ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష..

*ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష..

*ఒకొక్కరికి రూ.6లక్షల జరిమానా..

*తీర్పు వెల్లడించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి.

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 30:

 

 

 

 

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్, ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు.ఇందులో భాగంగా క్రైమ్ నెంబర్, 27/2016 కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్టయ్యారు. వీరు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన జె. దామోదరం, ఏ.హరిప్రసాద్ కాగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ చంద్రగిరి మండలం, పాండురంగవారి పల్లి ప్రాంతంలో పట్టుబడ్డారు. వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడమే కాకుండా, అడవిలోకి అక్రమ ప్రవేశం చేసిన నేరస్తులకు కూడా ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని అభినందించారు.

ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.

ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ

మహదేవపూర్ జూన్ 30( నేటి ధాత్రి ):

తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్షకు మద్దతు ప్రకటించిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి గత ప్రభుత్వము మోసం చేసినది ఉద్యోగాలు ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు గుంట భూమి ఇవ్వలేదు అవసరానికి వాడుకొని మోసం చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని ఉద్యమకారులకు తెలియపరచడం జరిగింది. పై విషయం మా ప్రియతమా నాయకులు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్తామని ఉద్యమకారులకు తెలియపరిచినాము ఉద్యమకారులు కూడా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల రాష్ట్ర అధికార ప్రతినిధి అయివుద్దీన్ ఉద్యమకారుల భూపాల్ పల్లి జిల్లా అధికార ప్రతినిధి అక్రముద్దీన్ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ దేవేందర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం..

*ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం..

*2న వి.కోట నుంచి ప్రారంభం..

పలమనేరు(నేటి ధాత్రి) జూన్ 31:

 

 

 

ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టదలచిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సభ్యులతో అయన సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఇప్పటి వరకు ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధి పై గ్రామ స్థాయిలోని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారించ డమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం
(కే ఎస్ ఎస్) కుటుంబ సాధికారిక సభ్యులుగా ఉన్న వారు బాధ్యత తీసుకొని పార్టీ రూపొందించిన ఫార్మట్ ప్రకారం వివరాలను పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం. కాబట్టి పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు తప్పక అందెలా చూడాలన్నారుబూత్ లెవల్ స్థాయిలో కనీసం రోజుకు 50 కుటుంబాలకు తగ్గకుండా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఈ కార్యక్రమం నియోజకవర్గం లోని వి. కోట మండలంలోని కొంగాటం పంచాయతీ నుంచి ఈ నెల 2 న ప్రారంభించి ఏక కాలంలో అన్ని మండలాల్లో విజయవంతంగా సాగేలా చూడాలని కోరారు. అనంతరం కార్యక్రమ కార్యాచరణ పై నాయకులతో ఆయన చర్చించారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు ఆర్వీ బాలాజీ, విజయ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్,కిషోర్ గౌడ, సోమశేఖర్ గౌడ్, ఆనంద,నాగరాజు రెడ్డి, కుట్టి,నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్,రాంబాబు, గిరి, ప్రతాప్, బ్రహ్మయ్య, నాగరాజు, చౌడప్ప, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

నవరాత్రి చండి హోమం మహోత్సవంలో పాల్గొన్నా.

శ్రీ.వారాహి దేవి, నవరాత్రి చండి హోమం మహోత్సవంలో పాల్గొన్నా

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

న్యాలకల్ మండలంలోని ముంగి గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ. ఆదిలక్ష్మి ఆశ్రమం లో నిర్వహించిన శ్రీ.వారాహి దేవి నవరాత్రి చండి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,రామలింగారెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, ఏయంసి.వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ,యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ ,జిల్లా అధ్యక్షులు నరేశ్ గౌడ్ ,కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి. రాములు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్ష.

ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్ష

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల
పోరం ఆధ్వర్యంలో శాంతి యుత దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినటువంటి నాయకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు (మాజీ జెడ్పిటిసి) ఎన్నం పెళ్లి పాపన్న తెలంగాణకమ్యూ నిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య సిపిఎం జిల్లా నాయకులు అంకేశ్వరపు ఐలయ్య ఎమ్మార్పీఎస్ నాయ కులు అరికిల దేవయ్య మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయ ణరెడ్డి జె ఎ సి రాష్ట్ర కార్యదర్శి దామర కొండ కొమురయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిన్నా ప్రతాప్ సేనారెడ్డి సంఘీభావం తెలి పారు ఈ కార్యక్రమం మండల ఉద్యమకారుల ఫోరం అధ్య క్షులు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్య మకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్ పల్లెబోయిన సారయ్య గిద్దమారిరామన్న పాల్గొన్నారు హనుమకొండ జిల్లా అధ్య క్షుడు పొడి శెట్టి గణేష్ మాట్లా డుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షాన ఈ ఉద్యమాన్ని ఉవ్వె త్తున కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి అడుగు స్థలముజార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఇస్తున్నటు వంటి 25 వేల పెన్షన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఉద్యమకా రులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 100 కోట్లతో నిధులు కేటా యింపు,ఇందిరమ్మ ఇండ్లురాజీ వ్ యువ వికాసం పథకంలో 20% ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు ఎండి రఫీ రాజ్ మహమ్మద్ మదర్ సాహెబ్ మండల కోశాధికారి కానుగుల నాగరాజు మండల నాయ కులు మండల సభ్యులు నరసింహరాములు గంట శ్యాంసుందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ మేకల శ్రీనివాస్ మామునూరి రాజన్న మారపల్లి సదానందం అడప ప్రభాకర్ కోడెపాక బాబు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్ జోగి రెడ్డి దూదిపాల రాజిరెడ్డి చిందం ప్రభాకర్ అరికెళ్ల వీరయ్య కర్రు ఆదిరెడ్డి జాలిగపు అశోక్ ఎలమంచి సలేందర్ రెడ్డి తుడుం వెంకటేష్ ఎర్ర తిరుప తిరెడ్డి వనం దేవరాజు, నరహ రిశెట్టి రామకృష్ణ ,రాయరాకుల మొగిలి, బాసాని నవీన్, కోడిమల సంతోష్ ఓరుగంటి గోపాల్ రెడ్డి పురాణం రమేష్  పాల్గొన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే ఐపీఎస్., తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 27 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

భూపాలపల్లి ఇంచార్జ్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ. ‌

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి
భూపాలపల్లి ఇంచార్జ్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ. ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఇన్చార్జీలతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కొలికపోగు వెంకటేశ్వరావు మాదిగ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో ఇన్చార్జీలు కో ఇన్చార్జిలు గ్రామ కమిటీల నిర్మాణం గద్దెలు త్వరితగతిన పూర్తి చేసి జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ అవిద్భవ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ అంతడుపు ల సారయ్య మాదిగ పల్లి శ్రీను మాదిగ బండారు రాజ్ కుమార్ మాదిగ నేర్పటి శ్రీను క్రాంతి బండారు బాబు జీ సమ్మయ్య సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన.

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు నియోజకవర్గంలోని చిట్యాల మండలాల్లోని వివిధ గ్రామాలల్లో పర్యటించారు. ఆయా గ్రామాలల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని, మండలంలో.
తిరుమలాపూర్ గ్రామంలో కంచర్ల పోషాలు, చిట్యాల మండల కేంద్రంలో చింతకింది రాజమణి, నవాబుపేట గ్రామంలో మహమ్మద్ హకీమ్, కైలాపూర్ గ్రామంలో సకినాల కుమారస్వామి ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మధు వంశీకృష్ణ మాజీ ఎంపీటీసీ దబ్బటఆనిలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర.

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…

నేటి ధాత్రి- మహబూబాబాద్-గార్ల:-

 

 

 

 

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని,రైతాంగాన్ని,కూలీలను ఆదుకోవడంలో పూర్తి వైఫల్యం చెందాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ అన్నారు.సోమవారం అఖిలభారత రైతుకూలీ సంఘం గార్ల మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు సూత్రపు మనోహర్ అధ్యక్షతన మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్బంగా జడ సత్యనారాయణ,గుజ్జు దేవేందర్ లు ప్రసంగిస్తూ,ఆదివాసీలను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్రం బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్,ములుగు,భద్రాది కొత్తగూడెం జిల్లా లో ఉన్న 339 ఆదివాసి గ్రామాలను 49వ జీవో ప్రకారం ఖాళీ చేయటం కోసం ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలను చట్టాల ద్వారా బయటికి పంపడానికి పూనుకోవడం దారుణమని అన్నారు.ఈ మూడు జిల్లాల్లో ఉన్న గ్రామాలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కోరుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోకుంటే ప్రతిఘటన ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు.రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజాన్ని,సమానత్వాన్ని రద్దు పరచాలని చెప్పి ఆర్ఎస్ఎస్ పరివార్ ప్రయత్నిస్తుందని రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకురావడం కోసం బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని అన్నారు.ఆదివాసీల నివసించే అడవులను అదానీ, అంబానీలకు వేదాంత కంపెనీలకు దారాదత్తం చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకోవడం శోచనియమని అన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని,ఎరువులు,పురుగు మందులు కల్తీ లేకుండా నాణ్యమైనవి ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జి. సకృ,మండల నాయకులు గౌనీ మల్లేష్,పాక వెంకన్న, మాలోతు మాన్య,శ్రీరాములు, నందగిరి శ్రీను, వి. సక్రు, జయరాం,చింతల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు,
ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు.
ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లాభాల్లో పాకాల మహిళా బ్యాంక్.

లాభాల్లో పాకాల మహిళా బ్యాంక్

ఘనంగా పాకాల మహిళా బ్యాంక్ 24 వార్షిక మహాసభ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నర్సంపేట పాకాల మహిళా బ్యాంక్ 25 లక్షల 50వేల లాభం అర్జించిందని పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండం రాజేశ్వరి తెలిపారు.శాంతినగర్ లోని మహిళా బ్యాంక్ కార్యాలయంలో 24 వార్షిక మహాసభ ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాక్స్ సొసైటీ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ2024-25 సంవత్సరానికి గాను డిపాజిట్లు రెండు కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మహిళ బ్యాంక్ 236 సంఘాలు మరియు బృందాలతో ఆర్థిక అభివృద్ధి దిశలో ముందుకు కొనసాగుతున్నట్లు తెలిపారు. 3000 పైచిలుకుల సభ్యులు గల సంఘంలో పాడి గేదె రుణాలు, వ్యాపార రుణాలతో పాటు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాజేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్స్ కోశాధికారి ఇమ్మడి పద్మ, డైరెక్టర్ గొర్రె రాధ, గండు శ్రీదేవి,గాధగోని నిర్మల, రాపాక మాణిక్యం, మండల పద్మ, దేవులపల్లి వాణి,గుడిశాల వనజ, బొమ్మగాని మంజుల, గొడిశాల రజిత ,లీగల్ అడ్వైజర్ పెండెం శివానంద్ సిబ్బంది కీసరి విజయ, పాకాల రంజిత్ తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి

ఐనవోలు నేటిధాత్రి:

ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయుడు అక్రమ డిప్యూటేషన్ తొలగించాలి.

రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయుడు అక్రమ డిప్యూటేషన్ తొలగించాలి

ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి:

వీపనగండ్ల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల నుండి డిప్యూటే షన్ ద్వారా వనపర్తి ప్రభుత్వ బాలుర పాఠశాల కు బదిలీ చేయించుకొని వచ్చారని వనపర్తి లో రాజకీయ పార్టీ ల సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజావాణిలా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఫిర్యాదు చేశామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు వనపర్తికి ఆ ఉపాధ్యాయుని వద్దని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఎమ్మెల్యే మెగారెడ్డి స్పందించి ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ
అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వీపనగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్న సిపిఎం ఖండిస్తున్నామని వీపనగండ్లలో బాలికల బాలుర పాఠశాలల్లో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడని , అతన్ని 5 మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలుర పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ డిప్యూటేషన్ ను ఎత్తివేయకుంటే వనపర్తి లోని ప్రజా సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుందని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఎం నాయకులు బాల్ రెడ్డి, దేవేందర్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య, ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి, రవి, ఇటుకూరి రంజిత్, కొండ వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ భూములను పరిరక్షించండి.

ప్రభుత్వ భూములను పరిరక్షించండి.

నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి :

 

 

 

నాగర్‌కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాలలో కుంటల ఆక్రమణలు,చెరువు శికం భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్దానిక సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్ పట్టణం కొత్త జిల్లా గా ఏర్పడిన నాటి నుండి జిల్లా పరిసర ప్రాంతాలలో చాలా వరకు కుంటలు,చెరువు శిఖం భూములు ఆక్రమణలు జరిగినట్లు వివిధ పత్రికలలో వార్తలు వినపిస్తున్నాయని ఇట్టి భూఆక్రమణల పై గతంలో కలెక్టర్ కూడ నివేదికలు ఇవ్వమని సంబంధిత అధికారులను ఆదేశించినా చర్యల విషయంలో అధికారాలు,ఆధారాలు ఉన్నా ఆలస్యం చేస్తూ నివేదికల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని,పట్టణ ప్రజలకు,రైతులకు మేలు చేసే చెరువులను, కుంటలను కాపాడవలిసిన తక్షణ కర్తవ్యం జిల్లా ఉన్నతాధికారులపై ఉందని ప్రకృతి వనరులను రాజకీయ అండదండలతో చెరబట్టి ధ్వంసం” చేసి కాంక్రీట్ జంగిల్ గా కందనూలు చెరువు”లను మారుస్తున్నా.జిల్లా ఉన్నతాధికారుల లో ఏమాత్రం చలనం కలగడం లేదని వాపోయారు.

జల వనరులను ఎవరు ఆక్రమించుకున్నా విచక్షణాధికారం ఉపయోగించి ప్రభుత్వ ఆధీనం లోకి తెచ్చుకునే అవకాశం ఉన్నా,ఆ దిశగ ఉన్నతాధికారులు ప్రయత్నించకపోవడం బాధాకరమని,ఆక్రమణలపై కోర్టుకేసులు ఉన్నా కబ్జాదారుల విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కోర్టుల దృష్టికి తీసుకెళ్లి కూల్చివేసే అధికారం జిల్లా ఉన్నతాధికారులకు ఉందని,ప్రజల ఆస్తులకు ఏ మాత్రం నష్టం వాటిల్లినా,తమ అధికార దండాన్ని ఉపయోగించే అవకాశం ఉన్నతాధికారులకు ఉన్నా చర్యలు తీసుకోకుండా..

