ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆర్.ఎం.పి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్
నర్సంపేట,నేటిధాత్రి:
ఆర్ఎంపీ,పీఎంపి వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో మద్దతుగా శాసనసభ మండలి కౌన్సిల్ లో గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 45 వేల ఆర్ఎంపీల సేవలు ఎంత అవసరమో వివరించి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఖరాఖండిగా మాట్లాడారని ఆర్ఎంపీ,పిఎంపి అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్ పేర్కొన్నారు.ఆర్.ఎం.పి ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆర్ఎంపీల సేవలను కొనియాడుతూ కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసిన సేవలను ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని తెలపడం అభినందనీయమని అన్నారు. ఇదేవిధంగా ఆర్ఎంపీల గుర్తింపు పట్ల అన్ని వేదికల మీద మొదటి నుంచి ఆర్ఎంపీ,పిఎంపి లకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెత్తడానికి ముఖ్య కారకులైన సందర్భం ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతిపక్ష నాయకులందరూ ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవాలని స్వామినాథ్ కోరారు. ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం సార్ లకు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తూర్ గ్రామములో ఉన్నది కానీ అతిపెద్ద సాగు నీటి చెరువు నారింజ ప్రాజెక్టు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ నరోత్తం, మా ట్లాడుతు ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు 3000 ఎకరాల ఆయాకట్టును నిర్థారించారు కానీ ప్రభుత్వ అలసత్వం వల్ల కాలువలు బాగాలేనందున ఆయకట్టుకు నిరందడం లేదు ఈ ప్రాజెక్టులో నీటి నిలువల వల్ల చుట్టుప్రక్కల 12 గ్రామాలలో భూగర్భజలాలు పెంపొందినాయి,మొన్న నారింజను పరిశీలిస్తే అందులో ఉన్న నీరంత రంగు మారి కలుషిత మైనట్లు కనిపిస్తున్నది,ఈ నీరు కలుషితానికి కారణం అల్లానా వ్యర్థ జలాలో లేదా పురపాలక డ్రైనేజీ వాటరో కలవడం వల్ల జరిగినట్లు కనిపిస్తున్నది, చుట్టూ ప్రక్కల వాకబు చేయగా పశువుల కూడా ఆ నీరు త్రాగడం లేదని ప్రజలు చేప్పుతున్నారు.ఈ రోజు ఇంత వేసవిలో కూడా ఈ ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నాయి.ఈ ప్రాజెక్టులో ఇతర వ్యర్థ జలాలు కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది,తక్షణమే కాలుష్యనియంత్రణ అధికారులు ఆ నీటిని పరిశీలించి నీటి కాలుష్యానికి కారణమైన సంబందిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఆ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టి లోతును పెంచి ప్రాజెక్టులో నీటి నిలువను పెంపొందించాల్సిందిగా డిమాండ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలరాజ్ , జైపాల్, తదితరులు ఉన్నారు.
గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి
జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.
జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచర్యాగడి గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. గ్రామంలో వీధిదీపాల సమస్య, మురుగు నీటి నిల్వ, త్రాగునీటి కొరత వంటి సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఇంటి యజమాని ఇంటిపన్ను సహా ఇతర పన్నులను చెల్లించాలన్నారు.
ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో నవోదయలో సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులు వి.నిఖిత, ఇ. వర్షిత్, ఎ. సంజిత్, ఎ.రేవంత్,కె. దీక్షిత్ లను వారు అభినందించారు.వీరి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టంతో కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకొని ప్రతి విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నవోదయ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నందు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం క్లస్టర్ ఇన్ చా ర్జులు, భూత్ ఇన్ చార్జీ లు,యూనిట్ ఇన్ చార్జీ ల తో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ ని కోల్పోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఇంకా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఉన్నారని వారి మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
Constituency
గత 20 సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేశారని ఇకమీదట వారి ఆటలు సాగని సాగనివ్వమని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి అనేకమంది జైలుకు వెళ్లారని అటువంటి వారికి అందరికీ తగిన గుర్తింపు ఇస్తామని గ్రామాలలో మరియు కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పది రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఉంటుందని అటువంటి వారికే పదవులు వరిస్తాయని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూత్ ఇన్, చార్జులు, యూనిట్ఇన్చార్జులు , క్లస్టర్ ఇన్చార్జులు మరియు పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…
ఉమ్మడి ఖమ్మం జిల్లా – భద్రాచలం లో* “ట్రైబల్ మ్యూజియం” పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర *మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఎంఎల్ఏ స్ తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు మట్ట రగామాయి కోరాం కనకయ్య , రాందాస్ నాయక్ గారు, కాంగ్రెస్ జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ పాల్గొన్నారు…
సిరిసిల్ల పట్టణం అనంత నగర్ 26వ వార్డులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వికృతి భరత్ కుమార్ కి 42500 రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఆది శ్రీనివాస్ కి, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రెడ్దిమల్ల భాను, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, దళిత నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మకూరు డ్యాం నుండి తపస్ పల్లి డ్యాం కు నీటి విడుదల
చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనగుల శ్వేతా వెంకన్న
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల, కొమురవెల్లి,మండలంలో పలు గ్రామాల చెరువులలో నీళ్లు లేక పంట పొలాలు ఎండుతున్నాయని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న జనగామ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ నియోజకవర్గం ప్రాంతానికి నీళ్లు బొమ్మకూరు డ్యామ్ కు నీటిని విడుదల చేయాలని కోరారు నీటిపారుదల శాఖ ఈ ఈ, ఏఈలకు కొమురవెల్లి చేర్యాల రైతుల పక్షాన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారితో అభివృద్ధి అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముస్లిం మంత్రిని చేర్చుకోవాలని ప్రభుత్వం నుండి డిమాండ్ మెనార్టీ యువ నాయకుడు మహమ్మద్ అజీజ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఎల్గోయి గ్రామానికి చెందిన మెనార్టీ యువ నాయకుడు మహమ్మద్ అజీజ్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సర ఆగడి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మంత్రిని చేర్చడం ద్వారా, ప్రభుత్వంపై ముస్లింల ఆందోళనలను తొలగించాలి, ఈ అభిప్రాయాలను శ్రీనగర్ మాజీ ప్రతినిధి హీర్ షేక్ జావేద్ తన పత్రికా ప్రకటనలో వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసే లౌకిక పార్టీ అని ఆయన అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద శాసనమండలికి అభ్యర్థుల ఎన్నిక సందర్భంగా, రాష్ట్రం తెలంగాణ ముస్లింలు ఎమ్మెల్సీ స్థానానికి ముస్లిం అభ్యర్థిని ఎన్నుకుంటారని చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ చివరికి ఫలితం దానికి విరుద్ధంగా మారింది. కాబట్టి, కాంగ్రెస్ హైకమాండ్ మరియు తెలంగాణ ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మంత్రిని చేర్చడం ద్వారా దీనిని పరిష్కరించాలి, తద్వారా ముస్లింల సందేహాలు తొలగిపోతాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లింలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం అప్పగించారని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఎల్లప్పుడూ రాజు పదవిలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను విస్మరించిన రాజకీయ పార్టీని నష్టాలను చవిచూస్తూ అధికారం నుండి తొలగించారని గత చరిత్ర సాక్షిగా ఉందని మైనారిటీ కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.
విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .
అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు
తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా వందరెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అలాగే ఖరీదైన వైద్యం చేయించుకోలేనినిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని సందర్భంగా లబ్ధిదారులకు కోలాపురి నర్సయ్యకు .60000. కట్ల రమ్యకు.20000.రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముందటితిరుపతి యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆత్మకూరు నాగరాజు ముందటి రమేష్ సంపత్ నక్క రవి గొర్రె రాజు గుండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు
హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే
బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్
పరకాల నేటిధాత్రి
అయోధ్య నుండి అక్షింతలు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యన్ని ఊరు రా ఇంటింటా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం లో కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని పరకాల పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గాజులు నిరంజన్ ఖండిస్తున్నామని అన్నారు.అనంతరం మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముల వారిని కించపరించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అక్షింతలకు,తలంబ్రాలకు తేడా తెలియని కేటీఆర్ మాట్లాడిన వైఖరి హిందూ సమాజాన్ని కించపరచడమేనని,హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడిన కేటీఆర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.
సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడి జిల్లాలోని 12 మండలాలు గ్రామాలలో ప్రజాస్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తారీఖున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు
నిజ్జా (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) పారిశ్రా మిక వాడలో మరో ముందడుగు పడనుంది. జహీరాబాద్ నియో జకవర్గంలో ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు 12,500 ఎకరాల భూమిని సేక రించేందుకు ప్రతిపాదించింది.
అందులో ఇప్పటికే దాదాపు 3,500 ఎకరాలను సేకరించి పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది.
అయితే మిగత భూమి సేకరించినందుకు ప్రభుత్వం సంకల్పించినప్ప టికీ ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరే కత వ్యక్తమవడంతో భూ సేకరణలో ఆలస్యం అవుతోంది.
అయితే సేకరించిన నిమ్ భూమిలో మౌలిక సదుపాయాల కోసం అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొం దించగా అందులో భాగంగా తాగునీటి పైప్లాన్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రూ.10,02,98,136 (ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వ్యాల్యూ) మంజూరు చేసింది.
ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న మిషన్ భగీరథ పైప్లాన్ నుంచి నూతనంగా ఏర్పాటు చేయనున్న వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు, హుండై పరిశ్రమకు పైపులైన్ వేసి తాగునీటి సౌకర్యం కల్పించను న్నారు.
ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికా రులు పనులు చేపట్టేందుకు టెండర్ ఆహ్వానించారు.
వచ్చే నెల 7వ తేదీ వరకు టెండర్ బిడ్లు దాఖలు చేసుకోవడానికి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించారు.
BT road
ఈ పైప్ లైన్ పనులు పూర్తయితే ఆ రెండు పరిశ్రమలతో పాటు నిజ్జా పారిశ్రామి కవాడలో కొంతవరకు నీటి వసతి కల్పించినట్లు అవు తుంది.
కాగా ఇప్పటికే కలెక్టర్ వల్లూరి క్రాంతి గతంలో నిమ్డ్ ప్రాంతాన్ని పర్యటించి మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదే శించారు.
అంతర్గత రోడ్ల నిర్మాణానికై పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చాలని కలెక్టర్ ఆదేశించారు.
కాగా జాతీయ రహదారి65 హుగ్గెల్లి చౌరస్తా నుంచి కృష్ణాపూర్, మాచ్నూర్, బర్డీపూర్ గ్రామాల సమీపం నుంచి నిమ్ వరకు రూ.100 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తికావస్తున్నాయి.
100 ఫీట్ల వెడల్పుతో 9 కిలోమీటర్ల దూరం బీటీరోడ్డు పనులు ఇప్ప టికే పూర్తి చేశారు.
ఈ రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి దానిపై ఇరువైపులా ఎస్ఈడీ లైట్లు బిగించారు.
అలాగే చౌరస్తాల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.
అయితే హుగ్గెల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహ దారిని ఇరువైపులా వెడల్పు చేసి రాకపోకలు సాఫీగా జరి గేలా పనులు కొనసాగుతున్నాయి.
ఈ పనులు పూర్తయితే నిమ్స్ రోడ్డును ప్రారంభించి రాకపోకలను అధికారికంగా కొనసాగించే అవకాశం ఉంది.
అలాగే నిమ్డ్ అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో కలగనుంది.
ఇదిలా ఉండగా ఇక్కడ వెన్ టెక్నాలజీ, హుండై పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరగగా..
నిర్మాణ ర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ కొనసాగు తుంది.
ఈ రెండు పరిశ్రమలతో ఎలాంటి కాలుష్యం లేనం దున స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
వీటి ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.
కాగా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్డ్ ఏర్పాటు చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
హుగెల్లి చౌరస్తా సమీ పంలో జాతీయ రహదారి65, నిమ్డ్ రోడ్లకు ఆనుకుని ఉన్న ఎకరా భూమి ధర ఏకంగా రూ.8కోట్లు పలుకుతుందంటే జహీరాబాద్ ప్రాంతంలో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
అదేవిధంగా బర్దీపూర్, మాచ్నూర్ నిమ్డ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి.
మారుమూల ప్రాంతా ల్లో ఉన్న భూముల ధరలు సైతం విపరీతంగా పెరిగిపో యాయి. సామాన్యుడు ఎకరా భూమి కూడా కొనలేని స్థితిలో ధరలు ఉన్నాయి.
