సుబ్రమణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు
తమిళనాడులో పర్యటిస్తున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తమిళనాడులోని పళని సుబ్రమణ్యస్వామి (దండయుతస్వామి) ఆలయాన్ని సందర్శించారు.స్టడీ టూర్ లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.సంఘంలో సభ్యునిగా ఉన్న ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ రమేష్ విధూరియ,ఇతర సభ్యులతో కలిసి మంగళవారం సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వీరికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు, వేదపండితులు ఆశీర్వచనాలు పలికి శాలువాతో సత్కరించారు, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ పుణ్య దంపతుల వెంట కుమారుడు వద్దిరాజు ప్రీతమ్ ఉన్నారు.
`కాంగ్రెస్ నుంచి ఎంతటి వారి వార్తలైనా పరిమితంగా వుండాలి.
`నా వార్తలే నిత్యం రావాలి?
`షర్మిల వార్తలు హైలెట్ అవుతుండాలి?
`కాంగ్రెస్ పార్టీ మొత్తం షర్మిల కోసం ఎదురుచూస్తున్నట్లుండాలి!
`షర్మిలను కాంగ్రెస్ వర్గాలు ఆహ్వానిస్తున్నట్లే వార్తలుండాలి.
`షర్మిల వస్తేనే పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తుందనేలా రాయాలి!
`షర్మిలను మించిన నాయకురాలు లేదనే చర్చ జరగాలి?
`షర్మిలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి వార్తలు తగ్గించాలి?
`తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికొచ్చే కృషి జరగాలి?
`అటు మీడియా తో, ఇటు అనుచరులకు పొంగులేటి సూచన?
`పెద్ద ఎత్తున సోషల్ మీడియా వింగ్ ఏర్పాటుకు కసరత్తు!
`యూ ట్యూబ్ నిండా మన వార్తలే వుండాలి.
`మన వార్తలే ట్రెండిరగ్ కావాలి?
`నా నాయకత్వం మీద ఎక్కువ ఫోకస్ వుండాలి?
`తెలంగాణ మొత్తం పొంగులేటి వార్తలు కనిపించాలి.
`ఇది ప్రచార యుగం.. ఎంతైనా ఖర్చు చేద్దాం?
`నేనేంటో చూపిస్తా! కాంగ్రెస్ లో నా తర్వాతే ఎవరైనా అనేలా చేస్తా!!
`నా రాజకీయం అందరికీ రుచి చూపిస్తా!
హైదారబాద్,నేటిధాత్రి:
ఇకపై ప్రధాన మీడియా స్రవంతిలోనైనా, ఇతర మీడియా సంస్ధల్లోనైనా, మన ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాతోపాటు, కాంగ్రెస్ పార్టీ మీడియా వింగ్‌లోనూ తన వార్తలే కనిపించాలి. తాను ఎవరెవరిని కలుస్తున్నాను…తనను ఎవరు కలుస్తున్నారు? తనకెంత బలముంది? అన్నది ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ వుండాలి. అందుకే నిత్యం కాంగ్రెస్ పార్టీ వార్తల పేరుతో నేనే మీడియాలో కనిపించాలి. నా వార్తలు మాత్రమే పెద్దగా హైలెట్ కావాలి. మొత్తంగా నా మాటే మీడియాలో కూడా వినిపించాలి. ఇది కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో చెబుతున్న మాట? ఆ తర్వాత మన తరుపున త్వరలో కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలకు ప్రాధాన్యత కల్పించాలి. ఇప్పటికే ఆమె పాలేరు నుంచిపోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. తెలంగాణలో సుమారు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో పాలేరులో కూడా పాదయాత్ర జరగనుంది. అక్కడే నివాసం కూడా వుంటానని చెబుతోంది. అందువల్ల ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా, పార్టీ నేతలు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వండి వార్చాలని సూచిస్తున్నారట. ముందుగా తన వార్తలకు ప్రాధాన్యత కల్పిస్తూ, తర్వాత షర్మిల వార్తలను ఎక్కువగా ఫోకస్ చేయాలని ఖచ్చితంగా సూచనలు చేసినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ వార్తల విషయంలో తన వార్తలే నిత్యం రావాలని, మిగతా కాంగ్రెస్ నేతల వార్తలకు అంత ప్రాదాన్యత కల్పించొద్దని కూడా మీడియా వర్గాలను మేనేజ్ చేసుకునే పనిలో శ్రీనివాస్‌రెడ్డి వున్నాడట. ముఖ్యంగా షర్మిల వార్తలను తెలంగాణ సమాజంలోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం వుందని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అంతే కాదు షర్మిల వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని, ఇప్పటికీ కాంగ్రెస్‌లో షర్మిలను మించిన నాయకులు లేరన్నది జనంలోకి బాగా తీసుకెళ్లాలని కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకునేంతగా పార్టీ నేతలు కోరుకుంటున్నారన్న సంగతిని జాతీయ కాంగ్రెస్ నేతలు తెలుసుకునేలా జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేసుకుంటామని కూడా చెప్పుకుంటున్నారట. త్వరలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అనుచరుల సమావేశంలో పొంగులేటి వివరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో మొత్తం పొంగులేటి వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే కనిపించేలా ఇప్పనుంచే డిజైన్ చేయాలని చెబుతున్నారట. ఏ యూట్యూబ్ చానల్చూసినా తన వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే విసృతంగా అప్‌లోడ్ చేయాలన్నారట. పెద్దఎత్తున పాజిటివ్ వార్తలు ట్రెండిరగ్‌లో వుండేలా సోషల్ మీడియా వింగ్ 24 గంటలు పనిచేసేలా వుండాలని చెప్పారట. ఇది ప్రచార యుగం..దాని కోసం ఎంత ఖర్చు చేస్తే అంత లాభం అని, అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని కూడా పొంగులేటి స్పష్టం చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నేనోంటో చూపిస్తా…నా రాజకీయం ఏమిటో చూపిస్తా…కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర ఎలా వుంటుందో చూపిస్తా…నేను చెప్పిందే పార్టీ మొత్తం వినేలాచేస్తా…నా తర్వాతే పార్టీలో ఎవరైనా అనేలే చేస్తా…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మాహన్‌రెడ్డి రుణం తీర్చుకుంటా? షర్మిలను తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిషలు పనిచేస్తా..ముందు అది ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెడుతా…నేను సూచించే వారికే టిక్కెట్లు ఎలా దక్కాలో స్కెచ్ వేస్తా..అంటూ తన అనుచురులలో ఉత్సాహం నింపినట్లు విశ్వసనీయ సమచారం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరులో మరో కొత్త కుంపటి రాజేసుకోనున్నది.
ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్లు మాజీ ఎంపి.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనదంటూ, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీని మొత్తం తన వైపు తిప్పుకునే ఎత్తుగడలు ఇప్పటినుంచే వేస్తున్నట్లు కూడా సమాచారం. తాను దూర సందు లేకపోయినా, మెడకో డోలు అన్నట్లు తాను కాంగ్రెస్‌లో చక్రం తిప్పడమే కాకుండా, షర్మిలను క్రియాశీలం చేయడానికి అసరమైన కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమచారం. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఆ పార్టీల త్వరలో కల్లోలం రేపే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయనను కలుస్తున్న నాయకులు, ఆయన పిలుస్తున్న నాయకులు ఖమ్మంలో ముందు పెంచుకోనున్న పట్టు అన్నదానిపై అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులన్నీ షర్మిల కోసమే అన్నది కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరికొత్త రాజకీయం మొదలుపెడుతున్నాడని వినికిడి. ఇదిలా వుంటే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పటికే వున్న అనేక గ్రూపులతో సతమతమౌతూ వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఫలంగా కర్నాటక ఫలితాలతో కనిపించని ఊపు వచ్చిందని నమ్ముతున్నారు. ఇదే నిజమని ఎవరికి వారు నా మాటే చెల్లాలన్న రాజకీయాలు మొదలుపెడుతున్నారు.ఇలాగే గతంలో రేవంత్‌రెడ్డి కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా అంటుండేవారు. ఎక్కడికెళ్లినా, ఏ సభనైనా రేవంత్‌రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేసే బ్యాచ్ అంతటా రెడీగా వుంటుందంటుండేవారు. పైగా అసలైన కాంగ్రెస్ నేతలు పార్టీనుంచి పారద్రోలేలా రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియా సైన్యం జగ్గారెడ్డి, ఇతర నాయకుల మీద పెద్దఎత్తున ట్రోల్ చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులు పెట్టిన సందర్భం కూడా వుంది. వాటిపై పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదులు చేస్తామని కూడా జగ్గారెడ్డి, హనుమంతరావులు హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఒక దశలో జగ్గారెడ్డి కూడా పార్టీని విలేస్తానని, అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని, రేవంత్ సంగతి చూస్తానని కూడా హెచ్చరికలు జారీచేశారు. రేవంత్‌రెడ్డికి పోటీగా జగ్గారెడ్డి కూడా తిరంగ యాత్ర చేపట్టిన వైనం చూశాం. ఇప్పుడు సరిగ్గా అదే పనిని పొంగులేటి చేసి, రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపించే పనిలో పడుతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మొదట పొంగులేటి కాంగ్రెస్‌లో రావాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తొలి దశలో వ్యతిరేకించింది రేవంత్ రెడ్డే. షర్మిల విషయంలోనూ ముందు స్పందించింది కూడా రేవంత్ రెడ్డే. తెలంగాణలో మేం..మేం చూసుకుంటాం? నీ రాజకీయాలు, సేవలు మా తెలంగాణ ప్రజలకు అక్కర్లేదు అని ప్రకటించింది కూడా రేవంత్‌రెడ్డే. ఎక్కడైతే ప్రభుత్వ ఏర్పాటుకోసం, ఏ అన్న కోసం పనిచేశావో అక్కడే రాజకీయాలు చేసేకో అంటూ సూచనలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఆఖరకు ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరేందుకు అధిష్టానం నుంచి మార్గం సుగమమం చేసుకుంటున్నారు. అదే జరిగితే ఇక రేవంత్‌రెడ్డికి చుక్కలే…కోరికోరి కుంపటి నెత్తిన పెట్టుకోవడం అంటేఇదే మరి…ఏం జరుగుతుందో చూద్దాం. అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన ధనబల రాజకీయంతో షర్మిలను ముందుకు తీసుకొస్తే, సామాజిక పరంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను రేవంత్ రెడ్డి ముందుకు తెచ్చి రసవత్తరమైన రాజకీయాన్ని అడేందుకు సిద్దపడుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాజకీయాలు ఇక ముందు ముందు మరింత రసవత్తరంగా వుంటాయని చెప్పడానికి ఇది ట్రైలరే అంటున్నారు.
` బిజేపి శ్రేణులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దనం తెలిసేలా చేశాడు.
`ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనా దక్షతతో తెలంగాణకున్న ప్రాధాన్యత గురించి చెప్పి వెళ్లారు.
`మీకు అర్థమౌతుందా?
`స్టేజిని చూసి మోడీ నిరాశ చెందినట్లున్నాడు
`వలసవాదులను చూసి అవాక్కైనట్లున్నాడు.
`అందుకే ఎవరి పేరు ఉచ్చరించకుండానే స్పీచ్ ఇచ్చారు.
`ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ మూలాలు ఉన్నవాళ్లు ఇద్దరూ ముగ్గురే
`మిగిలిన వాళ్ళందరూ అవసరానికి వచ్చిన వాషింగ్ పౌడర్ నిర్మాలే?
`ప్రజలను చూసి సంతోషపడ్డాడు! స్టేజిని పై ఉన్న వాళ్లని చూసి నిరాశ చెందినట్లున్నాడు!!
`ఒక్క బండి సంజయ్ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి మోడీ సంతోషించినట్లున్నాడు.
`బండి సంజయ్ మార్పుపై మధనపడ్డట్లున్నారు.
`కిషన్ రెడ్డికి అంత పవర్ లేదని తెలుసుకున్నట్లున్నాడు.
`బిజెపిని రెడ్లు ఆక్రమించేసి బీసీలకు దూరం చేస్తున్నారేమో అనుకున్నట్లున్నాడు.
హైదరబాద్,నేటిధాత్రి:
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వరంగల్ వస్తున్నాడు. 8వ తేదీ ఎప్పుడొస్తుంది? ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతాడు? పార్టీ శ్రేణులుకు పూర్తి భరోసా కల్పిస్తాడు. దిశానిర్ధేశం చేస్తాడు. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో హిత బోధ చేస్తాడు. అగ్రహోదగ్రుడిలాగా బిఆర్‌ఎస్ మీద ఆరోపణాస్త్రాలు సంధిస్తాడు. విమర్శల జడివాన కురిపిస్తాడు. సగటు బిజేపి శ్రేణుల్లో ఉత్సాహం నింపి వెళ్తాడు. తెలంగాణ బిజేపికి ఒక ఊపు తీసుకొస్తాడు. డబుల్ ఇంజన్ సర్కారు ప్రస్తావన తెస్తాడు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివిరిస్తాడు. తెలంగాణను ఏం చేశామో చెబుతాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో లెక్కలు చెబుతాడు. భవిష్యత్తులో తెలంగాణకు ఏం చేస్తామో చెప్పి వెళ్తాడు. ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్దిని వివరిస్తాడు. గుజరాత్ మోడల్‌ను గుర్తు చేస్తాడు. అక్కడి ప్రగతిని తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరిస్తాడు. మేకిన్ ఇండియా గొప్పదనం అందరికీ వినిపించేలా చెప్తాడు. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారపడతాడు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి అంటూ ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని గిర్జస్తాడు. ఇక కొట్లాడండి అని బిజేపి శ్రేణులను ఉత్సాపరుస్తాడు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఊపరి సల్పకుండా చేస్తాడు? ఇది శనివారం ఉదయం వరకు రాష్ట్ర బిజేపి పెద్దలు, నాయకులు, శ్రేణులు, సగటు కార్యకర్తలు కొంత కాలంగా నిద్రాహరాలు మాని ఎదురుచూసిన తరుణం.
పాపం..వాళ్లు ఒకటి ఆలోచిస్తే..ప్రధాని మోడీ మరొకటి చెప్పాడు. ఒక్కసారిగా నిద్రలో వున్న వాళ్లకు మెలకువ వస్తే ఎలా ఉలిక్కిపడతారో..అలా బిజేపి నేతలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే ప్రధాని తన ప్రసంగం ముగించారు.
ఇదీ ఈ రోజు బిజేపి నేతలకు కళ్లు బైర్లు కమ్మిన రోజు. ఇన్ని రోజుల పాటు ఎదరుచూసిన దానిలో కనీసం ఒక వంతు కూడా ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభను మించి బిజేపి సభ జరుగుతుందని గొప్పలకు పోయారు. పెద్ద భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన కూడా పెద్ద విదామైంది. పత్రికా ప్రకటలనపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాహుల్ గాంధీ సభను మించిన సభ జరుగుతుందని అందరూ ఊహించారు. ప్రధాని మోడీ ప్రసంగంపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఊహించినంత స్ధాయిలో రాష్ట్ర బిజేపి సభ నిర్వహించలేదు. బిజేపి శ్రేణులు కలగన్నట్లు ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. అటు, ఇటూ సప్పగానే తోచింది. బిజేపి కార్యకర్తలకు కొంత కోపం వచ్చింది. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, బిఆర్‌ఎస్ మీద విరుచుకుపడుతున్న బిజేపి నేతల గాలి ప్రధాని మోడీ తీసి వెళ్లిపోయారు? ఇది ఎవరో అంటున్న మాట కాదు…సాక్ష్యాత్తు సభ దగ్గరే బిజేపి శ్రేణులు తిట్టుకున్న వ్యాఖ్యలు?
వరంగల్ సభ ప్రధాని మోడీకి నచ్చనట్లు వుంది. ఆ సభా వేదిక మీదకు రాగానే ప్రధాన మంత్రి మోడీకి అది బిజేపి వేదికలాగా కనిపించినట్లునట్లుంది.
కింద వున్న కార్యకర్తలు బిజేపిని అనువణువూ నింపుకున్న వాళ్లు. కాని వేదిక మీద వున్నవాళ్లు అద్దె నేతలు. అరువు నేతలు. అవకాశవాదం కోసం బిజేపిలో చేరిన వాషింగ్ పౌడర్ నిర్మాలు. వారి రాజకీయ భవిష్యత్తు కోసం కాషాయకండువా కప్పుకున్నవారు. అంత పెద్ద వేదిక మీద అసలు బిజేపి నేతలుగా కనిపించింది ముగ్గురే..ఒకరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మూడు బండిసంజయ్. అంతే ముందు వరసలో చూసినా, వెనక వరుసలో వున్న వాళ్లంతా రాజకీయ అవసరార్ధం చేరిన వాళ్లే…అందుకే ప్రధాన మంత్రి మోడీ బిజేపి సభలో ఏ ఒక్క నాయకుడిని పేరును ప్రస్తావించలేదు. కనీసం సభ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పలేదు. ఆఖరకు సభకు విచ్చేసిన బిజేపి శ్రేణులకు అభివాదం కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఆఖరున ఔర్ ఏక్ బార్ బిజేపి సర్కార్ అని మూడుసారు శ్రేణులతో అనిపించి ముగించారు. అంటే ఆయనకు ఆ సభ నిర్వహణ మీద ఎలాంటి సదాభిప్రాయం లేదన్నది అర్దమైంది. కేవలం బండి సంజయ్ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ప్రధాని మోడీ ఆసక్తిగా గమనించారు. బండి సంజయ్ మాట్లాడుతుంటే పార్టీ శ్రేణులు ఈలలు వేస్తుంటే సంతోషించాడు. అంతకు మించి ప్రధాని మోడీ ఒక్కసారి కూడా వేదికపై చిరునవ్వు నవ్వలేదు. గతంలో బండి సంజయ్ నేతృత్వంలో జరిగిన రెండు మూడు సభల్లో ప్రదాని మోడీ పలు మార్లు చిరునవ్వులు చిందించారు. బండి సంజయ్‌ను భుజం తట్టారు. ప్రజలను బండికే చూపిస్తూ మురిసిపోయాడు. వరంగల్ సభలో అలాంటి సన్ని వేశం కనిపించలేదు. ఎవరినీ ప్రధాని మోడీ ఎవరినీ భుజం తట్టలేదు. వరంగల్ సభలో మాత్రం ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. కనీసం సంతోషంగా వున్నట్లు కూడా కనిపించలేదు. అంతే కాదు ప్రధాని ఊహించిన దానికి బిజేపి ఏర్పాటు చేసిన సభను చూసిన తర్వాత కొత్త అధ్యక్షుడైన కిషన్‌రెడ్డి పనితనం ఏమిటో కూడా అర్దమైనట్లుంది.
ఇదిలా వుంటే ప్రధాని మోడీ పదినిమిషాల వ్యవధిలో చెప్పిన రెండు రకాల వ్యాఖ్యలకు బిజేపి శ్రేణులు బిత్తరపోయాయనే చెప్పాలి.
ఓ వైపు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎంత కీలకమో చెప్పారు. తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో చెప్పారు. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పారు. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని వివరించారు. అంటే ఇదంతా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసినట్లే..ముఖ్యమంత్రి కేసిఆర్ పనితీరుకు కితాబిచ్చినట్లే…అయితే బిజేపి ఏర్పాటు చేసిన సభలో ఏదో ఒకటి మాట్లాడాలి. అందువల్ల ప్రధాని తనదైన శైలికి భిన్నంగా తెలంగాణ బిజేపి నేతలు ఏం చెప్పారో అవే విషయాలు ఉటంకించారే తప్ప, ఆయన కొత్తగా చెప్పినట్లు లేదు. గట్టిగా చెప్పినట్లు అసలే లేదు. దాంతో బిజేపి శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇదే సభలో అటు ఈటెల రాజేందర్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తోడుగా ప్రధాని పంచులు వుంటాయని అనుకున్నారు. కాని ప్రధాని కనీసం మాటల మతాబులు కూడా పేల్చలేదు. ఇదీ సంగతి..అర్ధమైందా? రేపటి భవిష్యత్తు ఇదే అని బిజేపి శ్రేణులకు అర్దమైనట్లుంది.
ఇదిలా వుంటే ప్రధాని మోడీ సభ పూర్తయిన వెంటే బిఆర్‌ఎస్ నేతలు ప్రత్యారోపణలు సంధించారు.
కేంద్ర బిజేపి వైఫల్యాలు ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని లెక్కలు చెప్పారు. ఇవ్వాల్సిన వాటి గురించి ప్రజలు వివరించారు. తెలంగాణకు బిజేపి తీరని అన్యాయం చేస్తోందన్న సంగతి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ప్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరులో ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. కనీసం నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని రాష్ట్ర్రమంత్రులు, ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. ఇదీ అసలు సిసలు కొసమెరుపు.
