ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం
టిడిపి కూటమి పార్టీల బలోపేతమే లక్ష్యం
ఆదిశగా ఆమె అడుగులు…పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైనం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ బాబు,అనిత కూటమి అన్న డాక్టర్ సంధ్య యాదవ్ కు అడ్డ దండలు ,
త్వరలో అన్నా డాక్టర్ సంధ్య యాదవ్ ను వరించనున్న మేయర్ పదవి
టిడిపి, కూటమి యాదవ సామాజిక వర్గం ఆమె వైపు మొగ్గు
తిరుపతి జిల్లా..తిరుపతి(నేటి ధాత్రి)….
ఫిబ్రవరి 06:
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి ఉత్కండ నేపథ్యంలో ముగిసింది. రెండు రోజుల క్రితం డిప్యూటీ మేయర్ నియామకంలో వైసిపి టిడిపి కార్పొరేటర్ల మధ్య రణ పోరు కొనసాగిందని చెప్పవచ్చు.తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో గత వైసిపి పాలనలో టిడిపి మాజీ నగర అధ్యక్షుడు ఆర్ సి మునికృష్ణ ఒకే ఒక్క కార్పొరేటర్ గా గెలిచిన నేపథ్యం. ఒక కార్పొరేటర్ పదవి కోర్టు పరిధిలో పోను మిగతా 48 స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి తిరుపతి మేయర్ పదవి పై టిడిపి కూటమి కన్ను పడింది. అప్పటికే మేయర్ పదవి కోసం వైసీపీ పార్టీని వీడి టిడిపి పార్టీలోకి చేరిన అన్నా రామచంద్రయ్య ఒక్కసారిగా డిప్యూటీ మేయర్ ఎన్నికపై తన సత్తా ఏమిటో చూపెట్టాడు. వైసీపీకి 48 మంది కార్పొరేటర్ల బలము ఉన్న వారిని ఒక్కొక్కరిని వైసీపీ పార్టీ నుండి టిడిపి పార్టీ వైపు వచ్చే విధంగా తన మార్కును అన్న రామచంద్రయ్య చూపెట్టాడని చెప్పక తప్పదు. ఒకానొక దశలో 48 మంది వైసిపి కార్పొరేటర్లు ఒక కార్పొరేటర్ మృతి చెందడంతో మిగతా 47 మంది వైసీపీ కార్పొరేటర్ లను తన వైపు తిప్పుకునేందుకు తన అనుచర గణంతో కలిసి పెద్ద ఎత్తున పావులు కదిపాడు. అయితే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి వారి అనుచర గణం పట్టు వదలని విక్రమార్కుడుల విజృంభించారు. ఒకానొక దశలో టిడిపి,కూటమికి వైసిపి గట్టి పోటీనిచ్చింది. అయితే అధికార పార్టీ కూటమి అండదండలతో అన్నా రామచంద్రయ్య 50% కార్పోరేటర్లను టిడిపి వైపు తిప్పి చివరగా డిప్యూటీ మేయర్ పదవిని టిడిపి కార్పొరేటర్ అయిన ఆర్ సి మునికృష్ణకు కట్టబెట్టాడు. దీంతో డిప్యూటీ మేయర్ పదవి భర్తీ అయింది. అయితే ఇక మేయర్ పదవి పై అన్న రామచంద్రయ్య ప్రత్యక్షంగా పరోక్షంగా టిడిపి కూటమినేతలతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఆయనకు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏమిటంటే తన కుమార్తెలైన డాక్టర్ సంధ్య యాదవ్, అనిత యాదవులలో ఇద్దరిలో ఎవరికైనా మేయర్ పదవి ఇప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే గత వైసిపి ప్రభుత్వం లోని పార్టీ నుండి తాను విడిపోయి తటస్థంగా ఉంటూ టిటిపి కూటమి గెలుపుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ టిడిపి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు. తమ పెద్ద కుమార్తె అయిన అన్నా డాక్టర్ సంధ్యా యాదవ్ మాత్రం సాక్షాత్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ బాబు సమక్షంలో టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకుంది. అయితే రెండవ కుమార్తె అనిత యాదవ్ మాత్రం ఇప్పటివరకు టిడిపి పార్టీలో చేరలేదు, టిడిపి పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోలేదు.కానీ డాక్టర్ అన్నా సంధ్య యాదవ్ మాత్రం టిడిపి పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి యుద్ధ సైనికుల పనిచేస్తోంది. అంతేకాకుండా ఇటు టిడిపి అటు కూటమి పెద్దల ఆదేశాలు తు.చ తప్పకుండా అందరి మన్నలను పెద్దల ఆశీస్సులు, పొందుతూ టిడిపి పార్టీని కూటమి ని బలోపేతం చేయడంతో పాటు తండ్రి అన్నా రామచంద్ర యాదవ్ అడుగుజాడల్లో నడుస్తూ డాక్టర్ అన్న సంధ్యా యాదవ్ పది అడుగులు ముందుకు వేస్తూ దూసుకెళ్తుంది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మెజార్టీ కార్పొరేటర్లు డాక్టర్ అన్న సంధ్య యాదవ్ కే మేయర్ పదవి ఇస్తే ఆ పదవికి డాక్టర్ సంధ్య యాదవ్ న్యాయం చేస్తుందని,అంతేకాకుండా ప్రస్తుత తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ కు తగ్గ వ్యక్తి డాక్టర్ అన్న సంధ్యారాణి అని ఆమెకే మేయర్ పదవి కట్టబెట్టాలని ఇప్పటికే పరోక్షంగా అన్న రామచంద్రయ్య యాదవ్ తన అనుచర గణంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని మెజారిటీ కార్పొరేటర్ తో పాటు మొత్తం యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, యువత మహిళలు, యాదవ కుటుంబాలు కూడా డాక్టర్ అన్న సంధ్య యాదవ్ కు మేయర్ పదవి ఇస్తే బాగుంటుందని గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా డాక్టర్ సంధ్య యాదవ్ అయితే ఇటు టిడిపి పార్టీకి అటు కూటమి నేతలను ఏకత్రాటి పై నడిపే శక్తి యుక్తి ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ అన్న సంధ్య యాదవ అని అందరి నోట గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం. అయితే పార్టీలో ఇప్పటివరకు చేరకుండా పార్టీ కార్యక్రమాలకు అక్కడక్కడ పాల్గొంటున్న అన్న అనిత యాదవ్ కు మేయర్ పదవి వరిస్తుందా..? లేకుంటే టిడిపి కూటమిపార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న అన్న డాక్టర్ సంధ్య యాదవ్ కు మేయర్ పదవి వరించనుందా.. ? కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే మొత్తం మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్ బాబు అనిత, పెద్దల ఆశీస్సులు టిడిపి కూటమి పార్టీలతో పాటు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని మొత్తం యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు యువత మహిళలు డాక్టర్ అన్నా సంధ్య యాదవ్ కే మేయర్ పదవి ఇస్తే బాగుంటుందని ఆమె వైపు మొగ్గుచూపడం, ప్రస్తుతమే డాక్టర్ శిరీష కు దీటుగా డాక్టర్ అన్న సంధ్యా యాదవ్ పాలనలో తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని తిరుపతి నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు యువత మహిళలు టిడిపి కూటమి ప్రధానంగా యాదవ సామాజిక వర్గ ప్రజలు గుసగుసలాడడం కొసమెరుపు.