ఘనంగా పోషణ మాస కార్యక్రమం…

ఘనంగా పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ దేవిక కల్పన విజయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు ఆకుకూరలు పప్పు కూరలు తినిపించాలి అంగన్వాడి నుండి వచ్చే కోడిగుడ్లు బాలమృతం వాటిని పిల్లలకు తరచుగా తినిపియ్యాలి అని సూచించారు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పిల్లలకు గంట తర్వాత తల్లిపాలు పట్టించాలి దాని ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వారు అన్నారు

పిల్లలలో రక్తహీనతను గుర్తించండి…

పిల్లలలో రక్తహీనతను గుర్తించండి

సరియైన మందులను ఇవ్వాలి డాక్టర్ రవి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంగన్వాడి సూపర్వైజర్ అరుణ రజిత కిషోర్ బాల సురక్షన్ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు రక్తహీనత టెస్టులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ రవి మెడికల్ ఆఫీసర్ రోజా హాజరైనారు అనంతరం విద్యార్థులకు బ్లడ్ టెస్ట్ చేసి రక్తహీనత ఉన్న విద్యార్థులకు వెంటనే మందులను ఇవ్వడం జరిగింది. బ్లడ్ తక్కువ ఉన్న విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ పాఠశాల టీచర్స్ ఆశా వర్కర్స్ విద్యార్థులు పాల్గొన్నారు

జ్ఞానోదయ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగతోత్సవ….

మెట్ పల్లి అక్టోబర్ 14 నేటి ధాత్రి

 

జ్ఞానోదయ డిగ్రీ పిజీ కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు.
మెట్ పల్లి పట్టణం లోని మనోహర్ గార్డెన్ లో మంగళవారం జ్ఞానోదయ డిగ్రీ పిజీ కళాశాల నూతన విద్యార్థుల స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ అధికారి నక్క శ్రీనివాస్ ముఖ్య అతిధి గా విచ్చేసారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకొని. లక్ష్య సాధన దిశగా పని చేయాలనీ సూచించారు.అనంతరం కరస్పాండంట్ ఇల్లేందుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమయం పాలనతో చదివి సమాజంలో శక్తులుగా మారాలని ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంకు మెట్ పల్లి ఎస్ ఐ 3 గంగాధర్ అతిధిగా పాల్గొని మాట్లాడారు. సీనియర్లు జూనియర్లకు ఆదర్శం గా ఉండేట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వెంకట్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రాజ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.
మల్లాపూర్ అక్టోబర్ 14 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సార రుత్విక్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందున మల్లాపూర్ స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జారపు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రిత్విక్ అనేక విజయాలు సాధించాలని, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే నేటి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ఎగ్యారపు శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శులు తిప్పర్తి కిషన్, సింహరాజు నరేష్, అలాగే సంఘ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, బెజ్జారపు తిరుపతి, బెజ్జారపు శ్రీనివాస్, కట్ట వీరేంద్ర చారి, గన్నరపు రమేష్, ఎగ్యారపు వెంకటరమణ, ద్రుశెట్టి రాజేష్, దురిశెట్టి శ్రీనివాస్, ఆకోజి వెంకటరమణ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీజేపీ-బీఆర్ఎస్ అడ్డుకుంటున్న..

బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీజేపీ-బీఆర్ఎస్ అడ్డుకుంటున్న

◆:- ఎంపీ సురేష్ కుమార్ ఆరోపణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని, అయితే ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడం ద్వారా రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామకం కోసం అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్లు, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, సంజీవరెడ్డి, జిల్లా
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ధమ్మచక్ర పరివర్తన దినం…

ధమ్మచక్ర పరివర్తన దినం

-బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్వ భారత దేశ పూర్వ మత మైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి శుభదినం ఈరోజు ఆయన నాగపూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించినటువంటి శుభదినా రోజునా పర్లపెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పుష్పాలంకరణ కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్న భాస్కర్ , బీసీ సంఘం నాయకులు ఆకుతోట రమేష్, పొన్నం రమేష్, నియోజకవర్గ అధ్యక్షులు పుల్యాల భగత్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యకమం లో మనోజ్ మాట్లాడుతూ…ధమ్మచక్ర పరివర్తన దినం అంటే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ , ఆయన అనుచరులు హిందూ మతం నుండి బౌద్ధమతాన్ని స్వీకరించిన రోజును సూచిస్తుంది. ఈ సంఘటన 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో జరిగింది, అప్పటి నుండి ఈ రోజును బౌద్ధ పండుగగా జరుపుకుంటారు.