# అదునుచూసి దెబ్బకొట్టిన భాజపా చీఫ్ కిషన్ రెడ్డి వర్గం
వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఇచ్చిన హామీ నెరవేరగా ముందే ఆయన వర్గంపై వేటు మొదలైంది. బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రధాని రాక ముందుగానే భాజపా అధ్యక్ష పదవిపై మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాకు రానున్న 24 గంటల ముందే బండి వర్గంపై మొదటి దెబ్బ పడింది. బండి సంజయ్ వర్గం పై రేటు పడిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం కొండేటి శ్రీధర్, రేవూరి ప్రకాష్ రెడ్డిలు అదును చూసి దెబ్బకొట్టారనే ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టు యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమదేవి తన సోదరుడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన నాయకుడు డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి తో కలిసి గత సంవత్సరంనర క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి భాజపాలు చేరారు. నర్సంపేట పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసేవారు కూడా లేనప్పటికీ కొన్ని వార్డులలో వారు డిపాజిట్లు గల్లంతైన సందర్భాలు ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బిజెపి పాత క్యాడర్ తో పాటు రేవూరి వర్గం కలిసిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన యువజన నాయకుడు డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తన సంఖ్యాబలాన్ని పెంచుతూ భారతీయ జనతా పార్టీలో యువతను చేర్పించారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో భాజపా అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుందన్న సాంకేతాలు వినబడుతున్న నేపథ్యంలో రాణా ప్రతాప్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల భాజాపాకు గట్టి దెబ్బ తగిలినట్టే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కి ప్రధాన అనుచరులుగా ఉన్న వర్గం నుండి రాణా ప్రతాప్ రెడ్డి ని సస్పెండ్ చేయడం బండి సంజయ్ వర్గాన్ని తొక్కే క్రమంలోనే ఇది మొదటి దెబ్బ నర్సంపేట నియోజకవర్గ నుండే మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భాజపా లో చేరిన నాటినుండి రానా ప్రతాప్ రెడ్డి యువతను చేర్పించి పార్టీని ఉవ్వెత్తున లేపుతూ క్యాడర్ను పెంచాడని ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి నుండి బిజెపిలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భాజపా పాత కార్డును కాపాడలేదు అలాగే కొత్తవారిని చేర్చలేదని తెలుగుదేశం నుంచి వచ్చిన రేవూరి నేడు బిజెపిలో కొనసాగుతాడా లేక కాంగ్రెస్ పార్టీకి పోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాల రీత్యా రానా ప్రతాప్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల పార్టీలో ఉన్న క్యాడర్ అయోమయంలో పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
మహదేవపుర్ మండల పరిషత్ అధ్యక్షుల పై ఈరోజు ఆర్డీవో కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం కొరకు అవిశ్వాస పత్రాన్ని ఆర్డీవో కు అందజేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీ కు చెందినటువంటి ఎంపీపీ బన్ సోడా రాణి బాయ్ మండల పరిషత్ అధ్యక్షురాలు గా గత నాలుగు సంవత్సరాల నుండి కొనసాగుతున్న క్రమంలో ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు మాత్రం ముగ్గురు ఉన్నారు. మెజారిటీ మాత్రం భారత రాష్ట్ర సమితి ఎంపీటీసీలే ఉన్నప్పటికీ ప్రస్తుత ఎంపీపీ పై అవిశ్వాసం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాస పత్రం స్థానిక ఆర్డీవోకు 8 మంది ఎంపీటీసీలు అవిశ్వాస పత్రంలో పేర్కొన్నప్పటికీ అవిశ్వాస పత్రాన్ని అందజేసే సమయంలో ఆరుగురు ఎంపీటీసీలు కలిసి ఆర్డిఓ కు అవిశ్వాస పత్రాన్ని అందజేయడం జరిగిందని ఆర్డీవో నేటిధాత్రి విలేఖరికి తెలియపరచారు. ఇక ఎంపీపీ పోయా అవిశ్వాసం వెనుక ఏ రాజకీయ పార్టీ హస్తముంది భారత రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్ లోకి ఎంపీటీసీలు వెళ్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు భారత రాష్ట్ర సమితిలోకి వస్తున్నారా అనేది వేచి చూడాలి. గుట్టు చప్పుడు కాకుండా ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం మంథని నియోజకవర్గ రాజకీయంలో ఒక పెను మార్పు అని చెప్పవచ్చు.
`సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట.
`అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క.
`బిఆర్‌ఎస్ అంటే బడుగులకు అండ సంకేతాలు.
`అదే బాటలో బిజేపి పయనం.
`ఈటెల ఎంపికలో అదే పరమార్ధం.
`కాంగ్రెస్ లో కూడా మొదలైన బడుగుల జపం.
`పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ తో ఒక్కసారిగా కలకలం.
`కాంగ్రెస్ ను ఇంత కాలం కాపాడిరది బడుగు నేతలే.
`కాంగ్రెస్ కు ఎల్లకాలం ఓటు బ్యాంకు బడుగులే.
`అందరూ ఇప్పుడు బడుగుల నినాదమే.
`పటించేది బడుగుల మంత్రమా!
పార్టీల కొంగ జపమా!?
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాల్లో ఏ విషయం గమనించినా అందులో ముఖ్యమంత్రి కేసిఆర్ ముద్రనే స్పష్టంగా కనిపిస్తుందే తప్ప, ప్రతిపక్షాల ఆలోచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలను కేసిఆర్ వేలు పట్టుకొని నడిపిస్తున్నాడా? లేక ప్రతిపక్షాలే కేసిఆర్ వేలు పుట్టుకొని నడుస్తున్నాయో? అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలు విమర్శించే ప్రతిపక్ష కాంగ్రెస్,బిజేపిలు అవే పధకాలకు మరింత ఆర్ధికమద్ది ప్రచారాస్త్రాలు చేసుకుంటున్నాయి. దానికి తోడు ప్రతి క్షణం ముఖ్యమంత్రి కేసిఆర్ వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తూ, వాటినే అనుసరించడం కూడా ప్రతిపక్షాలు అలవాటు చేసుకుంటున్నాయి. తాజాగా బిఆర్‌ఎస్ ఈసారి వచ్చే ఎన్నికల్లో బడుగులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పసిగట్టాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలనీ బడుగుల ఆర్ధిక స్వేచ్ఛ ,స్వాలంబన మిలితమై వుంటున్నాయి. అందులో భాగంగానే వేసే ప్రతి అడుగు పేదలైన బడుగులు సంక్షేమం కోసం చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఆది నుంచి అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు కూడా పేదలైన బడుగుల జీవితాల్లో వెలుగుల నింపేందుకు, వారి జీవితాలకు భరోసా కల్పించేందుకు ఎంతో ఉపయోపడుతున్నాయి. అయితే ఆసరా అన్నది కేవలం పేదరికమే ప్రాతిపదికగా అమలు చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి , షాదీ ముబాకర్ లాంటవి కూడ అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. అయినా బగుడుల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయా వర్గాలు అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా సమానత్వాన్ని సాధించాలి. ఇది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన. అందుకే తెలంగాణలో దళిత బంధు అనే పధకం ప్రారంభించారు. నిజానికి ఇది గొప్ప పధకం. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి పథకం అమలు జరగలేదు. ప్రపంచానికి సమానత్వ పాఠాన్ని చెప్పిన ప్రాన్స్‌లో కూడా ఇలాంటి గొప్ప పధకాలు ఏనాడు లేదు. ఎందుకంటే ప్రపంచ గతినే మర్చిన ప్రాన్స్ విప్లవం ఒక గొప్ప మలుపు. ఒక్క రొట్టె ముక్క కోసం వచ్చిన విప్లవం ప్రాన్స్ విప్లవం. ఆకలి కోపం ఎలా వుంటుందో పాలకులకు రుచి చూపించిన విప్లవం ప్రాన్స్ విప్లవం. అలాంటి దేశంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వ్రుం వున్నప్పటికీ పేదల సంక్షేమం, ఆర్ధిక స్వావలంబన కోసం ఏనాడు కృషి చేసింది లేదు. ఆకలి, ఆర్ధిక, సామాజిక అసమానత్వాలు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. అందుకు ప్రాన్స్ విప్లవం ఒక ఉదాహరణ. బాస్టిలీ జైలు ఉదంతం ఒక నిర్ధారణ. అయినా ప్రాన్స్‌లో సహజంగా వచ్చిన మార్పులోనే అన్ని వర్గాలు అక్కడ ఎదిగాయి. కాని మొదటిసారి ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమం అన్న పదానికి కొత్త అర్ధం చెప్పారు. దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది దళితుల కుటుంబ జీవితాల్లో వెలుగులొచ్చాయి. తెలంగాణలోని మొత్తం దళిత సమాజాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం వారి జీవితాలను దీర్చిదిద్దుతున్నారు. దశల వారిగా దళిత బంధు విడుదల చేస్తూ వారికి ఆర్దిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆ తర్వాత గిరిజన బంధు ప్రకటించారు. అంతకు ముందే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. తాజాగా వాటిని కూడ గిరిజనులకు అందజేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పోడు భూముల సమస్యల ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా పరిష్కారం కాలేదు. అలా గిరిజనుల జీవితాలను కూడా పండగ చేస్తున్నారు. ఈ మధ్య బిసిలకు లక్ష సాయం పథకం ప్రకటించారు. త్వరలో అది కూడా అమలు కానున్నది. ఇలా బిడుగుల కోసం ఒక్కొక్కటీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. సమాజంలో అసమానతలు రూపు మాపే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రజలకు వచ్చేఎన్నికల్లో ఏం చెప్పాలో తోయడం లేదు. దళిత బంధును పెంచి ప్రకటిస్తామా? అంటే అది బిఆర్‌ఎస్ పార్టీని కాపీ కొట్టినట్లే అవుతుంది. ఏ పధకం ప్రకటించాలన్నా వాటికి పేటెంట్ రైట్లు బిఆర్‌ఎస్ వే అన్న భావన కల్గుతోంది. తాజాగా ఆయా పార్టీలు రాజకీయాల్లో బడుగులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచన చేయకముందే ముఖ్యమంత్రి కేసిఆర్ ఈసారి ఎన్నికల్లో బడుగు నేతలుకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తేఎలా వుంటుందన్న ఆలోచనచేస్తున్నాడని తెలిసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా బిడుగుల జపం చేస్తున్నట్లే కనిపిస్తోంది.
