అప్పాయిపల్లి గ్రామం అభివృద్ధి లో ముందంజ
ఎమ్మెల్యే మెగారెడ్డి సహకారముతో
వనపర్తి నేటిదాత్రి.
వనపర్తి నియోజకవర్గం అప్పాయిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి సహకారంతో 118 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని అప్పాయిపల్లి మాజి ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ రావ్ నేటిదాత్రి దినపత్రిక విలేకరితో చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఇండ్లు పూర్తి కావడానికి నిర్మాణ దిశలో ఉన్నాయని ఆనంద్ రావు చెప్పారు ఒక ఇందిరమ్మ ఇల్లు వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తెలుగు లక్ష్మి కి చెందిన నూతన గృహప్రవేశం చేశారని ఆయన పేర్కొన్నారు అప్పాయిపల్లి గ్రామంలో నిరుపేదలకు రేషన్ కార్డులు ఒంటరి మహిళలకు వితంతువులకు పింఛన్లు ఇప్పిచ్చామని ఆయన తెలిపారు గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది కొరకు అప్లై చేసుకున్న లబ్దిదారులకు ఎల్ ఓ సి చెక్కులు ఎమ్మెల్యే మెగారెడ్డి ద్వారా ఇప్పించామని ఆయన పేర్కొన్నారు గ్రామంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరాని కి కృషి చేస్తానని ఆయన తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో అప్పయ్యపల్లి శివారులో ప్రభుత్వం ద్వారా రవాణా కార్యలయం కార్యాలయానికి స్థలం కేటాయించారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వపరంగా బడ్జెట్ 9 కోట్ల 50 లక్షలు మంజూరు ఆయన పేర్కొన్నారు ఈమేరకు మాజి ఉప సర్పంచ్ ఆనంద్ రావు అప్పాయిపల్లి గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఎంపీ మల్లు రవికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు
