టంగా పేర్కొంది. అయితే బిహార్‌, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకుండా కులగణన పూర్తిచేశాయి. అయితే ఇది కేవలం రాజ కీయ కోణంలోనే తమ ప్రయోజనార్థం చేపట్టిన కార్యక్రమమని, ఇందులో ఎటువంటి పారదర్శకత లేదని అశ్వనివైష్ణవ్‌ స్పష్టం చేస్తూ, కేంద్రం జనగణనతో పాటు చేపట్టే కులగణన ఎంతో పారదర్శకంగా, నిక్కచ్చిగా వుండబోతున్నదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు కులగణన పేరుతో ని ర్వహించిన సర్వేలు సమాజంలో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కులగణను, జనాభాలెక్కలతో పాటు చేపడితే స్పష్టమైన ఫలితాలు వస్తాయన్నారు. పదేళ్ల క్రితం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన నిర్వహిం చింది. అయితే రాష్ట్రంలో బలమైన వర్గాలుగా వున్న వక్కళిగలు, లింగాయత్‌లనుంచి తీవ్ర వ్యతి రేకత రావడంతో ఆ నివేదికను ఇటీవలి కాలం వరకు ప్రభుత్వం బయటపెట్టడం సాధ్యంకాలే దు. బలీయమైన కులాల ప్రభావ తీవ్రతను ఇది మరోసారి బహిర్గతం చేసింది. ఈ కులగణనలో తమకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఇప్పటికీ ఈ రెండు వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నా యి కూడా. 

బిహార్‌లో తొలి కులగణన

కులగణన అవసరాన్ని నొక్కి చెబుతున్న విపక్ష పార్టీలు, దీనివల్ల ప్రతి కులంలో జనాభా సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది కనుక దీని ఆధారంగా ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు పరచ వచ్చునని వాదిస్తున్నాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం విపక్షాలు హిందూసమాజాన్ని ముక్కలుగా విడగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తునాయనేది భాజపా వాదన. అధికార,విపక్ష పార్టీల మాట ఎట్లా వున్నా, దేశంలో కులగణన జరిపిన మొట్టమొదటి రాష్ట్రం బిహార్‌. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 36శాతం రాష్ట్రజనాభా అత్యంత వెనుకబడిన స్థా యిలో వున్నట్టు తేలింది. బిహార్‌ రాష్ట్రం మొత్తం జనాభా 13కోట్లలో 27.13% మంది ప్రజలు వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు. 15.52% సాధారణ కేటగిరి ప్రజలుగా తేలింది. ఈ కులగణను రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో కుటుంబాల వారీగా జరపగా, రెండో దశలో సామాజిక, ఆర్థిక, కులపరంగా నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ప్రస్తుతం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్‌ సదుపాయ పరిమితి 50%ని ఎత్తేస్తామని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 

ఇప్పటివరకు మూడు కులగణనలు

దేశంలో మొట్టమొదటి కులగణన 1871ా72లో నాటి బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం చేపట్టింది. రెండో కులగణను 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్వహించింది. దాని తర్వాత 2011లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక మరియు కులగణనను నిర్వహించింది. దీని ప్రకారం దే శంలో 46.7లక్షల కుల/ఉపకుల గ్రూపులున్నట్టు తేలింది. అయితే సేకరించిన సమాచారం స్థి రంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి కులగణన వల్ల లాభనష్టాలు రెండూ వున్నాయి. ముందుగా ప్రయోజనాల విషయానికి వస్తే ఏఏ కులాల్లో ఎంతమంది జనాభా వున్నారనేది స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను జనాభా ఆధారంగా రూపకల్పన చేయవచ్చు. ఇదే సమయంలో పేదరికంలో మగ్గే వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవచ్చు. అంతేకాదు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆయా వర్గాల ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే ఈ కులగణనలో కొన్ని ప్రతికూలతలు కూడా వున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు, వెనుకబడిన కులాల పేర్లలో కొద్ది తేడా మాత్రమే కనిపిస్తుంది. ఉదాహరణకు ‘సెన్‌’ అనే కులం బెంగాల్‌లో అగ్రవర్ణం కాగా, ‘సెయిన్‌’ ఓబీసీ వర్గానికి చెందినది. చిన్న స్పెల్లింగ్‌ తప్పు జరిగినా పథకాల అమలు తారుమారు కావడం ఖాయం. బిహార్‌ కులగణనలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతిని గుర్తుంచుకోవాలి. బిహార్‌ కులగణనలో ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల కారణంగా సమాచారాన్ని తారుమారుచేసే అవకాశాలు అధికమన్న విమర్శలు వచ్చాయి. సమాజంలో కులవ్యవస్థ మరింత కఠినంగా మారే ప్రమాదం ఏర్పడిరది. ఈ కులగణన నేపథ్యంలో, అధిక జనాభా కలిగిన కులాలవారు తమ నిష్పత్తికి అనుగుణంగ ప్రయోజనాలు కల్పించాలన్న డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను కులాల ఆధారంగా అమలు చేయడమనేది ఒక ప్రామాణికతను సంతరించుకునే పరిస్థితి నెలకొంది. కులగణన చేపట్టేముందు ఇటువంటి ప్రతికూలతలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో వుంచుకోవాలి. కాకపోతే ఈ కులగణన చేపట్టిన రాష్ట్రప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం ప్రజల సంక్షేమం అనేదానికంటే, అధిక జనాభా కలిగిన వర్గాలకు ఎక్కువ రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్న ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే మనదేశంలో స్వాతంత్య్రానంతరం కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి రాజకీయాలకు సమాధికట్టి, దానికి ఎప్పటికప్పుడు పాలరాతితో అద్భుతమైన ‘అవినీతి’ కళాఖండాలను జోడిస్తూ ప్రపంచపు వింతల్లో ఒకటిగా పరగణించే ‘తాజ్‌మహల్‌’ను తలదన్నే స్థాయిలో తీర్చిదిద్దాయి. దీనికి ఎప్పటికప్పుడు మరింత నగిషీల సొబగులు చేర్చడం తప్ప సంక్షేమం అమల్లో చిత్తశుద్ధి అనేదానికి ఎప్పుడో ‘తర్పణాలు’ వదిలేశాయి. ఒక్కపక్క కులరహిత సమాజం రావాలని సుద్దులు చెప్పే పార్టీలు తమ స్వార్థం కోసం కులవ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. నిజంగా పార్టీలకు చిత్తశుద్ధి వుంటే, సమాజంలో ‘ధనిక’, ‘పేద’ అనే రెండు వర్గాలనే గుర్తించి (కుల,మతాలకతీతంగా) పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్‌ ఆశయాలను సాధించినట్టుగా పరిగణించాలి. అంతేకాని స్వార్థం కోసం ఆ మహనీయుని పేరును ఉపయోగించుకోవడం అలవాటు కాకూడదు!

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

బెంగాల్‌ హిందూ ఓటర్లను ఆకర్షించలేకపోతున్న బీజేపీ

సంస్థాగత బలం లేకపోవడం పెద్ద లోటు

బలమైన కార్యకర్తల బేస్‌ అవసరం

ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు

గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకోసం మమత అమలు చేస్తున్న పథకాలు

బీజేపీ పట్ల బెంగాలీల్లో వ్యతిరేక భావం

భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు

ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న రాడికల్‌ ముస్లింలు

భద్రత కొరవడి బిక్కుబిక్కు మంటున్న హిందువులు

వక్ఫ్‌ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తుల విధ్వంసం

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో రెండోతరగతి పౌరులుగా హిందువులు

హిందువులపై దాడులు సర్వసాధారణం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో తమపై దాడులు జరుగుతున్నా, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నా, మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తున్నప్పటికీ, పశ్చిమబెంగాల్‌ హిందువుల్లో చాలామంది ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేస్తుండటం విచిత్రమనిపిస్తుంది. ఇటీవల వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ముర్షిరాబాద్‌ జిల్లాకు చెందిన జఫ్రాబాద్‌ అనే ఒక చిన్న పట్టణంలో మైనారిటీలుగా వున్న హిందువులకు చెందిన ఏ ఒక్క ఇల్లుదాడికి లేదా లూటీకి గురికాకుండా లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పెచ్చరిల్లిన హింస ప్రభావాన్ని ఇక్కడి హిందువులు చవిచూశారు. ఈ చిన్న పట్టణం కోల్‌కతాకు 284 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ 25వేల మంది ముస్లిం జనాభా వుంటే, హిందువు లు కేవలం 5100 మాత్రమే. షంషేర్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పట్టణం వుంది. ఈ నియోజకవర్గంలో 2.16లక్షల మంది ఓటర్లుండగా ఇందులో 80శాతం మంది ముస్లిం లే. ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి తప్ప మరొకరు గెలవరు. ముస్లిం మెజారిటీ ప్రాంతా ల్లో హిందువుల బతుకులు ఎంత దుర్భరంగా వుంటాయనేదానికి జఫ్రాబాద్‌ పట్టణం ఒక ఉదా హరణ మాత్రమే! మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాల పుణ్యమాని, ఇక్కడి హిందువులు ఎన్ని బాధలు పడుతున్నా పోలీసులు కూడా పట్టించుకోరు. రాష్ట్రంలో ముస్లింలు మెజారిటీలుగా వున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది. 

హిందువుల్లో ఓటింగ్‌ శాతం తక్కువ

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.6కోట్లు. వీరిలో హిందువులు 68శాతం. హిందువుల్లో బెంగాలీ హిందువులు 54శాతం వుంటే, గుజరాతీలు, మార్వాడీలు, యు.పి, బిహార్‌ ప్రాంతా లనుంచి వచ్చిన వారు, గూర్ఖాలు, గిరిజనులు కలిసి 14శాతం వుంటారు. అంటే బెంగాలీ హిం దువులు 4.1 కోట్లు కాగా, బెంగాలేతర హిందువుల సంఖ్య 1.6కోట్లు. ఇక రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల సంఖ్య 2.43కోట్లు. బెంగాల్‌లో సాధారణంగా ఓటింగ్‌ శాతం 80శాతానికి పైగా నమోద వుతుంది. ముస్లిం ఓటర్లు 90 నుంచి 94శాతం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుం టే, హిందువులు కేవలం 65శాతం మంది మాత్రమే పోలింగ్‌ బూత్‌లకు వెళతారు. అంటే రా ష్ట్రంలోని మొత్తం 5.16 కోట్ల హిందువుల్లో కేవలం 3.5కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు విని యోగించుకుంటున్నారు. అదే 2.43కోట్లమంది ముస్లింలలో 2.18కోట్లమంది ఓట్లు వేస్తారు. దీవల్ల రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లను పరిశీలిస్తే హిందువుల ఓట్లు కేవలం 3.16లక్షలు మాత్రమే అధికంగా పోలవడం గమనార్హం. 

హిందువుల్లో 66శాతం మంది బీజేపీకి మద్దతు

2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 2.75కోట్ల ఓట్లు (45.76%) పోల్‌ కాగా, బీజేపీకి 2.33 కోట్ల (38.73%) ఓట్లు పోలయ్యాయి. అంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 42.37లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పడటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు మొత్తం హిందువులవే. 3.51కోట్లమంది హిందువులు ఓటుహక్కును వినియోగించుకోగా, ఇం దులో 2.33కోట్ల మంది బీజేపీకే తమ ఓట్లు వేసినట్లు తేలుతోంది. అంటే మొత్తం పోలైన హిందూ ఓట్లలో 66శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఓటువేసారని స్పష్టమవుతోంది. అంటే మిగిలిన 34శాతం (1.18కోట్లు) ఇతర పార్టీలు ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటు వేసారను కోవాలి. వీరిలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకు 64లక్షల మంది హిందువులు అనుకూలంగా ఓటు వేయగా మిగిలినవారు తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. 

ఈ విశ్లేషణను పరిశీలిస్తే 34శాతం మంది హిందువులు ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ మరియు లెఫ్ట్‌ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.

హిందువులపై యదేచ్ఛగా దాడులు

 హిందువుల వేడుకలు, ఊరేగింపులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పండుగల సందర్భంలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. హిందువుల పట్ల ప్రభుత్వం పూర్తి పక్షపాత వైఖరిని అవలంబిస్తోంది. ఇస్లామిక్‌ ఛాందసవాదులు నిర్హేతుక కోర్కెలకు తలగ్గి ఎన్నో తరాలుగా కొనసాగుతున్న హిందువుల పండుగలు, వేడుకలపై మమత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. హిందువులపై దాడులకు, హింసాకాండకు పాల్పడిన ఇస్లామిక్‌ ఛాందసవాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. దీన్ని అలుసుగా తీసుకొని మతఛాందసవాదులు యదేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇస్లామిస్టులు దాడులకు తెగబడటానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వం అండ వున్నదన్న ధైర్యంతోనే! ఉదాహరణకుచందన్నాగోర్‌ సబ్‌డివిజన్‌కు చెందిన చంపదాని పట్టణంలో హిందువుల జనాభా 76%. కానీ ఏప్రిల్‌ 11న శుక్రవారం నమాజు ముగిసిన తర్వాత ఇస్లామిక్‌ రాడికల్స్‌ హిందువుల ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కర్రలు, లాఠీలు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న రాడికల్‌ ముస్లింలు, పోలీసులను కూడా తరిమివేశారు. 

ఇస్లామిక్‌ రాడికల్స్‌ దాడులనుంచి తమను తాము కాపాడుకోవడానికి బెంగాలేతర హిందూ యువకులు గ్రూపులుగా ఏర్పడి ఇస్లామిస్టులను నిరోధిస్తున్నప్పుడు, పోలీసులు వీరినే నియంత్రించా రు తప్ప దాడులకు పాల్పడిన వారిని పల్లెత్తుమాట అనుకపోవడం బెంగాల్‌లో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. ఆవిధంగా తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా హిందువుల కు రక్షణ లేకుండా పోయింది. బెంగాల్‌లోని గ్రామీణ, పట్టణ, సెమి అర్బన్‌ ప్రాంతాలకు చెందిన హిందువులకు ఈ దాడుల అనుభవాలు వెన్నాడుతున్నాయి. 

పేదలకు అనుకూల పథకాలు

మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకునా, రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం కుంచించుకు పోతుండటంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో అత్యధికశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. మమతా బెనర్జీ అమ లు చేస్తున్న పథకాల వల్ల, లక్షల సంఖ్యలో బాలబాలికలు పాఠశాలలకు వెళ్లగలుగుతున్నారు. ఉన్నత విద్యకూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా మమతా బెనర్జీ ఆయా వర్గాల ఓట్లను కోరుతున్నారు. తమకు అందుతున్న పథకాల ప్రయోజనం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన పేద హిందువులు తృణమూల్‌ కాంగ్రెస్‌కే అనుకూలంగా వుంటున్నారు. ఇదే సమ యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనాలు పొందు తుండటం ఓటుబ్యాంకు పటిష్టంగా వుండటానికి మరో కారణం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రభుత్వ భూమిలో ఒక టీస్టాల్‌ లేదా దుకాణాన్ని నడుపుకోవడం, పన్నులు చెల్లించకుండా చట్టవిరు ద్ధంగా ఆటోరిక్షాలు నడుపుకోవడానికి పేదలకు స్థానిక తృణమూల్‌ నాయకులనుంచి మద్దతు లభిస్తోంది. అదేవిధంగా చట్టవిరుద్ధంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లను నడుతున్న లక్షల సంఖ్యలో ప్రజలు కూడా తృణమూల్‌కు గట్టి మద్దతుదార్లుగా వున్నారు. 

స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు

చాలామంది బెంగాలీ హిందువులు బీజేపీని బయటినుంచి వచ్చిన పార్టీగా పరిగణిస్తారు. బీజేపీ చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఇందుకు కారణం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యంగా బీజేపీ ఉత్తరభారత్‌కు చెందిన పార్టీగా ఇక్కడి ప్రజలు పరిగణిస్తారు. తమకు బీజేపీకి ఎంత మాత్రం పొసగదన్న అభిప్రాయం దృఢంగా వుంది. ఇదే సమయంలో భాజపాకు రాష్ట్రంలో గట్టి సంస్థాగత బేస్‌ ఇంకా ఏర్పడలేదు. అటువంటి బేస్‌ ఏర్పడితే, ఓటర్లు ధైర్యంగా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోగలుగుతారు. అరాచకానికి, హింసాత్మక రాజకీయాలకు పెట్టింది పేరుగా వున్న బెంగాల్‌లో ఏ రాజకీయ పార్టీ అయినా తన మద్దతుదార్లకు రక్షణ క ల్పించే స్థితిలో వుండాలి. బీజేపీకి అటువంటి సంస్థాగత బలం లేకపోవడంతో ఎంతోమంది హిందువులు పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్‌ బూత్‌లకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు బూత్‌ స్థాయిలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన కార్యకర్తల బలం బీజేపీకి లేదు. ఇక పట్టణ ప్రాంత బెంగాలీలు ప్రత్యేకించి కోల్‌కతా నగరానికి చెందిన హిందువులు లెఫ్ట్‌ పార్టీలకు అనుకూలం. ఎప్పుడైతే కమ్యూనిస్టులు తెరమరుగైపోయారో వీరంతా తృణమూల్‌ కాం గ్రెస్‌ మద్దతుదార్లుగా మారిపోయారు. వీరు బీజేపీని మతతత్వ పార్టీగా విస్తృతంగా ప్రచారం చే స్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బెంగాలేతరుల జనాభా అధికం. వీరంతా తృణ మూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారు. ఇటువంటి బెంగాలేతర వర్గాలనుంచి ప్రముఖ నాయకులను ఆకర్షించడంలో బీజేపీ ఇంకా సఫలీకృతం కాలేదు. దీంతో పాటు వీరిని విస్మరించడం కూడా పార్టీకి ప్రతికూలతగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అనుకూలుడైన సమర్థ నాయకుడిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. హిందువుల్లోని అన్ని వర్గాలను ఆకర్షించగలిగే ఛరిష్మా నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. ఇన్ని కారణాల నేపథ్యంలో ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడిపే పార్టీలకు హిందూ ఓటర్లు అనుకూలంగా వుండటంలో పెద్ద విశేషమేం లేదు. బలం వున్నవాడి వైపే వీరు మొగ్గు చూపుతున్నారు. ఇదే తృణమూల్‌కు లాభం.

అధికారులుగా చేయలేని సేవ..నాయకులుగా చేస్తారా?

-రాజకీయాలంటే మాటలు కాదు..అధికారుల పెత్తనం అసలే కాదు!

-అప్పుడు జనానికి దూరం…ఇప్పుడు దగ్గరయ్యేందుకు ఆరాటం?

-అధికారులు రాజకీయాలు…రాణించలేక అవస్థలు!

-రాజకీయాలలోకి అధికారులు..సక్సెస్‌ కాలేక తలనొప్పులు!

-ఏదో ఒక పార్టీలో చేరి పదవులు పొందిన వారున్నారు.

-ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు.

-మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

-అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు.

-రాణించలేక చతికిలపడిపోతున్నారు.

-ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు.

-అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు.

-నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు వున్నారు.

-రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారున్నారు.

-ఉనికి కోసం తహతహలాడుతున్నారు.

-అధికారిగా వున్నప్పుడు ప్రజలకు దూరంగా వున్నారు.

-రిటైర్‌ అయ్యాక రాజకీయాలలో చేరి జనాన్ని ఉద్దరిస్తామంటారు.

-రాజకీయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు.

-సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు.

-వున్న పేరును చెడగొట్డుకొని, విమర్శల పాలౌతున్నారు.

-రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో వుంటున్నారు.

-ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్‌ లో పాల్గొంటున్నారు.

-ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయ అని ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉద్యోగులు ముదిరితే నాయకులౌతారంటే ఇదేనేమో! రాను రాను రాజకీయాల్లోకి ఉద్యోగులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులుగా ఎడాపెడా సంపాదించి, తర్వాత వాటిని రాజకీయాల కోసం కొంత ఖర్చు చేసి, మరింత దోచుకునేందుకు మార్గం వేసుకునే వారు చాలా మంది క్యూలో వున్నట్లున్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందన్నది ఎంత నిజమే ఉద్యోగులు నాయకులైతే కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ప్రజలు కూడా వారి నుంచి ఏదీ ఆశించడం లేదు. నిజాయితీగా ఉద్యోగం చేసిన ఎంత పెద్ద అధికారులైనా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని కొంత మంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వాళ్లేమీ జీవితాలు త్యాగంచేసిన వారు కాదు. ఉద్యోగం చేసిన నాడు వారి జీతాల నుంచి జనానికి సేవ చేసిన వారు కాదు. కాని ఆగష్టు 15, జనవరి 26 నాడు పుటక్కున దేశ భక్తి పుట్టుకొచ్చి, జెండా వందనం అయిపోగానే చట్టుక్కున మర్చిపోయినట్లే వుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం వారి జీవిత కాలం మొత్తం సామాన్యుడిని దగ్గర తీసుకున్న సందర్భాలే వుండవు. కాని అంతా అయిపోయాక రాజకీయాల్లోకి వచ్చే ముందుకు ఎవరూ చూడని, వినని ముచ్చట్లన్నీ చెప్పేస్తుంటారు. జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. ఇయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి. తమకు తాము గొప్ప బలవంతులమని, అతి విశ్వాసానికి వెళ్లిన నాయకులెవరూ తెలుగు రాష్ట్రాలలో సక్సెస్‌ అయిన వారు లేరు. ముందుగా చెప్పుకోవాల్సిన నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌. ఏకంగా లోక్‌సత్తా అనేపార్టీ పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి రహితసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తానన్నాడు. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఓ పదేళ్ల పాటు రాజకీయం చేశాడు. కాని ప్రజలు ఆదరించలేదు. పైగా ఆయనకు రాజకీయాలు చేసేంత సొమ్మెక్కడిది అని జనం ప్రశ్నించుకున్నారు. ఒక దశలో హైదరాబాద్‌ నగరమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని అనేక నగరాల్లో లోకస్‌ సత్తాను ముందుగా విస్తరించాలని చూశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌తోపాటు, అనేక నగరాల్లో లోక్‌ సత్తా గురించి ఆయన చేసిన ప్రచారం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది? అన్న ప్రశ్న మొదలైంది. దాంతో అప్పటి నుంచి ఆయన పతనం కూడా మొదలైంది. ఏపి ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ప్రజలు దరి చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం మీద లేని పోని కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. 2009లో ఓసారి జనం నమ్మి చూద్దామని కూకట్‌ పల్లి నుంచి గెలిపించారు. కాని ఆయన నాయకుడిగా పనిచేయలేదు. అమెరికాలో రాజకీయం ఇలా వుంటుంది. లండన్‌లో ఇలా వుంటుంది. ఇక్కడ కూడా అదే అమలు చేద్దామన్నట్లు మాటలు చెప్పారు. ప్రజలకు దూరమయ్యారు. రేషన్‌ కార్డు కోసం మన దేశంలో నాయకుడికి దగ్గరకు వెళ్లడమే ప్రజలకు అలవాటు. అదే రివాజు. తర్వాత అదికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో రేషన్‌ కార్డు కావాలంటే రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవాలి. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా?అని అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే సామాన్యుడికి ఎంత దగ్గరగా వుంటే నాయకుడు అంత ప్రజల గుండెల్లో వుంటాడు. అధికారికి ప్రజలకు దూరం వుండడమే తెలుసు. డాబు, దస్కం చూపించడమే అలవాటు. అలాంటి వారు ప్రజలకు చేరువ కావడం అన్నది దుర్లభం. ఎంత మంది అదికారి అనే పేరున్నా, నేరుగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కాలేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు తటస్ధులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, సరికొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఎన్నికల్లో మాజీ సిబిఐ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన విజయరామారావును ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేయించారు. అలా మరి కొంత మందికి అవకాశాలు కల్పించారు. ఆ ఎన్నికల్లో వాళ్లంతాగెలిచారు. అందులో ఓ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నలుగురు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజలకు గుర్తు కూడా లేరు. కాకపోతే ఒక్కసారైనా గెలిచారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. అలా ఒకపార్టీని నమ్ముకొని రాజకీయాలు చేసిన ఉద్యోగులు అంతో ఇంతో రాజకీయంగా కూడా రాణించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ లాంటి వారు రాజకీయాలలో ఇప్పటికీ కీలకభూమిక పోషిస్తున్నారు. తొలి తెలంగాణ మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్‌ ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మండలి సభకు చైర్మన్‌ అయ్యారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్‌ నాయక్‌ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. కాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే గెలవలేకపోయారు. బిఆర్‌ఎస్‌లో చేరి వుంటే ఎప్పుడో రాజకీయంగా మరో స్ధాయిలో వుండేవారు. కాని ఆయన వేసిన తప్పటడుగుల మూలంగా పార్టీ పెరిగింది లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచింది లేదు. కాకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపడంతో ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఎన్నికల ముందు పోలీస్‌ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ , తన ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా దాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంమీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. కాని బిఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. అప్పుడు గాని రాజకీయాలంటే ఏమిటో ఆయనకు అర్ధం కాలేదు. దాంతో బిఎస్పీని వదిలేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదికారంలో వున్నప్పుడే ఆయన పార్టీలో చేరితే ఆయన రాజకీయం మరోలా వుండేది. కాని ఆయన అడుగడుగునా కేసిఆర్‌ను విమర్శిస్తూ వెళ్లారు. ఒక రకంగా బిఆర్‌ఎస్‌ ఓటమికి ఆయన కూడా నీటి బొట్టుగా మారారు. అప్పుడు కేసిఆర్‌ను తూర్పార పట్టిన ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు ఆకాశానికెత్తుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా అవకాశ వాద రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారని అర్దం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉద్యోగులు కొంత మంది రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరి పదవులు పొందిన వారున్నారు. వరంగల్‌ ఎంపిగా రెండు సార్లు గెలిచిన సిరిసిల్ల రాజయ్య ఒకప్పుడు ఉద్యోగం చేసిన వారే. ప్రస్తుత మహబూబాబాద్‌ ఎంపి బలరాం నాయక్‌ కూడా ఒకప్పుడు ఉద్యోగి. ఆయన గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి మళ్లీ ఎంపిగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీచర్‌గా పనిచేసిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఒకటి రెండు ఓటములు తప్ప ఆయన వరుస విజయాలు సాదిస్తూవచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేసును పర్యవేక్షించిన సిబిఐ. జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఇంటిపేరు జేడిగా స్ధిరపర్చుకున్న లక్ష్మి నారాయణ రాజకీయాల్లో విజయాలు చవి చూడలేకపోతున్నారు. సొంతంగా పార్టీ పెట్టి చతికిలపడిపోయారు. కొన్ని పార్టీలు తిరిగి అక్కడ కూడా నెగల్లేక పోయారు. ఇప్పుడు రాజకీయాలపై యువత అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నారు. మీడియాలో విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. ఎంతో సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు వున్న పేరును రాజకీయాల్లోకి వచ్చి చెడగొట్టుకున్నారు. ప్రజల్లో వున్న గుర్తింపు తనకు తానే చెరిపేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మాట కోసం మీడియా ఎగబడిపోతుండేది. ఇప్పుడు తన మాటలు చెప్పడంకోసం మీడియా సంస్దల చుట్టూ లక్ష్మినారాయణ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏంసేవ చేశారో లేదోగాని, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామనుకుంటు ప్రజలు స్వాగతించలేదు.
ఇక పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాణించాలని కూడా చూస్తున్నారు. వారిపై మరో ప్రత్యేక కధనం త్వరలో…

‘‘కేసిఆర్‌ గర్జన’’..’’కాంగ్రెస్‌ లో తర్జనభర్జన!’’

-ప్రజలంతా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూశారు

-చాలా కాలం తర్వాత ‘‘కేసీఆర్‌’’ ను చూసిన ఆనందంలో కేరింతలు కొట్టారు

-‘‘కేసీఆర్‌’’ ప్రసంగంలో ఉగ్రరూపం కన్నా, సమగ్ర రూపానికి విలువిచ్చారు

-శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేశారు

-తెలంగాణకు కాంగ్రెస్‌ విలన్‌ అన్నారు

-కాంగ్రెస్‌ వైఫల్యాలను జనం చేత చెప్పించారు

-మొదటి సారి ప్రజలను ‘‘అన్నలు’’ అని పలుసార్లు సంబోధించారు

-తనదైన శైలికి భిన్నంగా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూపించారు

-ఒక్కో పథకం ప్రస్తావిస్తూ చురకలు అంటించారు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు

-తన కళ్ల ముందే తెలంగాణ తెర్లవుతుంటే తట్టుకోలేకపోతున్నాన్నారు

-మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయే అని శ్రేణులలో భరోసా నింపారు

-ఏడాదిన్నర సమయం కాంగ్రెస్‌ కు ఇచ్చానన్నారు

-ఇక ఆగేది లేదంటూనే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్ధామన్నారు

-పనిలో పనిగా పోలీసు శాఖను హెచ్చరించారు

-బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను ప్రశంసించారు

-స్వయంగా నేనే శ్రేణులకు అందుబాటులో వుంటానన్నారు

-సభ ఊహించినట్లే సక్సెస్‌ అయింది

-డ్రోన్‌ కళ్లకందనంత సభా ప్రాంగణం నిండిపోయింది

-నింగి వంగి నేల పొంగిందన్నట్లు జనం వచ్చారు

నిర్వాహకులు ‘‘ఎమ్మెల్సీ పోచంపల్లి’’, ‘‘ఎమ్మెల్సీ తక్కల్లపల్లి’’ ‘‘పెద్ది’’,’’దాస్యం’’ లను అభినందించారు

