ప్రభుత్వ పాఠశాలలో పూలే గ్రంథాలయం.
నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూలే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వారోత్సవాన్ని పురస్కరించుకొని లీడ్ చిల్డ్రన్ లైబ్రరీ, గ్రామస్తుల సహకారంతో పూలే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. నర్సంపేట పట్టణానికి చెందిన లీడ్ చిల్డ్రన్ గ్రంథాలయ వ్యవస్థాపకులు కాసుల రవి కుమార్, జెడ్పిఎస్ఎస్ ఇటుకాలపల్లి మొదటి బ్యాచ్ టాపర్ నాంపల్లి మురళీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాతల సహకారంతో నిర్మించిన గదులలో వీరి…