అయితే ముందుచూపు ఉన్న పెట్టుబడిదారులు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ముందుగానే వందల ఎకరాల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాట్లు చేశారు. మండలాలు, మారుమూల గ్రామాల్లో సైతం ఇంకా వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూనే ఉంది.
ఈ వెంచర్లల్లో ప్లాట్లుగా విభజించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతు న్నారు.
పట్టణాల్లోని ప్లాట్ల ధరలకు దీటుగా మండలాల్లో ప్లాట్ల ధరలు పలుకుతున్నాయి.
ఇదంతా జహీరాబాద్ ప్రాంతానికి నిమ్డ్ రావడం వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా పారిశ్రామికంగా నిమ్డ్ అభివృద్ధి చెందినట్లయితే జహీరాబాద్ ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఎంతైనా ఉంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ మండలం ఏపిఓ ను బదిలీ చెయ్యాలి
సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిఆర్డిఓ పిడి కి వినతి పత్రం
మరిపెడ నేటిధాత్రి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరిపెడ మండలం ఏపీఓ గా విధులు నిర్వహిస్తున్న మంగమ్మ దీర్ఘకాలికంగా ఒకే చోట గత 13 సంవత్సరాలుగా పనిచేస్తూ వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మరిపెడ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అవకతవకలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో బయటపడటం తన సొంత మండలం లోని తాను దీర్ఘకాలంగా పనిచేయడం వలన రాజకీయ ప్రాబల్యం ఉండటం వలన సాధారణ బదిలీలు జరిగిన కూడా తాను ఇక నుండి బదిలీ కాకుండా మళ్లీ ఇదే చోట యధావిధిగా పోస్టింగ్ లో కొనసాగుతూ వస్తుంది రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీలల్లో అందరూ ఏపీఓ లు నాలుగు ఐదు సంవత్సరాలకి ఇతర మండలాలకు బదిలీ అయినారు కానీ మరిపెడ ఏపీవో మాత్రం గత 13 సంవత్సరాల నుండి మరిపెడ మండలం నుండి బదిలీ కాలేదు ఈ మండలం నుండి బదిలీ చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఆసరాగా నిలిచేందుకు అందిస్తున్న వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు,ఓంటరి మహిళలకు వారి జీవనాధారానికి ప్రభుత్వం ప్రతినెలా పెన్షన్ అందిస్తుంది. మండలంలోని గ్రామాలలో కొంతమంది రాజకీయ నాయకులు,ప్రభుత్వ అధికారుల అండదండలతో అవయవాలు అన్నీ బాగున్నా నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అర్హులకు పింఛన్లు రాకుండా అనర్హులకు పింఛన్లు వస్తున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి దీనిపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు,చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.గత కొన్నేళ్లుగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ పెన్షనర్లు. కొన్ని కుటుంబాలలో ఓకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు రావడం గమనార్హం. అనర్హులకు పెన్షన్ రావడం పట్ల ప్రజలనుండి వినబడుతున్న మాటలు. కొన్ని కుటుంబాలలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెన్షన్ కొంతమందికి వచ్చి, కొంతమంది కి రావడం లేదు. ప్రభుత్వం నుండి అర్హులైన పేదవారికి పెన్షన్లు అందకుండా అనర్హులకు పెన్షన్ రావడం పట్ల అర్హులుగా ఉండి పెన్షన్ రాని వారు మాకు ఎందుకు పింఛన్ రావడం లేదని ఆగ్రహిస్తున్నారు.అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసిన ఫలితం శూన్యంగానే ఉన్నదని లబ్ధిపొందని వారు ఆరోపిస్తున్నారు.అర్హులకు పెన్షన్ రాకపోతే వారు జీవనాధారం కోల్పోతున్నారు.అయ్యా ప్రభుత్వమా అర్హులమైన మాకు పెన్షన్స్ ఇవ్వలేరా? అంటూ దీనిపై ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నకిలీ(అనర్హులు)వారిని గుర్తించి ఏరేసి,అర్హులకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుని అర్హులకు పెన్షన్ అందజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Government
నాకు పెన్షన్ ఇప్పించండి
నేను పుట్టినప్పటి నుండి వికలాంగుడిని నాకు ప్రభుత్వ పెన్షన్ 75 రూ.ల నుండి 2000 రూ.ల వరకూ వచ్చింది ఆ తర్వాత 10 సంవత్సరాల నుండి నాకు పెన్షన్ రావడం లేదు, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం,నేను అర్హుడ్ని కాదా నా దగ్గర ఆధారాలు, సర్టిఫికెట్స్ అన్ని ఉన్నా కూడా పెన్షన్ రావడం లేదు దీనిపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ వచ్చేలా న్యాయం చేయాలని కోరుతున్నా. పరాంకుశం వెంకట రామచందర్.
నాకు ప్రభుత్వ న్యాయం చేయాలి
నా భర్త చనిపోయి ఐదేళ్లు అవుతుంది నాకు ఇప్పటివరకు పెన్షన్ రావడం లేదు, పెన్షన్ కోసం ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్న కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదు, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది, నాకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్నా. బండ్ల స్వరూప.
Government
నాకు పెన్షన్ రావడం లేదు
నా భర్త చనిపోయి ఐదేళ్లు అవుతుంది ఇప్పటివరకు నాకు పెన్షన్ రావడం లేదు, దయచేసి ప్రభుత్వం నాకు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. దుప్పటి బుచ్చమ్మ.
బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు…………. చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ……….
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.
Chityala Market
మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని రైతు సోదరులు తమ పశువులను పశు వైద్య అధికారికి చూపించి డాక్టర్ సలహాలు పాటించి పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.ఆమెవెంట ఏ ఎం సి. వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ కనుక .శేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్.G. రాకేష్ శర్మ, ఎం .వెంకటేష్(జె వి వో), గోపాలమిత్ర శ్రీనివాస్, రాజన్న, అశోక్ , మార్కెట్ కమిటీ సిబ్బంది బొచ్చు రాజు, పడదల దేవేందర్ రావు, అల్లం సమ్మయ్య రైతు సోదరులు పాల్గొనడం జరిగింది.
మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.
• మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం..
• టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్…
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల ఓట్లు కావాలి కానీ మైనారిటీల మంత్రి పదవి వద్ద గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనార్టీలకు తోహ ఇచ్చారు. మరియు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మైనారిటీ అవసరం లేదా అని మీ యువ నాయకుడు షేక్ సోహెల్ ప్రశ్నిస్తున్నారు.
జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి నిర్మూలన పై నూతన కార్యచరణకు ఈ జిల్లా కమిటీ శ్రీకారం చుట్టిందని ఇకనుంచి దశలవారీగా జిల్లాలో యావత్ యువకులను బానిసలను చేస్తూ వారి ప్రాణాలను కోల్పోయే విధంగా మనుషుల విలువలను దెబ్బతీసే విధంగా రోజు రోజుకు జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం షాపులపై దఫళవారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని ఎన్నోసార్లు అధికారులకు వినతులు స్వయంగా పట్టించిన కూడా జిల్లాలు అధికారులేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపైన డివైఎఫ్ఐ అధికారులు సిండికేట్ యాజమాన్యాలు బెల్టు షాపులు కుమ్మక్కయ్యే యువకులను నాశనం చేసేందుకు ధనార్జినేయంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ దంధాలు నడిపిస్తున్నారని స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అందుకోసమే ఈ జిల్లాలో యువకులు మద్యం తాగుతూ తద్వారా గంజాయి డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారని దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంతవరకు డివైఎఫ్ఐ పోరాటాలు ఉంటాయని యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిమెంట్ కర్మాగారం గాని, కోల్ శుద్ధి కర్మాగారం, గాని ఉక్కు పరిశ్రమ, గాని ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండమని యువకులు కూడా గంజాయి డ్రగ్స్ మద్యం నుంచి బయటపడతారని వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించి జిల్లాలో ఉన్న యువకులందరికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూనే రోజురోజుకు పెరుగుతున్న మద్యం బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పడుతున్న సమస్యలపై త్వరలోనే సందర్శనలు చేసి సమగ్రమైన సమాచారంతో పోరాటాలు నిర్వహించబోతున్నామని ప్రభుత్వాసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేసేందుకు దశల వారి పోరాటాలు కూడా డివైఎఫ్ఐగా నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కవిత, గుడి కందుల దేవేందర్, బందు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, జ్ఞానేశ్వరి బుర్ర స్వాతి, అజ్మీర సరిత, ఎర్ర సుజాత, భాస్కర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.