Grand Felicitation for NewGrand Felicitation for New DYSODYSO
డి.వై.ఎస్.ఓ.గా బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రశాంత్కు ఘన సన్మానం
హన్మకొండ, నేటిధాత్రి :
హనుమకొండ జిల్లా యువజన క్రీడల శాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కొత్త ప్రశాంత్ ని హనుమకొండ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి మరియు కిక్ బాక్సింగ్ వంటి క్రీడలకు ఆయన పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
బండారి సంతోష్ (ప్రెసిడెంట్, హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ & ఇంటర్నేషనల్ రిఫరీ)ఎస్. తిరుపతి (సెక్రటరీ)
పి. దినేష్ తేజ (సభ్యులు)
ఏ. గణేష్ తేజ (సభ్యులు)
కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
