ఆదర్శ పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ మేకల రమేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు సంరక్షణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రూపశిల్పి అని దేశ ఐక్యత కోసం దేశం అభివృద్ధి కోసం దేశంలో ఉండేటటువంటి ప్రజల అందరి న్యాయం కోసం రాజ్యాంగంలో ఎన్నో సంస్కరణలు రూపొందించిన గొప్ప మేధావి అని అన్నారు నా భారత దేశంలో ప్రతి పౌరుడు ఆకలితో చావకూడదని అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పిస్తున్నానని అదే దేశ అభివృద్ధికి సూచికగా మారుతుందని అన్నారు దేశం ముందంజలో ఉండాలంటే కులమత వర్గ విభేదాలు ఉండకూడదని అందరూ ఐక్యతతో సమానత్వంతో కలిసి మెలిసి ఉండాలని అన్నారని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