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు.. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో అది కనిపించడం లేదు. అరు గాలం వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంటలు పండించిన రైతులు ప్రభుత్వాలు సకాలంలో నాఫడ్ లేదా మార్క్ ఫడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పంటను కొనుగోలు చేయక పరేషాన్లో ఉన్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట చేతికి వచ్చింది. మండలంలో ఈ సీజ న్లో 4721 ఎకరాలలో రైతులు సోయాబీన్ పంట వేశారు. ఈ సంవత్సరం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో సోయాపంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. చివరకు ఉన్న పంటను రాసులు పట్టినా ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఒక ఎకరంలో సోయాబీన్ పంట పండించడానికి సుమారు 25వేయిల రూపాయల పెట్టుబడి అయితుందని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఎకరానికి 6 లేదా ఏడు క్వింటాళ్ళ దిగు బడి మాత్రమే వస్తుందని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు అమ్మితే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు సోయా బీన్ పంటను పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. చేతికి వచ్చిన పంటను అమ్మకుని పెట్టుబ డులకు తెచ్చిన అప్పులు చెల్లిద్దామంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించా ల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దిగుబడి తగ్గి మార్కెట్ లో ధర లేకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మద్దతు ధరకు అమ్ముకుని కొంతలో కొంతైనా ఉపశమనం పొందవచ్చని రైతులు భావిస్తున్నారు. సోయా బీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ కు 5328 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారలు క్వింటాల్ కు3800 నుండి 4000 రూపాయల వరకు ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ వద్ద సుమారు 1500 రూయాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతు
న్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు. ప్రాంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రాంభించాలి

జీర్లపల్లి సోయాబీన్ పంట చేతికి వచ్చిందని మార్కెట్లలో గిట్టుబాధర లభించ డంలేదు. 14 ఎకరాలు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సోయాబీన్ పంటను పండించాను. ఈ సీజన్ లో అధిక వర్షాలు పడి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే కొను గోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారం భించి గిట్టుబాటు ధరకల్పించాలి.

దిగవంతనేత మాజీ మంత్రి ఎండి ఫరీదోద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దిగవంతనేత మాజీ మంత్రి ఎండి ఫరీదోద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 జహీరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది #ఉమ్మడి_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_మాజీ_మంత్రి_వర్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ(“కీర్తిశేషులు స్వర్గీయ మహమ్మద్ ఫరిదుద్దిన్ జయంతి”)సందర్బంగా అభిమానుల అధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు,బాలింతలకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బిజీ సందీప్ గోవర్ధన్ రెడ్డి బాలిరెడ్డి నవీద్ నిజాం అలీ మాజీ సర్పంచ్ నరేష్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాస్ నాయక్ జైరాజ్ బాలరాజ్ కవేలి కృష్ణ ఇక్బాల్ వసంత్ భార్కత్ ముబీన్ రామానుజన్ రెడ్డి ప్రణీష్ రావు అభిమానులు పాల్గొన్నరు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహమ్మద్ ఫలితద్దీన్ ప్రజల గుండెల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల కొరకే తపించే మంచి నాయకుడిని కోల్పోయామని వారు వివరించారు. కుల మతాలకతీతంగా ప్రతి వ్యక్తికి నేనున్నానంటూ ధైర్యం చెప్తే మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయామని వారు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు,

పాత బాకీలు తీర్చడంతోనే..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134821.930.wav?_=1

 

పాత బాకీలు తీర్చడంతోనే..
సమయం సరిపోతుంది.
• గత ప్రభుత్వం అప్పుల కుప్ప తెచ్చిపెట్టింది.
• ఇచ్చిన మాట తప్పిన గత ప్రభుత్వం!

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత ప్రభుత్వం చేసిన పాత బాకీలు తీర్చడంతోనే సమయం సరిపోతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం లీల గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి మరెన్నో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మోసపూరిత మాటలపై అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తోనే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు కొమ్మాట బాబు, నజీరుద్దీన్, మారుతి, లక్ష్మా గౌడ్ తదితరులు ఉన్నారు.

