బడే నాగ జ్యోతక్క విజయం కోసం ఉపవాస దీక్షలు

మంగపేట నేటిధాత్రి

బడే నాగజ్యోతక్క ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసిన రాజుపేట టిఆర్ఎస్ మహిళా గ్రామ కమిటీ సభ్యులు… రాజుపేట టిఆర్ఎస్ మహిళా గ్రామ కమిటీ అధ్యక్షురాలు ,భూతం సుశీల మాట్లాడుతూ..బడే నాగజ్యోతక్క ప్రత్యర్థుల్ని అధిగమించి జనాదరణ సంపాదించుకొని ఈ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ ములుగు ఎమ్మెల్యే అధికారాన్ని కైవసం చేసుకొని ములుగును అభివృద్ధి పథంలో నడిపించాలని ములుగు ప్రజల ఆకాంక్షలన్నిటిని నెరవేర్చే విధంగా అక్క గొప్ప జననేతగా కీర్తి ప్రతిష్టలు పొందాలని రాజుపేట ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది.. అని వారు అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యరాక్షులు గుడేపు. పద్మ, ప్రధాన కార్యదర్శి కొప్పుల. రమణ, సహాయ కార్యదర్శి మైప .రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *