Call to Make Hindu Dharma Sammelan a Grand Success
హిందూ ధర్మ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు
కుంకుమేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ ను ఆహ్వానించిన సమితి సభ్యులు
పరకాల పట్టణంలో ఈనెల 28వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా సమితి ఉపాధ్యక్షుడు మాడుగుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ దేవస్థానం ఛైర్మన్ గందే వెంకటేశ్వర్లును సత్కరించి కార్యక్రమానికి ఆహ్వానించారు.హిందువుల ఐక్యత ద్వారా సమాజ చైతన్యం,సంస్కృతి పరిరక్షణకు ఈ సమ్మేళనం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
