తెలంగాణ జాగృతిలో చేరిన భాజపా పంజాల శ్రీరామ్
కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేటకు చెందిన బీజేపీ వరంగల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు,సీనియర్ నాయకుడు పంజాల శ్రీరామ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతి పార్టీలు చేరారు. ఈ చేరిక ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో జరిగింది.నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పంజాల శ్రీరామ్ భారతీయ జనతా పార్టీలో గత కొన్ని ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేశారు. అలాగే జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసి, నర్సంపేట మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ అంతర్గత లోపాల వల్ల బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ జాగృతిలో చేరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతరించబోయే తెలంగాణ జాగృతిలో నిబద్ధతతో పని చేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ చేరికకు సహకరించిన నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తడిగొప్పుల మల్లేష్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి నవీన్ చారి, రాష్ట్ర, జిల్లా నాయకులకు పంజాల శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
