నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి
• కన్నీరు మున్నిరవుతున్న రైతన్నలు
• కాలువలు లేక తిప్పలు
నిజాంపేట: నేటి ధాత్రి
భూగర్భ జలల్లో నీళ్లు లేక రైతుల పొలాల్లో బోర్ మోటార్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా నందగోకుల్, నస్కల్, చల్మెడ గ్రామాల్లో బోర్ మోటార్లు తగ్గుముఖం పట్టాయి. దింతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరి నాట్ల సమయంలో అధికంగా పోసిన బోరు మోటార్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం తో ఏమి చెయ్యాలో అర్థం కాకా రైతులు తలలు పట్టుకుంటున్నారు. బోరమోటార్ లను నమ్ముకొని వరినాటు భూమి ఉన్నవరకు వేశామని ఇప్పుడు బోర్లు పొయ్యకపోవడం తో చాలా వరకు వరి పంటలు ఎండిపోవడం తో పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. చేతికి వచ్చిన పంటలు ఎండ తీవ్రత కు ఎండిపోతుంటే ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. మండలం లో కొన్ని గ్రామాలకు కాళేశ్వరం నీరు కాలువల ద్వారా వస్తున్నాయని తమ గ్రామాలకు కూడా నీరు వచ్చేలా చూడాలని ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు. కాళేశ్వరం నీరు కాలువల ద్వారా ప్రతీ గ్రామంలో గల చెరువులలోకి పంపించినట్లయితే భూగర్భ జలలు పెరిగి బోర్లు సంమృద్ధిగా పోస్తాయని అభిప్రాయ పడుతున్నారు.

• మా గ్రామాలకు కాలువలు తీసుకురండి
రైతు చంద్రయ్య
మా గ్రామాలకు కాలువలు లేకపోవడంతో
కాళేశ్వరం నీరు రావడం లేదు. మా పంటలకు కాళేశ్వరం నీరు అందించండి! కాలువల ద్వారా కాళేశ్వరం నీరు గ్రామాలలో చెర్వులోకి వదిలితే భూగర్భ జలాలు పెరుగుతాయి