
*బోయినిపల్లి వినోద్ కుమార్
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్,సిరిసిల్ల పర్యటన ముగించుకొని కరీంనగర్ వెళ్తున్న సమయంలో వెంకట్రావుపల్లి స్టేజి దగ్గర హోటల్లో యువకుల కోరిక మేరకు హోటల్ దగ్గర ఆగి అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో టీ తాగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పైన చర్చించడం జరిగింది.ఈ మధ్యలో కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టడం.దాని పైన మీ స్పందన ఏంటి అని అడిగి తెలుసుకోగా మంచి కార్యక్రమం చాలా మంది విద్యార్థులు ఉదయం ఏమి తినకుండా స్కూల్ కు వస్తున్నారు.మధ్యాహ్న వరకు ఎంతో డల్ అవుతున్నారు,ఉదయం కేసీఆర్ టిఫిన్ అనేది మంచి కార్యక్రమం సార్ చాలా మంచి కార్యక్రమం అని చెప్పడం జరిగింది.. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందని ఆరా తీయగా ప్రైవేట్ స్కూల్ ల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని చెప్పడం జరిగింది.త్వరలోనే ప్రభుత్వం కూడా విద్యకు విద్యానికి పెద్దపీట వేయను ఉందని రానున్న ప్రభుత్వంలో మండలానికి నాలుగైదు సెమీ రెసిడెన్సి పాఠశాల ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయుల వృత్తి గొప్పదని పిల్లలను ఉన్నంత జివిద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు.అదేవిధంగా అక్కడ ఉన్న యువకులతో రైతులతో బోయినిపల్లి వినోద్ కుమార్,
ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్ గౌడ్, స్థానిక సర్పంచ్ బూర్గులనందయ్య, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.