ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా వందరెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అలాగే ఖరీదైన వైద్యం చేయించుకోలేనినిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని సందర్భంగా లబ్ధిదారులకు కోలాపురి నర్సయ్యకు .60000. కట్ల రమ్యకు.20000.రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముందటితిరుపతి యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆత్మకూరు నాగరాజు ముందటి రమేష్ సంపత్ నక్క రవి గొర్రె రాజు గుండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే

బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

అయోధ్య నుండి అక్షింతలు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యన్ని ఊరు రా ఇంటింటా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం లో కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని పరకాల పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గాజులు నిరంజన్ ఖండిస్తున్నామని అన్నారు.అనంతరం మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముల వారిని కించపరించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అక్షింతలకు,తలంబ్రాలకు తేడా తెలియని కేటీఆర్ మాట్లాడిన వైఖరి హిందూ సమాజాన్ని కించపరచడమేనని,హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడిన కేటీఆర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడి జిల్లాలోని 12 మండలాలు గ్రామాలలో ప్రజాస్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తారీఖున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు

నిమ్జ్ లో మరో ముందడుగు…

నిమ్జ్ లో మరో ముందడుగు…

• తాగునీటి పైప్ లైన్కు రూ.10కోట్లు

• పూర్తికావొస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం

• వెమ్, హుండై ఏర్పాటుకు కార్యాచరణ

• ప్రభుత్వ ప్రతిపాదన 12,500 ఎకరాలు

• ఇప్పటి వరకు 3,500 ఎకరాల సేకరణ

• భూముల ధరలకు రెక్కలు

• గ్రామాల్లోనూ వెంచర్ల ఏర్పాటు

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

BT road

 

నిజ్జా (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) పారిశ్రా మిక వాడలో మరో ముందడుగు పడనుంది. జహీరాబాద్ నియో జకవర్గంలో ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దాదాపు 12,500 ఎకరాల భూమిని సేక రించేందుకు ప్రతిపాదించింది.

అందులో ఇప్పటికే దాదాపు 3,500 ఎకరాలను సేకరించి పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తుంది.

అయితే మిగత భూమి సేకరించినందుకు ప్రభుత్వం సంకల్పించినప్ప టికీ ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరే కత వ్యక్తమవడంతో భూ సేకరణలో ఆలస్యం అవుతోంది.

అయితే సేకరించిన నిమ్ భూమిలో మౌలిక సదుపాయాల కోసం అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొం దించగా అందులో భాగంగా తాగునీటి పైప్లాన్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రూ.10,02,98,136 (ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వ్యాల్యూ) మంజూరు చేసింది.

ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న మిషన్ భగీరథ పైప్లాన్ నుంచి నూతనంగా ఏర్పాటు చేయనున్న వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు, హుండై పరిశ్రమకు పైపులైన్ వేసి తాగునీటి సౌకర్యం కల్పించను న్నారు.

ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికా రులు పనులు చేపట్టేందుకు టెండర్ ఆహ్వానించారు.

వచ్చే నెల 7వ తేదీ వరకు టెండర్ బిడ్లు దాఖలు చేసుకోవడానికి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించారు.

BT road

ఈ పైప్ లైన్ పనులు పూర్తయితే ఆ రెండు పరిశ్రమలతో పాటు నిజ్జా పారిశ్రామి కవాడలో కొంతవరకు నీటి వసతి కల్పించినట్లు అవు తుంది.

కాగా ఇప్పటికే కలెక్టర్ వల్లూరి క్రాంతి గతంలో నిమ్డ్ ప్రాంతాన్ని పర్యటించి మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదే శించారు.

అంతర్గత రోడ్ల నిర్మాణానికై పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చాలని కలెక్టర్ ఆదేశించారు.

కాగా జాతీయ రహదారి65 హుగ్గెల్లి చౌరస్తా నుంచి కృష్ణాపూర్, మాచ్నూర్, బర్డీపూర్ గ్రామాల సమీపం నుంచి నిమ్ వరకు రూ.100 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తికావస్తున్నాయి.

100 ఫీట్ల వెడల్పుతో 9 కిలోమీటర్ల దూరం బీటీరోడ్డు పనులు ఇప్ప టికే పూర్తి చేశారు.

ఈ రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి దానిపై ఇరువైపులా ఎస్ఈడీ లైట్లు బిగించారు.

అలాగే చౌరస్తాల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.

అయితే హుగ్గెల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహ దారిని ఇరువైపులా వెడల్పు చేసి రాకపోకలు సాఫీగా జరి గేలా పనులు కొనసాగుతున్నాయి.

ఈ పనులు పూర్తయితే నిమ్స్ రోడ్డును ప్రారంభించి రాకపోకలను అధికారికంగా కొనసాగించే అవకాశం ఉంది.

అలాగే నిమ్డ్ అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో కలగనుంది.

ఇదిలా ఉండగా ఇక్కడ వెన్ టెక్నాలజీ, హుండై పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరగగా..

నిర్మాణ ర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ కొనసాగు తుంది.

ఈ రెండు పరిశ్రమలతో ఎలాంటి కాలుష్యం లేనం దున స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

వీటి ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

కాగా జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్డ్ ఏర్పాటు చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

హుగెల్లి చౌరస్తా సమీ పంలో జాతీయ రహదారి65, నిమ్డ్ రోడ్లకు ఆనుకుని ఉన్న ఎకరా భూమి ధర ఏకంగా రూ.8కోట్లు పలుకుతుందంటే జహీరాబాద్ ప్రాంతంలో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

అదేవిధంగా బర్దీపూర్, మాచ్నూర్ నిమ్డ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి.

మారుమూల ప్రాంతా ల్లో ఉన్న భూముల ధరలు సైతం విపరీతంగా పెరిగిపో యాయి. సామాన్యుడు ఎకరా భూమి కూడా కొనలేని స్థితిలో ధరలు ఉన్నాయి.

అయితే ముందుచూపు ఉన్న పెట్టుబడిదారులు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ముందుగానే వందల ఎకరాల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాట్లు చేశారు. మండలాలు, మారుమూల గ్రామాల్లో సైతం ఇంకా వెంచర్ల ఏర్పాటు కొనసాగుతూనే ఉంది.

