నడి కూడ,నేటి ధాత్రి:
హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది. పూలనే పూజించడం మన తెలంగాణ సాంప్రదాయం. నడికూడ మండల కేంద్రంలో మహిళలు,చిన్నారులు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. రకరకాల పువ్వులు గుమ్మడి పూలు,తంగేడు పువ్వులు,సీతా జడపూలు, బంతి, చామంతి పూలు, కట్లాయి పూలతో బతుకమ్మలను పేర్చి, అమ్మవారికి బియ్యం పిండి, నువ్వుల పిండితో చేసిన ప్రసాదాలు నైవేద్యం సమర్పిస్తారు. మొదటిరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మ లుగా పేర్చి, అమ్మవారిని కొలుస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న దేవాలయాల దగ్గరికి తీసుకెళ్ళి మహిళలందరూ బతుకమ్మల చుట్టూ ఆడి పాడి సమీపంలో గల నీటి కొలనులో నిమజ్జనం చేస్తారు. దీనితో మండల కేంద్రంలోని పలు గ్రామాలలో కనువిందుగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు