చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలలో ఒకటైన బతుకమ్మ పండుగను ఆడపడుచులు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిల్పూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలు లింగంపల్లి,కొండాపూర్, మల్కాపూర్, వెంకటాద్రి పేట, పల్లగుట్ట,కృష్ణాజి గూడెం, రాజవరం, వెంకటేశ్వర పల్లి, నష్కల్ , వంగాలపల్లి చిన్న పెండ్యాల తదితర గ్రామాల్లో బతుకమ్మ పండుగ సంబరాల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను ఆడపడుచులు ఆనందంగా ఆడుకున్నారు.ఇందులో భాగంగా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో మహిళలు బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను తంగేడు పువ్వు తో పాటు రకరకాల పువ్వులను తెచ్చి బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలు సాంప్రదాయ నృత్యాలతో పాటు ఆట పాటలతో ఆడి పాడి బతుకమ్మ పండుగను ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో
స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలతో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