ఈ వెంచర్లల్లో ప్లాట్లుగా విభజించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతు న్నారు.

పట్టణాల్లోని ప్లాట్ల ధరలకు దీటుగా మండలాల్లో ప్లాట్ల ధరలు పలుకుతున్నాయి.

ఇదంతా జహీరాబాద్ ప్రాంతానికి నిమ్డ్ రావడం వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా పారిశ్రామికంగా నిమ్డ్ అభివృద్ధి చెందినట్లయితే జహీరాబాద్ ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఎంతైనా ఉంది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ మండలం ఏపిఓ ను బదిలీ చెయ్యాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిఆర్డిఓ పిడి కి వినతి పత్రం

మరిపెడ నేటిధాత్రి.

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరిపెడ మండలం ఏపీఓ గా విధులు నిర్వహిస్తున్న మంగమ్మ దీర్ఘకాలికంగా ఒకే చోట గత 13 సంవత్సరాలుగా పనిచేస్తూ వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మరిపెడ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అవకతవకలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో బయటపడటం తన సొంత మండలం లోని తాను దీర్ఘకాలంగా పనిచేయడం వలన రాజకీయ ప్రాబల్యం ఉండటం వలన సాధారణ బదిలీలు జరిగిన కూడా తాను ఇక నుండి బదిలీ కాకుండా మళ్లీ ఇదే చోట యధావిధిగా పోస్టింగ్ లో కొనసాగుతూ వస్తుంది రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీలల్లో అందరూ ఏపీఓ లు నాలుగు ఐదు సంవత్సరాలకి ఇతర మండలాలకు బదిలీ అయినారు కానీ మరిపెడ ఏపీవో మాత్రం గత 13 సంవత్సరాల నుండి మరిపెడ మండలం నుండి బదిలీ కాలేదు ఈ మండలం నుండి బదిలీ చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

నడికూడ మండలంలో నకిలీ పెన్షన్ల హవా..!

నడికూడ మండలంలో నకిలీ ( అనర్హుల) పెన్షన్ల హవా..!

అనర్హులకే ప్రభుత్వ పెన్షన్లు పెద్దపీట.

అవయవాలన్ని బాగున్నా పెన్షన్ తీసుకుంటున్న వైనం

చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

 

నడికూడ,నేటిధాత్రి:రాష్ట్ర

 

ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఆసరాగా నిలిచేందుకు అందిస్తున్న వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు,ఓంటరి మహిళలకు వారి జీవనాధారానికి ప్రభుత్వం ప్రతినెలా పెన్షన్ అందిస్తుంది. మండలంలోని గ్రామాలలో కొంతమంది రాజకీయ నాయకులు,ప్రభుత్వ అధికారుల అండదండలతో అవయవాలు అన్నీ బాగున్నా నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అర్హులకు పింఛన్లు రాకుండా అనర్హులకు పింఛన్లు వస్తున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి దీనిపై ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు,చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.గత కొన్నేళ్లుగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ పెన్షనర్లు. కొన్ని కుటుంబాలలో ఓకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు రావడం గమనార్హం. అనర్హులకు పెన్షన్ రావడం పట్ల ప్రజలనుండి వినబడుతున్న మాటలు. కొన్ని కుటుంబాలలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెన్షన్ కొంతమందికి వచ్చి, కొంతమంది కి రావడం లేదు. ప్రభుత్వం నుండి అర్హులైన పేదవారికి పెన్షన్లు అందకుండా అనర్హులకు పెన్షన్ రావడం పట్ల అర్హులుగా ఉండి పెన్షన్ రాని వారు మాకు ఎందుకు పింఛన్ రావడం లేదని ఆగ్రహిస్తున్నారు.అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసిన ఫలితం శూన్యంగానే ఉన్నదని లబ్ధిపొందని వారు ఆరోపిస్తున్నారు.అర్హులకు పెన్షన్ రాకపోతే వారు జీవనాధారం కోల్పోతున్నారు.అయ్యా ప్రభుత్వమా అర్హులమైన మాకు పెన్షన్స్ ఇవ్వలేరా? అంటూ దీనిపై ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నకిలీ(అనర్హులు)వారిని గుర్తించి ఏరేసి,అర్హులకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుని అర్హులకు పెన్షన్ అందజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Government

నాకు పెన్షన్ ఇప్పించండి

నేను పుట్టినప్పటి నుండి వికలాంగుడిని నాకు ప్రభుత్వ పెన్షన్ 75 రూ.ల నుండి 2000 రూ.ల వరకూ వచ్చింది ఆ తర్వాత 10 సంవత్సరాల నుండి నాకు పెన్షన్ రావడం లేదు, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం,నేను అర్హుడ్ని కాదా నా దగ్గర ఆధారాలు, సర్టిఫికెట్స్ అన్ని ఉన్నా కూడా పెన్షన్ రావడం లేదు దీనిపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ వచ్చేలా న్యాయం చేయాలని కోరుతున్నా.
పరాంకుశం వెంకట రామచందర్.

 

నాకు ప్రభుత్వ న్యాయం చేయాలి

నా భర్త చనిపోయి ఐదేళ్లు అవుతుంది నాకు ఇప్పటివరకు పెన్షన్ రావడం లేదు, పెన్షన్ కోసం ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్న కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదు, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది, నాకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్నా.
బండ్ల స్వరూప.

Government

నాకు పెన్షన్ రావడం లేదు

నా భర్త చనిపోయి ఐదేళ్లు అవుతుంది ఇప్పటివరకు నాకు పెన్షన్ రావడం లేదు, దయచేసి ప్రభుత్వం నాకు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నాను.
దుప్పటి బుచ్చమ్మ.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు………….
చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్
గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ……….

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.

Chityala Market

మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని రైతు సోదరులు తమ పశువులను పశు వైద్య అధికారికి చూపించి డాక్టర్ సలహాలు పాటించి పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.ఆమెవెంట ఏ ఎం సి. వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ కనుక .శేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్.G. రాకేష్ శర్మ, ఎం .వెంకటేష్(జె వి వో), గోపాలమిత్ర శ్రీనివాస్, రాజన్న, అశోక్ , మార్కెట్ కమిటీ సిబ్బంది బొచ్చు రాజు, పడదల దేవేందర్ రావు, అల్లం సమ్మయ్య రైతు సోదరులు పాల్గొనడం జరిగింది.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

• మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం..

• టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల ఓట్లు కావాలి కానీ మైనారిటీల మంత్రి పదవి వద్ద గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనార్టీలకు తోహ ఇచ్చారు. మరియు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మైనారిటీ అవసరం లేదా అని మీ యువ నాయకుడు షేక్ సోహెల్ ప్రశ్నిస్తున్నారు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు

డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి నిర్మూలన పై నూతన కార్యచరణకు ఈ జిల్లా కమిటీ శ్రీకారం చుట్టిందని ఇకనుంచి దశలవారీగా జిల్లాలో యావత్ యువకులను బానిసలను చేస్తూ వారి ప్రాణాలను కోల్పోయే విధంగా మనుషుల విలువలను దెబ్బతీసే విధంగా రోజు రోజుకు జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం షాపులపై దఫళవారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని ఎన్నోసార్లు అధికారులకు వినతులు స్వయంగా పట్టించిన కూడా జిల్లాలు అధికారులేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపైన డివైఎఫ్ఐ అధికారులు సిండికేట్ యాజమాన్యాలు బెల్టు షాపులు కుమ్మక్కయ్యే యువకులను నాశనం చేసేందుకు ధనార్జినేయంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ దంధాలు నడిపిస్తున్నారని స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అందుకోసమే ఈ జిల్లాలో యువకులు మద్యం తాగుతూ తద్వారా గంజాయి డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారని దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంతవరకు డివైఎఫ్ఐ పోరాటాలు ఉంటాయని యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిమెంట్ కర్మాగారం గాని, కోల్ శుద్ధి కర్మాగారం, గాని ఉక్కు పరిశ్రమ, గాని ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండమని యువకులు కూడా గంజాయి డ్రగ్స్ మద్యం నుంచి బయటపడతారని వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించి జిల్లాలో ఉన్న యువకులందరికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూనే రోజురోజుకు పెరుగుతున్న మద్యం బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పడుతున్న సమస్యలపై త్వరలోనే సందర్శనలు చేసి సమగ్రమైన సమాచారంతో పోరాటాలు నిర్వహించబోతున్నామని ప్రభుత్వాసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేసేందుకు దశల వారి పోరాటాలు కూడా డివైఎఫ్ఐగా నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కవిత, గుడి కందుల దేవేందర్, బందు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, జ్ఞానేశ్వరి బుర్ర స్వాతి, అజ్మీర సరిత, ఎర్ర సుజాత, భాస్కర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

దక్షిణాదిపై డీలిమిటేషన్‌ కత్తి!

ఈ ప్రక్రియను మరో 25ఏళ్లు వాయిదా వేయాలంటున్న జేఏసీ

ఉత్తరాది రాష్ట్రాల నిర్లక్ష్యం, దక్షిణాదికి ఇబ్బందికరం

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు దన్నుగా నిలవని ఉత్తరాది పార్టీలు

ప్రాంతీయ ప్రయోజనాలే ఇందుకు కారణం

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టలేవన్న సత్యం మరోసారి బట్టబయలు

గుంపులో గోవిందయ్య స్థాయికి దిగజారిన కాంగ్రెస్‌

దక్షిణాదికి తానే నాయకుడుగా ఎదగాలని స్టాలిన్‌ తహతహ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 22న చెన్నైలో జరిగిన సమావేశంలో ఏడు రా ష్ట్రాలనుంచి ప్రజాప్రతినిధులు హాజరుకావడమే కాకుండా, ఈ అంశంపై ఒక జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయడం తాజా పరిణామం. ఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కర్ణాటక, తెలంగాణ, ఒడిషాల నుంచి సీనియర్‌ నాయకులు సభ్యులుగా వున్నారు. తాము నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతి రేకం కాదని, కాకపోతే ఇది, సామాజిక న్యాయం, జనాభా నియంత్రణతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేవిధంగా వుండకూడదని సమావేశంలో పా ల్గన్న నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం తాము నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించలేమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే పునర్విభజనలో పారదర్శకతల లేదంటూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి కూడా మార్చి 22న ప్రధానికి ఒక లేఖరాస్తూ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో పారదర్శకతను పాటించాలని కోరినప్పటికీ, ఈ సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతి నిధిని పంపకపోవడం గమనార్హం. ఇక ఆహ్వానం అందిన పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తన ప్రతినిధులను పంపలేదు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఓటర్ల గుర్తిం పు కార్డుల సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో మరో సమస్యలో తలదూరిస్తే తమ రాష్ట్రసమస్య బలహీనపడుతుందని అందువల్లనే మిన్నకుండిపోయామని పార్టీ తెలిపింది. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గనడం గమనార్హం. తమిళనాడు, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, వెస్ట్‌ బెంగాల్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన మామూలు ధోరణిలో మాట్లాడుతూ ఈ పునర్విభజన ప్ర క్రియ దక్షిణాది రాష్ట్రాల నెత్తిన కత్తిలా వేలాడుతోందన్నారు. 1976నాటి కేంద్ర ప్రభుత్వ కు టుంబ నియంత్రణ విధానాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఈ రాష్ట్రాలను శిక్షించడం తగదని పే ర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటైౖ నిలబడాలని కోరారు. ‘జనాభాపరంగా ఈ రాష్ట్రాలను శిక్షించడం అన్యాయ’మన్నది ఆయన వాదన. ఏతావాతా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మాత్రం 1971 జనగణన ప్రకారమే నియోజక వర్గాల సంఖ్యను కొనసాగించాలని, ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియను మరో 25 సంవత్సరాల పాటు వాయిదావేయాలని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2021 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేప ట్టాలని భావిస్తోంది. అంటే ఇప్పటికే ఇది ఆలస్యమైంది. అందువల్ల 2026లో చేపట్టబోయే జనగణన ప్రకారం ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాలన్నది కొందరి అభిప్రాయం. ఇందుకోసం మళ్లీ రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి వుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించిన వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం కేటాయింపులు తగ్గిపోయి ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు డీలిమిటేషన్‌ ‘బాంబు’ వాటిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.

పరిశీలిస్తే చెన్నైలో జరిగిన ఈ డీలిమిటేషన్‌ వ్యతిరేక సమావేశానికి ఎన్డీఏ యేతర పక్షాల నుంచిపూర్తిస్థాయి మద్దతు లభించలేదన్న అంశం స్పష్టమైంది. ముఖ్యంగా ఫెడరల్‌ యాంటీ`బీజేపీ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో అభిప్రాయ భేదాలు స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స మాజ్‌వాదీ పార్టీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌లు గైర్హాజరీకి కారణాలు ఏమి చెప్పినా, డీలిమిటేషన్‌ వల్ల సీట్లు పెరిగి ప్రయోజనం కలుగుతున్నప్పుడు, సీట్లు తగ్గే దక్షిణాదికి మద్దతివ్వడానికి అవి ముందుకు రాలేదన్నదిస్పష్టమైంది. అయితే ఈ పార్టీలు గైర్హాజరైనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల సమావేశం తన అభిప్రా యాలను స్పష్టంగా వెల్లడిరచడంలో విజయం సాధించిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్‌పై ఇప్పటివకు ఎటువంటి రోడ్‌మ్యాప్‌ ప్రకటించలేదు. కాకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాత్రం, ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగబోదంటున్నారు. అది ప్రాతిథ్య పరంగానా లేక నైష్పత్తిక ప్రాతినిధ్య పరంగానా అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు. 

లోక్‌సభలో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఒక పౌరుడు, ఒక ఓటు అనే విధానంలో జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాల్సివుంటుంది. కానీ స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి నియోజకవర్గాల ఏర్పాటులో జనాభాను ప్రాతిపదికగా తీసుకున్న దాఖలాలు లేవు. పరిపాలనాపరమైన సౌలభ్యత,దేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం వుండాలన్న ప్రాతిపదికనే అనుసరించినట్టు గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా లక్షద్వీప్‌, లద్దాఖ్‌ నియోజకవర్గాలు ఈవిధంగా ఏర్పడినవే. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే నియోజకవర్గ ఏర్పాటుకు తగినంత జనాభా ఈ ప్రాంతాల్లో లేదు. అందువల్ల భౌగోళిక ప్రాతిపదికన వీటి ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం జనాభా ప్రాతి పదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, దెబ్బతినేవి దక్షిణాది రాష్ట్రాలే. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియపై జరుగుతున్న చర్చలు ప్రధానంగా రెండు అంశాలను తెరపైకి తెస్తున్నాయి. మొదటిది ఆర్థికం కాగా రెండవది జనాభా ప్రాతిపదిక. ఈ రెండు అంశాలు దేశ పురోభి వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జనా భా నియంత్రణను పాటించి, ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా ఉద్యోగావకాశాల కల్పనలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది కంటే ఎంతో ముందంజలో వున్నాయి. ఈ విషయంలో తీవ్ర నిర్ల క్ష్య వైఖరి అనుసరించిన ఉత్తరాది రాష్ట్రాలు పెరిగిన జనాభా భారంతో పాటు, పేదరిక వృద్ధి, కుంటుపడిన ప్రగతి వంటి అనేక అవలక్షణాలతో కునారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ లేవనెత్తిన అంశాలను కేంద్రం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళితే, ఉత్తర`దక్షిణ ప్రాంతాల మధ్య ప్రాధాన్యతల్లో తేడాలు ఏర్పడతాయి. 

చెన్నైలో జరిగిన సమావేశం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న స్వార్థపరత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడంలో కూడా వీటి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్త్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఏదోవిధంగా ప్రముఖంగా ప్రచారంలో వుండాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగమే భాషా వివాదం మరియు డీలిమిటేషన్‌ వివాదం. ఈ రెండు అంశాల్లో దక్షిణాదికి తనను తాను నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలు, పక్కాగా స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయి. ఇక్కడ వాటికి బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టేకంటే, తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుంటే చాలన్న ధోరణి మరోసారి బట్టబయలైంది. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు తమ ప్రతినిధులను చెన్నైకి పంప డం వల్ల డీలిమిటేషన్‌ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు పెరిగే సీట్లు తగ్గిపోవు. తమ సహచర తమ సహచర రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దన్నుగా నిలవకుండా తప్పించుకోవడం వాటికే చెల్లింది. ఇటువంటి పార్టీలు, దేశ ప్రయోజనాలకోసం పనిచేస్తాయని ఎట్లా అనుకోవాలి? జాతీయభావంలేని పార్టీల వల్ల దేశానికి తీరని నష్టం. ఎవరికి వారే నాయకులం కావాలనుకుంటారు పరస్పర సహకారం విషయంలో ముందుకు రారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమస్యలను లేవనెత్తి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప, వీటివల్ల రాష్ట్రాలకు, దేశానికి ఎటువంటి ప్రయోజనం వుండబోదు. కుటుంబపాలనతో రాచరికాన్ని వెలగబెట్టడం తప్ప ప్రజా స్వామ్యం వీటికి ఎంతమాత్రం పట్టదు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు.

“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”
– ఎస్సై సంగమేశ్వర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.

Ramaiah Junction

ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారికి చలాన్లు వేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని, అతి వేగంతో వాహనాల్ని నడపారాదని, రహదారులు పచ్చని చెట్ల నీడతో కప్పబడాలి తప్ప మనిషి రక్తంతో తడవకూడదని వాహనాలు ఢీకొనడం గాని రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అంగ వికలాంగులు కావడం కుటుంబ సభ్యులకు దూరమావడం తన పై ఆధారపడ్డ వారికి దుఃఖం ను మిగిల్చకూడదని వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అందుకు
ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యత గా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం…

ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు

రెండున్నరేండ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులూ వస్తలేవు

మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చుపెడుతున్న కార్యదర్శులు

ఒక్కో సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపో వడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపో యాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి, ఇటు రెండున్న రేండ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తిపన్నులు వసూలు కావట్లేదు. దీంతో పం చాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధుల్లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటనెన్స్, డీజిల్, ట్యాంకులు క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చిపనులు చేస్తున్నాకొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసు కుంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.

Panchayat

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ఫైనాన్స్ నిధులైనా విడుదల చేసి అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పిం చాలని కోరుతున్నారు.