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134333.368.wav?_=2

 

 

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నిర్మాణాల్లో భాగంగా దర్శనాలు
భక్తులకు నిలిపివేస్తూ ఏకాంత సేవలు చేస్తూ అర్జిత సేవలు మరియు భక్తులు రాజన్న దర్శించుకునేదంతా భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనను మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ యొక్క సూచనలను తీసుకొని ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా అర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తులను నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది కాంక్షిస్తుంది కానీ అందులో భాగంగా భక్తులకు రాజన్నను దూరం చేస్తాం అంటేనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భీమన్న ఆలయంలో అర్జిత సేవలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఆపివేయడం వంటివి చేయడం ద్వారా,నిన్న బిజెపి చేసిన ధర్నాకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దర్శనాలు యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు మరియు అలాగే నిన్న జరిగినటువంటి ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ బంధువులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మా ధన్యవాదాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్,మోర రవి,కోడం వినయ్, దూడం సురేష్,దేవేందర్ రెడ్డి,మెరుగు శ్రీనివాస్,సిద్ధి దేవరాజు,వేముల వైశాలి,శ్రీనివాస్, శ్రీధర్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ డిపో మేనేజర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T133805.158.wav?_=3

 

నేడు డయల్ యువర్ డిపో మేనేజర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి మంగళవారం ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో, ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు మరియు సూచనలను నేరుగా తెలియజేయవచ్చు. దీని కోసం 99592 26269 నంబర్ కు ఫోన్ చేయాలని మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తుంది.

మెజారిటీ కోసమే ప్రచారం…”ఎంపీ వద్దిరాజు రవిచంద్ర”

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T131035.665.wav?_=4

 

ఎంపీ వద్దిరాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాలినడకన ఎన్నికల ప్రచారం

(నేటిధాత్రి)

 

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాలినడకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎంపీ రవిచంద్ర కు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావు యూసఫ్ గూడ డివిజన్ బాధ్యతలను అప్పగించారు.

 

ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.శివమ్మ పాపిరెడ్డి హిల్స్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ సభకు ఎంపీ రవిచంద్ర నాయకత్వాన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం యూసఫ్ గూడ డివిజన్ ప్రగతినగర్ నందు కొలువైన వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాలినడకన ఎన్నికల ప్రచారం జరిపారు. ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సీనియర్

 

నాయకులు పుస్తె శ్రీకాంత్,ఆశీస్ కుమార్ యాదవ్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్,కోట్ల వినోద్ కుమార్,మంజుల, భాగ్యలక్ష్మీ,విమల తదితరులు తన వెంట రాగా గులాబీ కండువాలు మెడలో వేసుకుని ప్రగతినగర్, లక్ష్మీనరసింహా నగర్,యూసఫ్ గూడ చెక్ పోస్ట్ తదితర చోట్ల పలు వీధుల్లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు,ప్రజలకు రావలసిన బకాయిలను వివరిస్తూ కార్డులు పంపిణీ చేశారు.గృహిణులు, వ్యాపారస్తులు, మైనారిటీలు, యువకులు, మెకానిక్స్,వృద్ధులను ఎంపీ రవిచంద్ర తదితర నాయకులు కలిసి సర్కారు వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు”,”బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మకే మన ఓటు అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

 

‘వేలకోట్ల’’ చిట్‌ ‘‘కుంభకోణం’’?

`చిట్‌ కంపెనీలు ..చీకటి దందాలు!?

`ఒక్కసారి చిట్‌ వేస్తే.. ఇక మిగిలేది చీకటే!

1000 cr chit fund scam in warangal

`నమ్మి చిట్టి కడితే చీటి చిరిగినట్లే!?

`లాక్కోలేక, పీక్కో లేక కష్టాలు కొని తెచ్చుకోవడమే!

`గాలికి పోయే కంపను గోచిలో పెట్టుకోవడమే!

1000 cr chit fund scam in warangal

`జీవితాలు ఆగమే…బతకంతా నరకమే!

`నమ్మించినంత సులువుగా మోసం చేస్తారు?

`జనాన్ని నట్టెట ముంచేస్తారు!

`తేరగా చేతులెత్తేస్తారు!

`బోర్డు తిప్పేసి కంపనీ లాస్‌ అని మూసేస్తారు!

`అట్లుంటది చిట్‌ కంపనీల మోసం!

ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే వేలాది కోట్ల కుంభకోణం!

12 నెలలుగా వరంగల్‌ నగరంలో ‘‘చిట్స్‌ రిజిస్ట్రార్‌’’ లేడు.

`దివాళా కంపెనీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు!

`దివాళా తీసిందని చట్టాన్ని నమ్మిస్తారు!

`కోర్టులను కూడా నమ్మించి జనాన్ని మోసం చేస్తారు!

`కంపనీ బకాయి పడ్డ వారికి రూపాయి ఇవ్వరు!

`కంపనీకి రావాల్సి వుంటే వేధించుకు తింటారు!

`ప్రజలకు ఎవరూ మద్దతుగా రారు!

`పోలీసులు కూడా ప్రజల పిర్యాదులు పట్టించుకోరు!

`నాయకులు, పోలీసులు కంపనీలకు అండగా నిలుస్తారు!

`బోర్డులు తిప్పేసిన కంపెనీలకే వంతలు పాడుతుంటారు!

జనాలకు ‘‘చిట్‌ చట్టాల’’ మీద అవగాహన వుండదు!
బోర్డు తిప్పేసిన కంపెనీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియదు!
ఆ సొమ్మును ‘‘చిట్‌ రిజిస్ట్రార్‌’’కు మాత్రమే చెల్లించాలన్న అవగాహన ఎవరికి ఉండదు!

`పదే పదే కంపెనీల మోసాలకు బలౌతుంటారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చట్ట బద్దమైన సంస్థలు అంటారు. చట్టాలను చచ్చుబండలు చేస్తారు. ప్రజలు ఎవరో ఒకరిని నమ్మి, చిట్టీలు వేసి మోసపోవద్దు? అని నీతులు చెబుతారు. అన్ని రకాల అనుమతులతో కూడిన చిట్‌ కంపనీ ఊదరగొడతారు. ప్రచారం చేసుకుంటారు. సెలబ్రిటీలతో ప్రకటనలు చేయిస్తారు. హంగూ ఆర్భాటాలతో కూడిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. జనం సొమ్ముతో కార్యాలయాలను నిర్వహిస్తుంటారు. మా చిట్స్‌ కంపనీలో చిట్టీల కట్టమంటారు? ప్రజలను మోసం చేస్తుంటారు. జనాన్ని నిండా ముంచేస్తుంటారు. వారి బతుకులతో ఆడుకుంటుంటారు. నమ్మినందుకు జనానికి నరకం చూపిస్తారు. వేసిన చిట్టీల గడుపు పూర్తయినా చిట్టీ మొత్తం డబ్బులు ఇవ్వరు. నట్టేట ముంచుతుంటారు. అయినా పాలకులు పట్టించుకోరు. వ్యవస్ధలు పట్టించుకోవు. జనం గోడు వినిపించుకోరు. బాధితులకు అండగా ఎవరూ ముందుకు రారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోరు. అందరూ పట్టీపట్టనట్లే వ్యవహరిస్తుంటారు. చిట్స్‌ పేరుతో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కంపనీలు బోర్డులు తిప్పేసినా దిక్కు దివానం వుండదు. జనం సొమ్ముతో ఉడాయిస్తుంటారు. కంపనీ దివాళా తీసిందని కాకమ్మ కధలు చెబుతారు. జనం నోట్లో మట్టికొడతారు. నాలుగు రోజులు జైలు జీవితం అనుభవిస్తారు. బైటకు వచ్చి మళ్లీ కొత్త బాగోతం మొదలు పెడతారు. పాత బోర్డు స్ధానంలో కొత్త బోర్టు పెట్టేస్తారు. కంపెనీకి కొత్త పేరు పెట్టేస్తారు. మళ్లీ అద్దాల కార్యాలయం ఓపెన్‌ చేస్తారు. అమాయక జనాన్ని మళ్లీ ఆకర్షిస్తారు. బోనం బొట్లు పెట్టేస్తుంటారు. కంపనీలకు దేవుళ్ల పేరు పెడుతుంటారు. నమ్మకానికి ప్రతి రూపం అంటారు. నమ్మకమే మా పెట్టుబడి అని నమ్మిస్తారు. జనం సొమ్ముకు భరోసా అంటారు. మమ్మల్ని నమ్మడం అంటేనే గొప్ప వరం అన్నంతగా ప్రచారం సాగిస్తారు. సెలబ్రిటీలను తెచ్చి ప్రచారానికి వినియోగిస్తుంటారు. మీ భవిష్యత్తు మాది అంటారు. జనం సొమ్ము ఊడ్చుకొని ఉత్తచిప్ప కూడా చేతికి రాకుండా చేస్తారు. జనం రూపాయికి రక్షణ అంటారు. జనం బలహీనతను హాయిగా సొమ్ము చేసుకుంటారు. ఆస్ధులు పెంచుకుంటారు. చిట్‌ వేసేదాక బెల్లం మీద ఈగలు వాలినట్టు, జనం చుట్టూ తిరుగుతారు. వడ్డీ వల విసురుతారు. వెంట పడీ పడీ చిట్టీ కట్టేదాకా వదిలిపెట్టరు. అప్పులోల్లు ఇంటికి తిరిగినట్లే తిరుగుతారు. ఒక్క సారి చిట్టీ కట్టిన తర్వాత ఆ తిరగడం మనకు నేర్పిస్తారు. కాళ్లు అరిగేలా తిరిగినా కనికరం చూపరు. జనం సొమ్ముతో జనాన్నే బెదిరిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటారు. నెల కిస్తీ కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే, పెనాల్టీలు వేస్తారు. చిట్టీ గడువు పూర్తయి, నెలలు గడిచినా సరే సొమ్ము తిరిగి ఇవ్వరు. ఆఖరుకు కంపనీ దివాళా పేరుతో బోర్డు తిప్పేస్తారు. ఇలా ఒక్క వరంగల్‌ జిల్లాలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వెలిసిన కంపనీలకు, మూత పడిన కంపనీలకు లెక్కేలేదు. కొత్తవి పుట్టుకొస్తూనే వుంటాయి. పాతవి మూత పడుతూనే వుంటాయి. కాని వ్యక్తులు వాళ్లే వుంటారు. జనం సొమ్మును దశాబ్ధాల తరబడి దోచుకుంటూనే వున్నారు. త్వరలో వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు జనానికి కుచ్చుటోపీ పెట్టిన చిట్‌ కంపనీల దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా మీ నేటిదాత్రిలో…త్వరలో..