బిజేపి తీసుకున్న తాజాగా నిర్ణయాల్లో కూడా బడుగుల వైపు బిజేపి కూడా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే పైకి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసినా, ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి మెరుగైన ఫలితాలు లభించే అవకాశాలున్నాయన్న అంచనాకు బిజేపి పెద్దలొచ్చారు. అందుకే కర్నాటక ఎన్నికల తర్వాత బిజేపి సినారియా మారింది. గత కొంత కాలంగా అటూ, ఇటూ డైలమా కొనసాగించినా, తెలంగాణలో బిజేపి బతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా బడుగుల కార్డు వినియోగించుకుంటే తప్ప మనుగడ సాగించలేమన్నది గుర్తించింది. నిజానికి తెలంగాణలో కూడా బడుగుల నేత సంజయ్ నేతృత్వంలోనే పార్టీకి ఊపు వచ్చింది. కాని ఆయన దూకుడే పార్టీని కొంప ముంచేలా వుందన్న తేలిపోయింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ ఖాళీ అయ్యే పరిస్ధితికి వచ్చింది. అధికార బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే బండి సంజయ్ బలం సరిపోదు. ఆయన వుంటే పార్టీ నేతలు కూడా సహకరించే పరిస్ధితి కనిపించడం లేదన్నది తెలిపోయింది. బిజేపిలోఒక్కసారిగా పెరిగిన అరువు నేతలే, పార్టీని ముంచడమా? తేల్చడమా? అన్నదాకా రావడంలో వారిని కాపాడుకోవాల్సిన అవసరం బిజేపికి కల్గింది. దాంతో బిజేపి కూడా బిసి జపం చేయాల్సి వస్తోంది. ఎందుకుంటే బిఆర్‌ఎస్ మీద ప్రతిపక్షాలు ఓ ముద్ర వేశాయి. కాంగ్రెస్ మీద మరో ముద్ర వుండనేవుంది. దాంతో బిఆర్‌ఎస్ అన్నది ఇటీవల బడుగుల పార్టీ ప్రజలు అక్కున చేర్చుకునేందుకు అనేక పధకాలు అమలు కూడా చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయమే…దాన్ని కూడా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక మిగిలింది కాంగ్రెస్సే…మేమేం తక్కువ..మాకేం తక్కువ. మాకు వున్న ఓటు బ్యాంకు బలమే బడుగులు అన్నది తెరమీదకు తెచ్చేందుకు కాంగ్రెస్ కూడా కొత్తఎత్తులకు సిద్దపడుతోంది.
కాంగ్రెస్‌లో మాత్రం ఒక తరహా తిరుగుబాటు కూడా మొదలైనట్లే కనిపిస్తోంది.
మాజీ పిసిసి. అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తాజగా విడుదల చేసిన బిసి నేతల జాబితాతో కాంగ్రెస్‌లో ఒక కల్లోలం మొదలైనట్లే లెక్క. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓట్లు బడుగులవి..సీట్లు రెడ్లవి అన్న నానుడి వుండేది. వారి పెత్తనమే ఎప్పుడూ సాగేది. అటు ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ వచ్చినా అదే దోరణ కనిపిస్తోంది. మొదటి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించినా, ఆ తర్వాత ఇద్దరూ రెడ్డి నేతలను పిసిసిలుగా నియమించారు. నేను పిసిసి అధ్యక్షుడినౌతా అంటూ విహెచ్. హనుమంతరావు , దామోదర రాజనర్సింహా లాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా చేసేవారు లేరు. వారి గోడు వినేవారు లేరు. కాని జగ్గారెడ్డి, కోమటి రెడ్డి లాంటి వారి వార్తలు మాత్రం చక్కర్లు కొడతాయి. ఇదీ కాంగ్రెస్ తీరు. మరి ఈసారైనా జెండా ఎగరేయాలంటే అదే మూస కాంగ్రెస్ వెళ్తుందో..లేక బడుగుల జపం చేస్తుందో చూడాలి.
తమిళనాడుకు చెందిన బాబా నిత్యానంద బెంగళూరులో ఆశ్రమం నడుపుతున్న సమయంలో అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది.
ఆ తర్వాత అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కొన్నేళ్ల క్రితం భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తన శిష్యులతో కలిసి కైలాస అనే ఏకాంత ద్వీపంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఈ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్టు, రూపాయి నాణేలు, ప్రత్యేక జెండా ప్రకటించి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా పలు దేశాల అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
అదేవిధంగా, నిత్యానంద నినార్క్ నగర పాలక సంస్థ నిత్యానంద కైలాసాన్ని సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది. నిత్యానంద భౌతికంగా గాయపడ్డారని ఇటీవల వార్తలు వచ్చిన తర్వాత, ఆమె లింక్డ్‌ఇన్ పేజీలో రంజిత ఫోటోను నిత్యాంత మాయి స్వామి అని చూపించారు.
Ranjitha
దాని క్రింద కైలాస ప్రధాని అని పేర్కొన్నారు. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని బట్టి కైలాస ద్వీపానికి రంజితను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది.
నాగుర్ల వెంకన్నను పరకాల నియోజక వర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలి.
పరకాల నియోజక వర్గం నుండి వెనుక బడిన సామాజిక వర్గం ఆరె కులానికి అవకాశం ఇవ్వాలి.
తేది: 7-7-2023 రోజున ఉదయం 11.00 గం. పరకాల పట్టణం లోని మయూరి గార్డెన్స్ లో ఆరె కుల సంక్షేమ సంఘం సదస్సు పరకాల మండల ప్రధాన కార్యదర్శి అడగాని జనార్ధన్ అద్యక్షతన జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య అతిదులుగా జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు జిల్లా కమిటి సభ్యులు హాజరైనారు.
అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు హింగె శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని ఆరె కులస్తులు ఆర్ధిక,సామాజిక రాజకీయ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది.ఈ సమస్యలు అన్ని పరిష్కారం కావాలంటే ఆరె కులస్థుల నుండి కొందరు చట్టసభలలో ఉండాలి,అప్పుడు మాత్రమే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆరె కుల ముద్దు బిడ్డ నాగుర్ల వెంకన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి నేటి భారత రాష్ట్ర సమితి రూపాంతరం చెందే వరకు పార్టీకి అధిష్టానానికి విధేయుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. పరకాల నియోజక వర్గం లో పుట్టి పెరిగి అన్ని వర్గాల ఆశీర్వాదం పొందుతున్న నాయకుడు సౌమ్యుడు వివాద రహితుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, బడుగు బలహీన వర్గాల గొంతుక నాగుర్ల వెంకన్న. కాబట్టి మా ఆరె కులం నుండి పరకాల నియోజక వర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్దిగా నాగుర్ల వెంకన్న గారికి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము.
జిల్లా ముఖ్య సలహా దారులు పేర్వాల లింగమూర్తి మాట్లాడుతూ పరకాల నియోజక వర్గం లో ఆరె కుల సామాజిక వర్గం ఓట్లు సుమారు గా 20,000 వరకు ఉంటాయి. ఆరె కులస్థులు తెలంగాణా రాష్ట్రం లోని 20 నియోజక వర్గాలలో గెలుపు, ఓటములను నిర్ణయించే బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. కాబట్టి పరకాలలో నాగుర్ల వెంకన్న గారికి టికెట్ ఇవ్వడం వల్ల 20 నియోజక వర్గాలలో ఉన్న మా అరె కులస్థులు పూర్తిగా బి.ఆర్.ఎస్ వెంట నడుస్తారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో తెలంగాణ సాధిస్తామని ఆశ లేని రోజులలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు వేసిన అడుగులో అడుగై కేసీఆర్ గారి పిలుపునందుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అతి ముఖ్య నాయకులలో నాగుర్ల వెంకన్న ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఊరూరా జండా గద్దెలు నిర్మించి తెలంగాణ నినాదాన్ని పల్లె పల్లెకు మోసుకెళ్లిన ఉద్యమకారుడు నాగుర్ల వెంకన్న. పార్టీ ఒడుదుడుకుల సమయంలో కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉన్న నాయకుడు,పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన క్రమశిక్షణ కలిగిన నాయకుడు, పార్టీ ఏ అవకాశం ఇచ్చిన ఆ పదవికి వన్నెతెచ్చిన శ్రమజీవి, పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా త్యాగం చేసినటువంటి ఉద్యమకారుడు, మచ్చ లేని నాయకుడు నాగుర్ల వెంకన్న.
నాగుర్ల వెంకన్న గారి సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈసారి బి.ఆర్.ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గం అభ్యర్థిగా నాగుర్ల వెంకన్నను ప్రకటించాలని ఆరె కులం నుండి విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ కార్య క్రమం లో జిల్లా కమిటి సభ్యులు కొల్లూరి కండేరావు, కుడ్లే మనోహర్ రావు,నాగుర్ల రాజేశ్వర్ రావు, హింగే భాస్కర్, వరికెల కిషన్ రావు, కుడ్లే సుధాకర్ రావు, సిరిసె చందర్ రావు, వాడికారి లక్ష్మన్ రావు, తుమ్మనపల్లి శ్రీనివాస్,అవేలి శ్రీనివాస్,
అంబీరు శ్రీనివాస్,
పరకాల మండల కమిటి సభ్యులు వాడికారి శివాజీ,నాగుర్ల శ్రీనివాస్,ఇజ్జిగిరి రాజేందర్,బాదరగాని రాకేష్
నడికూడ మండల అద్యక్షులు లోకటి నగేష్, వాంకే రాజు, గుబిరే సుధాకర్,పేర్వాల రత్నాకర్ వరికెల రాజు, నాగుర్ల రాజీరు, సూరావు కిషన్ రావు, సురావు బాబురావు, సురావు శివరావు,మోకిడే రాజు, లోనె సతీష్ , నాగుర్ల బాబు రావు,సురావు నర్సింగరావు, భూపాల పల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వాడికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..
`పొంగులేటి అంత బలవంతుడైతే గత ఎన్నికలలో బిఆర్‌ఎస్ కు సీట్లెందుకు రాలేదు?