పంచాయతీలకు రూ.6,500 కోట్లు పెండింగ్

పంచాయతీలకు గతేడాది ఫిబ్రవరిలో పాల కవర్గాల గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయి. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1,514 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పాలకవర్గాలు కొ లువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. రెండున్నరేండ్లుగా దాదాపు రూ.5 వేల కోట్ల స్టేట్ ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది. అప్పటి సర్పంచులు అప్పు చేసి పల్లెలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, దానికి సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లించకపోవడం తో వారు ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పంచాయతీలు గాడిన పడ్తాయని అందరూ భావించారు. గతంలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులైనా వచ్చేవి. కానీ, ఎన్నికలు జరగ కపోవడంతో ఆ నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.

నిర్వహణ భారమంతా కార్యదర్శులదే

సర్పంచుల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఉండడంతో ఇప్పుడు పంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శలపై పడింది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఫండ్స్ రాకపోవడం. టార్గెట్ మేరకు ఆస్తిపన్నులు వసూలు కాకపోవ డంతో కార్యదర్శులే అప్పులు చేసి పంచాయతీల ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్ను గ్రామంలోకి పంపాలంటే అందులో డీజిల్ పోయించాల్సి ఉంటుంది.
నెలనెలా డీజిల్ కు రూ.10 వేల నుంచి 20 వేలకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. చాలా గ్రామాల కు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో లోకల్ బోర్లు, మోటార్లు, పైపుల రిపేర్లు చేయించక తప్పట్లేదు. రహదారులపై మొరం పోయించడం, గుంతలు పూడ్చడం, మొక్కలకు నీళ్లు పట్టడం, స్ట్రీట్ లైట్ల నిర్వహణలాంటి పనులు సరేసరి. ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్ జరిగినా తమ జేబు నుంచే పెట్టుకో వాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఇలా ఒక్కో నెలకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చవు తున్నదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.

కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.

కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…? మార్కెట్ గేట్ తాళాలు తెరవాలి…?

ఉపాధి కోల్పోతున్న మార్కెట్ హమాలి కూలీలు దడువాయిలు

ఈ నామ్ చేయకుండా… రైతుల సొమ్ము కాజేస్తున్న వ్యాపారులు

మార్కెట్లో చారాన కొలుగోళ్ళు…! రోడ్ల వెంట బారాన కొనుగోళ్లు..!

చోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలో భారత దేశంలోనే ఎక్సలెన్స్ అవార్డు పొంది గుర్తింపు తెచ్చుకొని పేరుగాంచింది, అంటే అప్పుడున్న మార్కెట్ అధికారుల చిత్తశుద్ధి కట్టుదిట్టమైన పాలన, వ్యాపారులు మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా నియమ నిబంధనలు అమలుపరి, మార్కెట్ పరిసర ప్రాంతాలలో బహిరంగంగా రోడ్ల వెంట ఎవరు కొనుగోలు చేయరాదని పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలతో మార్కెట్ను సజావుగా నడిపించేవారు.

ట్రేడింగ్ లైసెన్స్ ఉన్న వారు ఎవరైనా రోడ్ల వెంట దుకాణాల ముందు కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్ ను అప్రతిష్ట పాలు చేసే వారిపట్ల గతంలో కఠినంగా వ్యవహరించి నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్ అధికారులు నియవ నిబంధనలు చేపట్టి రైతుల ధాన్యాన్ని మార్కెట్లోనే విక్రయించుకునేలా రైతులకు ఎలాంటి మోసాలు జరగకుండా అలాగే మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా మార్కెట్ యార్డులో పనిచేసేటువంటి హమాలి కూలీ కార్మికులకు మరియు దడువాయిలకు మంచి ఉపాధి లభించేదని పలువురు హమాలి కూలి దడువాయిలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

కొంతమంది వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టం వచ్చిన కాడికి రైతులను మోసం చేస్తూ దండుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.

మార్కెట్ పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కొంతమంది వ్యాపారులు వే బ్రిడ్జి కాంటాలు నిర్వహిస్తూ వే బ్రిడ్జ్ కంటాలలో తేడాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న అవేవి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ వే బ్రిడ్జి కాంటా నిర్వహించిన తర్వాత రైతుల ధాన్యం నుండి 30 నుంచి 40 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధిస్తూ ఇష్టం వచ్చిన రేట్లు పెడుతూ రైతులను నిండా ఉంచుతున్నారని ఈ నామ్ చేయకుండా మార్కెట్ ఆదాయాన్ని గండి పెడుతున్నారని పలువురు రైతులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

ఇటు రైతులనే కాకుండా హమాలి కూలీలను మరియు దడువాయిలకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, హమాలీ కూలి రేట్లు చెబుతూ రైతుకు ఇచ్చే లెక్కల్లో చూపుతూ రైతుకు కోత విధిస్తూ ఆ సొమ్మని వ్యాపారి జేబులోనే వేసుకుంటున్నాడని ఇది చాలా దారుణమని పలువురు భావిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా రోడ్ల వెంట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే మార్కెట్ అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఏదో మతాలాబ్ ఉందని గుసగుసలాడుకుంటున్నారు.

ఈ మొక్కజొన్న సీజన్లో మార్కెట్ యార్డ్ మొత్తం కాలు పెట్టే సందు లేకుండా మొక్కజొన్న రాశులతో కలకలాడుతూ కనిపిస్తూ ఉండేది, నేడు మార్కెట్ యార్డు మొత్తం ఎటు చూసినా మొక్కజొన్న రాశులు లేవు వ్యవసాయ మార్కెట్ యాడ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుందంటే దీనికి అధికారులే కారణమని రైతులు దుయ్యబడుతున్నారు.

మార్కెట్ గేట్లకు తాళాలు వేసే సమయపాలన లేదా రైతులకు మార్కెట్లో అమ్ముకునే హక్కు లేనట్టు ఇలా గేట్లకు తాళాలు వేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు మా తప్పేం లేనట్టు కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లతో సహా ట్రాలీల వరకు డబ్బు ఆశ చూపి ట్రేడింగ్ దుకాణాల ముందుకు రైతుల ధాన్యాన్ని రప్పించుకునేలా వ్యూహాలు మొదలు పెడుతున్నారని పలువురు రైతులు అంటున్నారు.

ఇటు మార్కెట్ ఆదాయానికి గండి పెడుతూ మార్కెట్ హమాలీ కూలీల దడువాయిలకు ఉపాధి లేకుండా చేస్తున్న మార్కెట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక విమర్శలు వెళ్లవెత్తుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.

రైతులు ధాన్యాన్ని మార్కెట్లో పోసుకోకుండా చుట్టూ ఉన్న గేట్లకు తాళాలు వేసి ఉండడంతో రైతులు అయోమయానికి గురై దిక్కులేని స్థితిలో ఇలా రోడ్ల వెంట అమ్ముకొని నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు మండిపడుతున్నారు.

వ్యాపారులు మార్కెట్ యార్డులో 25% కొనుగోలు చేసి బహిరంగంగా వారి ఇష్టం వచ్చిన రేటు విధిస్తూ తరుగు పేరుతో 30 నుంచి 50 కేజీల వరకు ధాన్యంలో కోత విధిస్తూ బజారులో 75% కొనుగోలు చేస్తూ రైతులను మోసాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి, కానీ మార్కెట్ అధికారులు మాత్రం వ్యాపారుల నుండి మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు అని చెప్తున్నారు తప్ప మరి రైతుల పక్షాన మార్కెట్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు మోసాలకు గురికాకుండా చూడాల్సిన అధికారులే మాకు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తుంటే ఇక మార్కెట్ ఎందుకు అని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇలా ఎవరికి వారు రైతును దోచుకోవాలని చూసేవాళ్ళు ఉన్నంతకాలం రైతు రాజు కాలేడని దీనికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారులే నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.

ఇదే సందర్భంగా పలు హమాలి కూలి కార్మికుల సంఘాల నాయకులు మార్కెట్ కార్యాలయం ముందు వ్యాపారులు దుకాణాల ముందు రోడ్ల వెంట కొనుగోలు చేయరాదని అనే నినాదంతో కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మార్కెట్ అధికారులలో ఏమాత్రం వ్యవసాయ మార్కెట్ పట్ల చిత్తశుద్ధి లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్ సమయపాలన పాటిస్తూ మార్కెట్ గేట్లు తెరిచి ఉంచాలని అప్పుడే రైతుల యొక్క దాన్యం సరుకులకు గిట్టుబాటు ధర లభించి తూకాలలో మోసాలు జరగకుండా రైతుకు న్యాయం జరుగుతుందని ఇకనైనా మార్కెట్ అధికారులు రైతుల పక్షాన అలాగే మార్కెట్ ని నమ్ముకుని బ్రతుకుతున్న వేలాదిమంది కార్మికుల ఉపాధి కోల్పోకుండా నిలబడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని పలువురు హమాలి, కూలి దడువాయి కార్మికుల సంఘం నాయకులు రైతులు రైతు సంఘం నాయకులు మార్కెట్ అధికారులను మార్కెట్ పాలకమండలిని కోరుకుంటున్నారు.

చేర్యాలలో సీపీఐ 100 వసంతాల వార్షికోత్సవం.

చేర్యాలలో సీపీఐ 100 వసంతాల వార్షికోత్సవం

సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

చేర్యాల నేటిధాత్రి

 

చేర్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 వసంతాల వార్షికోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ. నిర్వహించారు అనంతరం అంగడి బజార్ లోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మరియు సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ మరియు సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సిహెచ్ రాజిరెడ్డి పాల్గొన్నారు.

CPI National

ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధ్యక్షత వహించారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పేద ప్రజల కార్మిక కర్షక సంక్షేమం కొరకు సిపిఐ పోరాటాలు చేసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో రామగళ్ళ నరేష్ ఇర్రి భూమయ్య ఎండి అజీమ్ బండారి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు

CPI National

ఈ డైలమా ఇంకెంత కాలం! కరిగిపోతున్న పుణ్యకాలం!!

`ఈటెల తప్ప ఇంకెవరూ కనిపించడం లేదా?

`అరవింద్‌ లాంటి నాయకులు అధ్యక్షుడుగా పనికి రారా?

`బండి సంజయ్‌ ను మరో సారి అధ్యక్షుడిని చేయలేరా?

`రఘునందన్‌ రావుకు అవకాశం ఇచ్చి చూడలేరా?

`బిజేపి పగ్గాలపై పారని పాచికలు!

`రాష్ట్ర బిజేపిలో లుకలుకలు

`అధిష్టానానికి తప్పని తలనొప్పులు

`బిజేపిలో కొనసాగుతున్న తెర వెనుక దోబూచులాట!

`అదిగో, ఇదిగో అధ్యక్షుడొచ్చే అనేవి ఊహలేనా

`ఈటెల అధ్యక్షుడు అనేది సొంత ప్రచారమేనా?

`ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్ధమో గందరగోళం

`అందరూ ఆశావహులే..ఎవరికిచ్చినా సహాకారాలు అంతంత మాత్రమే!

`ఈటెల రాజేందర్‌ ప్రచారం ఎంత వరకు నిజమౌతుంది?

`బిసి నినాదం అంటే రాజేందర్‌కే పరిమితం కాదు

`అరవింద్‌ కూడా ముందు వరుసలో నిలబడే అవకాశం

`ఇప్పుడు ఎవరు అధ్యక్షుడైనా మూడేళ్లే పదవీ కాలం!

`ఎన్నికల నాటికి అధ్యక్షుడుగా ఎవరున్నా మార్పు ఖాయం!

`ఇప్పుడు ఎవరికిచ్చినా అభ్యంతరం ఎవరికీ వుండకపోచ్చు!