 

వరంగల్‌లో చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఎక్కడ?

ఏడాది గడుస్తున్నా ఎందుకు ఖాళీగా వుంది?

`సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు?

`వరంగల్‌ అంటే ఎందుకు సుముఖంగా లేరు?

`వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు?

`వచ్చేందుకు సిద్దంగా వున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?

`రెవిన్యూ వ్యవస్ధలో ఏం జరుగుతోంది?

వరంగల్‌లో చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేక ఏడాది గడుస్తోంది. అయినా ఆ కుర్చీ ఖాళీగానే వుంది. కనీసం ఇన్‌ చార్జి కూడా ఎవరూ లేరు. చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పని చేయడానికి సబ్‌ రిజిస్ట్రార్లు ఎందుకు భయపడుతున్నారు. అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తే ఎలాంటి ఫలితం వుండదనుకుంటున్నారా? లేక ప్రజా ప్రతినిధులకు భయపడి రానంటున్నారా? వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏం జరుగుతోంది. ఆ మధ్య ఓ వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌గా ఓ అధికారిని వచ్చారు. నేను ఇక్కడ పని చేయాలని వెళ్లిపోయారు. కారణాలు ఏమైనా కావొచ్చు? అధికారులు తమకు నచ్చిన చోటనే పనిచేస్తారా? వారికి అనుకూలమైన పోస్టింగ్‌ వుంటే తప్ప పనిచేయరా? కేవలం రిజిస్ట్రేషన్‌ శాఖలో మాత్రమే పనిచేస్తారా? లంచాలకు అలవాటు పడిన వారు చిట్స్‌ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా? వచ్చిన వారిని ప్రజా ప్రతినిధులు పని చేయనీయడం లేదా? వరంగల్‌ అంటేనే అధికారులు ఎందుకు భయపడుతున్నారు? జీతం తప్ప అదనంగా దమ్మిడి రాకున్నా, సమస్యలు ఎదురౌతానకుంటున్నారా? ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో పనిచేసి, ఉద్యోగానికే ఎసరు తెచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా? అయితే ఇలాంటి చోట కూడా పనిచేసేందుకు కొందరు అదికారులు సిద్దంగా వున్నారు. కాని వారికి మాత్రం పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. ఎందుకంటే వచ్చే అధికారులు తమ చెప్పు చేతుల్లో వుండాలని ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్నారు. అవినీతికి అలవాటు పడిని అధికారులు చిట్స్‌ రిజిస్ట్రార్‌గా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఒక వేళ పనిచేద్దామని వచ్చే వారిని ప్రజా ప్రతినిధులు రానివ్వడం లేదు? కారణమేమిటంటే తమ మాట వినని అదికారులు వస్తే ఆ ప్రజా ప్రతినిధుల మాట చెల్లుబాటు కాదు. వారి ఆదేశాలు ఆచరణలోకి రావు. దాంతో ఏడాది కాలంగా చిట్స్‌ రిజిస్ట్రార్‌ లేకుండానే కార్యాలయం పనిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వరంగల్‌ అంటేనే చిట్‌ ఫండ్‌ కార్యాలయాల గోల్‌ మాల్‌కు అడ్డా? ఏ చిట్‌ ఫండ్‌ చూసినా అదే తీరు. అదే వ్యవహారం. అలా ప్రజలను నిండా ముంచిన కంపనీలే ఎక్కువ. ప్రజలను వీదిన పడేసిన కార్యాలయాలే వున్నాయి. వేల కోట్లు రూపాయల కుంభాకోణాలకు నిలయంగా మారాయి. అలాంటి వరంగల్‌లో బాధితుల గోడు వినేందుకు, చిట్స్‌ కంపనీ ఆగడాల నుంచి రక్షించేందుకు చిట్స్‌ రిజిస్ట్రార్‌ వుండాలి. ప్రజల గోడు ఎవరు వినాలి? ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? నిజాయితీగా పనిచేసే అధికారులు వున్నారు. కాని వారికి అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా ప్రతినిధులంటే జిల్లా రిజిస్ట్రార్లే భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎలాగూ ప్రజలకు సహకరించరు. పైకి ఎన్ని మాటలు చెప్పినా సరే, వాళ్లంతా చిట్స్‌ కంపనీలకే వత్తాసు పలుకుతారన్నది భహిరంగ రహస్యమే. అందుకే వరంగల్‌కు ఎవరినీ రానివ్వడం లేదు. బాధితుల సమస్యలు తీరడం లేదు. రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే స్పందించి, వరంగల్‌ చిట్స్‌ రిజిస్ట్రార్‌ పోస్టు భర్తీ చేయాలని కోరుతున్నారు. చిట్‌ రిజిస్ట్రార్‌గా పని చేయమని చెప్పేవారిని వదిలేయండి. కాని వస్తామని అంటున్నవారిని ఎందుకు రానివ్వడం లేదో చెప్పండి? ఏది ఏమైనా వెంటనే ఆ పోస్టును భర్తీ చేయండి.

జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం…

జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం

 

రాయికల్, అక్టోబర్ 13, నేటి ధాత్రి:

 

 

అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారు.

ఫేక్ యాప్ ల ద్వారా అధిక లాభాపేక్షను ఎర చూపి, గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం
మెట్ ఫండ్, యు బిట్ లలో చైన్ విధానంలో
పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.

పెట్టుబడి దారులకు విదేశీ టూర్లు, లక్సరీ వసతుల పేరిట అమాయక ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.

గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదు..ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు, వెబ్సైట్లు విస్తరించాయి.

ఆర్ బి ఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా చట్ట విరుద్ధమే.

కేవలం జగిత్యాల జిల్లా లోనే సుమారు 1000 కోట్లు మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

పెట్టుబడులు పెట్టిన వారికి ఏవిధమైన రశీదులు లేకుండానే పెట్టుబడులు పెడుతున్నారు.

క్షణాల వ్యవధిలో యాప్ లు తొలగిస్తూ ఆధారాలు లేకుండా చేస్తున్నారు.

జగిత్యాల పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించదగ్గ విషయం.

నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోయిన వారు పోలీసుల దృష్టికి వచ్చేది ఒక్క శాతం కూడా లేదు.. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు..

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, జూదం అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.

చట్ట పరమైన చర్యలు తీసుకోవడం తో పాటు, రికవరీ అవుతుందో లేదో అని భయపడి కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.

నకిలీ యాప్ లలో అమాయక ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన వారి ఆస్తులు జప్తు చేయాలి.

పోలీసులు కేసులు నమోదు చేయడంతోపాటు రికవరీ చేస్తామనే విశ్వాసం బాధితుల్లో కల్పిస్తేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారు.

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గిపోయి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

ఆర్ బి ఐ అనుమతులు లేకుండా
నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు
దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.

దేశ రక్షణ తో పాటు ఆర్థిక వ్యవస్థ రక్షణ కూడా ప్రధానం.

రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేస్తాం.. అని పరిశీలించి ఆర్థిక మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కేంద్ర హోమ్ శాఖ, ఆర్థిక శాఖ సైతం నకిలీ యాప్ లు, వెబ్సైట్ లలో పెట్టుబడులను అరికట్టేలా చొరవ తీసుకోవాలి..

నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోవడం జగిత్యాల జిల్లాకే పరిమితం కాలేదు. బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.

పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని, ఆర్థిక నేరాలు చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి.

పోలీసులు సుమోటోగా విచారణ చేపట్టాలి..

రాష్ట్ర స్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఆర్థిక నేరాల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్న..

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలువనున్న సీఎం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రాక ఖరారు అయ్యింది.ఐతే వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4 అనారోగంతో మరణించిన విషయం తెలిసిందే.కాగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఫోన్ ద్వారా అదే రోజు పరామర్శించారు.ఈ నేపథ్యంలో 15 న కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమం హన్మకొండలో ఏర్పాటు చేయనున్నారు.ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు గాను ఈ నెల 15 న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికార ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు…

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

కరీంనగర్, నేటిధాత్రి:

డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి….

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి

 

సోమవారం నాడు తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సూపర్డెంట్ కి సోమవారంనాడు వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఈ కార్యక్రమంలో వీరి వెంట (ఏఐటియుసీ)కార్మిక సంఘం నాయకులు లంక దాసరి అశోక్,రైతునాయకులు సురావు బాబురావు,సురావు కిషన్ రావు,కోడం రవీందర్, రఘుపతి పలువురు పాల్గొన్నారు.

దేవీ నవరాత్రి ప్రత్యేక పూజల పట్టు వస్త్రాలు కలుశాన్ని సమ్మి గౌడ్ కి అందజేత…

దేవీ నవరాత్రి ప్రత్యేక పూజల పట్టు వస్త్రాలు కలుశాన్ని సమ్మి గౌడ్ కి అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా భవాని మాతా దేవి ప్రత్యేక పూజల్లో తొమ్మిది రోజులపాటు ఉన్నటువంటి కలుశాన్ని,ప్రతిరోజు అమ్మవారి అలంకరణలో భాగంగా ఉన్న పట్టు వస్త్రాలను తాళ్లపూస పల్లి అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ యువత సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ కి అందజేశారు.ఈ సందర్భంగా
సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, ఆ దుర్గామాత తల్లి పూజలతో వర్ధిల్లిన పట్టు వస్త్రాలు,కలుశం అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీకి, నాకు అందేలా చేసిన దుర్గామాతకు, అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్,రాజు, మధుకర్,నరేందర్, విక్రమ్,శివరామకృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం…

వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం

ఫోటో రైట్ అప్ ఆర్థిక సహకారం అందజేస్తున్న సభ్యులు

వీణవంక( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

ఇటీవల ప్రమాదానికి గురైన శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి చెందిన సంగి సందీప్ కుమార్తె శ్రద్ధ వైద్య ఖర్చుల నిమిత్తం యప్ టీవీ అధినేత పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు.ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన శ్రద్ధకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తలలో చిన్న ఎముక విరిగడం తో డాక్టర్లు శ్రద్ధకి ఆపరేషన్ చేపట్టారు.మరల పర్యవేక్షణ చేసిన డాక్టర్లు శ్రద్ధ తలలో ఎముక ఇన్ఫెక్షన్ అయ్యిందని ,మరలా డాక్టర్లు వైద్యం చేయాలని, ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు కుటుంబీకులకు సూచించడం జరిగింది. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రద్ధ తల్లిదండ్రులు ,పాడి ఉదయ నందన్ రెడ్డిని కలిసి తన ఆర్థిక పరిస్థితిని విన్నవించుకోగా ,సానుకూలంగా స్పందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులచే రూ 20 ,000/- లను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శ్రద్ధ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, దాసారపు రాజు, మంతెన శ్రీధర్, తాళ్లపెళ్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, దాసారపు అశోక్, వంశీకృష్ణ, లోకేష్, పస్తం కుమార్ స్వామి, నీల ప్రభాకర్, సంగి మహేందర్, గట్టయ్య, చల్లూరి హరీష్, దాసారపు మహేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version