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తోంది. 135 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే పార్టీకి దిక్కూ దివానం లేనట్లు, కొత్తగా ఎవరైనా పార్టీలో చేరితేనే బతికి బట్టకడుతుందన్నట్లు సాగుతున్న వ్యవహారం విచిత్రంగా వుంది. పైగా కర్నాకట గెలుపుతోనే కాంగ్రెస్‌కు ఆశలు చిగురించినట్లు, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి జీవమే లేనట్లు ఆత్మహత్యా సాదృష్యమైన ప్రచారం, ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుందే తప్ప లాభం కాదు. ఇదిలా వుంటే నేటిధాత్రి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది. పొంగులేటి రాజకీయం వెనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్ర వున్నట్లు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఏ లక్ష్యం కోసమైతే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడో అది నెరవేరకపోయే పరస్ధితులు ఎదురయ్యేలా సూచనలు కనిపిస్తున్న విషయం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేత ఏకంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసే యోచన జగన్ చేశారని సమాచారం. అప్పటికే షర్మిల కూడా పార్టీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పొంగులేటి పెట్టిన పార్టీలో షర్మిల జాయిన్ అయినా తెలంగాణ వ్యతిరేకి అన్న సంకేతాలు వెళ్తాయి. ఒక వేళ షర్మిల పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేరితే తాను ఏం చేయదల్చుకున్నాడో..చెప్పదల్చుకున్నాడో చెప్పకుండానే తెలిసిపోతుంది. అందుకే ఉభయకుశలోపరిగా కాంగ్రెస్‌లో పొంగులేటి జాయిన్ అయితే, ఆ తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల పెత్తనం మొదలౌతుంది. ఇదీ అసలు స్కెచ్. అదే దారిలో పక్కా ప్రణాళిక సాగుతోంది. అందుకే షర్మిల కర్నాటకకు చెందిన డి.కే. శివకుమార్‌ను అభినిందించినట్లు ప్రచారం చేశారు. తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఫీలర్లు వదిలారు. ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఎక్కడా తెలంగాణప్రజలు వ్యతిరేకించినట్లు కనిపించలేదు. షర్మిల ఒక్కతే తెలంగాణ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు. ఆమెను నమ్మెందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ పరిస్ధితి ఎలా వుంటుందో ఇక్కడ షర్మిల రాజకీయం అంతే వుంటుందని అంచనా వేశారు. దాంతో ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కీలకం కావాలి. చక్రం తిప్పగలగాలి. తెలంగాణ రాజకీయాలను శాసించే దాకా పెరగాలి. అందుకు జగన్మోహన్‌రెడ్డి ఆర్ధిక సహాకారం, కేవిపి. చాణక్యం తోడవ్వాలి. ఇదీ అసలు సంగతి. అందుకే రాహుల్ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరంలో కేవిపి కలిశారు. మరునాడు ఉదయమే షర్మిల గురించి కేవిపి. రామంచంద్రరావు ప్రకటన చేశారు. ఇదంతా పైకి కనిపిస్తున్నట్లు కొత్త విషయం కాదు. చాలా కాలంగా జరిగుతున్న కసరత్తు అన్నది నేటిధాత్రి ముందు నుంచి చెబుతోంది…తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టేందుకు , గుప్పిట్లోకి తీసుకునేందుకు షర్మిలను తెలంగాణ నాయకురాలను చేసేందుకు జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్లాన్ ఇప్పటిదికాదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పుడో గమనించారు. అందుకే ఆయనను ఎప్పుడో పక్కనపెట్టారు. తెలంగాణ రాజకీయాలను , కేసిఆర్ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసికట్టేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటిని పంపించారన్నది దీనితో స్పష్టమైంది. అంతే కాదు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగన్‌ను కలవడం జరిగింది. అప్పుడే నేటిధాత్రి ఆ మైత్రిలో ఆంతర్యాన్ని అంచనా వేసింది. తర్వాత పరిణామాలను తెలియజేస్తూవస్తోంది. ఖమ్మం సభ జరిగిన తర్వాత ఇదే విషయాన్ని నేటిధాత్రి రాయడం జరిగింది. కాంగ్రెస్‌లో వైఎస్. అనుచరగణమంతా ఏకమౌతోంది? పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏకాకిచేసే ఎత్తుగడ వేస్తున్నారన్నది తెలియజేయడం జరిగింది.
ఒక్కసారి పొంగులేటి ఎపిసోడ్‌ను పూర్తిగా పరిశీలిస్తే, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ప్రశ్నించలేదు.
కేవలం ఒక్క రేణుకా చౌదరి మాత్రమే పొంగులేటి రాకను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆమె అదే స్టాండ్ మీద వున్నట్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం అంటే అదేదో అద్భుతం జరిగిపోతుందన్నంతగా ప్రచారం చేస్తూ వచ్చారు. అసలు అంతటి ప్రచారం గతంలో ఏ కాంగ్రెస్ నేతకు జరగలేదు. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇందులో కనీసం పదో వంతు ప్రచారం కూడా జరలేదు. అటు, ఇటూ అంటూ గోడ మీద పిల్లిలా పొంగులేటి ఎటు చూస్తే అటు, ఆ పార్టీకి ఇక తిరుగులేదన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్‌లోకి పొంగులేటి వెళ్లడాన్ని ఈ దశాబ్ధికే ఒక అధ్భుతమైన ఘట్టం ఆవిషృతమైనంత గొప్పగా వందిమాగదలు ప్రచారం చేశారు. కాని అసలు లోగుట్టు తెలుసుకోలేకపోయారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులే లేనట్లు, ఆ పార్టీలో చీకటిలో వున్నట్లు, పొంగులేటి ఒక వెలుగు సూర్యుడైనట్లు ఏం ప్రచామది? కాంగ్రెస్‌లోకి పొంగులేటి రావడమే ఒక వరమన్నట్లు ఇంకా ప్రచారం సాగుతూనేవుంది. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చి అంపశయ్య మీద వున్న కాంగ్రెస్‌కు తులిసి తీర్ధమందించినట్లు కూడా గొప్పలకు పోతున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు ఇన్‌స్టంట్ శక్తికోసం పొంగులేటి గ్లూకోస్ అవసరం అన్నంతగా ఆయన రాకకోసం కొందరు కాంగ్రెస్ నాయకులు పాకులాడారు. ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. ఇక భవిష్యత్తు కాంగ్రెస్‌కు జవసత్వాలు రావాలంటే పొంగులేటి అనే హర్లీక్స్ లేకపోతే కాంగ్రెస్‌కు కష్టమే అన్నంతగా నాయకులు ఆయన రాకకోసం ఆరాటపడినంతగా సాగిలపడడం విచిత్రం. కొత్తగా ఇప్పుడే కాంగ్రెస్ నేతలు కాజు, బాదంలు తింటున్నట్లు, బలవంతులౌతున్నట్లు మరీ విచిత్రం చేస్తున్నారు. ఖమ్మం లాంటి సభలు గతంలో నిర్వహించనట్లు, నా సభ చూశారా…నా ప్రతానం చూశారా…అన్నట్లు పొంగులేటి గొప్పలు చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్‌ను శాసించేది నేనే అన్నంతగా పొంగులేటి ధీమా చూపిస్తున్నాడు. పొంగులేటి రాకతో సీనియర్ నాయకులుంతా పక్కకుపోయినంత పనైంది. కాని ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన భరోసా ప్లకార్డును పక్కన పెడేసినట్లు, ఎప్పుడైనా కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయమన్నది ఆరోజే తెలిపోయింది. అంతే కాదు నేను లేనిదే కాంగ్రెస్ లేదన్నట్లు, బతికి బట్టకట్టేలా లేదన్నట్లు పొంగులేటి మీడియా సమావేశాలు చూస్తే అర్ధమౌతోంది. కాంగ్రెస్‌లో రూపాయి పెట్టే శక్తి వున్న నాయకుడు ఎవరూ లేరన్నట్లు , తన డబ్బులతోనే కాంగ్రెస్ బతకాలన్నట్లు శాసించే స్ధాయిలో వున్నట్లు కూడా ఆయన హవభావాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ కూడా ఘోర పరాభవాన్ని చూసే రోజులు కళ్లముందు కనిపిస్తున్నాయా? అన్న అనుమానం సగటు కాంగ్రెస్ కార్యకర్త కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి బలంగానే వుంది. తెలంగాణ వచ్చాక కూడా ఖమ్మంలో 2014లో 9 సీట్లు కాంగ్రెస్ గెల్చుకున్నది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించింది. మరి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌లోవున్న పొంగులేటి ఆ పార్టీని ఎందుకు గెలిపించలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ చేసిన బీరాలు పలికారు. నిజంగా పొంగులేటికి అంత బలమేవుంటే సొంతంగా పార్టీ పెట్టి, తన బలం నిరూపించాలి. కాని ఆయన హిడెన్ ఎజెండా ఏమిటో తెలిపోయింది. బిఆర్‌ఎస్‌లో చేరి ఆపార్టీని చెడగొట్టాలని చూశాడు. కాని కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేసి, షర్మిల చేతిలో పెట్టేందుకు జగన్ పద్మ వ్యూహంలో పొంగులేటి తనకు తానుగానే చిక్కుకుంటున్నాడు. అంతే…!
` అటు సాగులో కనీవినీ ఎరగని పురోగతి…ఇటు పారిశ్రామిక ప్రగతి.
` నిన్న బీడు నేల…నేడు బంగరు నేల.
` తెలంగాణ భూములు బొచ్చెడు పిరం…
` పొరుగు రాష్ట్రాల రైతులది దుఖం.
` నిన్న దుఖమెల్లవోసిన నేల…
`ఇప్పుడు ఎల్లకాలం నూతుల నిండా జల.
` నాడు చుక్కకేడ్చింది…నేడు పొలం మురుస్తోంది.
` పదేళ్ల కింద వలసలు…నేడు బంగారు పంటలు.
`నిన్న దేశాలు పట్టుకొని పోయి…నేడు ఊరిలో శ్రీమంతుడై..
` తెలంగాణ రైతు రాజయ్యాడు…
హైదరబాద్,నేటిధాత్రి:
మనిషికైనా, మానుకైనా, పక్షికైనా, ప్రకృతికైనా, ఏ జీవికైనా, చెట్టుకైనా, పుట్టకైనా, భూమికైనా, పాడికైనా , పంటకైనా నీరే ఆధారం. ఆ నీరు లేక గోపడిన తెలంగాణ ఇప్పుడు నీటి గంగాళమైంది. నీటి గోస లేని తెలంగాణ ఆవిష్కృతమైంది. తెలంగాణ గోదారి నీళ్లతో కళకళలాడుతోంది. అన్నింటికీ నీరే జీవాధారం. ఒకనాడు కాకతీయ కాలమైనా, సర్కారు నిజామైనా నీటి జాడలలు తొనికసలాడిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో విలవిలలాడిరది. చుక్క నీటి కోసం ఎదురు చూసింది. కనికరం లేని ఉమ్మడి పాలకుల చేతిలో కన్నీటిని దిగమింగుకున్నది. తెలంగాణ సాగు నీటి వనరైన చెరువులు ద్వంసం చేయబడ్డాయి. ప్రాజెక్టులు సాధ్యం కాదని తేల్చి, చెప్పి రైతును కష్టాల పాలు చేశారు. ఆ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ చైతన్య గీతికను ఆలపించి, ఉద్యమించి, పోరాటాన్ని ఉరకలెత్తించి, ఉక్కు సంకల్పంతో, పిడికిళ్లు బిగించి, మూడున్న కోట్లు గొంతులు సవరించి, జై తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి, డిల్లీ గల్లీలో కూడా తెలంగాణ రణ నినాదం చేసి తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్. తెలంగాణ తలరాత మార్చిన తనయుడు కేసిఆర్. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్…
తెలంగాణ వచ్చింది ఏం మారింది?