`ఇప్పుడు అధ్యక్షుడయ్యే వారికి వెంటనే రెండో సారి అవకాశం దక్కకకపోవచ్చు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇదిగో అధ్యక్షుడొచ్చె..అదిగో కొత్త అధ్యక్షుడు వచ్చే అంటూ ఏడాది కాలంగా బిజేపిలో వార్తలు వాస్తవాలు రూపుదాల్చడం లేదు. కొత్త బిజేపి అధ్యక్షుడు రావడం లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర బిజేపి పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలౌతోంది. మరో ఏడాదిపాటు అలాగే కిషన్‌ రెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. కాని సమాధానాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. నాయకులకు కూడా ఈ వివరాలు తెలియడం లేదు. కాని ఓవైపు బిజేపి పుంజుకుంటున్న తరుణంలో కూడా బిజేపి అదిష్టానం ఇంకా రాష్ట్ర బిజేపి పగ్గాలు కొత్తవారికి అప్పగించక పోవడం కూడా శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తోంది. కొత్త అధ్యక్షుడు వస్తే పార్టీలో ఊపు వస్తుందని చూస్తున్నారు. జిల్లాల అధ్యక్షులను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర అద్యక్ష ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నారు. కాని కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడడం లేదు. కాని అదిగో..ఇదిగో అన్న మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే వచ్చేది ఎవరో గాని, నేనంటే నేనే అనుకునే వారు మాత్రం చాలా మందే వున్నారు. ఒక రకంగా చెప్పాంటే ఎంపిలంతా క్యూలో వున్నారు. అందరూ నాకే వస్తుందన్న ఆశాభావంతో వున్నారు. కాని ఎవరిని పదవి ఎవరిని వరిస్తుందో అర్దం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాదించాలని అదికారంలోకి తేవాలని కార్యకర్తలు ఉవ్విల్లూరుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఆలోచిస్తున్నారు. కాని రాష్ట్ర స్దాయి నాయకత్వంలో ఆ ఊపు మాత్రం కనిపించడం లేదు. ఇటీవల రెండు ఎమ్మెల్సీలు గెల్చుకొని బిజేపి మరింత ఊపుతో వుంది. ఇలాంటి సమయంలో కొత్త అధ్యక్ష పదవిని ఎవరికో ఒకరికి అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఆ సంకేతాలు వెలుడుతున్నాయి. అయినా నాయకుల్లో డైలామా ఇంకెంత కాలం అంటున్నారు. ఎవరి గోల వారిదే! పారని పాచికలు..పగ్గాల కోసం పరుగులు! బిజేపి అధ్యక్ష ఎన్నిక కోసం నేతల ఉరుకులు పరుగులు. రాష్ట్ర బిజేపిలో లుకలుకలు. అదిష్టానం ముందు నేతలంతా హజరు. ఎవరి ప్రయత్నాలు వారివే..ఎవరి దారి వారిదే. బిజేపిలో కొనసాగుతున్న తెరవెనుక దోబూచులాట. ఈటెల వైపు అధిష్టానం మొగ్గు ప్రచారం మాత్రమే. గట్టిగానే ప్రయత్నిస్తున్న రామచంద్రరావు. నన్ను కూడా పరిగణలోకి తీసుకోమంటున్న డికే. అరుణ. ఏ వార్త నిజమో! ఏ వార్త అబద్దమో అంతా గందరగోళం.బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఈటెల అందరికీ అజాతశత్రువే. బిజేపిలోకి వెళ్లి కొందరికి పట్టని, గిట్టని శత్రువే? పైకి అంతా నటిస్తున్నారు..ఈటెల మాత్రం తన ప్రచారం తాను చేసుకుంటున్నారు. తానే కొత్త అధ్యక్షుడినంటూ చేసుకున్న ప్రచారం బిజేపిలో ఎవరికీ నచ్చడం లేదు. అదిగో పులి అంటే ఇదితో తోక అని ప్రచారం జరగడం ఈ రోజుల్లో పెద్ద వింత కాదు. అదే సంప్రదాయమౌతోంది. ఆ వార్తలకే ప్రాదాన్యత దక్కుతోంది. కేంద్ర బిజేపి నాయకులకు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి వస్తూనే వుంది. వరుస ఎన్నికలతో సతమతమౌతూనే వుంది. కాకపోతే ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజేపి గెలుస్తూ వస్తోంది. ఆ ఊపులోనే తెలంగాణ బిజేపి అధ్యక్షపదవి ప్రకటన వుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈటెల రాజేందర్‌ పేరు ఖరారైనట్లు ఈయన వర్గం కొన్ని నెలలుగా విపరీమైన, విసృతమైన ప్రచారం సాగిస్తోంది. అంటే పోటీలో ఈటెల మాత్రమే వున్నాడని, ఆయన పేరు ఖరారైన తర్వాత చేసేదేముందని ఇతర నాయకులు చేతులెత్తేసేందుకు ఇదొక వ్యూహం అనుకోవాలి. కాని డిల్లీలో మరోరకమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మాజీ ఎమ్మెల్సీ సీనియర్‌ నాయకుడు రామచంద్రరావుకు ఇవ్వాలని బలంగా ఇతర నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లోనే టికెట్‌ ఇస్తారని అనుకున్నారు. అప్పుడు కూడా ఈటెల రాజేందర్‌ టికెట్‌ కోసం ప్రయత్నం చేశారు. అదిష్టానాన్ని ఒప్పించారు. మెప్పించి టికెట్‌ తెచ్చుకున్నారు. అప్పుడే సీనియర్లు కొంత ఇబ్బంది పడ్డారు. ఈటెలకు టికెట్‌ ఇవ్వడాన్ని లోలోన సీనియర్లు వ్యతిరేకించారు. అధిష్టానం నిర్ణయం కావడంతో ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ పార్టీ పగ్గాల విషయంలోనూ ఈటెల ఇతర సీనియర్లకు పోటీ రావడాన్ని సీనియర్లు తట్టుకోవడంలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. బిజేపిలో చేరిన తర్వాత ఎన్నికల ముందు బండి సంజయ్‌ పార్టీ అధ్యక్ష పదవి పోవడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందరే అన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. అందులోనూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ కూడా నర్మగర్భంగా అనేక సార్లు ఆ విషయం వెల్లడిరచడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష ఎంపిక తెరమీదకు వచ్చింది. ఈ నెలలోనే అధ్యక్ష ప్రకటన వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మెదక్‌ ఎంపి. రఘునందన్‌ రావు వెల్లడిరచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాను కూడా రేస్‌లో వున్నానని పదే పదే చెబుతున్న రఘునందన్‌ రావు చెప్పడం అంటే డిల్లీలో ఏదో పీట ముడి జరుగుతోందన్నది మాత్రం అర్ధమౌతుంది. అంటే తాను రేసు నుంచి తప్పించారని ఆయన అభిప్రాయమా? అన్నది కూడా అర్దం చేసుకోవచ్చు. ఇక మిగిలింది డికే. అరుణ. ఆమె కూడా తెలంగాణ రాజకీయాల్లో సీనియర్‌ నాయకురాలు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా అనుభవం వుంది. అటు పార్టీ నాయకురాలిగా, ఇటు పాలనా పరమైన అనుభవం వున్న నాయకురాలు డికే. అరుణ. అంతేకాకుండా ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా మీద ఆమెకు పూర్తి పట్టువుంది. తెలంగాణ రాజకీయాలపై కూడా ఎంతో అవగాహన వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ రాజకీయాలు చేయాలంటే డికే. అరుణకు అద్యక్ష బాద్యతలు అప్పగిస్తే రాజకీయాలు రంజుగా వుంటాయన్నది కొందరి అభిప్రాయం. గతంలో డికే. అరుణ మంత్రిగా వున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా రేవంత్‌ రెడ్డి అడుగడుగునా అడ్డుకునేవారు. ఆమెకు వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి వున్నారు. అదే జిల్లా నుంచి పార్లమెంటు సభ్యురాలుగా వున్న డికే. అరుణకు పగ్గాలు అప్పగిస్తే రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారుతాయి. ఇక్కడ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చర్చించుకోవాలి. రెండు జాతీయ పార్టీలు క్రియాశీలంగా వున్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మనుగడ కొనసాగదు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరించి రాజకీయాలు చేయాలనుకుంటే బిజేపి డికే. అరుణకు పార్టీ పగ్గాలు అప్పగించాలి. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్‌ పార్టీ మీద పోరాటం చేస్తున్న పార్టీగా టిఆర్‌ఎస్‌ మాత్రమే ముందు వుంది. రాష్ట్ర అధ్యక్షుడైన జి. కిషన్‌ రెడ్డి కేంద్ర క్యాబినేట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన అటు పాలన, ఇటు రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ప్రచారాలు నిర్వహిస్తూ బిజీగా వుంటున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాలమీద పూర్తి దృష్టిపెట్టే అవకాశం చిక్కడం లేదు. త్వరలో తెలంగాణలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రామచంద్రరావు మహాబూబ్‌ నగర్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు గెలిచిన అనుభవం వుంది. కరీంనగర్‌ పార్లమెంటు నుంచి బండి సంజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యేలున్నారు. నిజాబాబాద్‌ నుంచి ఎమ్మెల్యేలున్నారు. మెదక్‌ నుంచి పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావు వున్నారు. వీళ్లలో ఎవరో ఒకరికి ఇవ్వడమో లేదా? మరో ఏడాదిపాటు అద్యక్ష ఎంపిక లేదని చెప్పడమో జరగడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం సూక్ష్మంగా ఆలోచిస్తే అర్దమౌతుంది. బిజేపిలో అధ్యక్ష పదవి కాలం మూడు సంవత్సరాలు. ఇప్పుడు కేంద్ర మంది బండి సంజయ్‌కు అద్యక్ష బాద్యతలు అప్పగిస్తే ఎన్నికల నాటికి మళ్లీ ఆ పదవి కాలం పూర్తవుంది. అందువల్ల ఈ సమయంలో పార్టీలో ఎవరికో ఒకరికి ఇచ్చి, పార్టీకి కొంత ఊపు తెచ్చి, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల మందు బండి సంజయ్‌ను బిజేపి అధ్యక్షుడిని చేయాలన్న ఆలోచన బిజేపి అధిష్టానం చేస్తున్నట్లు కూడా మరో వాదన వుంది. కాకపోతే కొత్త అద్యక్షుడు ఈ మధ్య సమయంలో ఎవరో ఒకరు రాకపోతే పార్టీలో కొంత నిరాశ, నిస్రృహలు నెలకొంటాయని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల అద్యక్ష పదవి ఎవరికో ఒకరికి ఇస్తే జోష్‌ పెరిగే అవకాశం వుంది. బిజేపి మరింత బలోపేతమయ్యేందుకు ఆస్కారముంది.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి

ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

పరకాల,దామెర నేటిధాత్రి

పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం.

యువ జ్యోతి ఆధ్వర్యంలో టీబి వరల్డ్ డే కార్యక్రమం,,,,

టిబి వ్యాధి రాకుండా నివారణ కు వివరించిన హెల్త్ ఆఫీసర్ భరత్ కుమార్,,,,

సిద్దిపేట ఎన్వైకే సహకారంతో విజయవంతంగా కార్యక్రమం,,,,

రామాయంపేట మార్చి 24 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రపంచంలో టీ బి వ్యాధితో అనేకమంది గతం లో మరణించడం జరిగిందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారుచేసి మందులతో టీబీ వ్యాధిని చాలా వరకు నివారించడం జరిగిందని రామాయంపేట మండల పి హెచ్ ఎస్ హెల్త్ ఆఫీసర్ భరత్ అన్నారు అయినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు కరోనా లాంటి వ్యాధులు రావడానికి టీబిలాంటి వ్యాధులు ఉండడం కూడా ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని అన్నారు ముఖ్యంగా తంబాకు పొగాకు సిగరెట్టు గుట్కా పాన్ మసాలా లాంటి వాటితోనే కాకుండా దుమ్ముదులి వాతావరణ కాలుష్యంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధి ఒకరు నుండి మరొకరికి సోగుతుందని అందుకే

TB disease

ఈ వ్యాధిని పూర్తిగా నివారించిన తగు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ధూమపానం పాన్ మసాలా గుట్కా లాంటి వాడుకున్న నివారించుకోవాలని ఇతవు ఈ పలికారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ హాస్టల్ మరియు పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిద్దిపేట వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సత్యనారాయణ తెలిపారు

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి
బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య
`మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి
`బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు
`అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు
`మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి
`జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ నిధానం
`లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్‌ పార్టీ విధానం : కాంగ్రెస్‌ నాయకులు

వర్ధన్నపేట,నేటిధాత్రి:

నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ కమ్మాగొని ప్రభాకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్‌ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు డా: బీ అర్‌ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్‌ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్‌ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్‌ చెప్పినవే . ఓ. ఏస్‌.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్‌,ఐపీఎస్‌,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్‌ అంబేద్కర్‌ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు.
ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ ని జవహర్‌ లాల్‌ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్‌ పార్టీ జై బాపు,జై బిమ్‌,జై సంవిధాన్‌ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్‌ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నుండి డిమాండ్‌ చేస్తున్నాం.

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..

 

రామాయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version