-అశేష జనవాహిని చూసి కేసీఆర్‌ మురిసిపోయారు

-ఖమ్మం నుంచి అత్యధికంగా ప్రజలు తరలివచ్చారు

-రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు’’ అందరికన్నా ఎక్కువ మందితో సభకు వచ్చారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిఆర్‌ఎస్‌ రజతోత్సవ రోజున ప్రకృతి పరంగా కూడా ఒక అద్భుతం జరిగింది. ఇది ఎవరూ ఊహించలేదు. అసలు ఊహకుకూడా అందలేదు. మండు వేసవిలో 45 డిగ్రీల ఎండలో సభకు జనం ఎలా వస్తారో..ఎండలో సభలో ఎలా వుంటారో అని అందరూ అనుకున్నారు. నిప్పులు కక్కే ఎండలను తట్టుకొని వచ్చేదెంత మంది అని కూడా అనుకున్నారు. కాని బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వాతావరణం సహకరించడం అన్నది గొప్ప విషయం. విశేషం కూడా. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. మండు వేసవిలో తెలంగాణ మలయమారుతంలాగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా మారిపోయింది. సభ జరగడానికి ఒక రోజు ముందుకు కూడా నిప్పులు వేడిమి వుంది. సభ తెల్లారి కూడా మళ్లీ ఎండ విపరీతంగా కాసింది. సభ జరిగిన రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని వాతావరణం మాత్రమే వుంది. ఇదెలా సాధ్యమైందన్నది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కేసిఆర్‌ సభ అంటే వాతావరణం కూడా ఎంత సహకరించిందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు ఒక్కసారిగా ఒక్క పూట చల్లబడిన వాతావరణం సాయంత్రానికి వర్షం కురిస్తే కూడా ఇబ్బందే అయ్యేది. కాని అటు వాన లేదు. ఇటు ఎండ లేదు. చల్లదనం మాత్రమే కనిపించింది. బిఆర్‌ఎస్‌ సభ ఊహకందనంత విజయం సాధించింది. ప్రకృతి కూడా బిఆర్‌ఎస్‌కు రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినట్లైంది.
సింహ శ్వాసలో వేడి, గర్జనలో వాడి రెండు ఎలా వుంటాయో బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో అధినేత కేసిఆర్‌ ఏక కాలంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీ మీద నిప్పులుచెరిగారు. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ పుట్టుక, తెలంగాణ ఉద్యమం, సాధనలను ఎంతో అర్ధవంతంగా వివరించారు. కేసిఆర్‌ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై ఏం మాట్లాడాలో కాంగ్రెస్‌పార్టీకి అర్ధం కాకుండాపోతోంది. నాయకులు తర్జన భర్జన అవుతున్నారు. లక్షలాది మంది సాక్షిగా కేసిఆర్‌ కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టారు. పనిలోపనిగా ప్రజల చేత ఆ వైఫల్యాలను చెప్పించారు. దాంతో లక్షల మంది కాంగ్రెస్‌ పధకాలు అమలు కావడం లేదని చెప్పినట్లైంది. నిజానికి కేసిఆర్‌ తన శైలికి భిన్నంగా ఇలాంటి నినాదాలు చేయించారు. తాను మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్‌ను తూర్పారపట్టినట్లైంది. ఇక సభ విషయానికి వస్తే రజత్సోతవ సభలో సరికొత్త కేసిఆర్‌ను జనం చూశారు. ఒకప్పటి ఉద్యమ కేసిఆర్‌వేరు. ఇప్పుడుకేసిఆర్‌ వేరు. ఆ కేసిఆర్‌లో ఉరిమే ఉత్సాహం మాత్రమే కనిపించేంది. కాని ఇప్పుడు ఉప్పెనలాంటి కేసిఆర్‌ను జనం చూశారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోవున్నా లేకున్నా, ప్రజల గుండెల్లో మాత్రం సుస్ధిరంగా వుందని నిరూపించారు. సహజంగా సభ నిర్వహణ అంటే బిఆర్‌ఎస్‌ను మించిన పార్టీలేదు. దేశంలోని ఏ పార్టీకి ఇంత పెద్దసభలు నిర్వహించడం సాధ్యం కాదు. అది ఒక్క కేసిఆర్‌కు మాత్రమే అని మరోసారి నిరూపించినట్లైంది. ఉద్యమ కాలంలో కొన్ని వందల సభలు కేసిఆర్‌ నిర్వహించారు. ఆ సభలకు కూడా ఎప్పుడూ లక్షకు తక్కువ కాకుండా ప్రజలు హజరయ్యేవారు. అప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న తెలగువాళ్లే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలకు టివిలకు అతుక్కుపోయేవారు. కేసిఆర్‌ ప్రసంగిస్తున్నంత సేపు చూపు తిప్పుకునేవారు కాదు. పదేళ్ల పాలన తర్వాత కూడా కేసిఆర్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించినట్లైంది. బి ఆర్‌ఎస్‌ వేసిన అంచనాకు మించి ప్రజలు వచ్చారు. కోట్లాది మంది ప్రజలు అటు టివిలలో, ఇటు అరచేతిలో మెబైల్స్‌ ద్వారా కేసిఆర్‌ ప్రసంగం ఆధ్యాంతం వీక్షించారు. ఏడాదిన్నర తర్వాత ఇంతటి సభ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కేసిఆర్‌ ఒక్క పిలుపు చాలు..లక్షలాది మంది తరలివస్తారని మరోసారి రుజువైంది. ఇక మళ్లీ కేసిఆర్‌ యుగం మొదలైందా? అన్నట్లు జనం తండోపతండాలుగా వచ్చారు. పుట్టల నుంచి చీమలు చేరినట్లు చేరారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా జన సందోహమే..వీరితోపాటు కేసిఆర్‌ సభకు హజరు కాలేక ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనం మరో లక్షన్నర వరకు వుంటారని కూడా తెలుస్తోంది. సభా ప్రాంగణానికి చేరుకోలేక, ట్రాపిక్‌లో చిక్కుకొని వెనక్కి వెళ్లలేక, ముందుకు రాలేక, బస్సుల్లోనే అందరూ సెల్‌ఫోన్లలో కేసిఆర్‌ ప్రసంగం విన్నారు. చాలా కాలం తర్వాత కేసిఆర్‌ను చూసిన ఆనందంలో ప్రజలు కేరింతలు కొట్టారు. కేసిఆర్‌ను జయజయ ధ్వానాలతో ఆహ్వానించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఈసారి కేసిఆర్‌ ప్రసంగంలో ఉగ్రరూపం కనిపించలేదు. సమగ్ర రూపాన్ని సంతరించుకున్న ప్రసంగం కనిపించింది. ఇది కేసిఆర్‌కు భిన్నమైన కొత్త శైలి. పైగా ఎంతో శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేస్తూ కేసిఆర్‌ ప్రసంగం సాగింది. అదే సమయంలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణకు విలన్‌ కాంగ్రెస్‌ అంటూ కేసిఆర్‌ అనగానే సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఇదే ఊపులో కాంగ్రెస్‌ చేసిన వాగ్ధానాలను ఉటంకించిన కేసిఆర్‌, ఆ వైఫల్యాలను ప్రజల చేత ఒకటికి రెండు సార్లు చెప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎంగట్టారు. ఇదిలా వుంటే ప్రజలను అన్నలారా అంటూ కేసిఆర్‌ సంబోధించడం కూడా మరో ప్రత్యేకత. ఉద్యమ సమయంలో మాత్రమే ఒకటి రెండు సార్లు అన్నట్లు గుర్తు. కాని తర్వాత తాను పెద్దకొడుకును అని అనేవారు కాని, సభకు వచ్చిన వారిని అన్నలని సంబోధించడం కూడా కొత్తగా వుంది. కేసిఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. తనదైన శైలికి భిన్నంగా కొత్త కేసిఆర్‌ను చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేక చతికిలపడుతున్న ఒక్కో పథకాన్ని ఏకరువు పెడుతూ, దెప్పి పొడిచారు. కొత్త రకం చురకలు అంటించారు. మొత్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద చల్లటి వాతావరణంలో నిప్పులు చెరిగారు. పదేళ్లలో తెలంగాణ రూపు రేఖలు మార్చానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వల్ల తెలంగాణ తెర్లు అవుతుంటే తట్టుకోలేకపోతున్నానంటూ జీరగొంతుతో అన్నారు. ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రజలకు కేసిఆర్‌కు తెలంగాణ మీద వున్న మమకారాన్ని తెలుసుకున్నారు. ప్రజలు ఏమాత్రం దిగులు చెందొద్దని, వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీయే అని సభ సాక్షిగా ప్రకటించారు. దాంతో సభ మొత్తం కేసిఆర్‌ నినాదాలతో మారు మ్రోగిపోయింది. ఏడాదిన్నర కాలం మౌనంగా వున్నాను. కాంగ్రెస్‌ పార్టీకి సమయం ఇచ్చాం. ఇక ఊరుకునేది లేదు. ఆగేది లేదు. పాలకపక్షంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ప్రజా పక్షమే మన బిఆర్‌ఎస్‌ అని అన్నారు. ఇక నేను జనక్షేత్రంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పనిలో పనిగా పోలీసు శాఖను కూడా హెచ్చరించారు. పోలీసులు బిఆర్‌ఎస్‌ నాయకులపై చూపిస్తున్న అత్యుత్సాహాన్ని ప్రశ్నించారు. రాసి పెట్టుకోండి అని వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. సోషల్‌ మీడియా బిఆర్‌ఎస్‌ వారియర్స్‌ మీద కేసులు నమోదు చేయడాన్ని కేసిఆర్‌ ఖండిరచారు. వారికి బిఆర్‌ఎస్‌ అండగా వుంటుందని చెప్పారు.