ఇది తెలంగాణలోని కొంత మంది కనులుండీ చూడలేని వారి ప్రశ్న. కాని తెలంగాణ వచ్చాక తెలంగాణ పూర్తిగా మారిపోయింది. అసలు ఒకప్పటి తెలంగాణేనా అని అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లే ఎక్కడున్నామన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది తెలంగాణకు వస్తున్నవారు చెబుతున్న మాట. సీమాంధ్రకు చెందిన ఒకప్పటి పాలక నేతలు కూడా చెబుతున్న మాట. తెలంగాణ వస్తే ఇక చీకట్లే అన్న వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తాము తెలంగాణ అభివృద్ది కాంక్షించలేకపోయామని, సహకరించలేకపోయామని సిగ్గుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పి తమ చేతగాని తనాన్ని నిరూపించుకుమని అంటున్నారు. అసలు తెలంగాణ ప్రాంతమే తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికి రావని అన్న వాళ్లు , తెలంగాణ ఇలా నీళ్లుతో తడుస్తుందని కలలో కూడ అనుకోలేదంటున్నారు. తెలంగాణ చీకటౌతుందనుకున్నాం? కాని అన్నింటినీ అధగిమించింది. సీమాంధ్రను మంచిపోయింది. తెలంగాణ కూడా అన్న పూర్ణగా మారింది. ధాన్యరాసులు పండుతున్నాయి. భూములకు విపరీతమైన ధర వస్తోంది. దేశంలోనే ఇంత డిమాండ్ వున్న స్ధలాలు లేవు. దిక్షిణభారత దేశంలోని రాష్ట్రాల గురించి చెప్పుకున్నా ఒకప్పుడు చెన్నై అంటే ఎంగో గొప్పగా చెప్పుకునేవారు. కాని అక్కడ మంచినీటి కటకట. కర్నాకట రాష్ట్రంలోని బెంగుళూరును సిలికాన్ వ్యాలీ అంటారు. కాని అక్కడ కూడా పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. నగరం పెరిగేందుకు స్ధలం లేకుండాపోయింది. హైదరాబాద్ సుందరీకరణ అంటే ఒక అద్భుతం. ఎంతో మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రగతి మాయాజాలం. అభివృద్ధి మంత్రం. తెచ్చిన తెలంగాణను బంగారు తునక చేయాలన్న లక్ష్యం. అందుకే తెలంగాణ ఒక అపురూపంగా మారింది. తెలంగాణ అద్భుత కట్టడాలతో అలరాలుతోంది. ప్రతి జిల్లా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడుతోంది. అభివృద్ధి అన్ని జిల్లాలకు సమానంగా పంచబడుతోంది. అన్ని జిల్లాలు సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తున్నాయి. హైదరాబాద్ సౌకర్యాలు తెలంగాణలోని దాదాపు అన్ని నరగాల్లోనూ అందుతున్నాయి. అందుకే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది. తెలంగాణ భూముల విలువ అమాంతం పెరిగింది.
తెలంగాణలో భూముల ధరలు దేశంలో ఎక్కడా లేనంతగా పెరిగాయి.
ప్రజల స్ధిర చరాస్ధులు గణనీయంగా పెరిగిపోయాయి. అందుకు కారణం తెలంగాణ పరిపాలనలో అదొక అద్భుత ఆవిష్కారం. ఒకప్పుడు సీమాంధ్రలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో నాలుగు ఎకరాల స్ధలం కొనుక్కొవచ్చు అన్న మాటలే వినపడేది. కాని ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఒక ఎకరం భూమి అమ్ముకుంటే, సీమాంద్రలో కనీసం వంద ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చు. అని సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అంటే తెలంగాణ ఎంతలా అభివృద్ది చెందిందో అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఏ ప్రాంతంలో భూముల రేట్లు చూసిన అంతే గొప్పగా వున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతం అంటూ వుండేవారు. కాని నేడు అదే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎకరం భూమి కోటి రూపాయలు దాటి పలుకుతోందంటే ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నట్లు కాదు. అదే ఆ పక్కన వున్న మహారాష్ట్రలో ఎకరం కనీసం లక్ష రూపాయలు కూడా పలకడం లేదు. ఇటు వెళ్తే కర్నాకట బోర్డర్‌లో కూడా పెద్దగా భూములకు విలువ లేదు. కొద్దో గొప్పొ ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూములకు విలువున్నా, తెలంగాణ భూములతో పోల్చితే ఎక్కడో అట్టుడుగునే వున్నాయి. తెలంగాణ రాక ముందు సరిగ్గా పదేళ్ల క్రితం హైదరాబాద్ తప్ప, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా ఎకరం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపే వుండేది. కాని నేడు ఏ మారు మూల ప్రాంతమైనా సరే కనీసం రూ.50లక్షలకు తక్కువ లేదు. ఏ జిల్లా కేంద్ర చుట్టు పక్కల ప్రాంతాలైనా సరే కోటి రూపాయలకు తక్కువ లేదు. ఇదీ తెలంగాణ భూముల విలువ.
అటు ఆంధ్రా, ఇటు మహారాష్ట్ర, ఆ పక్కనున్న కర్నాకట రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి అబ్బుపడుతున్నారు.
మురిసిపోతున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లేవారు. తెలంగాణ పల్లెలను వదిలి ప్రజలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ వసలు వెళ్లేవారు. పాలమూరు గోస గురించి, వలస గురించి ప్రత్యేకంగాచెప్పాల్సి వస్తే రాస్తే రామాయణమంత , వింటే భారతమంతా! వుంటుంది. అదీ పదేళ్ల క్రితం తెలంగాణ బతుకు. కాని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని, ఓర్వలేని తనంతో ప్రతిపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు. అయినా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. నిజానికి తెలంగాణ ఇంతలా అభివృద్ది జరుగుతుందిన కాంగ్రెస్, బిజేపి పార్టీలు కలగనలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏం చేస్తారో…చూద్దాం అన్నట్లు సీమాంధ్ర నాయకులు ఎదురుచూశారు. తెలంగాణ అభివృద్ది అంటే నీళ్లు తేవడం అంత సులభం కాదని కాంగ్రెస్ అనుకుంటూ వచ్చింది. కాని తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో కరంటు వెలుగులు కనిపించే సరికి కాంగ్రెస్, బిజేపిల కళ్లు బైర్లు కమ్మాయి. నిరంతర విద్యుత్ తెలంగాణలో సరఫరా అవుతుంటే ఇదెలా సాధ్యమౌతుందంటూ ఆశ్చర్యపోయాయి. మనసుంటే మార్గం వుంటుంది. అభివృద్ది చేయాలన్న చిత్తశుద్ది పాలకుల్లో వుంటే ఏదైనా సాధ్యమౌతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. ఊరు వదిలి వలస వెళ్లిన రైతు తిరిగి పల్లెకు వచ్చాడు. కన్న తల్లి లాంటి ఊరును వదలి, ఆస్ధిగా భావించే సాగు భూమిని వదిలి పొట పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఇప్పుడు ఆ రైతే పల్లెకు మళ్లీ చేరుకున్నాడు. కళ్ల నిండా నీళ్లు చూస్తూ, కడుపారా పొలానికి నీరందిస్తున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. తెలంగాణ రైతు రాజయ్యాడు. ఇదందా సాధ్యం కావడానికి కారణం ఒక్క పేరు..అదే కేసిఆర్. ఆయనే తెలంగాణ తల రాత మార్చిన యుగకర్త. తన ప్రాంతం మీద మమకారంతో ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, తెలంగాణ సాధించిన కేసిఆర్ ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే…ఆయన పేరు తెలంగాణ చరిత్రలో తరతరాలు చెరిగిపోని నిఘంటువే!
తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.
ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్
విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
`షర్మిల రాకను వ్యతిరేకించే రేవంత్ ను అదను చూసి సాగనంపుడే?
`బానిస నేతలు మొదటగా చేసే పని ఇదే?
హైదరబాద్,నేటిధాత్రి:
కొన్ని విషయాలు లోతుగా వుంటాయి. కొన్ని సార్లు గంభీరంగా వుంటాయి. పైకి చిన్నవిగా కనిపిస్తాయి. కాని సార్లు ఉపద్రవాలు సృష్టిస్తాయి. రాజకీయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి కోసం కొన్ని సార్లు సాగిలపడిపోతుంటాయి. మరి కొన్ని సార్లు వ్యక్తికోసం వ్యవస్థనే కుప్పకూలుస్తాయి. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అదే జరుగుతుందా? అన్న అనుమానం కల్గకమానదు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కాని ఆయనకు ఆయనగా పట్టుబట్టి మారీ వచ్చారు. ఇలా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆ పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టం. రేవంత్‌రెడ్డి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో వాటని అదిగమిస్తూ వస్తున్నారు. అయినా అడుగడుగునా ఏదో ఒక ఉపద్రవం వచ్చి వాలుతూనే వుంది. కాని ఈసారి షర్మిల రూపంలో, కేవిపి. రామచంద్రరావు నీడలో వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తి స్ధాయిలో వాస్తవ రూపం దాల్చితే మాత్రం రేవంత్‌రెడ్డికి పదవీ గండం తప్పదు. కాంగ్రెస్ పార్టీ పతనం అంతకన్నా తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ చెడగొట్టలేరు. ఎవరూ బాగు చేయలేరు అంటారు. చెడొగొట్టుకున్నా వాళ్లే, బాగు చేసుకున్నా వాళ్లే అన్నది నానుడి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పాత రోజులకు తీసుకోవడం కోసం అందులో వున్న నాయకులే కృషి చేస్తున్నారని చెప్పకప్పదు. ఇక్కడే కేవలం కేవిపి రామచంద్రరావు తన వ్యక్తిగత స్వార్ధం కోసం, జగన్ కుటుంబానికి దగ్గరవ్వడం కోసం కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసి, మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఈ లోతైన విషయంపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు షర్మిల రాకను చాల మంది స్వాగతిస్తున్నారు. కాని షర్మిల తెలంగాణ రాకతో మొదటగా రేవంత్ కు నష్టం చేస్తే, ఆపై తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆగం కావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనకుండి కథ స్క్రీన్ ప్లే పక్భందీగా నడిపిస్తున్నారనిపిస్తోంది.
షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తూనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు చోటు లేదు. తన మొదటి సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించింది. పాదయాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్ దరి చేరడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు షర్మిల రాజకీయాలకు మార్గం వేశాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్ నుంచి బైటకు రావడానికి ఇంత కాలం పట్టడానికి కూడా జగనే కారణం అన్నది తెలుస్తోంది. అదును చూసి పొంగులేటి పాచికను జగన్ వాడుకున్నాడు. అందుకు పొంగులేటి కూడా సై అన్నాడు. అయితే బిజేపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత కాలం ఎపిసోడ్ నడిపారు. పొంగులేటి బిజేపిలో చేరినా షర్మిల బిజేపిలో చేరడం కుదరదు. అందుకే ముందు బిఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని బైటకు రప్పించారు. అంతకు ముందే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి దింపేశారు. ఈ విషయం తెలియక రేవంత్‌రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తొలుత వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణరాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో మాకు మేము రాజకీయాలు చేసుకుంటామంటూ చెప్పాడు. దాంతో షర్మిల వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను ప్రశ్నిస్తూ వచ్చేది. రేవంత్‌రెడ్డి చేసిన పాదయాత్రపై సెటైర్లు వేస్తూ వచ్చింది. ఇదంతా ముందు నుంచి ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇది రేవంత్‌కు తెలియక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాని తెరవెనుక రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గంలో ముఖ్యమైననాయకులైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి,జానారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. వీరిలో దివంగత వైఎస్‌కు అనుచరులుగా వున్నవారే ఎక్కువ. వాళ్లుంతా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి రూపంలో సహకారాన్ని తీసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి చోటు కల్పించి, కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తున్నారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీరని ద్రోహానికి కూడా వీళ్లు పాల్పడుతున్నారు. ఖమ్మం సభపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తయారు చేయించిన పోస్టర్‌లో పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేకపోవడం గమనార్హం.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా వుంటూ వచ్చిన కేవిపి తొలుత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు.
కాని ఆయన ఎత్తులు పారలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సోనియాగాందీ కేవిపి. సూచనలు పట్టించుకోలేదు. అయినా సమయం చూసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేవిపి అనుకున్నారు. కాని జగన్ అంత కాలం ఆగేందుకు ఇష్టపడలేదు. పైగా ఓదార్పు యాత్ర చేపటొద్దన్న అధిష్టానం సూచనలు జగన్ పట్టించుకోలేదు. కేవివి. జగన్‌కు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్‌లోనే వుండాలంటూ జగన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయినా జగన్ వినలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ జగన్‌పై కేసులు నమోదు.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కేవిపి కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. జగన్‌కు మద్దతుగా నిలవలేదు. ఇది జగన్ కుటుంబంలో అసంతృప్తిని పెంచింది. జగన్ కు కేవిపిని దూరం చేసింది. ఆప్పటి నుంచి జగన్ కుటుంబానికి కేవిపి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, జగన్ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు జగన్ వినలేదు. తాను జగన్‌వైపు నిలవలేదు. ఇప్పుడు షర్మిలకైనా రాజకీయ భవిష్యత్తును సృష్టించి మళ్లీ ఆ కుటంబానికి దగ్గరయ్యే రాజకీయం తెలంగాణలో మొదలుపెట్టారు. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. కాకపోతే ఇందులో జగన్ కూడా షర్మిలకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే, కుటుంబ తగాదాలున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు విషయం బైట పడుతోంది. కేవిపి. రామచంద్రరావుకు కాంగ్రెస్ అధిష్టానంలో మంచి పలుకుబడి వుంది. కర్నాకట ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌కు వైఎస్‌కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ముందు షర్మిలను అటువైపు నుంచి కాంగ్రెస్‌కు దగ్గర చేసే ఎత్తుగడ మొదలు పెట్టారు. అది సక్సెస్ పుల్ అ య్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం మాత్రమే మిగిలి వుంది. షర్మిల ఎలాగూ రేవంత్ నాయకత్వంలో పనిచేయదు. కొత్తగా చేరిన నాయకులెవరూ రేవంత్‌కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా వైఎస్ నామస్మరణ ఇప్పటికీ చేస్తున్నవాళ్లే..అందువల్ల రేవంత్‌కాంగ్రెస్‌లో ఇక ఒంటరే… భవిష్యత్తు బైటకే…! చూద్దం ఏం జరుగుతుందో!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంపీ అయిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది.
తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాదితులు, డయాలసిస్ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.
ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, వారి ధనిక మిత్రులు ఓవైపు ఉంటే.. మరోవైపు రైతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్‌లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ గా మారింది. కేసీఆర్ ఓట్ బ్యాంక్ చెల్లా చెదురు అవ్వటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో గన్నవరం వరకు వెళ్లారు. పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేసారు.
ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట…కార్యకర్తలంతా ఒకే సభ అన్నట్లుగా నిర్వహించటం పైన రాహుల్ హ్యాపీ ఫీలయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణంకు చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్ అంటే.. బీజేపీ రిష్తేదార్ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.
రాహుల్ ఇదే సభలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు అంటూ చెబుతున్న సమయంలో సభలో హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి. సభ ప్రాంగణంకు చేరుకున్న సమయం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవలాను వివరించారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పైన ఖమ్మం వేదికగా గర్జించారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు.
ఎదుర్కోవటం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న అంశాలు.. పార్టీలోని పరిస్థితుల పైన భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు
కబ్జా చేయడం తనకు జాగీరైనట్లు, అది తప్పే కానట్లు, చేసింది గొప్ప పని అన్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పిన సుద్దులు ఆశ్చర్యకరంగా వుంది. దానికి తోడు నవ్వేమైనా తక్కువా…నువ్వు కబ్జాలు చేయలేదా? అంటూ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గురించి ముత్తిరెడ్డి వ్యాఖ్యానించ ఇద్దరం…దొందేలే అని చెప్పినట్లుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుంది జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకైనా అర్థమౌతుందా? అనే దాక వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యాడో…అప్పటి నుంచి వివాదాలే! వివాదాలు!! అయినా కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం, పాలన కోసం ప్రజలు ముత్తిరెడ్డి ని భరిస్తున్నారు. ఇదే వాస్తవమని బిఆర్‌ఎస్ నాయకులే అంటున్నారు. ముత్తిరెడ్డి విషయంలో వివాదం లేని సమయం లేదు…సందర్భం లేదు. గతంలో కొంత గంభీరంగా మాట్లాడే వారు. కోపంతో ఊగిపోయేవారు. ఇప్పుడు అదును చూసి అప్పుడప్పుడు ఏడుస్తూవున్నాడు. సమావేశాల్లో కొన్ని సార్లు ఆయనే నిరసన తెలుపుతున్నారు. సభల్లో నేల మీద పడుకొని నిరసనలు తెలియజేస్తాడు. అప్పడే రైతులను బెదిరిస్తాడు. ఏక కాలంలో అనేక డైమన్షన్లు చూపిస్తుంటాడు. తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వింతగా వున్నాయి. అంతే కాదు…నేనింతే! అన్నట్లు వున్నాయి. కబ్జాల విషయంలో తాను బాజాప్త చేశానని ఆయనే ఒప్పుకున్నాడు. పైగా కబ్జా చేసిన స్థలాన్ని జనానికి దానం చేసినంత దాన కర్ణుడిలాగా మాట్లాడుతుంటాడు. ప్రజల భూమిని కబ్జా చేయడమే నేరం. దాన్ని సమర్థించుకోవడం అంతకన్నా నేరం. తన కూతురు అమాయకురాలు కాబట్టి భూమి వదిలేసుకున్నది అని తనే అంటాడు. అలా తన కూతురు చేర్యాల చెరువు భూమి ప్రజలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని అంటాడు. అంటే తన కూతురు అలా భూమి ఇవ్వడం ఇష్టం లేదని పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే గా వున్న సమయంలో అనేక అక్రమాలు చేసినట్లు ముత్తిరెడ్డి ప్రకటించారు. వెంచర్ చేసి, ప్రజలకు, ప్రభుత్వానికి అందించాల్సిన స్థలం కూడా కొమ్మూరి ఇవ్వలేదని ముత్తిరెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా వుండి ఏం చేస్తున్నట్లు? చోద్యం చూస్తున్నాడా? ఎవరికి చెబుతారు? ఈ కల్లబొల్లి మాటలు అని జనం ఈసడిరచుకున్నారు. కూతురు ను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికలలో గెలవాలని సరికొత్త నాటకానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెరతీసినట్లు జనం చెప్పుకుంటున్నారు. చివరగా అసలు విషయం చెప్పుకోవాలి. ఇటీవల ముత్తిరెడ్డి కూతురు తన తండ్రికి వెయ్యి కోట్ల ఆస్థి వుంది. నెలకు కోటిన్నర రెంట్లే వస్తాయి అని చెప్పింది. మళ్ళీ ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ రెడ్డి మా నాన్న ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పింది. ప్రజలు ఒక వేళ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే సంపాదించాడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముందని గ్రహించి సరిదిద్దే ప్రయత్నం చేసింది. అంటే తండ్రి, కూతురు చాలా చక్కని స్క్రీన్ ప్లే రచించారు. ఇదిలా ఉంటే జనగామ రాజకీయాలు గుత్తకు తీసుకున్నట్లు, కబ్జాలు వాళ్ల హక్కు అన్నట్లు ఇద్దరు నేతలు ముత్తిరెడ్డి, కొమ్మూరి ల మధ్య సంవాదం చాలా విచిత్రంగా ఉంది. నా బాగోతం నాకు తెలుసు, నీ బాగోతం నాకు తెలుసు అని చెప్పుకుంటూ భలే నాటకాలు ఆడుతున్నారు. ప్రజల ముందుకు వచ్చేది, ఎన్నికలలో నిలబడేది, రాజకీయాలు చేసేది ఇందుకేనా? ప్రజలకు సేవ చేయడం అన్నది అటు ముత్తిరెడ్డి, ఇటు కొమ్మూరి మర్చిపోయారా? ఇక ముత్తిరెడ్డి చెప్పే విషయాలు కొన్ని అటు పార్టీని, ఇటు ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇరుకున పట్టేలా? వున్నాయి. నేనేంటో, నేను చేసేవేమిటో అన్నీ సిఎం. కేసిఆర్ కు తెలుసు అని చెప్పడంలో ముత్తిరెడ్డి ఆంతర్యమేమిటన్న దానిపై చర్చ మొదలైంది. అసలు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇలాంటి వాటిని సమర్థిస్తారా? ఇంకా ఇలాంటి నాయకులను ఉపేక్షిస్తూ పోతే రాజకీయాలంటేనే ప్రజలు విసుగెత్తిపోయే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ముత్తిరెడ్డి, కొమ్మూరి లాంటి నాయకులను రాజకీయాలు చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరు.
`ఖమ్మం సభతో కాంగ్రెస్ కథ కంచికే అంటున్న ‘‘మునుగోడు’’ సీనియర్ ‘‘బిఆర్‌ఎస్’’ నాయకుడు ‘‘నారబోయిన రవి ముదిరాజ్’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో మాట్లాడుతూ నమ్మితే గతం దరిద్రమంతా ముందుకు తెస్తారని నాటి అనుభవాలు ఆయన మాటల్లోనే..
