వనమహోత్సవంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్

చెన్నూరు, నేటిధాత్రి:

చెన్నూరు నియోజికవర్గం కోటపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 75వ వన మహోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతితో ప్రతి ఒక్కరూ మమేకమై ఉండాలని, స్వచ్ఛమైన గాలి, వాతావరణం, పర్యావరణం మానవ మనుగడకు అతి ముఖ్యమని కావున అడవుల్ని, వృక్షాల్ని ,వన్యప్రాణులని ప్రకృతిని బాధ్యతగా కాపాడుకోవాలని సూచించారు. ప్రజలందరూ వన మహోత్సవంలో తమ వంతుగా పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటాలని కోరారు. అనంతరం అధికారులు ,స్థానిక నాయకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు అందరూ కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్ తో పాటు కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య, పిడిఆర్డిఏ కిషన్, ఎంపీడీవో ఆకుల భూమన్న, ఎంఈఓ తిరుపతిరెడ్డి, ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణమూర్తి, ఏపీవో బాలయ్య ,ఎంపీ ఓ ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి ,ఏపీఎం వెంకటేశ్వర్లు, ఈజీఎస్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *