గర్భవతులు పిల్లలు
వేసవిలో
తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైనుపాక గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను శుక్రవారం రోజున అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన సూపర్వైజర్ జయప్రద ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలం అయినందున గర్భవతులు బాలింతలు పిల్లలు తీసుకోవలసిన ఆహార ఆరోగ్య వ్యక్తిగత శుభ్రత మంచినీటి ప్రాముఖ్యత గూర్చి వివరించనైనది ముఖ్యంగా ఈ సమయంలో ఫంక్షన్స్ తీర్థయాత్రలు వెళ్లకుండా చల్లటి వాతావరణంలో ఎప్పుడు కూలర్ ఏసివద్ద ఉండకుండా చెట్ల నీడలో ఎక్కువ సమయం గడపాలని మసాలాలతొ కూడిన భోజనము కాకుండా చిరుధాన్యాలతో కూడిన భోజనం తినాలి అని బయట తిను బండారాలు తినకుండా కూల్డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చల్లటి మజ్జిగ నిమ్మరసం దోసకాయ వాటర్ మినరల్ లాంటి పానీయాలు తీసుకోవాలని వివరించనైనది అలాగే తల్లులు పిల్లలు ముఖ్యంగా కిశోర బాలికలు మొబైల్ కి దూరంగా ఉండాలని వివరించి గర్భవతులు పిల్లల బరువు ఎత్తు చూసి గర్భవతి బాలింతలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరుణ సుభద్ర సుజాత ఆయాలు అస్మ సరోజన మహిళలు హాజరైనారు.