పోచంపల్లి, పెద్ది, దాస్యంలకు కేసిఆర్‌ ప్రశంస: బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాట్లను తమ భుజస్కంధాల మీద వేసుకొని రేయింబవళ్లు కష్టపడి ఇంత పెద్ద సభ సక్సెస్‌కు కారకులైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌ విప్‌. దాస్యం వినయ్‌ బాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే,ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఒకప్పటి బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిలను సభావేదిక సాక్షిగా కేసిఆర్‌ ప్రశంసించారు. వారు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలుతెలియజేశారు. ఈ ముగ్గురు పేర్లు కేసిఆర్‌ ప్రస్తావిస్తున్నప్పుడు జనం నుంచి పెద్దఎత్తున కేరింతలు, చప్పట్లు వినిపించాయి. ఎందుకంటే వరంగల్‌ సభ అంటే గతంలో జరిగిన మహా గర్జనకు సరిసమానంగా వుండాలి. లేకుంటే అంతకు మించి వుండాలి. ఏ మాత్రం తక్కువైనా మాట వస్తుంది. అందుకే ముగ్గురు నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి, ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ సభ ఏర్పాటు చూసుకున్నారు. కేసిఆర్‌ నుంచి ప్రసంసలు అందుకున్నారు.

ఖమ్మం ఈస్‌ ద మోస్ట్‌…వద్దిరాజు ఈస్‌ ద బెస్ట్‌: వరంగల్‌ రజత్సోతవ సభకు అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా ప్రజల హజరైనట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలను మించి రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గత పదిహేను రోజులుగా పకడ్భంధీగా చేసిన ప్లాన్‌ ప్రకారం ప్రజలు తరలివచ్చారు. నిజానికి వద్దిరాజు చూపిన చొరవ మిగతా జిల్లాలు కూడా చూపించి వుంటే వరంగల్‌ సభ మరో రకంగా వుండేదన్న మాటలు కూడా వినిపించాయి. 1200 ఎకరాలు కూడా సరిపోయేది కాదు. ఎక్కడ చూసినా కనీసం ఓ 50 కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది అని చర్చించుకున్నారు. ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాంతో వద్దిరాజు రవిచంద్రను అదినేత కేసిఆర్‌ కూడా అభినందించారు. ఏ ఖమ్మం గుమ్మంలో ఇబ్బంది ఎదురైందో అదే ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు రజతోత్సవ సభకు తరలిరావడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖమ్మం దారిలోనే ఎక్కువ ఇబ్బందులకు గురిచేసిట్లుకూడా బిఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఖమ్మం నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా పెద్దఎత్తున జరిగాయి. వాటిని కూడా తట్టుకొని వద్దిరాజు సమన్వయంచేసుకుంటూ లక్షలాది మంది సభకు హజరయ్యేలా చూశారు. కేసిఆర్‌ నుంచి వద్దిరాజు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version