చెల్లని కాసుకు గీతలెక్కువే..కాంగ్రెస్‌కు చెప్పుకునే గొప్పలు ఉట్టివే..!అయినా ఒక్క సభకే ఎగిరెగిరి పడితే…ఉద్యమ కాలం నుంచి మొదలు బిఆర్‌ఎస్ సభలేమిటో తెలిసి, కూడా ప్లూటు సింహం లాంటి బిఆర్‌ఎసూ ముందు కాంగ్రెస్ జింక ప్లూటు ఊదినట్లుంది. ఒక్కరోజులో వచ్చేది బలుపు కాదు..వాపు..అది రోగంతో సమానం. నిన్నటిదాకా రెండో స్ధానమే దక్కుతుందో లేదో అంటూ మధనపడిరది. మనుగడ కోసం ఆరాటపడిరది. కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఇక్కడ జబ్బలు చర్చుకుంటోంది. ముందే మురవడం మొదలు పెట్టింది. కనీసం అలాగైనా కాంగ్రెస్ సంబరపడడం చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ అన్నది ఏనాడో మరుగున పడిపోయింది. తెలంగాణకు అరవైఏండ్లు చేసిన నష్టం, పెట్టిన గోస చాలు అని ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడో బంగాళా ఖాతంలో కలిపేశారు. ఇంక దానికి మనుగడ అన్నది తెలంగాణలో లేదు. ఒక్క నాయకుడు చేరినందుకే కాంగ్రెస్‌లో జోష్ నిండితే ఇప్పుడు వున్న నాయకులంతా దద్దమ్మలమని ఒప్పుకున్నట్లేనా? బిఆర్‌ఎస్‌లో పనికి రాని నాయకుడు కాంగ్రెస్‌లో కళ్లకద్దుకోవడం అంటే ఆ పార్టీ ఎంత దీనావస్ధలో వుందో అర్దం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బిఆర్‌ఎస్‌లో పని చేయలేని నేతలు, బిఆర్‌ఎస్ నుంచి పంపించిన నేతలతో నింపుకున్న పార్టీలు మాతో పోటీ పడడడం అరువు నేతలే దిక్కుగా బతకడమే! అంతటి దురవస్ధను ఎదుర్కొంటూ కాంగ్రెస్ మేమే వస్తాం..అని చెప్పుకోవడం విడ్డూరం. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయ్యాలో ఒక్క మాట చెప్పగలిగే స్దితి, స్దాయి వారికి లేదు. అందుకే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్‌కు మిగిలేవి కలలే…అంటున్న మునుగోడు బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్ కాంగ్రెస్‌ను తూర్పారపడుతూ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు.. పాఠకుల కోసం! ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ పెట్టిన గోసలు అన్నీ ఇన్నీ కావు.
తెలంగాణను నీటి చుక్క ఇవ్వమంటే నలభైఐదేండ్లు గోస పెట్టింది. ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. సాగు ముందుట పడనీయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వికాసాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు సిగ్గు పడాలి. కేవలం రాజకీయ స్వార్ధం కోసం తప్ప, తెలంగాణకోసం ఏనాడు ఆలోచించనందుకు కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉమ్మడిరాష్ట్రంలో చెరువులు బాగు చేస్తే తెలంగాణ ఉద్యమం వుండేదా? ప్రాజెక్టులు కట్టాలన్న సోయి వుండేదా? తెలంగాణపై కక్ష్యపెంచుకున్నట్లు ఉమ్మడి పాలకులు ప్రవర్తిస్తుంటే ఎవరైనా ప్రశ్నించారా? మా తెలంగాణ నిధులు మాకు ఖర్చు చేయాలే అని నిలదీశారా? తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు కట్టరని ఎదురుతిరిగారా? ఆంధ్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతుంటే కళ్లప్పగించి చూశారు. తెలంగాణకు నీళ్లియమని మొహం మీద చెబితే పదవుల కోసం ఆశపడ్డరు. ఆఖరకు పోతిరెడ్డి పాడుకు నుంచి కూడా నీళ్లు తీసుకుపోతుంటే అడగలేదు. సీలేరు నుంచి కరంటు ఎందుకియ్యరు? అనలేదు. తెలంగాణ చీకట్లు చూసింది. విలవిలలాడిపోయింది. అలాంటి కాంగ్రెస్ నేతలా రేపు తెలంగాణకు ఉపయోపడేది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ పదేళ్లలో చేసి చూపించాడు. తెలంగాణను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. అన్ని రంగాలు సర్వతోముఖాభివృద్ది చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని ప్రయోజనాలు తెలంగాణ ప్రజలు అందుకుంటున్నారు. తెలంగాణ సాగులో విప్లవం తెచ్చాడు. నీటి చుక్క కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నేలతల్లి దాహం తీర్చిన కొడుకు కేసిఆర్. సాగుకు తెలంగాణలోని ప్రతి మూలను సిద్దం చేసిన నాయకుడు కేసిఆర్. ప్రతి ఎకరాకు నీళ్లుందిస్తున్న పాలకుడు కేసిఆర్. ప్రతి చోట పచ్చదనం వెల్లివిరిసేలా చేసిన పాలనాదక్షుడు కేసిఆర్. దేశంలోనే కేసిఆర్ లాంటి నాయకుడు లేడు. పాలకుడు లేడు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కలలు కనడం అంటే పగటి కలలే…అర్ధరాత్రి కలత నిద్రలే..
ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన మాట ఇప్పటికీ తెలంగాణ సమాజానికి గుర్తే వుంది.
కాని కాంగ్రెస్ నేతలకే ఆనాడు వినిపించలేదు. ఇప్పుడు గుర్తుకు లేదు. నవ్వేవారి ముందు జారిపడ్డట్టు తెలంగాణ సమాజం ఇక ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని చెప్పేవారు. అది ఉద్యమమైనా, ఉద్యమ స్పూర్తితోసాగే పాలనైనా అని తెలంగాణ ప్రజలు ఆనాడు, నేడు ఆచరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన మాత్రమే కావాలనికోరుకుంటున్నారు. మెరిసే బంగారమంత గొప్పగా తీర్చిదిద్దబడిన తెలంగాణను ఆదమర్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఆశలు నెరవేర్చాలనే జాలి పడితే మళ్లీ తెలంగాణ వందేళ్లు వెనక్కిపోతుంది. ఖమ్మం సభలో కాంగ్రెస్‌నాయకుల తీరు అందరూ చూశారు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఒకరినొకరు ఎలా తోసుకున్నారో…చూశాం. రేపు పాలన కూడా అంతే…పదవులు కోసం కాంగ్రెస్ నాయకులు పడే తపనతో పాలన గాలికొదిలేస్తారు…తెలంగాణను ఆగం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముందుకు ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చుతూ, ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు. పైగా ఏ పాలకుడు వచ్చినా సీమాంధ్ర ప్రగతిని కోరుకుంటే తెలంగాణ నాయకులు నోరు మెదపలేదు. తెలంగాణ వచ్చినా ఇంకా సీమాంధ్ర నేతలు కబంద హస్తాల చేతుల్లోనే వుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఉమ్మడి రాజధాని పేరుతో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల సమయంలో వస్తూ వెళ్తూ వుంటారు. ఒక్కసారి ప్రజలు కాంగ్రెస్ మీద జాలి పడితే, పీల్చుకుతింటారు. తెలంగాణను పిప్పి చేస్తారు..కేవిపి లాంటి వారి చేతిలో తెలంగాణ భవిష్యతును పెడతారు? ఇది సామాన్యులకు తెలియని విషయం.
అందుకే ఆనాటి గోసలు ఇక ఎప్పుడూ వద్దు. తెలంగాణలో కాంగ్రెస్ వద్దే వద్దు.
తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచేందుకు సాగుకు నీళ్లివ్వాలంటే ఎన్నో సాకులు చెప్పి, తప్పించుకున్న ఆనాటి పాలకులైన కాంగ్రెస్ నేతలుకు కాళేశ్వరం నీళ్లు కనిపించడం లేదా? కాళేశ్వరాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్‌నేతలు ఆనాడే ఎందుకు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? తెలంగాణ కోసం ఎందుకు ఆలోచించలేదు. ఆనాడే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఎందుకు దు:ఖపడేది. అసలు కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ సమాజం ముందు నిలబడే హక్కు అసలే లేదు. 2001లో తెలంగాణ డిక్లరేషన్ అంటూ ప్రకటించి, 2004 ఎన్నికల్లో ఆనాడు బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని పదేళ్లు కాలయాపనచేసి, తెలంగాణను హరిగోస పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. ఆఖరకు తెలంగాణ ప్రకటన చేసి, వెనక్కి తీసుకొని తెలంగాణను అగ్ని గుండం చేసింది కాంగ్రెస్. ఇక తెలంగాణ ఇవ్వని పరిస్ధితి తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమాన్ని చూసి, తప్పని పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ సాధనలో తెలంగాణ కాంగ్రెస్‌నేతలు కృషి ఇసుమంతైనా లేదు. ఇక బిజేపి నాయకులు వంతు అసలే లేదు. కేసిఆర్ పండిరచిన పంట కుప్ప మీద పెత్తనం మాకు అన్నట్లు తెచ్చిన తెలంగాణలో పాలన కోసం రెండు పార్టీలు పగటి కలులు కంటున్నాయి. రెండు మూడు స్ధానాల కోసమే కొట్లాడుకుంటున్నాయి. ఆ స్దానాలు దాటి రాలేవు. బిఆర్‌ఎస్ ముందు ఆ రెండు పార్టీల కుప్పిగంతులు చెల్లవు.
తెలంగాణలో మోకాళ్ల యాత్ర చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాదు….
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి …
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జన గర్జన పేరుతో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ పార్టీ పై అవాకులు చవాకులు పేలుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి ఆయన పై నిప్పులు చెరిగారు.ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ముందుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో మొదలుకొని 2G స్పెక్ట్రమ్ లాంటి అనేక స్కాములకు కాంగ్రెస్ పార్టీ నిలయమని అది ముందు మీరు గుర్తుంచుకోవాలని సూచించారు. 2018 ఎలక్షన్లలో రైతులకు 2లక్షల రుణ మాపి అన్నారు, పెన్షన్లు పెంచి ఇస్తామని హామీలు ఇచ్చిన అవి ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో ప్రజల చెంతకు పాలనను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగముందే దర్కాస్తు ఖాని , ధర్నా కానీ చెయ్యక ముందే దివ్యంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి అమలు చేసే ప్రభుత్వము బిఆర్ఎస్. అసలు మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోసపూరిత హామీలు ఇస్తున్న మీ మాటలు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తా అన్న తీరుగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకున్నా 200 నుండి 4000 వరకు ఇస్తున్న కేసీఆర్ ఎక్కడ ఆచరణకు నోచుకోేని మీ హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏ సభలో మీరు మాట్లాడిన బిజెపికి బి టీమ్ బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారని అసలు మీ చేతగానితనం వల్లనే బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని,మొన్న నేషనల్ హేరాల్డ్ కేసులో ఐ.టి, ఈడి,సీబీఐ విచారణ ఎందుకు ఆగింది? జైల్లో ఉండాల్సిన మీకు మీ తల్లిగారికి బిజెపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, నరేంద్రమోదీ దయా దక్షిణ్యాల మీద మీరు దేశంలో పర్యటిస్తున్న విషయం ప్రజలకు తెలవదా, అసలు బిజెపికి ఏ టీం, బీ టీం రెండు కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో మీరు ఉన్నారని, రాష్ట్రంలో మీరు మోకాళ్ల యాత్ర చేపట్టిన అమలు కానీ హామీలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలిచి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారని అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.