భద్రాచలం నేటిదాత్రి
వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు
సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు 8వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ముందుగా ముదిగొండ నాగేశ్వరరావు స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నాగేశ్వరరావు చిత్రపటానికిపార్టీ సీనియర్ నాయకులు, మాజీ డి సి సి బి చైర్మెన్ యలమంచి రవికుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. ప్రజాశక్తి నిర్వహణ బాధ్యతలు, సాహిత్య అమ్మకంలో
నాగేశ్వరరావు చురుకైన పాత్ర పోషించే వారని అన్నారు. కామ్రేడ్ నాగేశ్వరరావు ఆశయాలు సాధించడం అంటే ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని అదే నాగేశ్వరరావుకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. నేడు దేశంలో మతం, కార్పొరేట్ శక్తులు కలిసి దేశాన్ని పాలిస్తున్నాయని, దేశంలో ఫాసిస్ట్ తరహా పాలన సాగుతోందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రైతాంగ సమస్యల పరిష్కారంలో విఫలమైందని తమ సమస్యల కోసం పోరాడుతున్న రైతులపై నిర్బంధాలు ప్రయోగించి రైతాంగం ప్రాణాలను తీస్తోందని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పని చేసే బిజెపిని ఓడించడం ద్వారానే ఈ దేశానికి మేలు జరుగుతుందని అన్నారు.నేటి పరిస్థితుల్లో జరిగే కార్పొరేట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు నెట్టుకు రావడం అంత తేలికైన పని కాదని కమ్యూనిస్టులకు గెలుపోవటములు సహజమేనని భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అన్నారు. నేడున్న ప్రతికూల పరిస్థితులలో పార్టీ కార్యకర్తలు నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అదే కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావుకు మనం ఇచ్చే ఘన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం ముదిగొండ నాగేశ్వరరావు సోదరుడు రాము, సతీమణి శ్రీమతి ధనలక్ష్మి,కుమారుడు బిట్టు లు నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి,వై వెంకట రామారావు,ఎన్ లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, కుంజా శ్రీనివాస్ కోరాడ శ్రీనివాస్ ఎస్ భూపేంద్ర సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, శాఖ కార్యదర్శిలు జి రాధా, కాకా రమణ, పుణ్యవతి, ఏ లక్ష్మీనారాయణ, అజయ్ కుమార్, కొర్సా రావు,రాజలింగం,తదితరులు పాల్గొన్నారు.