 

Government lands

 

ప్రేక్షక పాత్ర వహిస్తే,మిగిలిన ప్రభుత్వ భూమి కూడ కబ్జా ల పాలుకావడంతో పాటు భవిష్యత్తు తరాలకు తీరని నష్టం”చేసిన వారు అవుతారాని సూచించారు.చెరువు బఫర్ జోన్, శిఖం పరిధి లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని చట్టంలో ఉన్నా భూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కుంటలను ధ్వంసం చేస్తూ,చెరువు శిఖం భూములలో నిర్మాణాలు చేసిన వారిపై పీ.డి యాక్ట్ ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టాల్సిందిగా పిర్యాదు లో విజ్ఞప్తి చేసారు.

55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.

సంకేపల్లి గ్రామంలో 55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
*శంకర్ పల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

 

శంకర్ పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామస్థులతో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమస్యలని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ పనులలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పనులలో జాప్యం జరగకుండా పనులను త్వరితగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, ఫిల్డ్ అసిస్టెంట్ ఉబాగుంట రాజు, మాజీ సర్పంచ్ భద్రయ్య, వార్డు మెంబర్లు, కావాలి గోపాల్, సురేష్, మౌనేష్ , తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతీ దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డియార్వో విజయలక్ష్మి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి,నర్సంపేట ఉమారాణి గార్లు పాల్గొని ప్రజలనుండి స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 130 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ 54, హౌసింగ్ 20 దరఖాస్తులు వచ్చాయని మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 56 వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం లభించకపోవడంతో ప్రజావాణికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని,మీ పరిధిలో పరీక్షించవలసిన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు.ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఆదేశించారు.ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తుదారునికి వివరించే ప్రయత్నంచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టిఐ ,గ్రీవెన్స్ పెండేల్సి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,e ఫైలింగ్ లో ఫైల్స్ సర్క్యులేట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.వ్యవసాయ,ఆరోగ్య, విద్యాశాఖ తదితర శాఖలు శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలని పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణచేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ అధికారి అనసూయ, డిబిసిడివో పుష్పలత,జిల్లా విధ్యా శాఖ అధికారి జ్ఞానేశ్వర్,నర్సంపేట ఆర్డీఓ ఇమారాణి,సంబంధిత అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న.

దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమిద్దాం

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి – ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపుని స్తున్నట్లు యుగంధర్ తెలిపారు.

ఈముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కరీంనగర్ బస్టాండ్ వద్ద విడుదల చేశారు.

ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నష్టపరిచే చర్యలను దేశ పౌరులు తిప్పికొట్టాలని వారు అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోడీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

మోడీ ట్రంప్ మాటలను సైతం ఖండించలేదని వారు అన్నారు.

భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు.

మోదీ అమెరికా సందర్శించినప్పుడల్లా కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తారు.

‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వారు ధ్వజమెత్తారు.

ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

మోడీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదని వారు ఉద్ఘటించారు.

అందుకే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

ఈపోస్టర్ విడుదల కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కనకం ప్రవీణ్, వినయ్, చరణ్, మధు, రాజేష్, కిరణ్ రాఘవేంద్ర,కుమార్, వినయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ పంచాయతీ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది.పరిశీలన అనంతరం అధికారులు మాట్లాడుతూ వీలయినంత త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనీ లబ్దిదారులకు సూచించారు.నిర్మాణం స్టేజిల వారిగా ఫోటో కాప్చర్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కాంక్షని,పంచాయతీ కార్యదర్శి అరెల్లి సత్యనారాయణని ఆదేశించారు.

కోతుల నుండి రక్షించండి.

కోతుల నుండి రక్షించండి…

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది.అవి తరచుగా ఇళ్లలోకి ప్రవేశించి ఆస్తి నష్టం కలిగిస్తున్నాయనీ,ఇళ్ళముందు బాల్కనీ రక్షణ గోడలపై కూర్చుంటూ,విద్యుత్ తీగలపై తిరుగుతూ ప్రజలను,ముఖ్యంగా పిల్లలను,మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయనీ స్థానికులు వాపోతున్నారు.ఈ కోతులను సురక్షితంగా నియంత్రించి,నిర్బంధించి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాత మంచిర్యాల ప్రాంతవాసులు కోరుతున్నారు.ఈ ప్రాంత ప్రజల భద్రత మరియు శ్రేయస్సు కోసం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.  

వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.

ఝరాసంగం: వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version