ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందుకున్న వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు తన జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేందర్ రావుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రికి పూలకుండిని అందజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ కరీంనగర్ అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు రాజేందర్ రావుకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…